2024 రండి, నన్ను అనుసరించండి
అక్టోబరు 21-27: “అంతకంటే సంతోషము కలిగిన జనులుండలేరు.” 3 నీఫై 27–4 నీఫై


“అక్టోబరు 21-27: ‘అంతకంటే సంతోషము కలిగిన జనులుండలేరు.’ 3 నీఫై 27–4 నీఫై,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“అక్టోబరు 21-27. 3 నీఫై 27–4 నీఫై,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)

జనులకు బోధిస్తున్న పునరుత్థానుడైన యేసు

అక్టోబరు 21-27: “అంతకంటే సంతోషము కలిగిన జనులుండలేరు”

3 నీఫై 274 నీఫై

యేసు క్రీస్తు యొక్క బోధనలు కేవలం ధ్యానించదగిన అందమైన వేదాంతం కాదు, అవి దానికి మించినవి. అవి ఆయన వలె మారేందుకు మనల్ని ప్రేరేపించడానికి ఉద్దేశించబడినవి. రక్షకుని సువార్త ఎంత పూర్తిగా జనులను మార్చగలదో 4 నీఫై గ్రంథము చూపుతుంది. యేసు యొక్క క్లుప్త పరిచర్యను అనుసరించి, నీఫైయులు మరియు లేమనీయుల మధ్య గల శతాబ్దాల వివాదము ముగింపుకు వచ్చింది. కలహము మరియు గర్వమునకు పేరొందిన రెండు దేశాలు “ఒక్కటిగా, క్రీస్తు యొక్క సంతానముగా” (4 నీఫై 1:17) మారిపోయిరి మరియు వారు “అన్ని వస్తువులను వారి మధ్య ఉమ్మడిగా కలిగియుండిరి” (4 నీఫై1:3). “దేవుని ప్రేమ … జనుల హృదయములలో గలదు,” మరియు “దేవుని హస్తము చేత సృష్టించబడిన జనులందరి మధ్య అంతకంటే సంతోషము కలిగిన జనులుండలేరు” (4 నీఫై 1:15–16). ఈ విధంగా రక్షకుని బోధనలు నీఫైయులు మరియు లేమనీయులను మార్చివేసాయి. అవి మిమ్మల్ని ఏవిధంగా మారుస్తున్నాయి?

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

3 నీఫై 27:1–12

యేసు క్రీస్తు యొక్క సంఘము ఆయన పేరున పిలువబడుతుంది.

రక్షకుని శిష్యులు దేశమంతటా ఆయన సంఘాన్ని స్థాపించడం మొదలుపెట్టినప్పుడు, ఒక ప్రశ్న ఎదురైంది, కొద్దిమందికి అది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు—సంఘము యొక్క పేరు ఏమైయుండాలి? (3 నీఫై 27:1–3 చూడండి). 3 నీఫై 27:4–12 లోనున్న రక్షకుని జవాబు నుండి ఈ పేరు యొక్క ప్రాముఖ్యత గురించి మీరేమి నేర్చుకుంటారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 115:4 లో ఈనాటి ఆయన సంఘము యొక్క పేరును రక్షకుడు బయల్పరిచారు. ఆ పేరులో ప్రతీ పదాన్ని ధ్యానించండి. మనం ఎవరమో, మనం ఏమి నమ్ముతామో మరియు మనమెలా ప్రవర్తించాలో తెలుసుకోవడానికి ఈ పదాలు మనకెలా సహాయపడతాయి?

రస్సెల్ ఎమ్. నెల్సన్, “సంఘము యొక్క సరియైన పేరు,” లియహోనా, నవ. 2018, 87–89 కూడా చూడండి.

3 నీఫై 27:10-22

యేసు క్రీస్తు యొక్క సంఘము ఆయన సువార్తపై నిర్మించబడింది.

ఆయన సంఘము “[ఆయన] సువార్తపై నిర్మించబడింది” (3 నీఫై 27:10) అని వివరించిన తర్వాత, ఆయన సువార్త ఏమిటో రక్షకుడు వివరించారు. 3 నీఫై 27:13–22లో ఆయన చెప్పిన దానిని మీరెలా సంక్షిప్తపరుస్తారు? ఈ నిర్వచనంపై ఆధారపడి, ఆయన సువార్తపై నిర్మించబడడం అంటే—సంఘము కొరకు—మరియు మీ కొరకు గల అర్థమేమిటి?

