2024 రండి, నన్ను అనుసరించండి
ఫిబ్రవరి 19-25: “ఆహా, మన దేవుని ప్రణాళిక ఎంత గొప్పది.” 2 నీఫై 6–10


“ఫిబ్రవరి 19-25: ‘ఆహా, మన దేవుని ప్రణాళిక ఎంత గొప్పది.’ 2 నీఫై 6-10,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)

“ఫిబ్రవరి 19-25. 2 నీఫై 6-10,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)

చిత్రం
గెత్సేమనేలో ప్రార్థిస్తున్న యేసు

Not My Will, but Thine, Be Done [నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక], హ్యారీ ఆండర్సన్ చేత

ఫిబ్రవరి 19-25: “ఆహా, మన దేవుని ప్రణాళిక ఎంత గొప్పది”

2 నీఫై 6–10

లీహై కుటుంబం యెరూషలేమును విడిచిపెట్టి కనీసం 40 సంవత్సరాలు అయ్యింది. వారు యెరూషలేము ప్రాంతము నుండి అర్థ ప్రపంచ దూరంలో, ఒక వింతైన క్రొత్త దేశంలో ఉన్నారు. లీహై మరణించాడు మరియు—“దేవుని హెచ్చరికలు మరియు బయల్పాటులయందు విశ్వసించిన”—నీఫైయులు మరియు వాటిని నమ్మని లేమనీయుల మధ్య శతాబ్దాలు కొనసాగబోయే కలహాన్ని అతని కుటుంబము అప్పటికే ప్రారంభించింది (2 నీఫై 5:6). నీఫై తమ్ముడైన జేకబ్, అప్పుడు నీఫైయులకు ఒక బోధకునిగా నియమించబడియుండి, దేవుడు వారిని ఎప్పటికీ మరిచిపోడని, వారు కూడా ఎప్పుడూ ఆయనను మరిచిపోకూడదని నిబంధన జనులు తెలుసుకోవాలని కోరాడు. నేడు మనకు ఖచ్చితంగా అవసరమైన సందేశమిది (సిద్ధాంతము మరియు నిబంధనలు 1:15-16 చూడండి). “మనము ఆయనను జ్ఞాపకము చేసుకొందుము … ఏలయనగా మనము వదలివేయబడలేదు. … ప్రభువు యొక్క వాగ్దానములు గొప్పవి,” అని అతడు ప్రకటించాడు (2 నీఫై 10:20–21). ఆ వాగ్దానాలలో, మరణం మరియు నరకాన్ని అధిగమించడానికి “అనంతమైన ప్రాయశ్చిత్తం” యొక్క వాగ్దానం కంటే గొప్పది ఏదీ లేదు (2 నీఫై 9:7). “కనుక,” “మీ హృదయములను సంతోషపరచుకొనుడి”! అని జేకబ్ ముగించాడు (2 నీఫై 10:23).

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

2 నీఫై 6–8

ప్రభువు తన జనుల యెడల దయ కలిగి, ఆయన నిబంధనలను నెరవేర్చును.

వారు ఇశ్రాయేలు వంశంలో భాగమని, దేవుడిని, ఆయన వాగ్దానాలను విశ్వసించగలరని అతని జనులకు అర్థమయ్యేలా చేయడానికి జేకబ్ 2 నీఫై 6–8లో వ్రాయబడిన యెషయా ప్రవచనాలను ఉదహరించాడు. ఆ సందేశము మీ కోసం కూడా, ఎందుకంటే కడవరి దిన పరిశుద్ధులు కూడా దేవుని నిబంధన జనులలో భాగమైయున్నారు. మీరు ఈ అధ్యాయాలను చదువుతున్నప్పుడు, క్రింద ఉన్నటువంటి ప్రశ్నలను ధ్యానించండి:

  • నా కొరకు గల రక్షకుని విమోచన ప్రేమ గురించి నేను ఏమి నేర్చుకుంటాను? ప్రత్యేకించి ఈ ప్రేమను బాగా వివరించే పదాలు లేదా వాక్యభాగాలేవి?

  • ఆయనను వెదికేవారికి రక్షకుడు ఏమి ఇస్తారు?

  • రక్షకుడు మరియు ఆయన వాగ్దానం చేసిన ఆశీర్వాదాల కోసం మరింత నమ్మకంగా “వేచి” ఉండడానికి నేనేమి చేయగలను?

చిత్రం
సెమినరీ చిహ్నము

2 నీఫై 9:1–26

యేసు క్రీస్తు నన్ను పాపము మరియు మరణము నుండి రక్షిస్తారు.

