2024 రండి, నన్ను అనుసరించండి
జనవరి 1–7: యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన. మోర్మన్ గ్రంథము యొక్క పరిచయ పేజీలు


“జనవరి 1–7: యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన. మోర్మన్ గ్రంథము యొక్క పరిచయ పేజీలు,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)

“జనవరి 1-7. మోర్మన్ గ్రంథము యొక్క పరిచయ పేజీలు,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)

బంగారు పలకలపై వ్రాస్తున్న మోర్మన్

జనవరి 1–7: యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన

మోర్మన్ గ్రంథము యొక్క పరిచయ పేజీలు

మీరు 1 నీఫై 1వ అధ్యాయంలోకి ప్రవేశించడానికి ముందే, మోర్మన్ గ్రంథము ఒక సాధారణ గ్రంథము కాదని స్పష్టమవుతుంది. దేవదూతల సందర్శనలు, కొండప్రాంతంలో శతాబ్దాలుగా పాతిపెట్టబడియున్న ఒక పురాతన గ్రంథము, దేవుని శక్తితో ఆ గ్రంథాన్ని అనువదించిన యువకునితో సహా అందులోని పరిచయ పేజీలు మిగతా వాటికి భిన్నమైన నేపథ్య కథను వివరిస్తాయి. మోర్మన్ గ్రంథము ప్రాచీన అమెరికా నాగరికతల చరిత్ర మాత్రమే కాదు. “యేసే క్రీస్తని” (మోర్మన్ గ్రంథము యొక్క శీర్షిక పేజీ) అందరినీ ఒప్పించాలని అది కోరుతుంది మరియు అది ఎలా వ్రాయబడింది, కాపాడబడింది, మనకు లభ్యం చేయబడింది అనేవాటిని దేవుడే స్వయంగా నిర్దేశించారు. ఈ సంవత్సరం, మీరు మోర్మన్ గ్రంథము చదువుతున్నప్పుడు, దాని గురించి ప్రార్థిస్తూ, దాని బోధనలను అన్వయిస్తే, మీరు రక్షకుని శక్తిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు. మరియు ముగ్గురు సాక్షులు వారి సాక్ష్యములో చెప్పినట్లుగా, “ఇది [నా] కన్నులకు ఆశ్చర్యకరముగానుండెను” అని మీరు చెప్పాలని భావిస్తారు.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

మోర్మన్ గ్రంథము యొక్క శీర్షిక పేజీ

మోర్మన్ గ్రంథమును అధ్యయనం చేయడం యేసు క్రీస్తు యందు నా విశ్వాసాన్ని బలపరచగలదు.

మోర్మన్ గ్రంథము యొక్క శీర్షిక పేజీ శీర్షికను మాత్రమే కాకుండా, అధిక సమాచారాన్నిస్తుంది. ఇతర విషయాలతోపాటు, ఈ పవిత్రమైన గ్రంథము గురించి అనేక ఉద్దేశాలను ఇది జాబితా చేస్తుంది. ఈ ఉద్దేశాల కొరకు శీర్షిక పేజీలో చూడండి. మీరు ధ్యానించినప్పుడు ఇటువంటి ప్రశ్నలు మీకు సహాయపడగలవు: మనం మోర్మన్ గ్రంథమును ఎందుకు కలిగియున్నాము? మోర్మన్ గ్రంథము ఇతర గ్రంథాల కంటే ఏవిధంగా భిన్నంగా ఉంది?

ఈ సంవత్సరం మోర్మన్ గ్రంథాన్ని చదవడం కోసం వ్యక్తిగత లేదా కుటుంబ ప్రణాళికను రూపొందించడానికి ఇది మంచి సమయం కావచ్చు. ఎప్పుడు మరియు ఎక్కడ మీరు చదువుతారు? మీ అధ్యయనంలో ఆత్మను మీరు ఏవిధంగా ఆహ్వానిస్తారు? మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు మీరు ప్రత్యేకంగా వెదకాలని కోరుకున్నది ఏదైనా ఉన్నదా? ఉదాహరణకు, శీర్షిక పేజీలో మీరు కనుగొన్న ఉద్దేశాలను నెరవేర్చే గద్యభాగాల కొరకు మీరు చూడవచ్చు. యేసు క్రీస్తునందు మీ విశ్వాసమును నిర్మించే వచనాల జాబితాను మీరు చేయవచ్చు.

2 నీఫై 25:26; మోషైయ 3:5–8; ఆల్మా 5:48; 7:10–13; హీలమన్ 5:12; 3 నీఫై 9:13–18; 11:6–14; మొరోనై 10:32–33 కూడా చూడండి.

