“ఫిబ్రవరి 12-18: ‘మేము ఆనందముగా జీవించితిమి.’ 2 నీఫై 3-5,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)
“ఫిబ్రవరి 12-18. 2 నీఫై 3–5,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)
ఫిబ్రవరి 12-18: “మేము ఆనందముగా జీవించితిమి”
2 నీఫై 3-5
1 నీఫై చదివినప్పుడు, నీఫై ఎక్కువ ఆసక్తిని చూరగొనే రూపాన్ని కలిగియున్నాడనే ఆలోచన మీకు రావచ్చు. శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా “భారీకాయుడైయుండి” (1 నీఫై 2:16), అతడు తాను ఎదుర్కొన్న కష్టాల చేత కదిలించబడనట్లు కనిపిస్తాడు. లేదా కనీసం అలాగని మనం ఊహించవచ్చు. కానీ నీఫై యొక్క విశ్వాసం ఆదర్శప్రాయంగా ఉన్నప్పటికీ, అత్యంత విశ్వాసులైన జనులు కూడా కొన్నిసార్లు “దౌర్భాగ్యులుగా” మరియు శోధనలచేత “అతిసులువుగా వేధింపబడేలా” ఉంటారని 2 నీఫై 4లో అతని సున్నితమైన మాటలు బయల్పరుస్తాయి. ఇక్కడ మనం ప్రయత్నిస్తున్న వ్యక్తిని, ఆనందంగా ఉండాలని కోరుతున్న వ్యక్తిని చూస్తున్నాము, కానీ “[అతని] పాపములను బట్టి అతని హృదయము మూలుగుచున్నది.” దానికి మరియు తర్వాత వచ్చే ఆశాజనకమైన నిర్ణయానికి మనం సంబంధం చూపగలము: “అయినప్పటికీ, నేను ఎవరియందు నమ్మికయుంచియున్నానో నేనెరుగుదును” (2 నీఫై 4:15–19 చూడండి).
నీఫై మరియు అతని జనులు “ఆనందముగా” (2 నీఫై 5:27) జీవించుటను నేర్చుకున్నప్పటికీ, ఆనందము సులువుగా లేదా బాధాకరమైన సమయాలు లేకుండా రాదని కూడా వారు నేర్చుకున్నారు. చివరకు అది “[మన] నీతి శైలము” (2 నీఫై 4:35) అయిన ప్రభువును నమ్మడం వలన వస్తుంది.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
సువార్తను పునఃస్థాపించడానికి జోసెఫ్ స్మిత్ దేవుని చేత ఎన్నుకోబడ్డాడు.
ఐగుప్తీయుడైన యోసేపు చేత ఇవ్వబడిన ఒక ప్రవచనమును లీహై తన కొడుకు జోసెఫ్‌తో పంచుకున్నాడు. ఆ ప్రవచనము భవిష్యత్తులో ఒక “శ్రేష్ఠమైన దీర్ఘదర్శి” అయిన జోసెఫ్ స్మిత్ గురించినది. దేవుని జనులను ఆశీర్వదించడానికి జోసెఫ్ స్మిత్ ఏమి చేయునని 6–24 వచనాలు చెప్తున్నాయి? జోసెఫ్ స్మిత్ చేసిన కార్యము మీకు “గొప్ప విలువైనది”గా ఎలా అయ్యిందో ఆలోచించండి. ఇటువంటి ప్రశ్నల గురించి ఆలోచించండి మరియు మీ జవాబులను నమోదు చేయడాన్ని పరిగణించండి:
-
జోసెఫ్ స్మిత్ బోధించిన దాని వలన పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు గురించి మీకేమి తెలుసు?
-
జోసెఫ్ స్మిత్ ద్వారా ప్రభువు పునఃస్థాపించిన దాని వలన మీ జీవితం ఎలా భిన్నంగా ఉంది?
-
పునఃస్థాపన జరుగకపోయి ఉంటే మీ జీవితం ఎలా ఉండేది?
మోర్మన్ గ్రంథమును వెలుగులోకి తీసుకురావడం జోసెఫ్ స్మిత్ నియమిత కార్యములో ఒక ముఖ్యభాగం. మోర్మన్ గ్రంథము ఎందుకు ముఖ్యమనే దాని గురించి ఈ అధ్యాయం నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? ప్రత్యేకించి, 7, 11–13, 18–24 వచనాలలో మీరు కారణాల కోసం చూడవచ్చు.
