2024 రండి, నన్ను అనుసరించండి
నవంబరు 4-10: “మీరు ఇక్కడున్నట్లుగా నేను మీతో మాట్లాడుచున్నాను.” మోర్మన్ 7–9


“నవంబరు 4-10: ‘మీరు ఇక్కడున్నట్లుగా నేను మీతో మాట్లాడుచున్నాను.’ మోర్మన్ 7–9,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“నవంబరు 4-10. మోర్మన్ 7–9,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)

బంగారు పలకలపై వ్రాస్తున్న మొరోనై

Moroni Writing on Gold Plates [బంగారు పలకలపై వ్రాస్తున్న మొరోనై], డేల్ కిల్‌బర్న్ చేత

నవంబరు 4-10: “మీరు ఇక్కడున్నట్లుగా నేను మీతో మాట్లాడుచున్నాను”

మోర్మన్ 7–9

ప్రత్యేకించి యుద్ధములో అతని తండ్రి చనిపోయి, నీఫైయులు నాశనమైన తరువాత—దుష్ట ప్రపంచంలో ఒంటరిగా ఉండడం ఎలా ఉంటుందో మొరోనైకు తెలుసు. “నేను ఒక్కడినే మిగిలియుంటిని,” అని అతడు వ్రాసాడు. “నాకు స్నేహితులెవరూ లేరు లేదా నేను వెళ్ళుటకు స్థలమేదియూ లేదు” (మోర్మన్ 8:3, 5). విషయాలు నిరాశాజనకంగా ఉండవచ్చు, కానీ మొరోనై యేసు క్రీస్తు నందు మరియు “ప్రభువు యొక్క నిత్య సంకల్పములు కొనసాగును” (మోర్మన్ 8:22) అనే తన సాక్ష్యమందు నిరీక్షణను కనుగొన్నాడు. ఆ నిత్య సంకల్పములందు మోర్మన్ గ్రంథము చేత పోషించబడే ముఖ్యమైన పాత్రను మొరోనై ఎరుగును—ఇప్పుడు అతడు శ్రద్ధగా పూర్తి చేస్తున్న గ్రంథము, ఒకరోజు అనేకమంది జనులను “క్రీస్తు యొక్క జ్ఞానమునకు” తెచ్చే గ్రంథము (మోర్మన్ 8:16; 9:36). ఈ వాగ్దానములందు మొరోనై యొక్క విశ్వాసము ఈ గ్రంథమును చదివే భవిష్యత్ పాఠకులకు ఇలా ప్రకటించుటను అతనికి సాధ్యము చేసింది, “మీరు ఇక్కడున్నట్లుగా నేను మీతో మాట్లాడుచున్నాను” మరియు “మీరు నా మాటలను కలిగియుందురని నేనెరుగుదును” (మోర్మన్ 8:35; 9:30). ఇప్పుడు మనము అతడి మాటలను కలిగియున్నాము మరియు ప్రభువు యొక్క కార్యము కొనసాగుతోంది, కొంతవరకు ఎందుకనగా మోర్మన్ మరియు మొరోనై, వారు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా వారి నియమితకార్యానికి యధార్థముగా నిలిచియున్నారు.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

మోర్మన్ 7

“యేసు క్రీస్తు నందు విశ్వసించుడి” మరియు “[ఆయన] సువార్తను హత్తుకొనుడి.”

అతని జనుల వృత్తాంతాన్ని సంక్షేపము చేసిన తర్వాత, మోర్మన్ తన ముగింపు సందేశాన్ని మోర్మన్ 7లో ఇచ్చాడు. అతడు ఈ సందేశాన్ని ఎందుకు ఎంచుకున్నాడని మీరనుకుంటున్నారు? “క్రీస్తు యొక్క సువార్తను హత్తుకొనుట” అనగా అర్థమేమిటని మీరనుకుంటున్నారు? (మోర్మన్ 7:8).

మోర్మన్ 7:8–10; 8:12-16; 9:31–37

మోర్మన్ గ్రంథము గొప్ప విలువ కలిగియున్నది.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా అడిగారు: “మీకు వజ్రాలు లేదా కెంపులు లేదా మోర్మన్ గ్రంథము ఇవ్వబడిన యెడల, మీరు దేనిని ఎంపిక చేస్తారు? నిజాయితీగా, మీకు ఏది గొప్ప విలువ కలిగియున్నది?” (“మోర్మన్ గ్రంథము: అది లేకుండా మీ జీవితం ఎలా ఉంటుంది?,” లియహోనా, నవ. 2017, 61).

మనకాలంలో మోర్మన్ గ్రంథము ఎందుకు విలువైనదో అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడునట్లు మోర్మన్ 7:8–10; 8:12–22; మరియు 9:31–37 లో మీరేమి కనుగొంటారు? అది మీకెందుకు విలువైనది? 1 నీఫై 13:38–41; 2 నీఫై 3:11–12; మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 33:16; 42:12–13 లో అదనపు అంతర్దృష్టులను మీరు కనుగొనవచ్చు.

