2024 రండి, నన్ను అనుసరించండి
జనవరి 15–21: “వచ్చి ఫలమును తినండి.” 1 నీఫై 6-10


“జనవరి 15–21: ‘వచ్చి ఫలమును తినండి.’ 1 నీఫై 6-10,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“జనవరి 15-21. 1 నీఫై 6-10,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)

చిత్రం
జీవవృక్షము గురించి లీహై యొక్క దర్శనము

లీహై స్వప్నము, స్టీవెన్ లాయిడ్ నీల్ చేత

జనవరి 15–21: “వచ్చి ఫలమును తినండి”

1 నీఫై 6-10

ఇనుపదండం, అంధకారపు పొగమంచు, విశాలమైన భవనం, “అత్యంత మధురమైన” ఫలంతో నున్న వృక్షం కలిగియున్న లీహై స్వప్నం—రక్షకుని ప్రేమ, ప్రాయశ్చిత్త త్యాగం యొక్క దీవెనలు పొందడానికి ఒక స్ఫూర్తిదాయకమైన ఆహ్వానం. అయినప్పటికీ లీహై దృష్టిలో మాత్రం ఈ దర్శనం అతని కుటుంబానికి సంబంధించినది కూడా: “నేను చూచిన దాని ప్రకారము, నీఫై, శామ్‌లను బట్టి కూడా ప్రభువునందు ఆనందించుటకు నాకు కారణము కలదు. … కానీ లేమన్‌, లెముయెల్ మిమ్ములను బట్టి నేను మిక్కిలి భయపడుచున్నాను” (1 నీఫై 8:3–4). లీహై తన దర్శనం గురించి వివరించడం పూర్తి చేసినప్పుడు, “తన మాటలను ఆలకించవలెనని, అట్లయిన ప్రభువు వారికి కనికరముగా నుండునేమోయని” (1 నీఫై 8:37) లేమన్, లెముయెల్‌లను అతడు ప్రాధేయపడెను. మీరు లీహై దర్శనాన్ని చాలాసార్లు అధ్యయనం చేసినప్పటికీ, ఈసారి లీహై చేసిన విధంగా ఆలోచించండి—మీరు ఇష్టపడే వ్యక్తి గురించి ఆలోచించండి. మీరు ఆ విధంగా చేసినప్పుడు, ఇనుపదండము యొక్క భద్రత, విశాలమైన భవనము యొక్క ప్రమాదాలు, ఫలము యొక్క తియ్యదనము క్రొత్త అర్థాన్నిస్తాయి. అలాగే, ఈ అద్భుతమైన దర్శనం పొందిన “మృదువైన తండ్రి భావాలను” మీరు మరింత లోతుగా అర్థం చేసుకుంటారు.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

1 నీఫై 7:6-21

నేను ఇతరులను క్షమించగలను.

1 నీఫై 7:6–21లో నీఫై మాదిరి గురించి ఏది మిమ్మల్ని ఆకట్టుకున్నది? మనం ఒకరినొకరం “నిష్కపటముగా క్షమించుకున్నప్పుడు” మనమెలా దీవించబడ్డాము? “ప్రభువు నీఫైని అతని అవిధేయ సహోదరుల నుండి విడిపిస్తారు” (సువార్త గ్రంథాలయము) అనే వీడియో మీ అధ్యయనంలో సహాయపడగలదు.

1 నీఫై 8

దేవుని వాక్యమును గట్టిగా పట్టుకోవడం నన్ను రక్షకుని వైపుకు నడిపిస్తుంది మరియు ఆయన ప్రేమను అనుభవించడానికి నాకు సహాయపడుతుంది.

క్రీస్తు వలె మారడానికి మీ వ్యక్తిగత ప్రయాణంలో మీరు ఎక్కడ ఉన్నారో అనే దానిపై ప్రతిబింబించమనే ఆహ్వానాన్ని లీహై దర్శనం అందిస్తుంది. అధ్యక్షులు బాయిడ్ కె. పాకర్ ఇలా చెప్పారు: “మీరు దీనిలో భాగమే; మనందరం దీనిలో భాగమే. లీహై స్వప్నం లేదా దర్శనంలోని ఇనుపదండంలో అన్నీ ఉన్నాయి … కడవరి దిన పరిశుద్ధుడు జీవితపు పరీక్షను అర్థం చేసుకోవాలి” (“Lehi’s Dream and You,” New Era, Jan. 2015, 2).

మీరు అధ్యయనం చేసినప్పుడు, ఇలాంటి పటములో వాటిని నమోదు చేయడాన్ని పరిగణించండి.

లీహై దర్శనంలోని సంకేతం

అర్థాలు

ధ్యానించవలసిన ప్రశ్నలు

లీహై దర్శనంలోని సంకేతం

వృక్షము మరియు దాని ఫలము (1 నీఫై 8:10–12)

అర్థాలు

ధ్యానించవలసిన ప్రశ్నలు

దేవుని ప్రేమలో పాలుపంచుకోవడానికి ఇతరులను ఆహ్వానించడానికి నేనేమి చేస్తున్నాను?

లీహై దర్శనంలోని సంకేతం

నది (1 నీఫై 8:13)

అర్థాలు

ధ్యానించవలసిన ప్రశ్నలు

లీహై దర్శనంలోని సంకేతం

ఇనుపదండము (1 నీఫై 8:19–20, 30)

అర్థాలు

ధ్యానించవలసిన ప్రశ్నలు

లీహై దర్శనంలోని సంకేతం

అంధకారపు పొగమంచు (1 నీఫై 8:23)

అర్థాలు

ధ్యానించవలసిన ప్రశ్నలు

లీహై దర్శనంలోని సంకేతం

గొప్ప విశాలమైన భవనం (1 నీఫై 8:26–27, 33)

అర్థాలు

ధ్యానించవలసిన ప్రశ్నలు

లీహై చూసిన నాలుగు జన సమూహాల గురించి నేర్చుకోవడానికి క్రింది వచనాలను కూడా మీరు పరిశోధించవచ్చు: 1 నీఫై 8:21–23, 24–28, 30 మరియు 31–33. ఈ సమూహాల మధ్య ఏ తేడాలను మీరు గమనిస్తారు? వృక్షము వద్దకు చేరుకొని, ఫలాన్ని రుచి చూసిన తర్వాత కొందరు జనులు ఎందుకు వెళ్ళిపోతారు (24–28 వచనాలు చూడండి)? ఈ అనుభవం నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?

కెవిన్ డబ్ల్యు. పియర్సన్, “చెట్టు దగ్గర ఉండండి,” లియాహోనా, మే 2015, 114–16 కూడా చూడండి; “లీహై జీవవృక్షము యొక్క దర్శనము చూచును” (వీడియో), సువార్త గ్రంథాలయము.

లీహై దర్శనము గురించి తెలుసుకోవడానికి మీకు సహాయపడే పరస్పర అనుభవం కోసం, ఇక్కడ క్లిక్ చేయండి.

అభ్యాసకులను తమ స్వంత ఆవిష్కరణలు పంచుకోనివ్వండి. వారు కనుగొన్న సత్యాల కోసం వారికైవారు లేఖనాలను పరిశోధించడానికి అభ్యాసకులను ఆహ్వానించడం గురించి ఆలోచించండి. ఉదాహరణకు, వారికైవారు లేదా చిన్న సమూహాలుగా పైనున్న పటములోని లేఖన సూచికలను పరిశోధించడానికి మీరు వారిని ఆహ్వానించవచ్చు. వారు కనుగొన్న సత్యాలను వారు గుర్తుంచుకుంటారు మరియు ఆదరిస్తారు.

చిత్రం
జీవ వృక్షానికి నడిపిస్తున్న ఇనుపదండాన్ని పట్టుకున్న జనులు

Common Thread [పునరావృత లక్షణం], కెల్సీ మరియు జెస్సి బార్రెట్ చేత

1 నీఫై 10:2–16

ప్రాచీన ప్రవక్తలు యేసు క్రీస్తు యొక్క నియమిత కార్యము గురించి యెరిగియున్నారు మరియు ఆయన గురించి సాక్ష్యమిచ్చారు.

1 నీఫై 10:2–16లో కనుగొనబడే సత్యాలను లీహై కుటుంబము—మరియు మనమందరం—తెలుసుకోవాలని ప్రభువు కోరుతున్నారని మీరెందుకు అనుకుంటున్నారు? రక్షకుడిని వారి జీవితాలలోకి ఆహ్వానించడానికి మీ ప్రియమైన వారికి మీరెలా సహాయపడగలరో ఆలోచించండి.

1 నీఫై 10:17–19

చిత్రం
సెమినరీ చిహ్నము
పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు నాకు సత్యాన్ని బయల్పరుస్తారు.

మీకు అర్థం కాని ఒక సువార్త సూత్రాన్ని జీవించమని మీరు అడుగబడినప్పుడు మీరెలా స్పందిస్తారు? క్రింది లేఖనాలలో, లీహై దర్శనానికి నీఫై స్పందించిన విధానం (1 నీఫై 10:17–19; 11:1 చూడండి) మరియు లేమన్, లెముయెల్ స్పందించిన విధానం (1 నీఫై 15:1–10 చూడండి) మధ్య తేడాలను గమనించండి. నీఫై ఆ విధంగా స్పందించడానికి అతడు ఏ సత్యాలను అర్థం చేసుకున్నాడు?

నీఫై మాదిరిని మనస్సులో ఉంచుకొని, మీరు బాగా అర్థం చేసుకోవాలని కోరుతున్న సువార్త సూత్రాల జాబితా చేయండి. మీ అంతట మీరు సమాధానాలు కనుగొనడానికి మీరేమి చేయగలరు?

అతని తండ్రి మాటలు నిజమని నీఫై తనకుతానుగా తెలుసుకున్నట్లు, మనం ఆధునిక ప్రవక్తలు మరియు అపొస్తలుల మాటలు వినినప్పుడు మనం కూడా అలాగే చేయగలము. ఇటీవలి సర్వసభ్య సమావేశంలో ప్రవక్తలు మరియు అపొస్తలులు మనకేమి బోధించారు? వారు బోధించిన దాని గురించి మీరేవిధంగా వ్యక్తిగత సాక్ష్యాన్ని పొందారు?

