2024 రండి, నన్ను అనుసరించండి
అక్టోబరు 28–నవంబరు 3: “పశ్చాత్తాపపడి … అందరినీ నేను ఒప్పించగలుగవలెనని నేను కోరుచున్నాను.” మోర్మన్ 1–6


“అక్టోబరు 28–నవంబరు 3: ‘పశ్చాత్తాపపడి … అందరినీ నేను ఒప్పించగలుగవలెనని నేను కోరుచున్నాను.’ మోర్మన్ 1-6,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“అక్టోబరు 28–నవంబరు 3. మోర్మన్ 1-6,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)

చిత్రం
బంగారు పలకలపై వ్రాస్తున్న మోర్మన్

Mormon Abridging the Plates [పలకలను సంక్షిప్తపరుస్తున్న మోర్మన్], టామ్ లోవెల్ చేత

అక్టోబరు 28–నవంబరు 3: “పశ్చాత్తాపపడి … అందరినీ నేను ఒప్పించగలుగవలెనని నేను కోరుచున్నాను”

మోర్మన్ 1–6

నీఫైయుల మధ్య అతడు చూసిన రక్తపాతము మరియు దుష్టత్వము యొక్క “భయంకరమైన దృశ్యము” యొక్క “సంపూర్ణ వృత్తాంతమును” మోర్మన్ మన నుండి తప్పించాడు (మోర్మన్ 2:18; 5:8). కానీ, ఒకప్పుడు నీతిమంతులైన జనులు ఎంత వరకు పతనం కాగలరో మనకు గుర్తుచేయడానికి మోర్మన్ 1–6 లో అతడు నమోదు చేసినది మనకు చాలు. అంతటా వ్యాపించిన దుష్టత్వము మధ్య అలసిపోయి, నిరాశ చెందినందుకు ఏ ఒక్కరు మోర్మన్‌ను నిందించలేరు. అయినప్పటికీ అతడు చూసి, అనుభవించిన దానంతటా దేవుని యొక్క గొప్ప కనికరము యొక్క జ్ఞానమును మరియు దానిని పొందుటకు గల మార్గము పశ్చాత్తాపమే అను అతని దృఢవిశ్వాసమును అతడు ఎన్నడూ కోల్పోలేదు. పశ్చాత్తపపడేందుకు అతడి అభ్యర్థన ఆహ్వానములను మోర్మన్ యొక్క స్వంత జనులు నిరాకరించినప్పటికీ, అతడు ఒప్పించవలసిన శ్రోతలనేకులు ఉన్నారని అతడికి తెలుసు. “ఇదిగో, నేను భూదిగంతములన్నిటికీ వ్రాయుచున్నాను,” అని అతడు ప్రకటించాడు. మరొక మాటలలో, అతడు మీకు వ్రాసాడు (మోర్మన్ 3:17–20 చూడండి). నేడు అతడు మీకిచ్చే సందేశము, వారి రోజులలో నీఫైయులను రక్షించగలిగిన అదే సందేశము: “యేసు క్రీస్తు యొక్క సువార్తను విశ్వసించుము. … పశ్చాత్తాపపడి, క్రీస్తు యొక్క న్యాయపీఠము యెదుట నిలుచుటకై సిద్ధపడుము” (మోర్మన్ 3:21–22).

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

మోర్మన్ 1–6

చిత్రం
సెమినరీ చిహ్నము
ఇతరులు చేసే దానితో సంబంధం లేకుండా నేను యేసు క్రీస్తును అనుసరించగలను.