జోసెఫ్ స్మిత్ అనువాదము, ఆదికాండము 50:24–38 (బైబిలు అనుబంధములో) కూడా చూడండి.
“ఓ ప్రభువా! నేను నీ యందు నమ్మికయుంచియున్నాను.”
“నా ఆత్మ యొక్క విషయములను వ్రాయుదును” అని నీఫై చెప్పాడు (15వ వచనము). మీరు 2 నీఫై 4:15–35లో అతడు వ్రాసిన దానిని చదువుతున్నప్పుడు, “నా ఆత్మ యొక్క విషయములేవి?” అని మిమ్మల్ని మీరు అడగండి. నీఫై చేసినట్లుగా, వాటిని వ్రాయుటకు మరియు మీరు ప్రేమించే వారితో వాటిని పంచుకొనుటకు ఆలోచించండి.
నీఫై నిష్ఫలంగా మరియు ఆత్రుతగా భావించినప్పుడు అతడు ఎలా ఓదార్పు కనుగొన్నాడో చూడడం, మీరు అటువంటి భావాలు కలిగియున్నప్పుడు మీకు సహాయపడగలదు. మీకు ఓదార్పునిచ్చే వాక్యభాగాల కోసం 15–35 వచనాలలో చూడండి. ఈ వాక్యభాగాలలో ఓదార్పును కనుగొనగల వారెవరైనా మీకు తెలుసా?
రోనాల్డ్ ఎ. రాస్‌బాండ్, “నా ఆత్మ యొక్క విషయములు,” లియహోనా, నవ. 2021, 39–41 కూడా చూడండి.
యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించడంలో నేను సంతోషం కనుగొనగలను.
సంతోషంగా ఉండడం అంటే అర్థమేమిటని మీరనుకుంటున్నారు? తన ప్రజలు “ఆనందముగా” జీవించారని నీఫై వ్రాసాడు (2 నీఫై 5:27). వారు సంతోషంగా ఉండేందుకు సహాయపడేటట్లు నీఫై మరియు అతని జనులు చేసిన ఎంపికల కొరకు మీరు చూడవచ్చు (ఉదాహరణకు, 2 నీఫై 5:6, 10–17 చూడండి). నీఫై ప్రజల మాదిరిగా, సంతోషకరమైన జీవితాన్ని నిర్మించడంలో మీకు ఏది సహాయపడగలదు?
లేమనీయులపై వచ్చిన “శాపం” ఏమిటి?
నీఫై దినములలో లేమనీయులపై వచ్చిన శాపమేదనగా, “వారి దుష్టత్వమును బట్టి … వారు (ప్రభువు) సన్నిధి నుండి కొట్టివేయబడిరి” (2 నీఫై 5:20–21). దీని అర్థం ప్రభువు యొక్క ఆత్మ వారి జీవితాల నుండి ఉపసంహరించబడింది. తర్వాత లేమనీయులు యేసు క్రీస్తు సువార్తను హత్తుకున్నప్పుడు, “దేవుని శాపము మరెన్నడూ వారిని వెంబడించలేదు” (ఆల్మా 23:18).
నీఫైయులు వారి నుండి విడిపోయిన తరువాత లేమనీయులకు నల్లని చర్మపు గురుతు వచ్చిందని కూడా మోర్మన్ గ్రంథము పేర్కొంటుంది. ఈ గురుతు యొక్క స్వభావము మరియు స్వరూపము పూర్తిగా అర్థం చేసుకోబడలేదు. ఈ గురుతు మొదట్లో నీఫైయుల నుండి లేమనీయులను వేరు చేసింది. తరువాత, నీపైయులు మరియు లేమనీయులు ఇద్దరూ దుష్టత్వము మరియు నీతి యొక్క కాలాల్లోకి వెళ్ళినప్పుడు, ఈ గురుతు అసంబద్ధం అయ్యింది.
నల్లని చర్మము దైవిక అయిష్టతకు లేదా శాపానికి గురుతుగా లేదని మన రోజులలోని ప్రవక్తలు దృఢంగా చెప్తున్నారు. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా ప్రకటించారు: “దేవుని యెదుట మీ స్థానము మీ చర్మపు రంగును బట్టి నిర్ధారించబడదని నేను మీకు హామీ ఇస్తున్నాను. దేవుని అనుగ్రహము ఉండుట, లేకపోవుట అనేది దేవుని పట్ల మరియు ఆయన ఆజ్ఞల పట్ల మన భక్తిపై ఆధారపడుతుంది, కానీ మన చర్మపు రంగుపై కాదు” (“దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిమ్ము,” లియహోనా, నవ. 2020, 94).
