2024 రండి, నన్ను అనుసరించండి
జూలై 22-28: “ఈ వాక్యమును మీ హృదయములలో నాటవలెను.” ఆల్మా 32–35


“జూలై 22-28: ‘ఈ వాక్యమును మీ హృదయములలో నాటవలెను.’ ఆల్మా 32-35,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“జూలై 22-28. ఆల్మా 32-35,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)

చిత్రం
బిడ్డ చేతిలో విత్తనము

జూలై 22-28: “ఈ వాక్యమును మీ హృదయములలో నాటవలెను”

ఆల్మా 32–35

జోరమీయుల కొరకు ప్రార్థన అనేది అనేకమంది జనులు చూసే చోట నిలబడి వ్యర్థమైన, ఆత్మ-సంతృప్తి కలిగించే మాటలు పునరావృతం చేయుటను కలిపియున్నది. జోరమీయులు యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని కోల్పోయారు—ఆయన ఉనికిని కూడా నిరాకరించారు—మరియు పేదవారిని హింసించారు (ఆల్మా 31:9–25 చూడండి). దానికి విరుద్ధంగా, బాహ్యముగా వ్యక్తపరచబడిన దానికంటే ప్రార్థన మన హృదయాలలోని ఉద్దేశాలతో ఎక్కువగా సంబంధము కలిగియున్నదని ఆల్మా మరియు అమ్యులెక్ ధైర్యముగా బోధించారు. అవసరతలో ఉన్నవారి పట్ల మనం కనికరము చూపని యెడల, మన ప్రార్థన “వ్యర్థము మరియు ఏ ప్రయోజనము ఉండదు” (ఆల్మా 34:28). అతిముఖ్యమైనది, ఆయన “అనంతమైన, నిత్యమైన బలి” (ఆల్మా 34:10) ద్వారా విమోచనను ఇచ్చు యేసు క్రీస్తు యందు మనకు విశ్వాసము ఉన్నందువలన మనం ప్రార్థిస్తాము. ఆల్మా వివరించినట్లుగా, అటువంటి విశ్వాసము వినయముతో మరియు “నమ్మవలెనను కోరికతో” (ఆల్మా 32:27) మొదలవుతుంది. కాలక్రమేణా, నిరంతర పోషణతో, దేవుని వాక్యము “నిత్య జీవమునకై అంకురించు వృక్షము వలేనుండు” (ఆల్మా 32:41) వరకు మన హృదయాలలో వేరు పారుతుంది.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

ఆల్మా 32:17-43

నా హృదయములో ఆయన వాక్యమును నాటి, పోషించుట ద్వారా యేసు క్రీస్తునందు విశ్వాసమును నేను సాధన చేస్తాను.

మీరు ఆల్మా 32:17–43 చదివినప్పుడు, యేసు క్రీస్తునందు విశ్వాసమును ఎలా సాధన చేయాలో గ్రహించుటకు మీకు సహాయపడు మాటలు మరియు వాక్యభాగములను గమనించండి. ఏది విశ్వాసము మరియు ఏది విశ్వాసము కాదు అనేదాని గురించి మీరు ఏమి నేర్చుకుంటారు?

ఆల్మా 32 ను అధ్యయనము చేయుటకు మరొక విధానము, ఒక విత్తనము యొక్క ఎదుగుదలలో వేర్వేరు దశలను సూచించు చిత్రములను గీయడం. తరువాత, ఆల్మా 32:28–43 నుండి మీ హృదయములో వాక్యమును ఎలా నాటి, పోషించాలో గ్రహించుటకు మీకు సహాయపడే మాటలతో ప్రతీ చిత్రమును గుర్తించండి.

రస్సెల్ ఎమ్. నెల్సన్, “క్రీస్తు లేచియున్నాడు; ఆయనయందు విశ్వాసం పర్వతములను కదిలించును,” లియహోనా, మే 2021, 101–4 చూడండి.