అతడికి 10 సంవత్సరాల వయస్సు వచ్చేనాటికి మోర్మన్ అతని చుట్టూ ఉన్నవారి నుండి విశేషరీతిలో భిన్నంగా ఉన్నాడు. మీరు మోర్మన్ 1–6 చదివినప్పుడు, యేసు క్రీస్తు నందు మోర్మన్ యొక్క విశ్వాసము అతడిని ప్రత్యేకంగా చేసిన మరియు ఇతరులకు సేవచేసి, వారిని దీవించడానికి అతనికి అవకాశాలను ఇచ్చిన మార్గాల కొరకు చూడండి. క్రింది వచనాలతో మీరు ప్రారంభించవచ్చు:

మోర్మన్ 1:2-3, 13–17.మోర్మన్ మరియు అతని జనుల మధ్య ఏ తేడాలను మీరు గమనిస్తారు? అటువంటి కష్టకాలములో ఆత్మీయంగా బలంగా నిలవడానికి అతనికి సహాయపడిన ఏ లక్షణాలను అతడు కలిగియున్నాడు?

మోర్మన్ 2:18–19.అతడు జీవించిన లోకమును వర్ణించడానికి మోర్మన్ ఏ పదాలను ఉపయోగించాడు? అతని చుట్టూ దుష్టత్వమున్నప్పటికీ, ఏ విధంగా అతడు నిరీక్షణను నిలుపుకున్నాడు?

మోర్మన్ 3:12.తన చుట్టూ ఉన్న జనుల గురించి మోర్మన్ ఎలా భావించాడు? అతడు కలిగియున్నటువంటి ప్రేమను వృద్ధిచేయడానికి మీరేమి చేయగలరు?

మోర్మన్ 1–6 లోని ఏ ఇతర వచనాలు యేసు క్రీస్తు యందు మోర్మన్ యొక్క విశ్వాసాన్ని ప్రత్యేకంగా చూపుతాయి? అతడు విశ్వాసంగా నిలిచియుండడానికి ఎంచుకున్నందువలన అతడికి ఇవ్వబడిన అవకాశాలేవి?

ఇటువంటి వాక్యాలను మీరెలా పూరిస్తారు? “ నాకొక మాదిరిగా ఉన్నారు, అతడు [లేదా ఆమె] అని నేను కోరుకోవడానికి ఇది సహాయపడింది.”

అతని మాదిరి అతని జనులలో ఏ మార్పు కలిగించడం లేదని మోర్మన్ భావించియుండవచ్చు. మోర్మన్‌తో మాట్లాడే అవకాశం మీకు కలిగితే, అతని మాదిరి మీలో కలిగించిన మార్పు గురించి మీరు అతనికి ఏమి చెప్తారు?

వారు నేర్చుకున్న దానిని పంచుకోవడానికి ఇతరులకు సహాయపడండి. వారు నేర్చుకున్న దానిని జనులు పంచుకున్నప్పుడు, వారు తమ స్వంత విశ్వాసాన్ని మరియు ఇతరుల విశ్వాసాన్ని బలపరుస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:122 చూడండి). వారు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు వారికి కలిగిన అనుభవాల గురించి మీ కుటుంబాన్ని లేదా తరగతిని అడగడానికి ప్రయత్నించండి.

చిత్రం
ఒకరితో ఒకరు యుద్ధము చేస్తున్న నీఫైయులు మరియు లేమనీయులు

Battle [యుద్ధము], జార్జ్ కొక్కో చేత

మోర్మన్ 2:10–15

దైవచిత్తానుసారమైన దుఃఖము క్రీస్తు వైపుకు, శాశ్వతమైన మార్పుకు నన్ను నడిపిస్తుంది.

మోర్మన్ తన జనుల దుఃఖమును చూసినప్పుడు, వారు పశ్చాత్తాపపడతారని అతడు ఆశించాడు. కానీ “వారి విచారము పశ్చాత్తాపమునకు కాదు” (మోర్మన్ 2:13)—అది దైవచిత్తానుసారమైన దుఃఖము కాదు, కానీ ప్రాపంచిక దుఃఖము. తేడా తెలుసుకోవడానికి, మోర్మన్ 2:10–15 నుండి మీరు నేర్చుకున్న దానిని ఇటువంటి పటములో వ్రాయడం గురించి ఆలోచించండి:

దైవచిత్తానుసారమైన దుఃఖము

ప్రాపంచిక దుఃఖము

యేసు వద్దకు వచ్చును (14వ వచనము)

దేవుడిని శపించును (14వ వచనము)

మీ దుఃఖము దైవచిత్తానుసారమైనదా లేదా ప్రాపంచికమైనదా అని మీరు ఎలా తెలుసుకోగలరు? మీరు ప్రాపంచిక దుఃఖమును అనుభవిస్తున్నట్లయితే, దానిని మీరు దైవచిత్తానుసారమైన దుఃఖముగా ఎలా మార్చగలరు?

