2024 రండి, నన్ను అనుసరించండి
అక్టోబరు 7–13: “ఇప్పుడు నా ఆనందము సంపూర్ణమాయెను.” 3 నీఫై 17–19


“అక్టోబరు 7–13: ‘ఇప్పుడు నా ఆనందము సంపూర్ణమాయెను.’ 3 నీఫై 17-19,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“అక్టోబరు 7-13. 3 నీఫై 17-19,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)

చిత్రం
నీఫైయులకు ప్రత్యక్షమయిన యేసు

The Light of His Countenance Did Shine upon Them [ఆయన ముఖము యొక్క కాంతి వారిపై ప్రకాశించెను], గ్యారీ ఎల్.కాప్ చేత

అక్టోబరు 7–13: “ఇప్పుడు నా ఆనందము సంపూర్ణమాయెను”

3 నీఫై 17–19

యేసు క్రీస్తు సమృద్ధి దేశములో పరిచర్య చేస్తూ, ఆయన సువార్తను బోధిస్తూ, పునరుత్థానము చెందిన ఆయన శరీరంపై గుర్తులను స్పృశించి తెలుసుకొని, చూచునట్లు జనులకు ఒక అవకాశమునిస్తూ, తానే వాగ్దానము చేయబడిన రక్షకుడని సాక్ష్యమిస్తూ రోజు గడిపారు. ఇప్పుడు ఆయన బయలుదేరి వెళ్ళే సమయము వచ్చింది. “నా సమయము ఆసన్నమైనది,” అని ఆయన చెప్పారు (3 నీఫై 17:1). ఆయన తన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళబోతున్నారు మరియు ఆయన బోధించిన దానిని ధ్యానించుటకు జనులకు సమయము అవసరమని ఆయనకు తెలుసు. కాబట్టి మరుసటి రోజు తిరిగి వస్తానని వాగ్దానమిస్తూ, ఆయన సమూహమును వారి ఇండ్లకు పంపారు. కానీ ఎవరూ వెళ్ళలేదు. వారేమి భావిస్తున్నారో వారు చెప్పలేదు, కానీ యేసు దానిని గ్రహించగలిగారు: ఆయన “మరికొంతసేపు వారితో నిలిచియుండాలని” (3 నీఫై 17:5) వారు ఆశించారు. ఆయన చేయవలసిన ఇతర ముఖ్యమైన పనులున్నాయి, కానీ దేవుని పిల్లల కొరకు కరుణ చూపడం ఎల్లప్పుడు ఆయనకు అధిక ప్రాధాన్యత గలది. కాబట్టి యేసు మరికొంతసేపు అక్కడే ఉన్నారు. తరువాత జరిగినది బహుశా లేఖనములో నమోదు చేయబడిన పరిచర్యలో అత్యంత సున్నితమైన మాదిరి. అక్కడ ఉన్నవారు మాత్రమే అది వర్ణింపలేనిదని చెప్పగలరు (3 నీఫై 17:16–17 చూడండి). ప్రణాళిక చేయబడని ఆత్మీయ క్రుమ్మరింపును యేసు తానే ఈ సాధారణమైన మాటలతో సంక్షిప్తపరిచారు: “ఇప్పుడు నా ఆనందము సంపూర్ణమాయెను” (3 నీఫై 17:20).

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

3 నీఫై 17; 18:24–25, 30–32

పరిచర్య చేయడంలో రక్షకుడు నా పరిపూర్ణమైన మాదిరి.

రక్షకుడు ప్రత్యక్షమైనప్పుడు దాదాపు 2,500 మంది జనులు అక్కడున్నారు, అయినప్పటికీ ఒకరి తర్వాత ఒకరుగా వారికి పరిచర్య చేయడానికి ఆయన ఒక మార్గాన్ని కనుగొన్నారు. 3 నీఫై 17; 18:24–25, 28–32 లో ఆయన పరిచర్య చేసిన విధానం గురించి మీరేమి గమనిస్తారు? ఆయన పరిచర్య చేసిన అవసరతలేమిటి? ఆయన పరిచర్యను ప్రభావవంతంగా చేసిన సుగుణాలేవి? ఆయన మీకు ఎలా పరిచర్య చేసారనే దాని గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. ఆయన మాదిరిని మీరు ఎలా అనుసరించగలరు? (3 నీఫై 18:24–25 మరియు 28–32 కూడా చూడండి).

3 నీఫై 17:13–22; 18:15–25; 19:6–9, 15–36

ఎలా ప్రార్థించాలో రక్షకుడు నాకు బోధించారు.