ఆల్మా 32:26-43

నాకై నేను ఎరుగుదును.

ఆల్మా యొక్క సాక్ష్యం గురించి జోరమీయులకు ఇంకా ఖచ్చితంగా తెలియనందున, ఆల్మా “ఒక ప్రయోగాన్ని” (ఆల్మా 32:26 చూడండి) సూచించాడు. ప్రయోగాలకు కోరిక, ఆతృత, క్రియ మరియు కనీసం కొంత విశ్వాసం అవసరము—మరియు అవి ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలకు దారితీయగలవు. మీరు చూసిన లేదా పాల్గొన్న ప్రయోగాల గురించి ఆలోచించండి. ఆల్మా 32:26–36 ప్రకారము, ఏ రకమైన ప్రయోగము యేసు క్రీస్తుయందు మన విశ్వాసానికి దారితీయగలదు?

దేవుని వాక్యముపై మీరేవిధంగా “ప్రయోగం చేసారు” మరియు “వాక్యము మంచిదని” తెలుసుకున్నారు? (ఆల్మా 32:28).

ఆల్మా 33:2–11; 34:17–29

ఏ సమయములోనైనా, ఎక్కడైనా ప్రార్థనయందు నేను దేవుడిని ఆరాధించగలను.

ఆరాధన మరియు ప్రార్థన గురించి ఆల్మా మరియు అమ్యులెక్ సలహా జోరమీయులకు కలిగియున్న ప్రత్యేక అపార్థములను సరిదిద్దుటకు ఉద్దేశించబడినది. వాటిని జాబితా చేయడాన్ని పరిగణించండి (ఆల్మా 31:13–23 చూడండి). ఆ జాబితా ప్రక్కన, ఆల్మా 33:2–11 మరియు 34:17–29 లో ప్రార్థన గురించిన సత్యముల యొక్క జాబితాను మీరు చేయవచ్చు. ఈ వచనముల నుండి మీరు నేర్చుకున్న విషయాలు మీరు ప్రార్థించి, ఆరాధించు విధానమును ఏవిధంగా ప్రభావితం చేస్తాయి?

ఆల్మా 34:9-16

చిత్రం
seminary icon
యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తము నాకు అవసరము.

ఆల్మా 34:9–14 లో ఉన్న రక్షకుని ప్రాయశ్చిత్త త్యాగము గురించి వివరించడానికి అనంతమైన మరియు నిత్యమైన అనే పదాలను అమ్యులెక్ ఎన్నిసార్లు ఉపయోగించాడో గమనించండి. రక్షకుని ప్రాయశ్చిత్తము అనంతమైనది మరియు నిత్యమైనది అని తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము? ఈ వచనాలలో రక్షకుని ప్రాయశ్చిత్తమును వివరించే పదాలు మరియు వాక్యభాగాల కొరకు కూడా చూడండి: హెబ్రీయులకు 10:10; 2 నీఫై 9:21; మోషైయ 3:13.

రక్షించడానికి యేసు యొక్క శక్తి అనంతమైనది మరియు నిత్యమైనది అని మనకు తెలిసినప్పటికీ, అది మనకు వర్తిస్తుందా—లేదా మనకు వ్యతిరేకంగా పాపం చేసిన వారికి వర్తిస్తుందా అని కొన్నిసార్లు మనం సందేహించవచ్చు. “రక్షకుని యందు విశ్వాసము కలిగియున్నప్పటికీ, ఆయన వాగ్దానం చేసిన దీవెనలు వారికి లభ్యమవుతాయని నమ్మని” వారి గురించి ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఒకసారి మాట్లాడారు (“If Ye Had Known Me,” Liahona, Nov. 2016, 104). రక్షకుని శక్తిని పూర్తిగా పొందడం నుండి మనల్ని ఏది నిరోధించవచ్చు? యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము అనంతమైనది మరియు నిత్యమైనది అని మీరెలా తెలుసుకోగలరో ధ్యానించండి.