2 కొరింథీయులకు 7:8–11; మిఛెల్ డి. క్రెయిగ్, “దైవిక అసంతృప్తి,” లియహోనా, నవ. 2018, 52–55 కూడా చూడండి.

మోర్మన్ 3:3, 9

“వారిని విడిపించినది ప్రభువేనని వారు గుర్తించలేదు.”

ప్రభువు వారిని దీవించిన విధానాలను నీఫైయులు గుర్తించలేదని మోర్మన్ గమనించాడు. మీరు మోర్మన్ 3:3, 9 చదివినప్పుడు, మీ జీవితంలో దేవుడి ప్రభావాన్ని మీరెలా గుర్తిస్తున్నారో మీరు ధ్యానించవచ్చు. ఆయన ప్రభావాన్ని మీరు గుర్తించినప్పుడు ఏ దీవెనలు వస్తాయి? ఆయనను గుర్తించకపోవడం వలన కలిగే పర్యవసానాలేవి? (మోర్మన్ 2:26; సిద్ధాంతము మరియు నిబంధనలు 59:21 చూడండి).

మోర్మన్ 5:8–24; 6:16–22

నన్ను చేర్చుకోవడానికి యేసు క్రీస్తు చేతులు చాచి నిలబడతారు.

మీ స్వంత పాపముల గురించి మీరెప్పుడైనా నిరుత్సాహపడినట్లయితే, రక్షకుడు “మిమ్మల్ని చేర్చుకోవడానికి చేతులు చాచి” నిలబడడం గురించిన మోర్మన్ వర్ణన అభయమివ్వగలదు. మీరు మోర్మన్ 5:8–24 మరియు 6:16–22 చదివినప్పుడు, మీరు పాపము చేసినప్పటికీ మీ పట్ల పరలోక తండ్రి మరియు యేసు యొక్క భావాల గురించి మీరేమి నేర్చుకుంటారు? యేసు క్రీస్తు చేతులు చాచి మిమ్మల్ని చేరుకోవాలనుకున్నప్పుడు మీరెలా భావించారు? ఫలితముగా ఏమి చేయాలని మీరు ప్రేరేపించబడ్డారు?

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

మోర్మన్ 1:1–3; 2:1, 23–24; 3:1–3, 12, 17–22

మోర్మన్ వలె, నేను యేసు క్రీస్తును అనుసరించగలను.

  • క్రీస్తు నందు అతని విశ్వాసమును వృద్ధిచేసుకున్నప్పుడు మోర్మన్ చాలా చిన్నవాడైనందున, అతడు మీ పిల్లలకు ఆదర్శం కాగలడు. బహుశా మీరు మోర్మన్ 1:1–3 చదువవచ్చు మరియు అమ్మరోన్ అతనికి ప్రత్యేక పని ఇచ్చినప్పుడు మోర్మన్ వయస్సు ఎంత అనే దాని కొరకు మీ పిల్లలు వినవచ్చు. మోర్మన్‌లో అమ్మరోన్ చూసిన లక్షణాలను ఈ వచనాలలో కనుగొనడానికి కూడా మీరు వారికి సహాయపడవచ్చు. యేసు క్రీస్తును అనుసరించడానికి ఈ లక్షణాలు మనకు ఎలా సహాయపడతాయి?