రక్షకుడు మీ కొరకు ప్రార్థించుటను వినుట ఎలా ఉంటుందో ఊహించండి. మీరు ప్రార్థించే విధానాన్ని అటువంటి అనుభవం ఎలా ప్రభావితం చేస్తుంది? మీరు 3 నీఫై 17:13–22; 18:15–25; మరియు 19:6–9, 15–36 చదువుతున్నప్పుడు, దీనిని ధ్యానించండి. ప్రార్థన గురించి యేసు క్రీస్తు యొక్క మాదిరి మరియు బోధనల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి మరియు ఎందుకు ప్రార్థించాలనే దాని గురించి అంతరార్థముల కొరకు చూడడం గురించి ఆలోచించండి. ఈ వచనాల నుండి ఏ ఇతర అంతరార్థములను మీరు పొందుతారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 10:5 కూడా చూడండి.

3 నీఫై 18:1-12

చిత్రం
సెమినరీ చిహ్నము
నేను సంస్కారమును తీసుకొన్నప్పుడు నేను ఆత్మ చేత నింపబడగలను.

మనం తరచు ఒక పనిని చేసినట్లయితే, అది మన దినచర్యగా లేదా అలవాటుగా మారగలదు. కొన్నిసార్లు మనం ఆలోచించకుండానే ఆ పని చేయవచ్చు. ప్రతీవారం సంస్కారపు విధితో అలా జరగకుండా మీరు ఎలా నిరోధించగలరు? మీరు 3 నీఫై 18:1–12 చదివినప్పుడు, మీరు సంస్కారము తీసుకున్న ప్రతీసారి మీరు ఆత్మీయంగా ఎలా “నింపబడగలరో” ధ్యానించండి (3 నీఫై 20:1–9 కూడా చూడండి). 5– 7, 11 వచనాల ప్రకారం, మీరు “ఎల్లప్పుడు” చేయవలసిన కొన్ని పనులేవి? సంస్కారపు విధిని యేసు ఎందుకు ఇచ్చారు—మరియు సంస్కారము మీ జీవితంలో ఆయన ఉద్దేశ్యాలను సాధిస్తున్నదా అని కూడా మీరు ధ్యానించవచ్చు. సంస్కారము మీకెందుకు పవిత్రమైనది?

సంస్కారము తీసుకున్నప్పుడు మరియు వారమంతా మీ ఆరాధనను మెరుగుపరచుకోవడానికి మీరు ఏమి చేయగలరు?

మరింత అర్ధవంతముగా ఆరాధించుటకు మీరు ఇంకేమి చేయగలరు? ఇటువంటి ప్రశ్నలను మీకై మీరు అడుగవచ్చు: “రక్షకుని త్యాగము నా అనుదిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నది?” “ఒక శిష్యునిగా నేను ఏది బాగా చేస్తున్నాను మరియు నేను దేనిని మెరుగుపరుచుకోవాలి?”

మత్తయి 26:26–28; జెఫ్రీ ఆర్. హాలండ్, “ఇదిగో దేవుని గొర్రెపిల్ల,” లియహోనా, మే 2019, 44–46 కూడా చూడండి.

ధ్యానించడానికి సమయమివ్వండి. కొన్నిసార్లు, లేఖన అధ్యయనము చదవడం, ప్రార్థించడం మరియు ధ్యానించడం యొక్క కలయికగా మారుతుంది. మీరు నేర్చుకొనే దానిపై ప్రతిబింబించడానికి మరియు దాని గురించి దేవునితో మాట్లాడడానికి మీరు ప్రశాంతమైన సమయాన్ని అనుమతించినట్లయితే, మీ జీవితంలో ఆయన మాట యొక్క శక్తిని మీరు అధికం చేయగలరు.

3 నీఫై 18:22-25

నేను యేసు క్రీస్తు యొక్క వెలుగును “పైకెత్తగలను”.

మీరు ఆయన అనుచరులని తప్ప, యేసు క్రీస్తు గురించి మరేమి తెలియని ఒక స్నేహితుడిని మీరు కలిగియున్నారు అనుకోండి. మీ క్రియలపై ఆధారపడి, ఆయన గురించి మీ స్నేహితుడు ఏమనుకుంటాడు? “లోకము కొరకు ప్రకాశించునట్లు మీ దీపమును పైకెత్తుడి” అనగా మీకు గల అర్థమేమిటి? (3 నీఫై 18:24). ఆ వెలుగును పైకెత్తడానికి మీకు సహాయపడునట్లు 3 నీఫై 18:22-25 లో రక్షకుడు ఇచ్చిన ఇతర ఆహ్వానములేవి?

బోని హెచ్. కార్డన్, “వారు చూచునట్లు,” లియహోనా, మే 2020, 78-80 కూడా చూడండి.

3 నీఫై 18:36–37; 19:6–22

యేసు క్రీస్తు యొక్క శిష్యులు పరిశుద్ధాత్మ యొక్క వరమును వెదకుతారు.