1 నీఫై 2:11–19; సిద్ధాంతము మరియు నిబంధనలు 8:1-3 కూడా చూడండి. 

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

1 నీఫై 8

దేవుని వాక్యమును గట్టిగా పట్టుకోవడం నన్ను ఆయన వైపుకు నడిపిస్తుంది మరియు ఆయన ప్రేమను అనుభవించడానికి నాకు సహాయపడుతుంది.

  • మీరు కలిసి 1 నీఫై 8 చదువుతున్నప్పుడు, మీ పిల్లలు లీహై దర్శనము యొక్క చిత్రాన్ని గీయడాన్ని ఆనందించవచ్చు. వారి చిత్రాలను వారు పంచుకోనివ్వండి మరియు స్వప్నములోని సంకేతాలు వేటిని సూచిస్తున్నాయో కనుగొనడానికి వారికి సహాయపడండి (1 నీఫై 11:21–22; 12:16–18; 15:23–33, 36 మరియు ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీ చూడండి). ఈ ప్రశ్నకు వారు పంచుకోగలిగినన్ని సమాధానాలను పంచుకోమని వారిని అడగండి: లీహై దర్శనము నుండి మనమేమి నేర్చుకుంటాము?

  • లీహై దర్శనములోని ఇనుపదండాన్ని సూచించేలా ఒక పైపు లేదా కర్ర లాంటిదేదైనా మీ దగ్గర ఉందా? గది చుట్టూ త్రిప్పుతూ మీరు వారిని రక్షకుని చిత్రం వద్దకు నడిపించినప్పుడు మీ పిల్లలు దానిని పట్టుకోనివ్వండి. లీహై దర్శనములో ఇనుపదండము ఎందుకు ముఖ్యమైనది? (1 నీఫై 8:20, 24, 30 చూడండి). ఇనుపదండము దేవుని వాక్యము వలె ఎట్లున్నది?

  • 1 నీఫై 8:10–12 చదివి, లీహై చూసిన దానిని వివరించమని మీ పిల్లల్లో కొందరిని ఆహ్వానించండి. మిగతావారిని 1 నీఫై 11:20–23 చదివి, నీఫై చూసిన దానిని వివరించమని అడగండి. దేవుని ప్రేమ గురించి అతనికి బోధించడానికి దేవదూత నీఫైకి బాలుడైన యేసును ఎందుకు చూపించాడు? వారి జీవితాల్లో వారు దేవుని ప్రేమను ఏవిధంగా అనుభవించారనే దాని గురించి మీ పిల్లలతో మాట్లాడండి.

1 నీఫై 10:17-19; 11:1

పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు నాకు సత్యాన్ని బయల్పరుస్తారు.

  • 1 నీఫై 10:19లో నీఫై బోధించిన దానిని అర్థం చేసుకోవడానికి మీ పిల్లలకు మీరు ఎలా సహాయపడగలరు? బహుశా మీరు రక్షకుని చిత్రాన్ని లేదా ఏదైనా ప్రత్యేక వస్తువును దుప్పటిలో చుట్టి, దానిని మడత విప్పి చూడమని మీ పిల్లలను ఆహ్వానించవచ్చు. మీరు 1 నీఫై 10:19 చదువుతున్నప్పుడు, “మడత విప్పండి” మరియు “పరిశుద్ధాత్మ” పదాలను వారు వినినప్పుడు వారు తమ చేతులను పైకెత్తవచ్చు. అప్పుడు మీరు సత్యాన్ని కనుగొనడంలో పరిశుద్ధాత్మ మీకు సహాయపడిన ఒక అనుభవాన్ని పంచుకోవచ్చు.

  • ఒక ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి వారు ఏమి చేస్తారనే దాని గురించి మాట్లాడమని మీ పిల్లలను అడగండి. సువార్త గురించి ఒక ప్రశ్నకు సమాధానం ఎలా కనుగొనాలని ఎవరైనా అతడ్ని అడిగితే నీఫై ఏమి చెప్తుండవచ్చు? 1 నీఫై 10:17–19; 11:1 చదవడం ద్వారా కనుగొనమని పిల్లలను ప్రోత్సహించండి.

  • ఏదైనా ఒకటి నిజమని వారు తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ వారికి సహాయపడినట్లు మీ పిల్లలు ఎప్పుడైనా భావించారా? వారిని తమ అనుభవాన్ని పంచుకోనివ్వండి. అతడు లేదా ఆమె పరిశుద్ధాత్మ ద్వారా జవాబులు పొందలేరని అనుకొనే ఒక స్నేహితునికి మనం ఏమి చెప్పవచ్చు? ఆ స్నేహితునికి సహాయపడేలా 1 నీఫై 10:17–19 మరియు 11:6లో మనమేమి కనుగొంటాము?

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

చిత్రం
లీహై దర్శనము

The Tree of Life [జీవవృ‌క్షము], ఏవన్ ఓక్సన్ చేత

ముద్రించు