2024 రండి, నన్ను అనుసరించండి
జనవరి 8–14: “నేను వెళ్ళి, చేయుదును.” 1 నీఫై 1-5


“జనవరి 8-14: ‘నేను వెళ్ళి, చేయుదును.’ 1 నీఫై 1-5,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)

“జనవరి 8-14. 1 నీఫై 1-5,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)

ఎడారిలో ప్రయాణిస్తున్న లీహై కుటుంబము

ఎర్ర సముద్రం సమీపంలో ప్రయాణిస్తున్న లీహై, గ్యారీ స్మిత్ చేత

జనవరి 8–14: “నేను వెళ్ళి, చేయుదును”

1 నీఫై 1-5

మోర్మన్ గ్రంథము ఒక నిజమైన కుటుంబం ఎదుర్కొనే నిజమైన శ్రమల వృత్తాంతముతో ప్రారంభమవుతుంది. ఇది క్రీ.పూ 600లో జరిగినది, కానీ ఈనాటి కుటుంబాలకు కూడా సుపరిచితంగా అనిపించే విషయాలు ఈ వృత్తాంతంలో ఉంటాయి. ఈ కుటుంబం దుర్మార్గపు ప్రపంచంలో జీవిస్తోంది, కానీ వారు ప్రభువును అనుసరిస్తే, వారిని సురక్షిత మార్గం వైపు నడిపిస్తానని ఆయన వారికి వాగ్దానం చేసారు. ఈ మార్గంలో వారు మంచి క్షణాలు, చెడు క్షణాలు, గొప్ప దీవెనలు మరియు అద్భుతాలు కలిగియున్నారు, అలాగే వారు వాదనలు, వివాదాలు కూడా కలిగియున్నారు. లేఖనాలలో సువార్తను జీవించడానికి ప్రయత్నిస్తున్న ఒక కుటుంబం గురించిన వివరణాత్మక వృత్తాంతం అరుదుగా ఉంటుంది: తమ కుటుంబంలో విశ్వాసాన్ని ప్రేరేపించడానికి ప్రయాసపడుతున్న మరియు వారి క్షేమం గురించి చింతిస్తున్న తల్లిదండ్రులు, తమ తల్లిదండ్రులను నమ్మాలో లేదో నిర్ణయించాల్సిన పిల్లలు మరియు అసూయలు, వివాదాలతో రగిలిపోతూ—కొన్నిసార్లు ఒకరినొకరు క్షమించుకొనే సోదరులు. మొత్తానికి, ఈ అపరిపూర్ణ కుటుంబం యొక్క విశ్వాసపు మాదిరులలో శక్తి ఉంది.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

1 నీఫై 1-5

దేవుని వాక్యము నాకు “అత్యంత విలువైనది”.

దేవుని వాక్యము “అత్యంత విలువైనది” (1 నీఫై 5:21) అనేది మోర్మన్ గ్రంథములో ఉన్న ఒక ప్రముఖ సందేశము. మీరు 1 నీఫై 1–5 చదివినప్పుడు, దేవుని వాక్యము లీహై కుటుంబాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దీవించిన విధానాల కొరకు చూడండి (ఉదాహరణకు, 1:11–15; 3:19–20; 5:10–22 చూడండి). దేవుని వాక్యము గురించి ఈ అధ్యాయాలు మీకు ఏమి బోధిస్తున్నాయి? లేఖనాలను పరిశోధించడానికి మిమ్మల్ని ప్రేరేపించేలా మీరేమి కనుగొంటారు?

1 నీఫై 2

నేను ప్రభువు తట్టు తిరిగినప్పుడు, నేను నా సాక్ష్యాన్ని పొందగలను మరియు బలపరచుకోగలను.

ప్రభువు యందు తన శక్తివంతమైన విశ్వాసానికి నీఫై ప్రసిద్ధి చెందాడు, కానీ మనందరిలాగే—అతడు తన సాక్ష్యాన్ని పొందడానికి శ్రమించవలసి వచ్చింది. అతని తండ్రి మాటలు నిజమని నీఫై ఎందుకు సాక్ష్యాన్ని పొందగలిగాడో చూపేలా 1 నీఫై 2లో మీరేమి చదువుతారు? లేమన్ మరియు లెముయెల్ ఈ సాక్ష్యాన్ని ఎందుకు పొందలేదు? (1 నీఫై 15:2-11 కూడా చూడండి). ప్రభువు మీ హృదయాన్ని మృదువుగా చేసినట్లు మీరెప్పుడు భావించారు?

సెమినరీ చిహ్నము

1 నీఫై 3–4

దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన నాకు ఒక మార్గాన్ని సిద్ధం చేస్తారు.

