2024 రండి, నన్ను అనుసరించండి
ఫిబ్రవరి 5–11: “గొప్ప మధ్యవర్తి ద్వారా స్వేచ్ఛను, నిత్యజీవమును కోరుకొనుటకు స్వతంత్రులైయున్నారు.” 2 నీఫై 1-2


“ఫిబ్రవరి 5–11: ‘గొప్ప మధ్యవర్తి ద్వారా స్వేచ్ఛను, నిత్యజీవమును కోరుకొనుటకు స్వతంత్రులైయున్నారు.’ 2 నీఫై 1-2,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)

“ఫిబ్రవరి 5-11. 2 నీఫై 1-2,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)

ఏదెను తోట విడిచివెళ్తున్న ఆదాము హవ్వలు

ఆదాము మరియు హవ్వ, డగ్లస్ ఫ్రైయర్ చేత

ఫిబ్రవరి 5–11: “గొప్ప మధ్యవర్తి ద్వారా స్వేచ్ఛను, నిత్యజీవమును కోరుకొనుటకు స్వతంత్రులైయున్నారు”

2 నీఫై 1-2

మీ జీవితం ముగిసిపోబోతోందని మీకు తెలిస్తే, మీరు మిక్కిలిగా ప్రేమించే వారితో ఏ చివరి సందేశాలను మీరు పంచుకోవాలనుకుంటారు? ప్రవక్తయైన లీహై తన జీవితపు ముగింపునకు చేరుకున్నట్లు భావించినప్పుడు, అతడు చివరిసారిగా తన కుటుంబాన్ని ఒక చోట సమావేశపరిచాడు. పరలోక తండ్రి అతనికి బయల్పరచిన దానిని అతడు వారితో పంచుకున్నాడు. మెస్సీయ గురించి అతడు సాక్ష్యమిచ్చాడు. తాను ఎంతో ఆదరించిన జనులకు అతడు ఆదరించిన సువార్త సత్యాలను అతడు బోధించాడు. స్వేచ్ఛ, విధేయత, ఆదాము హవ్వల పతనం, యేసు క్రీస్తు ద్వారా విమోచన మరియు ఆనందం గురించి అతడు మాట్లాడాడు. అతడు బోధించిన దానిని బట్టి జీవించడానికి అతని పిల్లలు అందరూ ఎంచుకోలేదు—మనలో ఏ ఒక్కరం మనం ప్రేమించే వారి కోసం అటువంటి ఎంపికలు చేయలేము. కానీ, “స్వేచ్ఛను, నిత్యజీవమును కోరుకొనుటకు మనల్ని స్వతంత్రులనుగా” (2 నీఫై 2:26–27 చూడండి) చేసే విమోచకుని గురించి మనం బోధించగలము మరియు సాక్ష్యమివ్వగలము.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

2 నీఫై 1:13-29

నేను “మేలుకొని, ధూళి నుండి లేవగలను!”

2 నీఫై 1:13–29లో, లేమన్ మరియు లెముయెల్‌ల ఆత్మీయ స్థితిని వివరించడానికి లీహై ఉపయోగించిన పదాలను గమనించండి. ఆత్మీయ “గాఢ నిద్ర” నుండి మేలుకోవడానికి ఏది మీకు సహాయపడుతుంది? మీ జీవితంలోని ఆత్మీయ “సంకెళ్ళ”ను వదిలించుకోవడానికి ఏది మీకు సహాయపడుతుంది? 15వ వచనంలో లీహై సాక్ష్యము గురించి మరియు 23వ వచనంలో అతని ఆహ్వానం గురించి ఆలోచించండి. ఈ వచనములలో పరలోక తండ్రి మీ కొరకు కలిగియున్న సందేశమేది?

దృశ్యాలను ఉపయోగించండి. దృశ్యాలను ఉపయోగించడం సువార్త సత్యాలను అర్థం చేసుకోవడానికి మరియు వాటిని చాలాకాలం గుర్తుంచుకోవడానికి అభ్యాసకులకు సహాయపడుతుంది. మీరు ఈ సారాంశం నుండి బోధించడానికి సిద్ధపడుతున్నప్పుడు, మీరు ఉపయోగించగల దృశ్యాలను పరిగణించండి. ఉదాహరణకు, 2 నీఫై 1:13 లేదా 2 నీఫై 2:27లో ఉన్న లీహై మాటలను అర్థం చేసుకోవడానికి ఒక కాగితపు గొలుసు అభ్యాసకులకు సహాయపడవచ్చు.

సెమినరీ చిహ్నము

2 నీఫై 2

యేసు క్రీస్తు వలన, నేను “స్వేచ్ఛను, నిత్యజీవమును ఎన్నుకొనుటకు స్వతంత్రుడిని.”