    చిత్రం
    యువకునిగా మోర్మన్

    మోర్మన్, వయస్సు 10, స్కాట్ ఎమ్. స్నో చేత

  • మోర్మన్ యేసు క్రీస్తును అనుసరించినందువలన, ఇతరులకు సేవచేసి, వారిని దీవించడానికి అతనికి అవకాశాలు ఇవ్వబడ్డాయి. క్రింది గద్యభాగాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చదవడానికి మీ పిల్లలను మీరు ఆహ్వానించవచ్చు మరియు మోర్మన్ గురించి వారు నేర్చుకున్న దానిని పంచుకోవడానికి వారికి సహాయపడవచ్చు: మోర్మన్ 1:1–3; 2:1, 23–24; మరియు 3:1–3, 12, 20–22, అతడు యేసు క్రీస్తును ఏవిధంగా అనుసరించాడు? యేసు క్రీస్తు యందు అతని విశ్వాసం ఇతరులకు ఎలా సహాయపడింది లేదా దీవించింది? మనకు తెలిసిన వారికి మన విశ్వాసం ఎలా సహాయపడగలదు?

మోర్మన్ 2:8-15

దైవచిత్తానుసారమైన దుఃఖము క్రీస్తు వైపుకు, శాశ్వతమైన మార్పుకు నన్ను నడిపిస్తుంది.

  • మీ పిల్లలు మోర్మన్ 2:8, 10–15 చదివినప్పుడు, దైవచిత్తానుసారమైన దుఃఖము మరియు ప్రాపంచిక దుఃఖము మధ్య తేడా తెలుసుకోవడానికి వారికి సహాయపడేందుకు బహుశా మీరు “గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు” లో ఉన్నటువంటి పటమునొక దానిని తయారు చేయవచ్చు. తర్వాత, పశ్చాత్తాపము ఎందుకు మన “హృదయము[లు] … ఆనందించునట్లు” చేయాలో కారణాలు కనుగొనడానికి వారు మోర్మన్ 2:12 ను కూడా పరిశోధించవచ్చు. మన పాపముల కొరకు మనం అనుభవించే దుఃఖము మనం మారడానికి దేవుని సహాయాన్ని వెదకడానికి దారితీస్తుందని మనమెలా నిశ్చయపరచగలము?

మోర్మన్ 3:3, 9

పరలోక తండ్రి నాకు అనేక దీవెనలు ఇస్తారు.

  • వారు కృతజ్ఞత కలిగియున్న కొన్ని విషయాలను జాబితా చేయమని (లేదా వాటి బొమ్మలు గీయమని) మీ పిల్లలను ఆహ్వానించడం దేవుని పట్ల కృతజ్ఞతగా భావించేలా వారికి సహాయపడేందుకు ఒక మంచి మార్గము కావచ్చు. వారు జాబితా చేసిన తర్వాత, మీరు మోర్మన్ 3:3, 9 చదువవచ్చు మరియు పరలోక తండ్రి నీఫైయులను కూడా దీవించారని, కానీ వారు దానిని గుర్తించలేదని వివరించవచ్చు. మన దీవెనల కొరకు మనం పరలోక తండ్రికి కృతజ్ఞత కలిగియున్నామని చూపడానికి మనము ఏమి చేయగలము?

మోర్మన్ 3:12

ప్రతీఒక్కరిని ప్రేమించాలని పరలోక తండ్రి నన్ను కోరుతున్నారు.

  • నీఫైయులు దుష్టులైనప్పటికీ, మోర్మన్ ఎన్నడూ వారిని ప్రేమించడం మానలేదు. మోర్మన్ 3:12లో “ప్రేమించు” మరియు “ప్రేమ” అనే పదాలు కనుగొనడానికి మీ పిల్లలకు సహాయపడండి. ఆయన పిల్లలందరి పట్ల దేవునికి గల ప్రేమ గురించి సాక్ష్యమివ్వండి.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

చిత్రం
బంగారు పలకలు

“యేసు క్రీస్తు యొక్క సువార్తను మీరు విశ్వసించవలెనని” (మోర్మన్ 3:21) మోర్మన్ గ్రంథము వ్రాయబడింది.

ముద్రించు