ఒక ప్రవక్త వాగ్దానం. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు, “[మోర్మన్ గ్రంథములో] మీరు అధ్యయనం చేసిన దానిని మీరు ధ్యానించినప్పుడు ఆకాశపు వాకిండ్లు విప్పబడతాయి, మీ స్వంత ప్రశ్నలకు సమాధానాలను మరియు మీ స్వంత జీవితం కొరకు నడిపింపును మీరు అందుకుంటారని నేను వాగ్దానం చేస్తున్నాను” (“మోర్మన్ గ్రంథము: ఇది లేకపోతే మీ జీవితం ఎలా ఉండేది?,” లియహోనా, నవ. 2017, 62–63).

సెమినరీ చిహ్నము

మోర్మన్ గ్రంథమునకు పీఠిక; “ముగ్గురు సాక్షుల సాక్ష్యము”; “ఎనిమిదిమంది సాక్షుల సాక్ష్యము

నేను మోర్మన్ గ్రంథము యొక్క సాక్షిని కాగలను.

ముగ్గురు సాక్షులు మరియు ఎనిమిదిమంది సాక్షులు చూసినట్లుగా మీరు బంగారు పలకలను చూడకపోయినా, మోర్మన్ గ్రంథము నిజమని పరిశుద్ధాత్మ మీకు సాక్ష్యమివ్వగలడు. మీరు వారి మాటలను చదివినప్పుడు, వారి సాక్ష్యాలు మీ సాక్ష్యాన్ని ఎలా బలపరుస్తాయో ఆలోచించండి.

మోర్మన్ గ్రంథము గురించి ఈ సాక్షులు వారి సాక్ష్యాన్ని పంచుకున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని ప్రేరేపించేదేది? మోర్మన్ గ్రంథము గురించి—ప్రత్యేకించి యేసు క్రీస్తు యొక్క దాని సాక్ష్యము గురించి మీ సాక్ష్యమును మీరెలా పంచుకోగలరో ధ్యానించండి. ఉదాహరణకు, ముందెన్నడూ మోర్మన్ గ్రంథము గురించి వినని ఒక స్నేహితునితో మీరు మాట్లాడుతున్నట్లు ఊహించుకోండి. దాని గురించి అతడు లేదా ఆమెతో మీరు ఏమి చెప్తారు? దానిని చదవమని మీ స్నేహితుడిని ప్రేరేపించడానికి మీరెలా ప్రయత్నిస్తారు? మోర్మన్ గ్రంథమునకు పీఠికను తిరిగి పరిశీలించడం గురించి ఆలోచించండి. మీ స్నేహితునితో పంచుకోవడానికి ఉపయోగపడే వివరాలను మీరు అక్కడ కనుగొనవచ్చు. క్రింది వీడియోలు కూడా మీకు ఉపాయములను ఇవ్వవచ్చు:

  • “మోర్మన్ గ్రంథ కథ”

మోర్మన్ గ్రంథము గురించి ఒక స్నేహితునితో మీరు పంచుకొనే విషయాలను జాబితా చేయడానికి ఆలోచించండి. మోర్మన్ గ్రంథ యాప్‌ను ఉపయోగించి మోర్మన్ గ్రంథమును పంచుకోవడానికి ప్రయత్నించండి.

రోనాల్డ్ ఎ. రాస్బాండ్, “ఈ దినము,” లియహోనా, నవ. 2022, 25–28 కూడా చూడండి;

కలిసి ప్రార్థించుచున్న జోసెఫ్ స్మిత్ మరియు ముగ్గురు సాక్షులు

ముగ్గురు సాక్షులు మోర్మన్ గ్రంథము గురించి సాక్ష్యమిచ్చారు.

ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ సాక్ష్యము

మోర్మన్ గ్రంథము యొక్క ఆగమనం ఒక అద్భుతం.

మోర్మన్ గ్రంథము ఎక్కడ నుండి వచ్చిందని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, మీరు ఏమి చెబుతారు? మోర్మన్ గ్రంథాన్ని మనకు ఇవ్వడంలో దేవుని ప్రమేయాన్ని మీరు ఎలా వివరిస్తారు? మీరు జోసెఫ్ స్మిత్ సాక్ష్యము చదివినప్పుడు, అతడు వివరించిన దాని పట్ల శ్రద్ధ చూపండి. మీరు చదివిన దానిపై ఆధారపడి, మోర్మన్ గ్రంథము యొక్క ప్రాముఖ్యత గురించి దేవుడు ఎలా భావిస్తున్నారని మీరనుకుంటున్నారు?

యులిసెస్ సోవారెస్, “మోర్మన్ గ్రంథము యొక్క ఆవిర్భావం,” లియహోనా, మే 2020, 32–35 కూడా చూడండి;

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

మోర్మన్ గ్రంథము యొక్క శీర్షిక పేజీ

మోర్మన్ గ్రంథమును చదవడం యేసు క్రీస్తు యందు విశ్వాసం కలిగియుండడానికి నాకు సహాయపడుతుంది.