లీహై కుటుంబం ఇప్పుడు క్రొత్త అవకాశాలతో నిండియున్న ఒక క్రొత్త దేశంలో ఉన్నారు. ఈ క్రొత్త ప్రదేశంలో వారు చేసిన ఎంపికలు వారి విజయానికి, సంతోషానికి ముఖ్యమవుతాయి. బహుశా ఈ కారణం చేతనే 2 నీఫై 2లో లీహై తన కొడుకు జేకబ్‌కు కర్తృత్వము లేదా ఎంపికలు చేసే సామర్థ్యము గురించి బోధించాడు. 11–30 వచనాలు మీరు చదివినప్పుడు, ఈ ప్రశ్నలకు సాధ్యమైనన్ని జవాబులు వ్రాయండి:

  • కొంతమంది దానిని హానికరమైన మార్గాలలో ఉపయోగించినప్పటికీ, పరలోక తండ్రికి కర్తృత్వము ఎందుకంత ముఖ్యమైనది?

  • మీ కర్తృత్వాన్ని బలహీనపరచడానికి లేదా నాశనం చేయడానికి అపవాది ఎలా ప్రయత్నిస్తాడు?

  • “స్వేచ్ఛను, నిత్యజీవమును ఎన్నుకొనుటకు” రక్షకుడు మీకెలా సహాయపడతారు (27వ వచనము)?

కర్తృత్వము గురించి 2 నీఫై 2లో నేర్చుకోవడానికి ఇక్కడ మరొక మార్గముంది: కర్తృత్వము కలిగియుండడానికి మరియు మన దైవిక సామర్థ్యాన్ని చేరుకోవడానికి మనకు అవసరమైన విషయాల కొరకు చూడండి. ఉదాహరణకు:

వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కోల్పోబడినట్లయితే, మన కర్తృత్వానికి ఏమి జరుగుతుంది?

2 నీఫై 2:1–4, 6–25

దేవుడు నా శ్రమలను దీవెనలుగా మార్చగలడు.

తన చిన్న కుమారుడైన జేకబ్ అతని చిన్నతనంలో “బాధలను” మరియు “అధిక దుఃఖమును” అనుభవించాడని లీహైకి తెలుసు (2 నీఫై 2:1). 2 నీఫై 2:1–3, 6–25లో ఉన్న లీహై సాక్ష్యము జేకబ్‌కు విలువైనదైయుండవచ్చని మీరెందుకు అనుకుంటున్నారు? అది మీకెందుకు విలువైనది? ప్రత్యేకంగా శక్తివంతమైనవిగా మీరు కనుగొన్న పదాలు మరియు వాక్యభాగాల కొరకు చూడండి. మీ బాధలను దేవుడు మీ లాభం కొరకు ఎలా ప్రతిష్టించాడు? (2 నీఫై 2:2 చూడండి.)

రోమా 8:28; డేల్ జి. రెన్లండ్, “తీవ్రమైన అన్యాయము,” లియహోనా, మే 2021, 41–45 చూడండి.

2 నీఫై 2:15–29

పరలోక తండ్రి ప్రణాళికలో పతనము మరియు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ఆవశ్యకమైన భాగాలు.

పతనము ఒక విషాదం మాత్రమేనని మరియు ఆదాము హవ్వలు ఫలమును తినడానికి ఎంచుకున్నప్పుడు వారు శాశ్వతమైన తప్పు చేసారని చాలామంది నమ్ముతారు. 2 నీఫై 2:15–28లో, పతనము గురించి—క్రీస్తు ద్వారా విమోచన గురించి అదనపు సత్యాన్ని లీహై బోధిస్తాడు. మీ ఈ వచనాలను పరిశోధించినప్పుడు, ఏదెను తోటలో జరిగిన వాటి గురించిన సత్యాలను జాబితా చేయండి. ఇటువంటి ప్రశ్నలు సహాయపడవచ్చు:

  • పతనము ఎందుకు అవసరము?

  • పతనము యొక్క ప్రభావాలను జయించడంలో యేసు క్రీస్తు ఏ పాత్ర పోషించారు?

  • పతనాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం యేసు క్రీస్తు మనకెంత అవసరమో బాగా అర్థం చేసుకోవడానికి మనకెలా సహాయపడుతుంది?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

యేసు క్రీస్తు

Let Not Your Heart Be Troubled (మీ హృదయమును కలవరపడనియ్యకుడి), హావర్డ్ లియోన్ చేత

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

2 నీఫై 1:13; 15, 23

పాపము యొక్క ప్రభావాలను జయించడానికి యేసు క్రీస్తు నాకు సహాయపడతారు.

  • పాపము యొక్క “సంకెళ్ళను వదిలించుకోండి” అనే లీహై ఆహ్వానాన్ని అర్థం చేసుకోవడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు, మీరు కలిసి పనిచేస్తూ కాగితపు ముక్కలతో ఒక గొలుసును తయారుచేయవచ్చు. కాగితపు ముక్కల మీద, సాతాను మనల్ని చేయమని శోధించే కొన్ని విషయాలను వ్రాయడానికి మీ పిల్లలు మీకు సహాయపడవచ్చు. కాగితపు గొలుసును వదిలించుకోవడంతో పాటు—ఈ వచనాలలోని కొన్ని వాక్యభాగాలను వారు నటించి చూపుతున్నప్పుడు, మీరు కలిసి 2 నీఫై 1:13, 15, 23 చదువవచ్చు. పాపము ఒక గొలుసువలె ఎట్లున్నది? పాపము యొక్క “సంకెళ్ళను వదిలించుకోవడానికి” యేసు మనకెలా సహాయపడతారు?

2 నీఫై 1:20

నేను దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు, నేను దీవించబడతాను.

  • మనల్ని కాపాడే బూట్లు, టోపీలు, చేతి తొడుగులు లేదా ఇతర వస్తువులతో దేవుని ఆజ్ఞలను పోల్చి చూపడం మీ పిల్లలకు సహాయపడుతుందా? ఆజ్ఞలు మనల్ని ఎలా కాపాడతాయోనని మీరు మాట్లాడుతున్నప్పుడు, వారు కొన్నిటిని ప్రయత్నించేలా మీరు చేయవచ్చు. తర్వాత, మనం ఆజ్ఞలను పాటించినప్పుడు మనం “వర్ధిల్లుతాము” (దీవించబడతాము లేదా కాపాడబడతాము) అని నొక్కిచెప్తూ మీరు 2 నీఫై 1:20 చదువవచ్చు. ఆజ్ఞలను పాటించడం ద్వారా మీరు దీవించబడిన లేదా కాపాడబడిన ఒక అనుభవాన్ని పంచుకోండి.

  • వర్ధిల్లడానికి మరియు దేవుని సన్నిధి నుండి కొట్టివేయబడడానికి (2 నీఫై 1:20 చూడండి) మధ్య తేడాను వివరించడానికి, మీరు, మీ పిల్లలు ఒక ఆరోగ్యవంతమైన మొక్కను మరియు మొక్క నుండి కత్తిరించబడిన ఆకు లేదా కొమ్మను చూడవచ్చు. తర్వాత మీ పిల్లలు నీఫై మరియు అతని సోదరులు చేసిన ఎంపికలను పునర్వీక్షించవచ్చు (1 నీఫై 2:11–16; 3:5–7; 18:9–11 చూడండి). ఈ ఎంపికల యొక్క ఫలితాలేవి? దేవునితో అనుసంధానమై ఉండడానికి ఏ ఎంపికలు మనకు సహాయపడతాయి?

2 నీఫై 2:11; 16, 27

ఎంపికలు చేయడానికి దేవుడు నాకు స్వేచ్ఛనిచ్చారు.

  • వ్యతిరేకాలు మరియు ఎంపికలు చేయడం గురించి లీహై బోధించిన దానిని అర్థం చేసుకోవడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు, మీరు ఒక ఆట ఆడవచ్చు, అందులో మీరు ఒక పదం (వెలుగు వంటిది) చెప్తారు మరియు మీ పిల్లలు దానికి వ్యతిరేక పదాన్ని (చీకటి) చెప్తారు. మీరు కలిసి 2 నీఫై 2:11, 16 చదువుతున్నప్పుడు, వ్యతిరేకాలు దేవుని ప్రణాళికలో ఎందుకు భాగమో నేర్చుకోవడానికి వారికి సహాయపడండి. తర్వాత, ఒక తప్పు ఎంపిక చేయడానికి శోధించబడిన బిడ్డ గురించి మీరు కథలు పంచుకోవచ్చు. మీ పిల్లలు ఆ తప్పు ఎంపికకు వ్యతిరేకమైన దానిని చెప్పి, దానిని నటించి చూపవచ్చు.

  • “స్వేచ్ఛ” మరియు “చెర” (2 నీఫై 2:27) మధ్య తేడా తెలుసుకోవడానికి, మీ పిల్లలు బోనులో ఉన్న ఒక జంతువు మరియు సహజ పర్యావరణంలో ఉన్న ఒక జంతువు బొమ్మలు గీయవచ్చు. ఏ జంతువు స్వేచ్ఛగా ఉంది? 2 నీఫై 2:27లో “స్వేచ్ఛ” అనే పదాన్ని మీరు చదివినప్పుడు, సరైన బొమ్మ వైపు చూపించమని పిల్లలను ఆహ్వానించండి. యేసు క్రీస్తు మనల్ని స్వతంత్రులను చేస్తారని సాక్ష్యమివ్వండి.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

సముద్రతీరం వద్ద మోకరిల్లుతున్న లీహై కుటుంబము

Lehi and His People Arrive in the New World [క్రొత్త ప్రపంచానికి చేరుకున్న లీహై మరియు అతని జనులు], క్లార్క్ కెల్లి ప్రైస్ చేత