రక్షకుని ప్రాయశ్చిత్తము మీకు ఎంత అవసరమో ధ్యానించడానికి, ప్రతీరోజు మీకు అవసరమైన ఒకదాని గురించి ఆలోచించడం సహాయపడవచ్చు. “ఇది లేకుండా నా జీవితం ఎలా ఉండియుండేది?” అని మిమ్మల్ని మీరు అడగండి. తరువాత, మీరు ఆల్మా 34:9–16 చదివినప్పుడు, యేసు క్రీస్తు లేకుండా మీ జీవితం ఎలా ఉండియుండేదో ధ్యానించండి. 2 నీఫై 9:7–9 లో మీరు ఇతర అంతరార్థములను కనుగొనవచ్చు. ఆల్మా 34:9–10 ను ఒక్క వాక్యంలో మీరెలా సంక్షిప్తపరుస్తారు?

మైఖేల్ జాన్ యు. టెహ్,“మన స్వకీయ రక్షకుడు,” లియహోనా, మే 2021, 99–101 కూడా చూడండి.

ఆల్మా 34:30–41

“ఇదియే మీ రక్షణ యొక్క దినము మరియు సమయము.”

మీరు ఒక మారథాన్‌లో లేదా ఒక సంగీత కార్యక్రమములో పాల్గొనాలని కోరుతున్నట్లు ఊహించుకోండి. సిద్ధపడేందకు కార్యక్రమము జరిగే రోజు వరకు మీరు వేచియున్నట్లయితే ఏమి జరుగుతుంది? ఈ మాదిరి ఆల్మా 34:32–35 లో ఉన్న అమ్యులెక్ హెచ్చరికలతో ఏవిధమైన సంబంధం కలిగియుంది? పశ్చాత్తాపపడడానికి మరియు మార్పుచెందడానికి మనం చేసే ప్రయత్నాలను ఆలస్యం చేయడం వలన కలిగే ప్రమాదమేది?

ఇప్పటికే చాలా ఆలస్యం చేసామని మరియు పశ్చాత్తాపపడడానికి చాలా ఆలస్యమైనదని చింతించే వారి కోసం కూడా 31వ వచనము ఒక సందేశాన్ని కలిగియుంది. ఆ సందేశము ఏమిటని మీరు చెప్పెదరు?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

ఆల్మా 32:1–16

నేను వినయంగా ఉండడానికి ఎంచుకున్నప్పుడు, ప్రభువు నాకు బోధించగలరు.

  • వినయంగా ఉన్న జోరమీయులకు బోధించడంలో ఆల్మా మరియు అమ్యులెక్ సఫలమయ్యారు. వినయంగా ఉండడం అంటే అర్థమేమిటి? ఈ పదాల యొక్క అర్థం గురించి ఆల్మా 32:13–16 లో ఏ ఇతర ఆధారాలను మనం కనుగొనగలము? “నేను నేను వినయంగా ఉన్నాను” వంటి వాక్యాన్ని పూర్తిచేయడానికి మీ పిల్లలను ఆహ్వానించండి.

ఆల్మా 32:28–43

యేసు క్రీస్తు గురించి నా సాక్ష్యాన్ని నేను పోషించినప్పుడు, అది పెరుగుతుంది.

  • విత్తనాలు, చెట్లు మరియు ఫలము అనేవి విశ్వాసము మరియు సాక్ష్యము వంటి నైరూప్య సూత్రాలను అర్థం చేసుకోవడానికి పిల్లలకు సహాయపడగలిగే సుపరిచిత వస్తువులు. మీరు ఆల్మా 32:28 చదువుతున్నప్పుడు, మీ పిల్లలను ఒక విత్తనాన్ని పట్టుకోనివ్వండి. తర్వాత, యేసు క్రీస్తు గురించి సాక్ష్యాన్ని పెంపొందించడమనేది ఒక విత్తనాన్ని నాటి, పోషించడం వంటిదనే విధంగా ఆలోచించడానికి మీకు సహాయపడమని మీరు వారిని అడగవచ్చు. మీరు మీ విత్తనాన్ని నాటి, ఒక విత్తనం—లేదా సాక్ష్యము—పెరగడానికి సహాయపడేందుకు ఏమి అవసరమనే దాని గురించి మీరు మాట్లాడవచ్చు.