ఇటీవలి మీ ప్రార్థనల గురించి ఆలోచించండి. మీ లోతైన కోరికలను గూర్చి మీ ప్రార్థనలు మీకేమి బోధిస్తాయి? రక్షకుని సమక్షములో ఒక రోజు గడిపిన తరువాత, సమూహము “వారు అధికముగా కోరిన దాని కొరకు ప్రార్థన చేసిరి”—పరిశుద్ధాత్మ యొక్క వరము (3 నీఫై 19:9). పరిశుద్ధాత్మ వరము ఎందుకంతగా కోరదగినది? ఈ గద్యభాగములను మీరు చదివినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కొరకు మీ స్వంత కోరికను ధ్యానించండి. మీరు ఆ సహవాసము కొరకు మనఃపూర్వకంగా ఎట్లు వెదకగలరు?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

3 నీఫై 17:7, 20-25

పరలోక తండ్రి పిల్లలలో ప్రతీఒక్కరిని రక్షకుడు ప్రేమిస్తారు.

  • 3 నీఫై 17 లోని వృత్తాంతాన్ని దృశ్యీకరించుటకు మీ పిల్లలకు సహాయపడేందుకు ఈ సారాంశంలో ఉన్నటువంటి చిత్రాన్ని ఒకదానిని మీరు ఉపయోగించవచ్చు. జనుల కొరకు రక్షకుని ప్రేమను నొక్కిచెప్పే వాక్యభాగాలు లేదా వచనాలను 3 నీఫై 17 నుండి చదవడాన్ని పరిగణించండి (7 మరియు 20–25 వచనాలు వంటివి). తర్వాత మీ పిల్లలు యేసుతో పాటు తమ చిత్రాన్ని గీయవచ్చు. వారలా చేస్తున్నప్పుడు, వారి కొరకు యేసు తన ప్రేమను చూపిన విధానాల గురించి ఆలోచించడానికి వారికి సహాయపడండి.

చిత్రం
పిల్లలను దీవిస్తున్న యేసు

Behold Your Little Ones [మీ చిన్నపిల్లలను చూడుడి], గ్యారీ ఎల్. కాప్ చేత

3 నీఫై 18:1-12

నేను సంస్కారమును తీసుకున్నప్పుడు నేను యేసు గురించి ఆలోచించగలను.

  • సంస్కార సమయంలో జరిగే దానిని మీకు చెప్పమని బహుశా మీరు మీ పిల్లలను ఆహ్వానించవచ్చు. తర్వాత మీరు 3 నీఫై 18:1–12 చదువవచ్చు మరియు నేడు మనం చేసేదానిని పోలిన దేనినైనా వారు వినినప్పుడు ఒక చేయి పైకెత్తమని మీ పిల్లలను అడగవచ్చు. సంస్కార సమయంలో దేనిని మనం గుర్తుంచుకోవాలి లేదా దేని గురించి ఆలోచించాలని యేసు క్రీస్తు కోరుతున్నారు? (3 నీఫై 18: 7, 11 చూడండి).

3 నీఫై 18:15-24; 19:6–9, 15–36

ఎలా ప్రార్థించాలో రక్షకుడు నాకు బోధించారు.

  • తర్వాత మీరు, మీ పిల్లలు 3 నీఫై 18:18–21 చదువవచ్చు మరియు ప్రార్థన గురించి యేసు ఏమి బోధించారో మాట్లాడవచ్చు. వారు ప్రార్థించినప్పుడు వారెలా భావిస్తారో మీకు చెప్పమని మీ పిల్లలను ఆహ్వానించడం, ప్రార్థన గురించి వారి సాక్ష్యాన్ని పంచుకోవడానికి వారికి సహాయపడగలదు.

  • ప్రార్థన యొక్క విలువైన దీవెనలలో కొన్నింటి కొరకు వెదకడానికి వెళ్ళడం పిల్లలకు సరదాగా ఉండవచ్చు. క్రింది లేఖన సూచికలను కాగితపు ముక్కలపై వ్రాసి, మీరు వాటిని దాచిపెట్టవచ్చు: 3 నీఫై 18:15; 3 నీఫై 18:20; 3 నీఫై 18:21; 3 నీఫై 19:9; మరియు 3 నీఫై 19:23. అప్పుడు మీ పిల్లలు ఆ కాగితాలను కనుగొని, వచనాలను చదివి, ప్రార్థన గురించి యేసు క్రీస్తు లేదా ఆయన శిష్యులు బోధించిన విషయాల కొరకు చూడవచ్చు.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

చిత్రం
యేసు మరియు నీఫైయుల పిల్లలను చుట్టుముట్టిన దేవదూతలు

Angels Ministered unto Them [దేవదూతలు వారికి పరిచర్య చేసిరి], వాల్టర్ రానె చేత.

ముద్రించు