యేసు క్రీస్తు కొరకు మీ అభినందనను అధికం చేయడానికి గల ఒక మార్గము ఆయన లేకపోతే మనకు ఏమి జరిగియుండవచ్చు అనే దాని గురించి ఆలోచించడం. మీరు 2 నీఫై 9:1–26 చదువుతున్నప్పుడు, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం లేకుండా మనకు ఏమి జరుగుతుందో అనేదానిని జాబితా చేయడాన్ని లేదా ఒక రంగులో గుర్తించడాన్ని పరిగణించండి. తర్వాత, మరొక జాబితాలో లేదా రంగులో, రక్షకుని ప్రాయశ్చిత్తం ద్వారా మనం ఏమి పొందగలమనే దానిని మీరు గుర్తించవచ్చు. మీరు చదివిన దానిపై ఆధారపడి, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము మనకు ఎందుకు అవసరమనే దానిని మీరెలా వివరిస్తారు? “దేవుని జ్ఞానము, ఆయన కనికరము మరియు కృప”ను స్తుతించడానికి మిమ్మల్ని ప్రేరేపించేలా మీరేమి కనుగొన్నారు? (2 నీఫై 9:8).

యేసు క్రీస్తు మనల్ని దేని నుండి రక్షించారో బోధించడానికి అదనంగా, ఆయన దానిని ఎలా చేసారనే అంతర్దృష్టులను కూడా జేకబ్ ఇచ్చాడు. 2 నీఫై 9:11–15, 20–24లో మీరు కనుగొనే దానిని నమోదు చేయడాన్ని పరిగణించండి.

దేవుని యొక్క విమోచన ప్రణాళిక చేత జేకబ్ ఎంతగా ఆశ్చర్యపోయాడంటే, అతడు “ఆహా, మన దేవుని ప్రణాళిక ఎంత గొప్పది” అని అరిచాడు. 2 నీఫై 9లో అతని కేకల కొరకు చూడండి (వాటిలో ఎక్కువ మట్టుకు 8–20 వచనాలలో కనుగొనబడతాయి). దేవుని ప్రణాళిక గురించి ఈ వచనముల నుండి మీరేమి నేర్చుకుంటారు? జేకబ్ భావించిన దానిని భావించడానికి ఏ అనుభవాలు మీకు సహాయపడ్డాయి? మీ ఆరాధన మరియు అధ్యయనంలో భాగంగా, మీరు ఆయన గురించి ఎలా భావిస్తున్నారో వ్యక్తపరిచే ఒక కీర్తన కొరకు చూడడం గురించి ఆలోచించండి.

2 నీఫై 9:7

రక్షకుని ప్రాయశ్చిత్తం అనంతమైనది.

యేసు క్రీస్తు యొక్క “అనంతమైన ప్రాయశ్చిత్తము”ను బాగా అర్థం చేసుకోవడానికి మీరేమి చేయగలరు? (2 నీఫై 9:7). బహుశా మీరు సంఖ్యలో అనంతంగా అనిపించే వాటి గురించి చూడవచ్చు—అంటే, పొలంలో గడ్డి పరకలు, సముద్రతీరంలోని ఇసుక రేణువులు లేదా ఆకాశంలో నక్షత్రాలు వంటివి. రక్షకుని ప్రాయశ్చిత్తం ఎలా అనంతమైనది? అది ఎలా వ్యక్తిగతమైనది? 2 నీఫై 9 లోని ఏ వాక్యభాగాలు, రక్షకుడు మీ కోసం చేసిన దానికి మీరు కృతజ్ఞులుగా భావించడానికి సహాయం చేస్తాయి?

2 నీఫై 9:27–54

నేను క్రీస్తు నొద్దకు రాగలను మరియు దేవుని ప్రణాళికను అనుసరించగలను.

2 నీఫై 9లో, జేకబ్ రెండు శక్తివంతమైన మరియు విరుద్ధమైన వాక్యభాగాలను ఉపయోగించాడు: “గొప్ప సృష్టికర్త యొక్క కనికరము గల ప్రణాళిక” మరియు “ఆ దుష్టుని ప్రణాళిక ఎంత యుక్తిగలది” (2 నీఫై 9:6, 28). బహుశా మీరు ఒక మార్గాన్ని బొమ్మ గీసి, దానికి పరలోక తండ్రి ప్రణాళిక అని పేరు పెట్టండి. తర్వాత 2 నీఫై 9:27–52 పరిశోధించండి. ఈ ప్రణాళికను అనుసరించడానికి మనకు సహాయపడేందుకు జేకబ్ ఇచ్చిన హెచ్చరికలు మరియు ఆహ్వానాల కొరకు చూడండి. మార్గం ప్రక్కన మీరేమి కనుగొన్నారో వ్రాయండి. దేవుని ప్రణాళిక నుండి మనల్ని దూరంగా నడిపించడానికి సాతాను ఎలా ప్రయత్నిస్తాడు? జేకబ్ యొక్క హెచ్చరికలు మరియు ఆహ్వానాలకు ప్రతిస్పందనగా మీరు ఏమి చేయాలని ప్రేరేపించబడినట్లు భావిస్తున్నారు?

2 నీఫై 10:20, 23–25

యేసు క్రీస్తు యొక్క త్యాగము నాకు ఆనందాన్ని తీసుకురాగలదు.

జేకబ్ సందేశం సంతోషకరమైనది. “మీరు ఆనందించి, నిరంతరము మీ తలలను పైకెత్తుకొనెదరని నేను ఈ వాక్యములను మీతో చెప్పుచున్నాను“ అని అతడు చెప్పాడు (2 నీఫై 9:3). మీరు 2 నీఫై 10:20, 23–25 చదువుతున్నప్పుడు, మీ హృదయానికి సంతోషాన్ని కలిగించేలా మీరు దేనిని కనుగొంటారు? మీరు నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవడానికి మీరు ఏమి చేస్తారు?