ఇత్తడి పలకలను పొందమని లీహై కొడుకులను ప్రభువు ఆజ్ఞాపించినప్పుడు, దానిని ఎలా చేయాలనే దాని గురించి ఆయన నిర్దిష్ట సూచనలు ఇవ్వలేదు. దేవుని నుండి మనం పొందే నిర్దేశం విషయంలో ఇది తరచుగా నిజమవుతుంది మరియు ఆయన “కష్టమైన కార్యం” కోరినట్లు అనిపిస్తుంది (1 నీఫై 3:5). 1 నీఫై 3:7, 15–16లోని ప్రభువు ఆజ్ఞ పట్ల నీఫై ప్రతిస్పందన గురించి మీకు ఏది ప్రేరణనిస్తుంది?

మీరు 1 నీఫై 3–4 చదువుతున్నప్పుడు, నీఫై ఎదుర్కొన్న వివిధ రకాల కష్టాల కొరకు చూడండి. “ఆయన [ఆజ్ఞాపించిన] కార్యమును నెరవేర్చుటకు” నీఫై కొరకు ప్రభువు ఏవిధంగా “ఒక మార్గమును సిద్ధపరిచారు”? నీఫై కోసం ప్రభువు ఏమి చేసారో తెలుసుకోవడం మీకెందుకు ముఖ్యమైనది?

ఆయన ఆజ్ఞలను పాటించడానికి దేవుడు మనల్ని సిద్ధపరచిన ఒక శక్తివంతమైన విధానము మన రక్షకునిగా ఉండడానికి యేసు క్రీస్తును పంపడం. అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ గారి సందేశము, మన రక్షకుడు మన కోసం ఏమి చేసారు?” చదవడం గురించి ఆలోచించండి (లియహోనా, మే 2021, 75–77). మనలో ప్రతీఒక్కరి కోసం యేసు క్రీస్తు ఏవిధంగా ఒక మార్గాన్ని సిద్ధపరిచారు? మీ కోసం ఆయన అన్నింటిని జయించారని తెలుసుకొని, “వెళ్ళి ఏమి చేయాలని” మీరు భావించారు?

సువార్త సూత్రాలను బోధించడానికి కథలను, మాదిరులను ఉపయోగించండి. మీరు బోధించడానికి సిద్ధపడినప్పుడు, లేఖనాలలోని వృత్తాంతాలకు రెండవ సాక్ష్యాన్ని జతచేయగల వ్యక్తిగత అనుభవాల గురించి ఆలోచించండి. ఉదాహరణకు, ప్రభువు చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మీ కోసం ఒక మార్గాన్ని ఎప్పుడు సిద్ధం చేసారు?

నీఫై మరియు అతని సహోదరులకు స్వాగతం పలుకుతున్న లీహై మరియు శరయ

Their Joy Was Full [వారి ఆనందము సంపూర్ణమాయెను], వాల్టర్ రానె చేత

1 నీఫై 4:1–3; 5:1–8

దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకోవడం ఆయన ఆజ్ఞలకు లోబడడానికి నాకు విశ్వాసాన్ని ఇవ్వగలదు.

లేమన్, లెముయెల్‌లకు సణగాలి లేదా ఫిర్యాదు చేయాలి అనిపించినప్పుడు, వారిని ప్రేరేపించడానికి, సహాయపడడానికి సాధారణంగా వారి సమీపంలో నీఫై, లీహైలు ఉన్నారు. మీకు సణగాలి అనిపించినప్పుడు, నీఫై మరియు లీహై మాటలను చదవడం సహాయకరంగా ఉండగలదు. దేవునిపై విశ్వాసం పెంపొందించుకోవడానికి ఇతరులకు సహాయపడేందుకు నీఫై, లీహైలు ఎలా ప్రయత్నించారు? ( 1 నీఫై 4:1–3; 5:1–8 చూడండి; 1 నీఫై 7:6–21 కూడా చూడండి). మీరు సణగాలి లేదా ఫిర్యాదు చేయాలని శోధించబడినప్పుడు మీకు సహాయపడగలిగేలా మీరు ఏమి నేర్చుకుంటారు?

1 నీఫై 4:5-18

“నేను ఆత్మ చేత నడిపించబడితిని.”

1 నీఫై 4:5–18లో, ఆత్మను గుర్తించి, అనుసరించడంలో నీఫై సామర్థ్యము గురించి ఏది మిమ్మల్ని ఆకట్టుకుంటుంది? ప్రభువు నుండి బయల్పాటును పొందడం గురించి మరింత నేర్చుకోవడానికి, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి సందేశము “సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు” (లియహోనా, మే 2018, 93–96) మీరు అధ్యయనం చేయవచ్చు.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

1 నీఫై 2:16

నేను నా స్వంత సాక్ష్యాన్ని కలిగియుండగలను.

  • తన తండ్రి బోధించినది నిజమని నీఫైకి ఎలా తెలిసింది? 1 నీఫై 2:16, 19లో ఈ ప్రశ్నకు జవాబులు కనుగొనడానికి మీ పిల్లలకు సహాయపడండి. బ్లాకుల మీద లేదా ఇతర వస్తువుల మీద నీఫై చర్యలను వ్రాసి, వాటితో దేనినైనా నిర్మించడాన్ని కూడా వారు ఆనందించవచ్చు. సాక్ష్యాన్ని నిర్మించడానికి ఈ చర్యలు మనకు ఎలా సహాయపడగలవనే దాని గురించి ఒక సంభాషణకు ఇది దారితీయవచ్చు.

