2024 రండి, నన్ను అనుసరించండి
నవంబరు 11-17: “అవిశ్వాసపు తెరను చించివేయుము.” ఈథర్ 1–5


“నవంబరు 11-17: ‘అవిశ్వాసపు తెరను చించివేయుము.’ ఈథర్ 1–5,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“నవంబరు 11-17. ఈథర్ 1-5,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)

అరణ్యము గుండా ప్రయాణిస్తున్న జెరెడీయులు

The Jaredites Leaving Babel [బాబెలును విడిచివెళ్తున్న జెరెడీయులు], ఆల్బిన్ వెసెల్కా చేత

నవంబరు 11-17: “అవిశ్వాసపు తెరను చించివేయుము”

ఈథర్ 1–5

దేవుని మార్గాలు మన వాటికంటే గొప్పవన్నది నిజము మరియు మనము ఎల్లప్పుడూ ఆయన చిత్తమునకు అప్పగించుకోవలసియుండగా, మనము ఆలోచించాలని మరియు మనకై మనం పనిచేయాలని కూడా ఆయన ప్రోత్సహిస్తారు. అది జెరెడ్ మరియు అతడి సహోదరుడు నేర్చుకొన్న ఒక పాఠము. ఉదాహరణకు, “భూమిపైనున్న శ్రేష్ఠమైన” ఒక క్రొత్త దేశానికి ప్రయాణించే ఆలోచన జెరెడ్‌తో ప్రారంభమైనట్లు కనబడుతుంది మరియు ప్రభువు ఆ అభ్యర్థనను మన్నించి, జెరెడ్ సోదరునితో ఇలా అన్నారు, “సుదీర్ఘకాలము నీవు నాకు మొరపెట్టినందున, నేను నీపట్ల ఆ విధముగా చేసెదను” (ఈథర్ 1:38–43 చూడండి). మరియు జెరెడ్ సోదరుడు వాగ్దాన దేశానికి వారిని తీసుకువెళ్ళే పడవల లోపల వెలుతురు అవసరం అయినప్పుడు, మనము సాధారణంగా ఆయనను అడిగే ప్రశ్నను ప్రభువు అడిగారు: “నేను ఏమి చేయవలెనని మీరు కోరుచున్నారు?” (ఈథర్ 2:23). ఆయన మన ఆలోచనలను, అభిప్రాయాలను వినాలనుకుంటున్నారు మరియు ఆయన వింటారు, ఆయన నిర్ధారణను ఇస్తారు లేదా మరొకవిధంగా మనకు సలహా ఇస్తారు. కొన్నిసార్లు మనము వెదికే దీవెనల నుండి మనల్ని వేరు చేసే ఏకైక విషయము మన స్వంత “అవిశ్వాసపు తెర” మరియు మనము “ఆ తెరను చించివేయగలిగినప్పుడు” (ఈథర్ 4:15), ప్రభువు మన కోసం చేయడానికి సమ్మతించే దాని చేత మనము ఆశ్చర్యపడవచ్చు.

“The Lord Appears to the Brother of Jared [ప్రభువు జెరెడ్ యొక్క సహోదరునికి కనిపిస్తారు]” (video), సువార్త గ్రంథాలయము కూడా చూడండి

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

ఈథర్ 1:33–43

నేను ప్రభువుకు మొరపెట్టినప్పుడు, ఆయన నాపై కనికరము కలిగియుంటారు.

ఈథర్ 1:33–43 జెరెడ్ సహోదరుని యొక్క మూడు ప్రార్థనలను గూర్చి చెప్తుంది. ప్రతీ ప్రార్థనకు ప్రభువు యొక్క స్పందన నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? ప్రార్థనయందు ఆయనకు మీరు మొరపెట్టినప్పుడు ప్రభువు యొక్క కనికరమును మీరు అనుభవించినప్పటి సమయము గురించి ఆలోచించండి. మీరు ