“నవంబరు 18-24: ‘చెడు అంతము చేయబడవలెను.’ ఈథర్ 6–11,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)
“నవంబరు 18-24. ఈథర్ 6-11,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)
నవంబరు 18–24: “చెడు అంతము చేయబడవలెను”
ఈథర్ 6–11
జెరెడీయులు నాశనము చేయబడిన వందల సంవత్సరాల తర్వాత, వారి ప్రాచీన నాగరికత యొక్క శిధిలాలను నీఫైయులు కనుగొన్నారు. ఈ శిధిలాల మధ్య ఒక రహస్యమైన వృత్తాంతమున్నది—“మేలిమి బంగారము”తో చేయబడి, “చెక్కడములతో నిండియున్న” పలకలు మరియు వాటిని చదవడానికి నీఫైయులు “గొప్ప ఆతురతను కలిగియున్నారు” (మోషైయ 8:9; 28:12). నేడు ఈ వృత్తాంతము యొక్క సంగ్రహమును మీరు కలిగియున్నారు మరియు అది ఈథర్ గ్రంథముగా పిలువబడుతోంది. నీఫైయులు వాటిని చదివినప్పుడు, జెరెడీయుల విషాదకరమైన పతనం గురించి తెలుసుకుని “వారు మిక్కిలి దుఃఖంతో నిండిపోయారు.” “అయినప్పటికీ అది వారికి అధిక జ్ఞానమునిచ్చెను మరియు దానియందు వారు ఆనందించిరి” (మోషైయ 28:12, 18). మీరు కూడా, ఈ గ్రంథములో బాధాకరమైన క్షణాలను కనుగొనవచ్చు. కానీ మీరు కూడా ఈ జ్ఞానం యొక్క బహుమతిని చూసి సంతోషించవచ్చు. మొరోనై వ్రాసినట్లుగా, “దేవుని జ్ఞానములో ఈ విషయాలు మీకు చూపబడవలెను … చెడు అంతము చేయబడవలెను మరియు నరుల సంతానము యొక్క హృదయములపై సాతానుకు ఎట్టి అధికారము లేని సమయం రావలెను” (ఈథర్ 8:26).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
నా మర్త్య ప్రయాణము గుండా ప్రభువు నన్ను నడిపిస్తారు.
సముద్రము గుండా జెరెడీయుల ప్రయాణాన్ని మీ జీవిత ప్రయాణంతో మీరు పోల్చినట్లయితే, మీరు ఆత్మీయ అంతర్దృష్టులను కనుగొనగలరు. ఉదాహరణకు, జెరెడీయుల నౌకలలోని రాళ్ళ వలె మీ మార్గాన్ని వెలిగించడానికి ప్రభువు ఏమి అందించారు? నౌకలు లేదా “వాగ్దాన దేశము వైపు వీచు” గాలులు దేనిని సూచిస్తున్నాయి? (ఈథర్ 6:8). ప్రయాణానికి ముందు, ప్రయాణమందు మరియు తర్వాత జెరెడీయుల చర్యల నుండి మీరేమి నేర్చుకుంటారు? మీ వాగ్దానదేశము వైపు ప్రభువు మిమ్మల్ని ఏవిధంగా నడిపిస్తున్నారు?
ఈథర్ 6:5–18, 30; 9:28–35; 10:1–2
“ప్రభువు యెదుట వినయముగా నడుచుకొనుము.”
గర్వము మరియు దుష్టత్వము ప్రబలమైయున్నట్లు జెరెడీయుల చరిత్రలో కనిపించినప్పటికీ, ఈ అధ్యాయాలలో—ప్రత్యేకించి ఈథర్ 6:5–18, 30; 9:28–35; మరియు 10:1–2 లో వినయము యొక్క మాదిరులు కూడా ఉన్నాయి. క్రింది ప్రశ్నలను ధ్యానించడం ఈ మాదిరుల నుండి నేర్చుకోవడానికి మీకు సహాయపడగలదు: ఈ పరిస్థితులలో ఈ జెరెడీయులు ఎందుకు తమనుతాము తగ్గించుకున్నారు? వారు తమ వినయమును ఎలా చూపించారు? ఫలితంగా దేవుడు వారిని ఎలా ఆశీర్వదించారు? వినయంగా ఉండేందుకు బలవంతము చేయబడుటకు (మోషైయ 4:11–12; ఆల్మా 32:14–18 చూడండి) బదులుగా, ఇష్టపూర్వకంగా ”ప్రభువు యెదుట వినయముగా నడచుటకు” (ఈథర్ 6:17) మీరేమి చేయగలరో ఆలోచించండి.
