2024 రండి, నన్ను అనుసరించండి
జూలై 15-21: “దేవుని వాక్యము యొక్క ప్రభావము.” ఆల్మా 30–31


“జూలై 15-21: ‘దేవుని వాక్యము యొక్క ప్రభావము.’ ఆల్మా 30-31,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“జూలై 15-21. ఆల్మా 30-31,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)

కొరిహోర్‌కు బోధిస్తున్న ఆల్మా

All Things Denote There Is a God (Alma and Korihor) [సమస్తము దేవుడున్నాడని సూచించుచున్నవి (ఆల్మా మరియు కొరిహోర్)], వాల్టర్ రానె చేత

జూలై 15-21: “దేవుని వాక్యము యొక్క ప్రభావము”

ఆల్మా 30–31

ఆల్మా 30–31 లోని వృత్తాంతములు మాటల యొక్క శక్తిని—మంచి కొరకైనా మరియు చెడు కొరకైనా స్పష్టముగా నిరూపిస్తాయి. అబద్ధ బోధకుడైన కొరిహోర్ యొక్క “ముఖస్తుతి మాటలు” మరియు “తీక్షణమైన మాటలు”, “అనేక ఆత్మలను నాశనము” చేయుదునని బెదిరించాయి (ఆల్మా 30:31, 47). అదేవిధముగా, జోరమ్ అనబడు నీఫై అసమ్మతీయుని బోధనలు ఒక జన సమూహము మొత్తాన్ని “గొప్ప తప్పిదములలో పడునట్లు“ మరియు “ప్రభువు మార్గములను చెరుపునట్లు” నడిపించాయి (ఆల్మా 31:9, 11).

దానికి విరుద్ధంగా, దేవుని వాక్యము “ఖడ్గము లేదా వారికి సంభవించిన ఇతర వాటన్నిటి కంటే జనుల మనస్సులపై అధిక శక్తివంతమైన ప్రభావము” (ఆల్మా 31:5) కలిగియుంటుందని ఆల్మా స్థిరమైన విశ్వాసాన్ని కలిగియున్నాడు. ఆల్మా మాటలు నిత్య సత్యాన్ని వ్యక్తం చేసాయి మరియు కొరిహోర్ నోరు మూయించడానికి యేసు క్రీస్తు శక్తులను ఆకర్షించాయి (ఆల్మా 30:39–50 చూడండి) మరియు జోరమీయులను సత్యమునకు తిరిగి తెచ్చుటకు అతనితో పాటు వెళ్ళిన వారిపై ఆయన దీవెనలను అవి ఆహ్వానించాయి (ఆల్మా 31:31–38 చూడండి). అబద్ధ సందేశాలు సర్వసాధారణమైన ఈ రోజుల్లో క్రీస్తు యొక్క అనుచరులకు ఇవి విలువైన మాదిరులు. ఆల్మా వలె “దేవుని వాక్యము యొక్క ప్రభావమును” (ఆల్మా 31:5) నమ్ముట ద్వారా మనము సత్యమును కనుగొనగలము.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

ఆల్మా 30:6-31

సెమినరీ చిహ్నము
అబద్ధ బోధనలతో నన్ను మోసం చేయడానికి అపవాది ప్రయత్నిస్తాడు.

ఆల్మా 30 లో, కొరిహోర్ “క్రీస్తు విరోధి” అని పిలువబడ్డాడు (6వ వచనము). యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తను బహిరంగంగా లేదా రహస్యంగా వ్యతిరేకించే వారెవరైనా లేదా ఏదైనా క్రీస్తు విరోధియే. ఈ వర్ణనకు కొరిహోర్ సరిపోతాడని ఆల్మా 30:6–31 లోని ఏ వచనాలు చూపుతాయి? కొరిహోర్ యొక్క అబద్ధ బోధనలను చదవడం అటువంటి బోధనలను గుర్తించడానికి మరియు నిరాకరించడానికి మీకు సహాయపడగలదు. క్రింది ప్రోత్సాహ కార్యక్రమాలు మీ అధ్యయనంలో సహాయపడగలవు:

  • రక్షకుని బోధనలు మరియు సాతాను యొక్క అబద్ధ అనుకరణల మధ్య తేడాను బాగా అర్థం చేసుకోవడానికి మీరు ఆలోచించగల వస్తు పాఠాలేవి? కొన్ని మాదిరులు చేపలు పట్టడానికి, నకిలీ డబ్బు మరియు తప్పుడు ప్రకటనల కొరకు ఉపయోగించే ఎర వంటివి. ఏదైనా నకిలీ అని మీరు ఎలా చెప్పగలరు? మీరు సత్యాన్ని ఎలా గుర్తించగలరు?

  • ఆల్మా 30:6–31 లో కొరిహోర్ బోధించిన తప్పుడు సిద్ధాంతాలను జాబితా చేయడం గురించి ఆలోచించండి. అతని బోధనల్లో ఏవి నేడు ప్రలోభపెట్టేవిగా ఉండవచ్చు? (ఆల్మా 30:12–18, 23–28 చూడండి). అటువంటి ఆలోచనలను అంగీకరించడం ఫలితంగా రాగల హాని ఏది? నేడు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించడంలో అపవాది ఉపయోగిస్తున్న అబద్ధ సందేశాలేవి?

  • కొరిహోర్ బోధనలను సత్యముతో ఎదుర్కోవడానికి ఆల్మా ఏమి చేసాడు? (ఆల్మా 30:31–54 చూడండి). మీ జీవితంలో ఇవే సూత్రాలను మీరు ఎలా ఉపయోగించగలరు?

ఆల్మా వలె, ఆధునిక ప్రవక్తలు మరియు అపొస్తలులు సత్యానికి, సాతాను అబద్ధాలకు మధ్య తేడా తెలుసుకోవడానికి మనకు సహాయపడతారు. ఈ సందేశాలలో ఏ సలహాను మీరు కనుగొంటారు: గ్యారీ ఈ. స్టీవెన్‌సన్, “నన్ను మోసగించకు” (లియహోనా, నవ. 2019, 00–00).

ఆల్మాతో మాట్లాడుతున్న కొరిహోర్

Korihor Confronts Alma [ఆల్మాను ఎదిరిస్తున్న కొరిహోర్], రాబర్ట్ టి. బార్రెట్ చేత

ఆల్మా 30:39-46

సమస్తమును ఒక దేవుడున్నాడని సూచించుచున్నవి.

నేడు అనేకమంది దేవుడు లేడని నమ్ముతున్నారు. దేవుడు నిజమని తెలుసుకోవడానికి మీకు సహాయపడునట్లు ఆల్మా 30:39–46 లో మీరేమి కనుగొంటారు? ఆయన గురించి తెలుసుకోవడం నుండి మనల్ని నిరోధించేది ఏది? ఆయన జీవిస్తున్నారని ఏ ఇతర సాక్ష్యాలను దేవుడు మీకిచ్చారు?

ఆల్మా 30:56–60

అపవాది తన అనుచరులకు సహకరించడు.

అపవాది తన అనుచరులను ఏవిధంగా ఆదరిస్తాడనే దాని గురించి ఆల్మా 30:56–60 నుండి మీరేమి నేర్చుకుంటారు? అతని ప్రభావమునకు వ్యతిరేకంగా మీ ఇంటిని రక్షించుకోవడానికి మీరేమి చేయగలరు?

ఆల్మా 36:3 కూడా చూడండి.

ఆల్మా 31

జనులను నీతి వైపు నడిపించుటకు దేవుని వాక్యము శక్తి కలిగియుంది.