నీఫై బోధించినట్లుగా, ప్రభువు “తన యొద్దకు వచ్చువానిని, నల్లవారైనా తెల్లవారైనా, బందీలైనా స్వతంత్రులైనా, పురుషులైనా స్త్రీలైనా ఎవ్వరిని ఆయన నిరాకరించడు” (2 నీఫై 26:33).
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
జోసెఫ్ స్మిత్ ఒక ప్రవక్త.
-
జోసెఫ్ స్మిత్ ద్వారా దేవుడు సాధించిన గొప్ప కార్యము గురించి మీ పిల్లలకు మీరు ఎలా చెప్పగలరో ఆలోచించండి. ప్రారంభించడానికి, 2 నీఫై 3:6లో “దీర్ఘదర్శి” అనే పదాన్ని కనుగొనడానికి మీరు మీ పిల్లలకు సహాయపడవచ్చు మరియు మనం చూడలేని విషయాలను చూడడానికి పరలోక తండ్రి వారికి సహాయం చేస్తారు కాబట్టి, ప్రవక్తలు దీర్ఘదర్శులని పిలువబడతారని వివరించవచ్చు. సంఘమును నడిపించడానికి ఒక దీర్ఘదర్శి ఉన్నందుకు మీరు ఎందుకు కృతజ్ఞతతో ఉన్నారో పంచుకోండి.
-
చిత్రాల గురించి వారికి తెలిసిన దానిని మీ పిల్లలను పంచుకోనివ్వండి. జోసెఫ్ స్మిత్ ఒక “శ్రేష్ఠమైన దీర్ఘదర్శి”గా ఎందుకు పిలువబడ్డాడు? “గొప్ప విలువైన” దేనిని జోసెఫ్ స్మిత్ చేసాడు? (7వ వచనము).
“ప్రభువు యొక్క కార్యములు” నాకిష్టం.
-
ఏది మనల్ని సంతోషంగా చేస్తుంది? నీఫైకి ఆనందాన్నిచ్చింది లేదా అతడిని సంతోషంగా చేసినది ఏది అని కనుగొనడానికి 2 నీఫై 4 నుండి వచనాలను కలిసి చదవడాన్ని పరిగణించండి (15–16, 20–25, 34–35 వచనాలు చూడండి). ఆయన సందేశము “నా ఆత్మ యొక్క విషయములు” లో ఎల్డర్ రోనాల్డ్ ఎ. రాస్‌బాండ్ తనకు అత్యంత విలువైన ఏడు “ప్రభువు యొక్క కార్యము”ల గురించి పంచుకున్నారు (లియహోనా, నవ. 2021, 39–41). బహుశా మీరు కలిసి ఆయన జాబితాను పునర్వీక్షించవచ్చు మరియు మీకు అత్యంత విలువైన “ప్రభువు యొక్క కార్యము”ల గురించి మాట్లాడవచ్చు.
-
నీఫైయులు “ఆనందముగా” (27వ వచనము) జీవించడానికి సహాయపడిన విషయాలను కూడా 2 నీఫై 5 వివరిస్తుంది. ఈ విషయాలను సూచించే కొన్ని పదాలు లేదా చిత్రాలను మీరు ఇచ్చి, వాటిని 5వ అధ్యాయము లోని వచనాలతో జతపరచడానికి మీ పిల్లలకు సహాయపడవచ్చు. ఉదాహరణలలో కొన్ని, కుటుంబం (6వ వచనము), దేవుని ఆజ్ఞలు (10వ వచనము), లేఖనాలు (12వ వచనము), పని (15 మరియు 17 వచనాలు), దేవాలయాలు (16వ వచనము) మరియు సంఘ పిలుపులు (26వ వచనము). ఈ విషయాలు మనకెలా సంతోషాన్నిస్తాయి?
దేవాలయము ప్రభువు యొక్క మందిరము.
-
మీ పిల్లల కోసం మీరు 2 నీఫై 5:15–16 చదువుతున్నప్పుడు, ఒక దేవాలయాన్ని నిర్మించడానికి వారు నీఫైకి సహాయపడుతున్నట్లు వారు నటించవచ్చు. దేవాలయంతో పాటు, వివిధ భవనాల చిత్రాలను కూడా వారికి మీరు చూపించవచ్చు. దేవాలయాలు ఇతర భవనాల కంటే ఏవిధంగా భిన్నంగా ఉన్నాయి?