డేల్ జి. రెన్లండ్, “న్యాయముగా నడుచుకొనుము, కనికరమును ప్రేమించుము, దీనమనస్సు కలిగి దేవుని యెదుట ప్రవర్తించుము,” లియహోనా, నవ. 2020, 109–12 కూడా చూడండి.
నేను క్రీస్తువంటి నాయకుడిని కాగలను.
ఈథర్ యొక్క 7–11 అధ్యాయాలు కనీసం 28 తరాల సమాచారమిస్తాయి. ఇంత తక్కువ స్థలంలో తక్కువ వివరాలను ఇవ్వగలిగినప్పటికీ, నీతివంతమైన మరియు దుష్ట నాయకత్వం యొక్క పరిణామాల గురించి ఒక నమూనా త్వరగా ఉద్భవిస్తుంది. దిగువ జాబితా చేయబడిన రాజుల యొక్క ప్రతికూల మరియు సానుకూల ఉదాహరణల నుండి నాయకత్వం గురించి మీరు ఏమి నేర్చుకుంటారు?
-
షూలే—ఈథర్ 7:23–27
-
జెరెడ్—ఈథర్ 8:1–7, 11–15
-
ఎమెర్ మరియు కోరియాంటమ్—ఈథర్ 9:21–23
-
హేతు—ఈథర్ 9:26–30
-
షెజ్—ఈథర్ 10:1–2
-
రిప్లాకిష్—ఈథర్ 10:5–8
-
మోరియాంటన్—ఈథర్ 10:9-11
-
లిబ్—ఈథర్ 10:19–28
-
ఈథెమ్—ఈథర్ 11:11–13
-
యేసు క్రీస్తు—మత్తయి 18:1–4; 20:20–28; 23:11
ఈ సందేశాన్ని—ముఖ్యంగా ఆయన చెప్పే కథలను—క్రీస్తువంటి నాయకత్వ సూత్రాలు లేదా నమూనాల కోసం చూస్తూ అధ్యయనం చేయడాన్ని పరిగణించండి. నాయకత్వం వహించే వ్యక్తులలో ఈ సూత్రాలను లేదా నమూనాలను మీరు ఎప్పుడు చూశారు?
మీరు నేర్చుకున్న వాటి గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు, మీ ఇంటిలో, మీ సమాజంలో, మీ సంఘ పిలుపులో మరియు మొదలైన వాటిలో ఇతరులను నడిపించడానికి లేదా ప్రభావితం చేయడానికి మీకు గల అవకాశాల గురించి ఆలోచించండి. మీకు నిర్దిష్ట నాయకత్వ నియామకం లేకపోయినా, మీరు క్రీస్తువంటి నాయకత్వ లక్షణాలను ఎలా పెంపొందించుకోవచ్చు?
(ChurchofJesusChrist.org).
ప్రభువు రహస్యముగా పని చేయడు.
జనులు వారి దుష్టకార్యాలను రహస్యంగా ఉంచడానికి కుట్రపన్నినప్పుడు, వారు ఒక రహస్య కూడికలో చిక్కుకున్నారు. ఈథర్ 8:7–18 లో వివరించబడిన రహస్య కూడికలకు అదనంగా, హీలమన్ 1:9–12; 2:2–11; 6:16–30; మోషే 5:29–33 లో ఇతర ఉదాహరణలు కనుగొనబడగలవు. ఈ వచనాలను 2 నీఫై 26:22–24 తో పోల్చడాన్ని పరిగణించండి, అందులో ప్రభువు తన కార్యాన్ని ఎలా చేస్తారో నీఫై వివరించాడు. రహస్య కూడికల గురించి అతను ఏమి చేసాడో వ్రాయమని మొరోనై ఆదేశించబడ్డాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు?
ఈథర్ 8:26 లో వివరించబడిన దీవెనలు పొందడానికి మీకు సహాయపడేలా ఈథర్ గ్రంథము నుండి మీరు ఏమి నేర్చుకున్నారు?
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
నేను భయపడినప్పుడు, నన్ను ఓదార్చడానికి పరలోక తండ్రిని నేను నమ్మగలను.
-
ప్రతి ఒక్కరికీ కష్టమైన రోజులు ఉన్నాయి—చిన్న పిల్లలకు కూడా. నిజంగా కఠినమైన మరియు భయానకమైన రోజులలో జెరెడీయులు దేవుణ్ణి ఎలా విశ్వసించారో చూపే పదాలు మరియు వాక్యభాగాలను ఈథర్ 6:1–12 లో కనుగొనడానికి బహుశా మీరు మీ పిల్లలకు సహాయపడవచ్చు. మీ జీవితంలోని కష్ట సమయాల్లో దేవుడు మీకు సహాయం చేసిన కొన్ని అనుభవాలను ఒకరికొకరు పంచుకోవడం గురించి ఆలోచించండి.
ప్రభువు చేసిన వాటిని స్మరించుకోవడం, కృతజ్ఞత మరియు శాంతిని తెస్తుంది.
-
వాగ్దాన దేశానికి సురక్షితంగా చేరుకున్న తర్వాత, జెరెడీయులు మిక్కిలి కృతజ్ఞతతో “ఆనందభాష్పములు రాల్చిరి” (ఈథర్ 6:12). జెరెడీయులు దేవునికి తమ కృతజ్ఞతలు తెలియజేసినట్లు చూపుతున్న ఈథర్ 6:9, 12 లోని వాక్యభాగాలను కనుగొనడంలో వారికి సహాయం చేయడం ద్వారా దేవుని ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి మీరు మీ పిల్లలను ప్రేరేపించవచ్చు. వారు కృతజ్ఞత కలిగియున్న కొన్ని విషయాల గురించి మీకు చెప్పమని మీ పిల్లలను అడగండి.
-
బహుశా మీ పిల్లలు ఈథర్ 6:30; 7:27; మరియు 10:2 చదివి, ఈ నీతిమంతులైన రాజులు ఏమి గుర్తుంచుకున్నారో కనుగొనవచ్చు. వారు తమ ప్రజలను నడిపించే విధానాన్ని అవి ఎలా ప్రభావితం చేశాయి? మీరు మరియు మీ పిల్లలు దేవుడు మీ కోసం చేసిన వాటిని గుర్తుచేసుకోవడానికి మార్గాలను చర్చించవచ్చు. ఉదాహరణకు, వారు దాని గురించి వ్రాయవచ్చు లేదా చిత్రాలను గీయవచ్చు.
నేను దేవుని ప్రవక్తను అనుసరించినప్పుడు, నేను దీవించబడతాను.
-
బహుశా మీరు మరియు మీ పిల్లలు మనం చేయాలని ప్రవక్త బోధించిన కొన్ని విషయాలను అభినయించడాన్ని ఆనందించవచ్చు. అభినయాలు దేనిని సూచిస్తాయో ఊహించే ఆటగా కూడా మీరు దీనిని మార్చవచ్చు. దేవుని ప్రవక్తను అనుసరించడం ఎందుకు ముఖ్యమో చర్చించడానికి ఇది మీ పిల్లలను సిద్ధం చేయగలదు. తర్వాత, ప్రజలు దేవుని ప్రవక్తకు విధేయత చూపినప్పుడు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి మీరు ఈథర్ 7:24–27 ను చదవవచ్చు. ఈరోజు ప్రవక్తను అనుసరించడం ద్వారా మనం ఎలా ఆశీర్వదించబడ్డాము?
నేను పశ్చాత్తాపపడినప్పుడు ప్రభువు కనికరము కలిగియున్నారు.
-
నమూనాల కోసం వెతకడం, ఉపయోగకరమైన లేఖన అధ్యయన నైపుణ్యం. ఈథర్ గ్రంథములో ప్రభువు యొక్క దయను పదే పదే నొక్కి చెప్పే నమూనా ఉంది. ఈ నమూనాను కనుగొనడంలో మీ పిల్లలకు సహాయపడడానికి, రెండు వృత్తాంతాల మధ్య సారూప్యతను చూస్తూ ఈథర్ 9:28-35 మరియు ఈథర్ 11:5–8 చదవమని వారిని ఆహ్వానించండి ఈ కథల నుండి మనము ఏమి నేర్చుకుంటాము?