నీఫైయుల నుండి జోరమీయులు విడిపోవడమనే సమస్యకు రాజకీయ లేదా సైనికపరమైన పరిష్కారం అవసరమని కొందరికి అనిపించియుండవచ్చు (ఆల్మా 31:1–4 చూడండి). కానీ ”దేవుని వాక్యము యొక్క ప్రభావమును” (ఆల్మా 31:5) నమ్మడాన్ని ఆల్మా నేర్చుకున్నాడు. దేవుని వాక్యము యొక్క శక్తి గురించి ఆల్మా 31:5 నుండి మీరేమి నేర్చుకుంటారు? (హెబ్రీయులకు 4:12; 1 నీఫై 15:23–24; 2 నీఫై 31:20; జేకబ్ 2:8; హీలమన్ 3:29–30 కూడా చూడండి).

మీరు ఆల్మా 31 చదివినప్పుడు, మీ జీవితానుభవాలకు వర్తించే ఏ ఇతర సువార్త సత్యాలను మీరు కనుగొనగలరు? ఉదాహరణకు:

  • మంచి పనులు చేయడానికి దేవుని వాక్యము జనులను నడిపించుటను మీరెలా చూసారు? (5వ వచనము చూడండి).

  • ఇతరుల పట్ల ఆల్మా యొక్క వైఖరులు, మనోభావాలు మరియు చర్యలను (34–35 వచనాలు చూడండి) జోరమీయుల వాటితో పోల్చండి (see 17–28 వచనాలు చూడండి). మీరు మరింతగా ఆల్మా వలె ఎట్లు కాగలరు?

  • ఇతరుల పాపాల కొరకు బాధపడే వాకిరి సహయపడునట్లు ఆల్మా 31:30–38 లో మీరేమి కనుగొంటారు?

ఆల్మా 31:5-6

యేసు క్రీస్తు మూలముగా ఎవరైనా మారగలరు.

జోరమీయులకు సువార్త బోధించడానికి ఆల్మా తనతో తీసుకువెళ్ళిన జన సమూహాన్ని గమనించండి (ఆల్మా 31:6 చూడండి). మోషైయ 27:8–37; 28:4; ఆల్మా 10:1–6; 11:21–25; 15:3–12 లో ఈ జనుల జీవితాల గురించి మీరేమి నేర్చుకుంటారు? వారి అనుభవాలలో మీ కొరకు ఏ సందేశములు ఉండియుండవచ్చు?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

ఆల్మా 30

అబద్ధ బోధనలకు వ్యతిరేకంగా మోర్మన్ గ్రంథము నన్ను హెచ్చరిస్తుంది.

  • కొన్ని వస్తువులు (డబ్బు లేదా ఆహారం వంటివి) మరియు ఆ వస్తువుల యొక్క బొమ్మ అనుకరణలను ప్రదర్శించడం గురించి ఆలోచించండి. ఇది నిజమైన విషయాలు మరియు అబద్ధ విషయాల మధ్య తేడా ఎలా తెలుసుకోవాలనే దాని గురించి చర్చకు దారితీయవచ్చు. అప్పుడు ఆల్మా 30:12–18 నుండి దేవుని గురించి కొరిహోర్ బోధించిన అబద్ధాలు లేదా అబద్ధ బోధనలను గుర్తించడానికి మీ పిల్లలకు మీరు సహాయపడగలరు. ఆల్మా 30:32–35 లో, ఆ అబద్ధాలకు ఆల్మా ఎలా స్పందించాడు? అతని మాదిరి నుండి మనం ఏమి నేర్చుకుంటాము?

ఆల్మా 30:44

సమస్తమును ఒక దేవుడున్నాడని సూచించుచున్నవి.

  • ఆకాశంలోనివి మరియు భూమిపై నున్న వస్తువులు దేవుడు జీవిస్తున్నాడని ఎలా సాక్ష్యమిస్తున్నాయనే దాని గురించి ఆల్మా మాట్లాడాడు. సాధ్యమైనట్లయితే, మీరు ఆల్మా 30:44 చదువుతున్నప్పుడు మీ పిల్లలతో కలిసి బయట నడవండి లేదా కిటికీ దగ్గర నిలబడండి. దేవుడు నిజమని మరియు ఆయన వారిని ప్రేమిస్తున్నారని తెలుసుకోవడానికి వారికి సహాయపడేలా వారు చూస్తున్న వాటిని ఎత్తి చూపమని వారిని అడగండి. వారు కనుగొన్న వాటి చిత్రాలను కూడా వారు గీయవచ్చు (ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీ చూడండి).