  • మీ పిల్లలను మోర్మన్ గ్రంథమును చూడనివ్వండి మరియు దాని ప్రతినొకదానిని పట్టుకోనివ్వండి. యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన అనే ఉపశీర్షికను వారు ఎత్తిచూపడానికి సహాయపడండి. శీర్షిక పేజీలో, “యేసే క్రీస్తు అని, నిత్యుడగు దేవుడని, సమస్త జనములకు తననుతాను ప్రత్యక్షపరచుకొనును” అనే వాక్యభాగమును కనుగొనడానికి కూడా మీరు వారికి సహాయపడవచ్చు. మోర్మన్ గ్రంథము యేసు క్రీస్తు గురించి మనకు బోధిస్తుందనేది దీని అర్థమని వారు గ్రహించడానికి సహాయపడండి. మోర్మన్ గ్రంథము యేసు క్రీస్తు యందు మీ విశ్వాసాన్ని ఎలా బలపరచిందో సంక్షిప్తంగా వారికి చెప్పండి. మోర్మన్ గ్రంథములో వారికి ఇష్టమైన కథల గురించి కూడా మీరు వారిని అడగవచ్చు.

మోర్మన్ గ్రంథమునకు పీఠిక

మోర్మన్ గ్రంథము మన మతము యొక్క ప్రధానరాయి.

  • “మోర్మన్ గ్రంథము మన మతము యొక్క ప్రధానరాయి” అని మోర్మన్ గ్రంథమునకు పీఠికలో జోసెఫ్ స్మిత్ యొక్క మాటలను గ్రహించడానికి ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీ మరియు క్రింది చిత్రము మీ పిల్లలకు సహాయపడగలవు. పైన ఒక ప్రధానరాయితో విల్లు వంటి కట్టడాన్ని నిర్మించడం లేదా గీయడం కూడా సరదాగా ఉండవచ్చు. ప్రధానరాయి తొలగించబడితే ఏమి జరుగుతుంది? మనకు మోర్మన్ గ్రంథము లేకపోతే ఏమి జరుగుతుంది? మోర్మన్ గ్రంథము యొక్క సత్యమును మనం అంగీకరించినప్పుడు ఇంకా మనం ఏమి నేర్చుకుంటామో తెలుసుకోవడానికి పీఠికలోని చివరి పేరాను మీరు కలిసి చదువవచ్చు. యేసు క్రీస్తు యందు మన విశ్వాసానికి మోర్మన్ గ్రంథమును ప్రధానరాయిగా మనమెలా చేయగలము?

ప్రధానరాయిని తగిన స్థానంలో ఉంచుతూ రాతి విల్లు వంటి కట్టడం

మోర్మన్ గ్రంథము మన మతము యొక్క ప్రధానరాయి.

ముగ్గురు సాక్షుల సాక్ష్యము”; “ఎనిమిదిమంది సాక్షుల సాక్ష్యము

నేను మోర్మన్ గ్రంథము యొక్క సాక్షిని కాగలను.

  • ఒక సాక్షిగా ఉండడం అంటే ఏమిటో మీ పిల్లలు గ్రహించేలా సహాయపడేందుకు, వారు చూడనిది మీరు చూసినది ఒకదాని గురించి మీరు వారికి వివరించవచ్చు. తర్వాత వారిని మీ కోసం అలాగే చేయనివ్వండి. మోర్మన్ గ్రంథము అనువదించబడిన బంగారు పలకలను చూసిన 11 మంది జనుల గురించి సంభాషణకు ఇది దారితీయవచ్చు. మీరు కలిసి సాక్ష్యాలను చదువుతున్నప్పుడు, వారి సాక్ష్యాల గురించి ఇతరులు తెలుసుకోవాలని ఈ సాక్షులు ఎందుకు కోరుకున్నారనే దాని గురించి మీరు మాట్లాడవచ్చు. మోర్మన్ గ్రంథము గురించి మనం ఎవరికి చెప్పాలనుకుంటున్నాము?

ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ సాక్ష్యము

మోర్మన్ గ్రంథము దేవుని శక్తి చేత మనకు ఇవ్వబడింది.

  • దేవుడు మోర్మన్ గ్రంథమును మనకు ఎలా ఇచ్చారో తెలుసుకోవడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు, మీరు “ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ సాక్ష్యము” యొక్క భాగాలను వారి కొరకు చదువవచ్చు. కొన్నిసార్లు కథను అభినయించడాన్ని కూడా మీ పిల్లలు ఆనందించవచ్చు.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

మొరోనై నుండి బంగారు పలకలను అందుకుంటున్న జోసెఫ్

Moroni Delivers the Golden Plates [బంగారు పలకలను అందిస్తున్న మొరోనై], గ్యారీ ఎల్. కాప్ చేత