  • ఒక వృక్షము యొక్క చిత్రము ఈ సారాంశముతో ఇవ్వబడింది; ఆల్మా 32:28–43 లో ఆల్మా యొక్క మాటలను వర్ణించేందుకు మీరు దానిని ఉపయోగించవచ్చు. లేదా వేర్వేరు దశలలో ఎదుగుతున్న మొక్కలను చూడడానికి మీరు నడిచి వెళ్ళవచ్చు మరియు ఎదుగుతున్న మొక్కను మన సాక్ష్యంతో పోల్చుతున్న వచనములను ఆల్మా 32 నుండి చదువవచ్చు. లేదా మీ పిల్లలు బోర్డు మీద ఒక చెట్టు బొమ్మను గీయవచ్చు మరియు యేసు క్రీస్తు గురించి వారి సాక్ష్యము ఎదగడానికి సహాయపడేలా వారు చేయగల ఒకదాని గురించి వారు ఆలోచించిన ప్రతీసారి ఒక ఆకును లేదా ఫలమును దానికి జతచేయవచ్చు.

  • మీ పిల్లలు ఒక విత్తనాన్ని (దేవుని వాక్యాన్ని సూచిస్తున్నది) ఒక రాయిలోనికి (గర్వముతో కూడిన హృదయాన్ని సూచిస్తున్నది) మరియు మెత్తని నేల లోనికి (వినయపూర్వక హృదయాన్ని సూచిస్తున్నది) నెట్టడానికి ప్రయత్నించేలా మీరు చేయవచ్చు. ఆల్మా 32:27–28 కలిసి చదవండి. మన హృదయాల్లో దేవుని వాక్యానికి “స్థానమివ్వడం” (27వ వచనము) అంటే అర్థమేమిటనే దాని గురించి మాట్లాడండి.

చిత్రములను గీయండి. కొంతమంది తాము నేర్చుకొనే దాని చిత్రాన్ని గీసినప్పుడు బాగా నేర్చుకుంటారు. మీ పిల్లలు ఆల్మా 32 అధ్యయనము చేసినప్పుడు, ఒక విత్తనము ఒక వృక్షముగా ఎదగడాన్ని చిత్రించుటను వారు ఆనందించవచ్చు.

ఆల్మా 33:2-11; 34:17-27

నేను ఏ సమయములోనైనా, దేని గురించి అయినా పరలోక తండ్రిని ప్రార్థించగలను.

  • మనం ప్రార్థించగల ప్రదేశాలు (ఆల్మా 33:4–11లో) మరియు మనం ప్రార్థించగల విషయాలను (ఆల్మా 34:17–27లో) వర్ణించే వాక్యభాగాలను కనుగొనడానికి మీ పిల్లలకు సహాయపడండి. బహుశా మీ పిల్లలు వారు ఈ ప్రదేశాలలో ప్రార్థిస్తున్నట్లు వారి చిత్రాన్ని గీయవచ్చు. పరలోక తండ్రి మీ ప్రార్థనలను వినినప్పటి అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకోండి.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

చిత్రం
ఒక వృక్షముపై ఫలము

“దానిని పోషించుటలో వాక్యము యెడల మీ శ్రద్ధ, విశ్వాసము మరియు సహనమును బట్టి, చివరికి మీరు దాని ఫలమును కోయుదురు; అది మిక్కిలి శ్రేష్ఠమైనది” (ఆల్మా 32:42).

ముద్రించు