“జనవరి 22–28: ‘పరిశుద్ధతను, దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొనియుండిరి.’ 1 నీఫై 11-15,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)
“జనవరి 22-28. 1 నీఫై 11–15,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)
జనవరి 22–28: “పరిశుద్ధతను, దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొనియుండిరి”
1 నీఫై 11–15
తన ప్రవక్త ద్వారా చేయించవలసిన బృహత్తర కార్యాన్ని దేవుడు కలిగియున్నప్పుడు, బృహత్తరమైన దర్శనమును ఆయన తరచూ ఆ ప్రవక్తకు ఇస్తారు. మోషే, యోహాను, లీహై మరియు జోసెఫ్ స్మిత్ అందరూ అటువంటి దర్శనాలను—వారి మనస్సులను విస్తరించి, దేవుని కార్యము నిజంగా ఎంత గొప్పదో మరియు విస్మయం కలిగిస్తుందో చూడడానికి వారికి సహాయపడిన దర్శనాలను కలిగియున్నారు.
నీఫై కూడా అటువంటి అత్యంత ప్రభావవంతమైన దర్శనాలలో ఒకదానిని కలిగియున్నాడు. రక్షకుని పరిచర్య, వాగ్దాన దేశంలో లీహై సంతతి యొక్క భవిష్యత్తు మరియు దేవుని కార్యము యొక్క కడవరి దిన గమ్యాన్ని అతడు చూసాడు. ఈ దర్శనము తర్వాత, జరుగబోయే కార్యము కొరకు నీఫై బాగా సిద్ధపడ్డాడు. ఈ దర్శనం గురించి చదవడం మిమ్మల్ని కూడా సిద్ధపరచడంలో సహాయపడగలదు—ఎందుకంటే ఆయన రాజ్యంలో మీరు చేయవలసిన కార్యాన్ని దేవుడు కలిగియున్నాడు. నీఫై చూసిన “గొఱ్ఱెపిల్ల సంఘము యొక్క పరిశుద్ధుల”లో మీరు ఉన్నారు, “వారు భూముఖమంతటిపైన చెదిరియుండిరి; వారు గొప్ప మహిమయందు పరిశుద్ధతను, దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొనియుండిరి” (1 నీఫై 14:14).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
దేవుడు తన ప్రేమకు వ్యక్తీకరణగా యేసు క్రీస్తును పంపారు.
లీహై దర్శనములోని వృక్షమునకు అర్థమేమిటని నీఫై దేవదూతను అడిగినప్పుడు, దేవదూత సరళంగా, “అది దేవుని ప్రేమను సూచిస్తున్నది,” అని చెప్పియుండవచ్చు. బదులుగా, అతడు రక్షకుని జీవితం నుండి సంకేతాలను, సంఘటనలను వరుసగా నీఫైకు చూపించాడు. మీరు 1 నీఫై 11 చదువుతున్నప్పుడు ఈ సంకేతాలు, సంఘటనల కొరకు చూడండి. ఎందుకు యేసు క్రీస్తు దేవుని ప్రేమ యొక్క అంతిమ వ్యక్తీకరణ అని గ్రహించడానికి మీకు సహాయపడేలా మీరు దేనిని కనుగొంటారు?
మీ పరలోక తండ్రి ప్రేమను అనుభవించడానికి రక్షకుడు మీకెలా సహాయపడ్డారు?
సూసన్ హెచ్. పోర్టర్, “దేవుని ప్రేమ: ఆత్మకు మిక్కిలి ఆనందకరమైనది,” లియహోనా, నవ. 2021, 33–35 కూడా చూడండి.
నేను “పరిశుద్ధతను, శక్తిని ఆయుధములుగా ధరించుకోగలను”.
నీఫై తన దర్శనంలో చూసిన వాటిలో అనేకమును ప్రత్యక్షంగా చూడడానికి జీవించియుండడు. ఈ విషయాలను తెలుసుకోవడం నీఫైకి విలువైనదని మీరెందుకు అనుకుంటున్నారు? వాటిని తెలుసుకోవడం మీకెందుకు విలువైనది? నీఫై తన దర్శనంలో చూసిన దాని గురించి మీరు చదివే ప్రతిసారీ ఈ ప్రశ్నలు అడగండి (1 నీఫై 12–14 చూడండి). ప్రభువు యొక్క “గొప్ప అద్భుతకార్యము” లో మీ పాత్ర గురించి మీరు పొందే మనోభావాలేవి? (1 నీఫై 14:7). ఆయన మీ కోసం చేసిన గొప్ప అద్భుతకార్యములలో కొన్ని ఏవి?