వివిధ భాషలలో మోర్మన్ గ్రంథ ప్రతులు

మోర్మన్ గ్రంథ ప్రవక్తల యొక్క రచనలు మనకు అన్వయిస్తాయి

మోర్మన్ 8:1-11

ఇతరులు పాటించకపోయినా నేను ఆజ్ఞలు పాటించగలను.

ఆజ్ఞలను పాటించడానికి మీ ప్రయత్నాల్లో కొన్నిసార్లు మీరు ఒంటరిగా భావించవచ్చు. మీకు సహాయపడేలా మొరోనై మాదిరి నుండి మీరేమి నేర్చుకోగలరు? (మోర్మన్ 8:1–11 చూడండి). అతడు విశ్వాసంగా ఎలా నిలిచియున్నాడని మీరు మొరోనైని అడగగలిగితే, అతడు ఏమి చెప్తాడని మీరనుకుంటున్నారు?

మోర్మన్ 8:26–41; 9:1–30

మోర్మన్ గ్రంథము మన కాలము కొరకు వ్రాయబడింది.

మోర్మన్ గ్రంథము వెలుగులోనికి వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో యేసు క్రీస్తు మొరోనైకు చూపించారు (మోర్మన్ 8:34–35 చూడండి), అది మన కాలం కొరకు ధైర్యముగల హెచ్చరికలు చేయుటకు అతడిని నడిపించింది. మీరు మోర్మన్ 8:26–41 మరియు 9:1–30 చదివినప్పుడు, అతని మాటలు మీకెలా అన్వయించబడవచ్చో ధ్యానించండి. ఉదాహరణకు, ఈ వచనాలలో మొరోనై 24 ప్రశ్నలు అడుగుతాడు. మొరోనై మన కాలమును చూసాడని ఈ ప్రశ్నలలో ఏ రుజువును మీరు చూస్తారు? మొరోనై ముందుగా చూసిన సవాళ్ళలో మోర్మన్ గ్రంథము ఎలా సహయపడగలదు?

ఆత్మను వినండి. మీరు చదివినవాటితో సంబంధం లేనట్లు అనిపించినప్పటికీ, మీ ఆలోచనలు మరియు భావాలపట్ల శ్రద్ధ వహించండి. ఆ మనోభావాలే మీ పరలోక తండ్రి మీరు నేర్చుకోవాలని కోరే విషయాలు కావచ్చు. ఉదాహరణకు, మోర్మన్ 9: 1–30 లో మొరోనై అడిగిన ప్రశ్నలను మీరు ధ్యానించిన తర్వాత మీకు కలిగిన మనోభావాలేవి?

మోర్మన్ 9:1-25

సెమినరీ చిహ్నము
యేసు క్రీస్తు అద్భుతములను చేయు దేవుడు.

అద్భుతాలలో విశ్వసించని మన కాలంలోని జనుల కొరకు ఒక శక్తివంతమైన సందేశంతో మొరోనై తన తండ్రి యొక్క వ్రాతలను ముగించాడు (మోర్మన్ 8:26; 9:1, 10–11 చూడండి). అద్భుతాలలో విశ్వసించడం నేడు అవసరమని మీరెందుకు భావిస్తున్నారు? మోర్మన్ 9:9–11, 15–27 మరియు మొరోనై 7:27–29 వెదకండి మరియు ఇటువంటి ప్రశ్నలను ధ్యానించండి:

  • ఈ వచనాల నుండి రక్షకుని గురించి నేనేమి నేర్చుకుంటాను?

  • గతంలో మరియు వర్తమానంలోని అద్భుతాల గురించి నేనేమి నేర్చుకుంటాను?

  • యేసు క్రీస్తు అద్భుతములను చేయు దేవుడని నమ్మడం వలన కలిగే లాభాలేవి? దీనిని నమ్మకపోవడం వల్ల కలిగే పర్యవసానాలేవి?

  • పెద్దవి మరియు చిన్నవి—రక్షకుడు నా జీవితంలో జరిగించిన అద్భుతాలేవి? ఈ అద్భుతాలు ఆయన గురించి నాకు ఏమి బోధిస్తాయి?

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు: “మన రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు, ఇప్పుడు మరియు ఆయన మరలా తిరిగి వచ్చే మధ్య కాలంలో, ఆయన అద్భుతకార్యములలో కొన్నిటిని నెరవేరుస్తారు. తండ్రియైన దేవుడు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ఈ సంఘముపైగా ఘనత, మహిమయందు అధ్యక్షత్వము వహిస్తారనే అద్భుతమైన సూచనలను మనము చూస్తాము” (“సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు,” లియహోనా, మే 2018, 96). ఈ అద్భుతాలలో కొన్ని ఏమైయుండవచ్చని మీరు భావిస్తున్నారు? వాటిని నెరవేర్చడంలో రక్షకునికి సహాయపడేందుకు మీరేమి చేయగలరు?