యోహాను 16:33; డి. టాడ్ క్రిస్టాఫర్సన్, “పరిశుద్ధుల యొక్క సంతోషము,” లియహోనా, నవ. 2019, 15–18 కూడా చూడండి.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

2 నీఫై 9:6-10, 19-24

యేసు క్రీస్తు నా రక్షకుడు.

  • వారికి రక్షకుడైన యేసు క్రీస్తు అవసరమని అర్థం చేసుకోవడానికి మరియు భావించడానికి మీ పిల్లలకు మీరెలా సహాయపడతారు? ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీ సహాయపడగలదు. ఒక గొయ్యి మరియు ఒక నిచ్చెన యొక్క సాధారణ సారూప్యతను ఇది ఉపయోగిస్తుంది. యేసు క్రీస్తు కొరకు మీరెందుకు కృతజ్ఞత కలిగియున్నారనే దాని గురించి మీ పిల్లలతో మాట్లాడడానికి 2 నీఫై 9:21–22ను ఉపయోగించడాన్ని పరిగణించండి.

  • మనకు రక్షకుడు ఎందుకు అవసరమో అర్థం చేసుకోవడానికి మీ పిల్లలకు సహాయపడగల ఒక మార్గము వారికి పతనము గురించి బోధించడం. ఏదెను తోటను విడిచివెళ్ళుట (సువార్త గ్రంథాలయం) వంటి ఆదాము హవ్వల చిత్రం మరియు సిలువపై నున్న యేసు క్రీస్తు చిత్రాన్ని మీరు చూపించవచ్చు. ప్రతీ చిత్రములో జరుగుతున్న దానిని వివరించమని వాళ్ళని అడగడం గురించి ఆలోచించండి. మనము ఆదాము హవ్వల వలె ఎట్లున్నాము? యేసు క్రీస్తు మన కొరకు ఏమి చేస్తారనేదాన్ని చూడడానికి బహుశా 2 నీఫై 9:6–10 వారికి సహాయపడగలదు. యేసు క్రీస్తు గురించి వారి మనోభావాలను పంచుకోమని పిల్లలను ఆహ్వానించడాన్ని పరిగణించండి.

కథలు మరియు ఉదాహరణలతో సత్యాన్ని బోధించండి. మీరు ఉపయోగించే కథలు మరియు ఉదాహరణలు సత్యాన్ని బోధిస్తున్నాయని నిశ్చయపరచండి. ఉదాహరణకు, ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీని ఉపయోగిస్తున్నప్పుడు, మనం గోతిలో నుండి బయటకు వచ్చే మార్గంలో ప్రతీ అడుగులో మనకు సహాయం చేయడానికి యేసు క్రీస్తు “గోతి” లోనికి వచ్చారని బోధించండి.

2 నీఫై 9:20, 28–29, 42–43, 49

“నా హృదయము నీతియందు ఆనందించును.”

  • “నీతియందు [ఆనందించడానికి]” లేదా ఆనందంగా ప్రభువుకు లోబడడానికి (2 నీఫై 9:49) మీ పిల్లలను ప్రోత్సహించడానికి, బహుశా మీరు ఒక మంచి ఎంపిక లేదా చెడు ఎంపిక చేస్తున్న బిడ్డ ఉన్న ఉదాహరణలు పంచుకోవచ్చు. ఎంపిక సంతోషాన్నిచ్చినప్పుడు నిలబడమని మరియు ఎంపిక దుఃఖాన్నిచ్చినప్పుడు కూర్చోమని పిల్లలను ఆహ్వానించండి. మనం యేసు క్రీస్తును అనుసరించాలని ఎంపిక చేసుకున్నందువలన మనం ఎప్పుడు సంతోషంగా భావించాము?

  • ప్రభువు యొక్క ఆజ్ఞలు మూర్ఖమైనవి లేదా పాతవి అని ఆలోచించే జనులతో మీ పిల్లలు (ఇంకా అవ్వకపోతే) ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఆజ్ఞలు పాటించడం మనకు సంతోషాన్నిస్తుందని ఎలా వివరించాలి అనే దాని గురించి మీరు, మీ పిల్లలు మాట్లాడుకోవచ్చు. దేవుడి సలహాను మనం పూర్తిగా అర్థం చేసుకోనప్పటికీ, దానిని నమ్మడం ఎందుకు ముఖ్యమైనది? ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తూ, చర్చిస్తూ, సహాయం కోసం 2 నీఫై 9:20, 28–29, 42–43లో చూడమని మీరు వారిని ప్రోత్సహించవచ్చు.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

చిత్రం
జనులను స్వస్థపరుస్తున్న యేసు

He Healed Many of Diverse Diseases [ఆయన అనేక రకాల వ్యాధులను నయం చేశారు], జె. కిర్క్ రిఛర్డ్స్ చేత

ముద్రించు