దృశ్యాల ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. బాగా అర్థం చేసుకోవడానికి మరియు వారికి బోధించిన దానిని దీర్ఘకాలము గుర్తుంచుకోవడానికి దృశ్యాలు మీ పిల్లలకు సహాయపడతాయి. పిల్లల కొరకు ఈ సారాంశంలో ఉన్న ప్రోత్సాహ కార్యక్రమాలలో అధికము దృశ్యాలను ఉపయోగించమని సూచిస్తాయి. మీ పిల్లలు నేర్చుకున్న దానిని గుర్తుంచుకోవడానికి వారికి సహాయపడేందుకు భవిష్యత్తులో అవే దృశ్యాలను చూపించడం గురించి ఆలోచించండి.

ఆల్మా 31:5

దేవుని వాక్యము శక్తివంతమైనది.

  • “ఇతర వాటన్నిటి కంటే” దేవుని వాక్యము అధిక శక్తివంతమైనదని అర్థం చేసుకోవడానికి మీ పిల్లలకు మీరెలా సహాయపడగలరు? (ఆల్మా 31:5). శక్తివంతమైనది ఏదైనా లేదా ఎవరి గురించి అయినా ఆలోచించమని వారిని అడగడాన్ని పరిగణించండి లేదా కొన్ని శక్తివంతమైన వస్తువుల చిత్రాలు చూపించండి. ఏది వాటిని శక్తివంతంగా చేస్తుంది? కలిసి ఆల్మా 31:5 చదవండి మరియు ఈ వచనానికి అర్థమేమిటని వారనుకుంటున్నారో చెప్పమని మీ పిల్లలను అడగండి. దేవుని వాక్యము మీపై శక్తివంతమైన ప్రభావమును కలిగియున్న ఒక అనుభవాన్ని పంచుకోండి.

ఆల్మా 31:8-35

పరలోక తండ్రి నా ప్రార్థనలను ఆలకిస్తారు.

  • ఆల్మా 31:8–35 నుండి వచనాలను ఉపయోగిస్తూ, ఆల్మా మరియు జోరమీయుల కథను క్లుప్తంగా సంక్షిప్తపరచండి. బ్లాకులు లేదా రాళ్ళతో రమీయంప్టమ్ గోపురాన్ని కట్టడానికి వారు మీకు సహాయపడుతుండగా, జోరమీయులు వారి ప్రార్థనలో చెప్పిన విషయాలను (ఆల్మా 31:15–18 చూడండి) గుర్తించడానికి మీ పిల్లలకు సహాయపడండి. మనం ప్రార్థించవలసిన విధానం ఇది కాదని వివరించండి. మనం ఎలా ప్రార్థించాలని మీరు, మీ పిల్లలు మాట్లాడుకుంటుండగా, ఒక్కసారి ఒక్కటి చొప్పున బ్లాకులు లేదా రాళ్ళను వారు తొలగించనివ్వండి. ప్రతీ ఉదయం మరియు రాత్రి ప్రార్థించడాన్ని గుర్తుంచుకోవడానికి వారికి సహాయపడేందుకు రాళ్ళలో ఒకదానిని వారు వారి మంచం ప్రక్కన పెట్టుకోవచ్చు. వారి రాయిని అలంకరించడాన్ని కూడా వారు ఆనందించవచ్చు.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

రమీయంప్టమ్ పైన ప్రార్థిస్తున్న జోరమీయుడు

జోరమీయుల హృదయములు “గర్వమందు బహుగా అతిశయించుచున్నవి” (ఆల్మా 31:25).