ప్రత్యేకించి 1 నీఫై 14:14 లోని వాగ్దానాన్ని పరిగణించండి. ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో రక్షకుడు ఎలా నెరవేర్చారు? (కొన్ని ఉదాహరణలకు, డేవిడ్ ఎ. బెడ్నార్, “గొప్ప మహిమయందు దేవుని శక్తితో,” లియహోనా, నవ. 2021, 28–30, ప్రత్యేకించి చివరి రెండు విభాగాలు చూడండి.)
నీఫై చూసిన “గొప్ప హేయకరమైన సంఘము” అంటే ఏమిటి?
నీఫై వివరించిన “గొప్ప హేయకరమైన సంఘము”, “దేవునిపై నమ్మకాన్ని వ్యతిరేకించే ఏదైనా తత్వశాస్త్రం లేదా సంస్థను సూచిస్తుంది. మరియు పరిశుద్ధులను తీసుకురావాలని ఈ ‘సంఘము’ ప్రయత్నించే ‘చెర’, తప్పుడు ఆలోచనల చెర ఉన్నంత శారీరక నిర్బంధం కాదు” అని అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ వివరించారు (“Stand as Witnesses of God,” Ensign, Mar. 2015, 32). తప్పడు ఆలోచనల చెరను నివారించడానికి—దాని నుండి తప్పించుకోవడానికి—రక్షకుడు మీకెలా సహాయపడతారు?
నేను విశ్వాసంతో అడిగితే ప్రభువు నాకు సమాధానం ఇస్తారు.
దేవుడు మీతో మాట్లాడడం లేదని—మీరు వ్యక్తిగత బయల్పాటు పొందడం లేదని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అతని సోదరులు ఈ విధంగా భావించినప్పుడు నీఫై వారికి ఏమని సలహా ఇచ్చాడు? (1 నీఫై 15:1–11 చూడండి.) మీ జీవితంలో నీఫై సలహాను మీరెలా అన్వయించగలరు?
దేవుని వాక్యమును గట్టిగా పట్టుకోవడం సాతాను ప్రభావాన్ని నిరోధించడానికి నాకు సహాయపడుతుంది.
నీఫై తరచు అతని సోదరులకు చెప్పవలసిన అత్యవసర విషయాలను కలిగియున్నాడు. కానీ 1 నీఫై 15:23–25లో అతడు వారికి చెప్పిన వాటి గురించి ప్రత్యేకించి అతడు ఉద్వేగభరితంగా కనిపించాడు. నీఫై ఇచ్చిన సందేశం ఏమిటి మరియు దాని గురించి అతడు అంత బలంగా భావించాడని మీరెందుకు అనుకుంటున్నారు?
“దేవుని వాక్యము” లేఖనాలు, జీవించియున్న ప్రవక్తల మాటలు మరియు స్వయంగా యేసు క్రీస్తును సూచించవచ్చు అని ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ బోధించారు. లేఖనాలు మరియు జీవించియున్న ప్రవక్తల మాటలను “గట్టిగా పట్టుకోవడం” అంటే అర్థమేమిటని మీరనుకుంటున్నారు? యేసు క్రీస్తును “గట్టిగా పట్టుకోవడం” అంటే అర్థమేమైయుండవచ్చు? ఈ ప్రశ్నలకు సాధ్యమైన జవాబుల కోసం మీరు ఎల్డర్ బెడ్నార్ గారి సందేశం “కానీ మేము వారిని లక్ష్యపెట్టలేదు” (లియహోనా, మే 2022, 14–16) చూడవచ్చు.
దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవడం అపవాదిని నిరోధించడానికి మీకెలా సహాయపడుతుంది? క్రింది వంటి పట్టికను పూరించడం మీ ఆలోచనలను క్రమములో పెట్టడానికి సహాయపడగలదు:
… శోధన యొక్క అంధకారాన్ని జయించడానికి నాకు సహాయపడుతుంది? (1 నీఫై 12:17 చూడండి) |
… లోకము యొక్క వ్యర్థమైన ఊహలు మరియు గర్వమును “లక్ష్యపెట్టకుండుటకు” నాకు సహాయపడుతుంది? (1 నీఫై 12:18) | |
లేఖనాలు మరియు జీవించియున్న ప్రవక్తల మాటలను గట్టిగా పట్టుకోవడం ఏవిధంగా … | ||
రక్షకుడిని గట్టిగా పట్టుకోవడం ఏవిధంగా … |
జార్జ్ ఎఫ్. జెబల్లోస్, “అపవాదిని నిరోధించే జీవితమును నిర్మించుట,” లియహోనా, నవ. 2022, 50–52 కూడా చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
పరలోక తండ్రి యేసు క్రీస్తును పంపారు, ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నారు.
-
దేవుని ప్రేమ గురించి నీఫైకి బోధించడానికి, దేవదూత రక్షకుని జీవితం నుండి సంఘటనలను నీఫైకి చూపించాడు. మీరు ఈ వచనాలు చదివినప్పుడు, వాటితో జతపరచబడగల చిత్రాలను కనుగొనడానికి మీ పిల్లలకు సహాయపడండి. ఈ వచనాలు మరియు చిత్రాల నుండి యేసు క్రీస్తు గురించి మనం ఏమి నేర్చుకుంటాము?
-
1 నీఫై 11:22–23 నుండి దేవుని ప్రేమ గురించి మనం ఇంకేమి నేర్చుకుంటాము?
మోర్మన్ గ్రంథము అమూల్యమైన సత్యాలను బోధిస్తుంది.
-
మోర్మన్ గ్రంథములోని “స్పష్టమైన, ప్రశస్థమైన” సత్యాలకు మీ పిల్లలు విలువిచ్చేలా సహాయపడేందుకు, మీరు ఒక చిత్రాన్ని గీయవచ్చు మరియు అది భిన్నంగా కనిపించేలా చేయడానికి దానిని మార్చమని లేదా దాని భాగాలను తొలగించమని మీ పిల్లలను ఆహ్వానించవచ్చు. బైబిలులోని వాక్యాలు మార్చబడ్డాయని మరియు కాలం గడిచేకొద్దీ తీసివేయబడ్డాయని బోధించడానికి మీరు దీనిని ఉపయోగించవచ్చు. 1 నీఫై 13:40 కలిసి చదవండి మరియు బైబిలు (“మొదటి” గ్రంథాలు) నుండి కోల్పోబడిన “స్పష్టమైన మరియు ప్రశస్థమైన వాక్యాలు” గ్రహించడానికి మోర్మన్ గ్రంథము (“ఈ చివరి గ్రంథాలు”) మనకెలా సహాయపడుతుంది అనే దాని గురించి మాట్లాడండి. మోర్మన్ గ్రంథము నుండి మీరు నేర్చుకున్న “స్పష్టమైన, ప్రశస్థమైన” సత్యాలేవి?
దేవుని వాక్యమును గట్టిగా పట్టుకోవడం శోధనను నిరోధించడానికి నాకు సహాయపడుతుంది.
-
లీహై దర్శనము గురించి వారికి జ్ఞాపకమున్న దానిని పంచుకోవడానికి మీ పిల్లలకు ఒక అవకాశాన్నివ్వండి. గత వారం సారాంశంలో ఉన్నదాని వలె ఉన్న ఒక చిత్రాన్ని ఉపయోగించడం సహాయపడవచ్చు. వృక్షాన్ని చేరుకోవడం నుండి జనులను ఆపినదేమిటి? దానిని చేరుకోవడానికి వారికి సహాయపడినదేమిటి? చిత్రములో ఇనుపదండాన్ని కనుగొనమని మీరు వారిని అడగవచ్చు. ఇనుపదండం దేనిని సూచిస్తుంది మరియు అది మనకు ఎలా సహాయపడగలదు అని కనుగొనడానికి, కలిసి 1 నీఫై 15:23–24 చదవండి.