మీరు నేర్చుకొనే దానిని నమోదు చేయండి. 3 నీఫై 27:23–26లో రక్షకుడు తన శిష్యులకు బోధించిన దానిని గమనించండి. ఆధ్యాత్మిక అనుభవాలను నమోదు చేయడం ఎందుకు ముఖ్యము? 3 నీఫై లోనున్న రక్షకుని పరిచర్యను మీరు అధ్యయనం చేసినప్పుడు, ఏమి నమోదు చేయాలని మీరు ప్రేరేపించబడతారు?

3 నీఫై 28:1–11

“మీరు ఏమి కోరుచున్నారు?”

ఆయన తన శిష్యులను అడిగినట్లుగా, “నా నుండి మీరు ఏమి కోరుచున్నారు” అని రక్షకుడు మిమ్మల్ని అడిగితే మీరేమి చెప్తారు? (3 నీఫై 28:1). మీరు 3 నీఫై 28:1–11 చదువుతున్నప్పుడు ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ఆయన ప్రశ్నకు వారి జవాబుల నుండి శిష్యుల హృదయాలలో గల కోరికల గురించి మీరేమి నేర్చుకుంటారు? యేసు క్రీస్తు యొక్క సువార్తను మీరు జీవిస్తున్నప్పుడు మీ కోరికలు ఎలా మారుతున్నాయి?

మీ కోరికలను ప్రతిబింబించే ఒక కీర్తనను వెదకడాన్ని పరిగణించండి.

3 నీఫై 29-30

దేవుని యొక్క కడవరి దిన కార్యము నెరవేరుతున్నది అనడానికి మోర్మన్ గ్రంథము ఒక సంకేతము.

ఏదో జరుగుతుందని మీకు తెలిపే సంకేతాల గురించి ఆలోచించండి. ఉదాహరణకు, వాన వస్తోందని లేదా రుతువులు మారుతున్నాయి అని మీకెలా తెలుస్తుంది? 3 నీఫై 29:1–3 ప్రకారం, ఆయన జనులను సమకూర్చే దేవుని కార్యము “నెరవేరుట ఇదివరకే మొదలైందని” మీకెలా తెలుసు? (3 నీఫై 21:1–7 కూడా చూడండి). మన కాలంలో జనులు నిరాకరించే విషయాలను కూడా 3 నీఫై 29:4–9 లో మీరు గమనించవచ్చు. ఈ విషయాలలో మీ విశ్వాసాన్ని మోర్మన్ గ్రంథము ఎలా బలపరుస్తుంది?

4 నీఫై 1:1–18

సెమినరీ చిహ్నము
యేసు క్రీస్తు యొక్క బోధనలను అనుసరించుట ఐక్యతకు, సంతోషానికి దారితీస్తుంది.

రక్షకుని దర్శనము తరువాతి సంవత్సరాలలో జీవించడం ఎలా ఉండియుండవచ్చు? మీరు 4 నీఫై 1:1–18 చదువుతున్నప్పుడు, జనులు పొందిన దీవెనలను జాబితా చేయడాన్ని పరిగణించండి. ఈ దీవెనకరమైన జీవితాన్ని అనుభవించడానికి వారు చేసిన ఎంపికలను గుర్తించడం లేదా గమనించడం గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. వారి నీతివంతమైన ఎంపికలను ప్రేరేపించగలిగేలా యేసు వారికి ఏమి బోధించారు? ఇక్కడ కొన్ని మాదిరులున్నాయి, కానీ మీరు వేరేవి కనుగొనవచ్చు: 3 నీఫై 11:28–30; 12:8–9, 21–24, 40–44; 13:19–21, 28–33; 14:12; 18:22–25.

అధిక ఐక్యత మరియు సంతోషంతో జీవించడానికి మీ కుటుంబము, వార్డు లేదా సంఘానికి సహాయపడేందుకు మీరేమి చేయగలరో ధ్యానించండి. విభజనలను జయించి, దేవుని యొక్క ఇతర పిల్లలతో నిజంగా “ఏకం” కావడానికి సహాయపడేందుకు మీరేమి చేయగలరు? ఈ లక్ష్యాన్ని సాధించడానికి యేసు క్రీస్తు యొక్క ఏ బోధనలు మీకు సహాయపడతాయి?

బాధాకరంగా, 4 నీఫై లో వివరించబడిన సీయోను సమాజము క్రమముగా దుష్టత్వములో పడింది. మీరు 4 నీఫై 1:19–49 చదివినప్పుడు, వారి సంతోషం మరియు ఐక్యతను అంతమొందించిన వైఖరులు మరియు ప్రవర్తనల కోసం చూడండి. ఈ వైఖరులు మరియు ప్రవర్తనలను తొలగించడానికి సహాయపడేందుకు మీరేమి చేయగలరు?

మోషే 7:18; డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్, “సుస్థిరమైన సమాజములు,” లియహోనా, నవ. 2020, 32–35; రీనా ఐ. అబుర్తో, “ఏక మనస్సుతో,” లియహోనా, మే 2018, 78–80 కూడా చూడండి.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

3 నీఫై 27:3-8

నేను యేసు క్రీస్తు యొక్క సంఘానికి చెందియున్నాను.

  • యేసు సంఘము పేరు యొక్క ప్రాముఖ్యతను పరిచయం చేయడానికి, వారి స్వంత పేర్ల గురించి మీ పిల్లలతో మాట్లాడండి. మన పేర్లు ఎందుకు ముఖ్యమైనవి? తర్వాత యేసు యొక్క శిష్యులు కలిగియున్న ప్రశ్న కొరకు చూస్తూ, మీరు 3 నీఫై 27:3 కలిసి చదువవచ్చు. 3 నీఫై 27: 5–8లో జవాబు కనుగొనడానికి మీ పిల్లలకు సహాయపడండి. సంఘము యొక్క పేరు ఎందుకు ముఖ్యమైనది?

  • వారు చెందియున్న వివిధ సమూహాలు, కుటుంబము లేదా ప్రాథమిక తరగతి వంటివాటి గురించి ఆలోచించడానికి కూడా మీరు మీ పిల్లలకు సహాయపడవచ్చు. ప్రతీ సమూహానికి చెందియుండడంలో వారికి నచ్చింది ఏమిటని వారిని అడగండి.

3 నీఫై 27:13-16

యేసు క్రీస్తు యొక్క సంఘము ఆయన సువార్తపై నిర్మించబడింది.

  • 3 నీఫై 27 లో రక్షకుడు తన సువార్తను సంక్షిప్తపరిచారు. సువార్త అనే పదానికి “మంచి వార్త” అని అర్థమని మీరు మీ పిల్లలకు వివరించవచ్చు. ఏ మంచి వార్తలను మీరు 3 నీఫై 27:13–16 లో కనుగొంటారు? రక్షకుని సంఘము ఆయన సువార్తపై నిర్మించబడిందని బోధించడానికి ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీని ఉపయోగించండి.

3 నీఫై 27:30–31

ఆయన పిల్లలు ఆయన వద్దకు తిరిగి వచ్చినప్పుడు పరలోక తండ్రి సంతోషిస్తారు.

  • మీరు ఒక ఆట ఆడడాన్ని పరిగణించండి, దానిలో ఎవరైనా ఒకరు దాక్కొని, మిగిలినవారు అతడు లేదా ఆమెను వెదకడానికి ప్రయత్నించవచ్చు. తప్పిపోయిన వారొకరు దొరికినప్పుడు మనం అనుభవించే ఆనందం గురించి ఒక సంభాషణకు ఇది దారితీయవచ్చు. 3 నీఫై 27:30–31 చదివిన తర్వాత, “ఎవ్వరూ … తప్పిపోకుండా” పరలోక తండ్రికి దగ్గరగా ఉండేందుకు ఒకరికొకరు ఎలా సహాయం చేసుకోవాలనే దాని గురించి మీరు మాట్లాడవచ్చు.

4 నీఫై

యేసు క్రీస్తును అనుసరించడం నాకు ఆనందాన్నిస్తుంది.

  • 4 నీఫైలో వర్ణించబడిన జనుల యొక్క సంతోషం గురించి నేర్చుకోవడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు, సంతోషంగా ఉన్న జనుల చిత్రాలను మీరు వారికి చూపించవచ్చు. తర్వాత, మీరు కలిసి 2-3 మరియు 15-17 వచనాలు చదివినప్పుడు, కథలో సంతోషాన్ని తెచ్చేదాని వద్దకు మీరు వచ్చినప్పుడు వారు చిత్రాల వైపు చూపించవచ్చు.

  • 4 నీఫై 1:15-16 లో బోధించబడిన దానిని సాధన చేయడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు, జనులు ఒకరితో ఒకరు కోపంగా ఉన్న సందర్భాలను వారికి ఇవ్వవచ్చు. మన హృదయాలలో మనం “దేవుని ప్రేమను” కలిగియున్నట్లయితే, ఆ సందర్భాలు ఎలా ఉంటాయో నటించి చూపమని వారిని ఆహ్వానించండి.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

ముగ్గురు నీఫైయుల శిష్యులతో మాట్లాడుతున్న యేసు

Christ with Three Nephite Disciples [ముగ్గురు నీఫైయుల శిష్యులతో క్రీస్తు], గ్యారీ ఎల్. కాప్ చేత