  • వారు సాక్ష్యాన్ని పొందాలని కోరుకునే వాటిని సూచించే చిత్రాలను లేదా వస్తువులను, అనగా మోర్మన్ గ్రంథ ప్రతి లేదా యేసు క్రీస్తు, దేవాలయము లేదా జీవించియున్న ప్రవక్త యొక్క చిత్రము వంటివాటిని మీరు మీ పిల్లలకు చూపించవచ్చు. ఒకదానిని ఎంపిక చేసి, దాని గురించి వారి సాక్ష్యాలను పంచుకోమని వారిని ఆహ్వానించండి. మీరు మీ సాక్ష్యాన్ని ఎలా సంపాదించారో కూడా మీ పిల్లలకు చెప్పవచ్చు. మనకు స్వంత సాక్ష్యము ఎందుకు అవసరము?

1 నీఫై 3–4

ఆయన ఆజ్ఞలను పాటించడానికి దేవుడు నాకు సహాయపడతారు.

  • ఇత్తడి పలకలు పొందడానికి దేవుడు నీఫైకి ఎలా సహాయపడ్డారనే దాని గురించి మాట్లాడడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు ఈ వనరులలో ఒకటి లేదా ఎక్కువ వాటిని ఉపయోగించడాన్ని పరిగణించండి: 1 నీఫై 3–4; ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీ.

  • 1 నీఫై 3:2–7ను అభినయించడాన్ని కూడా మీరు, మీ పిల్లలు ఆనందించవచ్చు. మీరు లీహైగా నటించవచ్చు మరియు ఇత్తడి పలకలు తీసుకురావడానికి యెరూషలేముకు తిరిగి వెళ్ళమని మీ పిల్లలను అడగవచ్చు. వారే లేమన్, లెముయెల్ లేదా నీఫై అయినట్లుగా, వారి స్వంత మాటలలో స్పందించమని వారిని ఆహ్వానించండి. మనం చేయాలని దేవుడు ఆజ్ఞాపించిన కొన్ని విషయాలేవి? (ఉపాయాల కోసం, మోషైయ 18:8–10 చూడండి). మనము నీఫై వలె ఎలా ఉండగలము?

1 నీఫై 3:19-21; 5:19–22.

లేఖనాలు గొప్ప నిధి వంటివి.

  • లీహై కుటుంబానికి లేఖనాలు చాలా ముఖ్యమైనవి. దీనిని వివరించడానికి, ఇత్తడి పలకలను తీసుకురావడానికి నీఫై మరియు అతని సహోదరులు చేసిన దానిని చెప్పడానికి లేదా నటించి చూపడానికి మీకు సహాయం చేయడానికి మీరు మీ పిల్లలను ఆహ్వానించవచ్చు: వారు చాలా దూరం ప్రయాణించారు, తమ వెండి బంగారాలను వదులుకున్నారు మరియు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక గుహలో దాగుకున్నారు. తర్వాత మీరు 1 నీఫై 5:21 చదివి, లీహై కుటుంబానికి లేఖనాలు ఎందుకంత ముఖ్యమైనవి అనే దాని గురించి మాట్లాడవచ్చు. అవి మనకు ఎందుకు విలువైనవి? లేఖనాలను ఒక నిధిలాగా మనమెలా ఆదరించగలము?

పలకలను అధ్యయనము చేస్తున్న నీఫై మరియు అతని కుటుంబము

నీఫై మరియు అతని కుటుంబము లేఖనాలకు విలువిచ్చారు.

1 నీఫై 4:6

నేను ప్రభువు యొక్క చిత్తాన్ని చేయాలని కోరినప్పుడు పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తాడు.

  • 1 నీఫై 3లో నీఫై మరియు అతని సహోదరులు ఇత్తడి పలకలను తేవడానికి ఎలా ప్రయత్నించారని కలిసి పునరాలోచన చేసిన తర్వాత, చివరకు సఫలం కావడానికి నీఫై ఏమి చేసాడో తెలుసుకోవడానికి మీ పిల్లలతో పాటు 1 నీఫై 4:6 చదవండి. అప్పుడు మీ పిల్లలు దేవుడు వారిని చేయమని కోరిన విషయాలను జాబితా చేయవచ్చు. ఈ పరిస్థితులలో పరిశుద్ధాత్మ మనకు ఎలా సహాయపడగలడు?

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

త్రాగినమత్తులో ఉన్న లేబన్‌ ప్రక్కనే నిలబడిన నీఫై

I Did Obey the Voice of the Spirit [నేను ఆత్మ యొక్క స్వరమును గైకొన్నాను], వాల్టర్ రానె చేత