అధ్యక్షులు మరియు సహోదరి నెల్సన్ వారిని సందర్శించినప్పుడు, సమోవా, టోంగా, ఫీజి మరియు తహితిలోని పరిశుద్ధుల అనుభవాల నుండి విశ్వాసము మరియు అద్భుతాల గురించి మీరేమి నేర్చుకుంటారు? (రస్సెల్ ఎమ్. నెల్సన్, “క్రీస్తు లేచియున్నాడు; ఆయనయందు విశ్వాసం పర్వతములను కదిలించును,” లియహోనా, మే 2021, 101–4 చూడండి).

రోనాల్డ్ ఎ. రాస్బాండ్, “ఇదిగో! నేను అద్భుతములు చేయు దేవుడను,” లియహోనా, మే 2021, 109–12 కూడా చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

మోర్మన్ 7:8–10

మోర్మన్ గ్రంథము మరియు బైబిలు యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిస్తాయి.

  • మోర్మన్ వలె మోర్మన్ గ్రంథము మరియు బైబిలు మధ్య సంబంధాన్ని నొక్కి చెప్పడానికి, మీ పిల్లలతో కలిసి మీరు ఇటువంటి ఒక ఆట ఆడవచ్చు: మీరు బైబిలు పైకెత్తి పట్టుకున్నప్పుడు వారిని “పాత నిబంధన, క్రొత్త నిబంధన” అని మరియు మీరు మోర్మన్ గ్రంథ ప్రతిని పైకెత్తి పట్టుకున్నప్పుడు “మరియొక నిబంధన” అని చెప్పమని వారిని అడగండి. బైబిలు మరియు మోర్మన్ గ్రంథము రెండూ సాక్ష్యమిచ్చే అనేక సంఘటనలు—యేసు పుట్టుక, మరణము మరియు పునరుత్థానము వంటివి కూడా మీరు ఎంచుకోవచ్చు—మరియు ఈ సంఘటనల చిత్రాలను కనుగొనమని మీ పిల్లలను ఆహ్వానించవచ్చు.

  • ఎనిమిదవ విశ్వాస ప్రమాణాన్ని నేర్చుకోవడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు, వేర్వేరు కాగితాల మీద మీరు ప్రతీ పదాన్ని వ్రాయవచ్చు. ఆ పదాలను సరైన క్రమములో అమర్చడానికి కలిసి పనిచేయమని మరియు అనేకసార్లు దానిని పునరావృతం చేయమని మీ పిల్లలను ఆహ్వానించండి.

మోర్మన్ 8:1-7

నేను ఒంటరిగా భావించినప్పటికీ, నేను ఆజ్ఞలను పాటించగలను.

  • వారు ఒంటరిగా భావించినప్పటికీ, దేవుని ఆజ్ఞలకు లోబడేందుకు మొరోనై మాదిరి మీ పిల్లలను ప్రేరేపించగలదు. మీరు వారితో కలిసి మోర్మన్ 8:1–7 చదివిన తర్వాత, వారే మొరోనై అయితే వారెలా భావించియుండేవారో వారు పంచుకోవచ్చు. 1, 3 మరియు 4 వచనాలలో, ఏమి చేయమని మొరోనై ఆజ్ఞాపించబడ్డాడు మరియు అతడు ఎలా విధేయుడయ్యాడు? మనం మరింతగా మొరోనై వలె ఎట్లు కాగలము?

  • ఎవ్వరూ చూడనప్పుడు మంచి చెడుల మధ్య వారు తప్పక ఎంచుకోవలసిన సందర్భాల గురించి మీరు, మీ పిల్లలు మాట్లాడుకోవచ్చు. ఈ సందర్భాలలో యేసు క్రీస్తు యందు విశ్వాసం కలిగియుండడం మనకు ఎలా సహాయపడుతుంది?

మోర్మన్ 8:24-26; 9:7-26

యేసు క్రీస్తు “అద్భుతములను చేయు దేవుడు.”

  • అద్భుతము అనేది దేవుడు తన శక్తిని చూపించి, మన జీవితాలను దీవించడానికి చేసేది అని మీ పిల్లలకు వివరించాలని మీరు కోరుకోవచ్చు. అప్పుడు మీరు దేవుని యొక్క కొన్ని అద్భుతాలను వర్ణించే వాక్యభాగాలను మోర్మన్ 9:11–13, 17 నుండి చదువవచ్చు మరియు మీ పిల్లలు ఇతర అద్భుతాల గురించి ఆలోచించవచ్చు. మీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాల గురించి మాట్లాడండి.

  • ఒక తయారీ విధానాన్ని మీ పిల్లలకు చూపించండి మరియు ఆవశ్యకమైన ఒక పదార్థాన్ని మీరు వదిలివేసినట్లయితే ఏమి జరుగుతుందో మాట్లాడండి. దేవుని నుండి అద్భుతాలకు దారితీయగల “పదార్థాలను” కనుగొనడానికి, కలిసి మోర్మన్ 8:24 మరియు 9:20–21 చదవండి.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

నీఫైయుల నాశనాన్ని పట్టించుకోని మొరోనై

Moroni Overlooking the Destruction of the Nephites [నీఫైయుల నాశనాన్ని పట్టించుకోని మొరోనై], జోసెఫ్ బ్రిక్కీ చేత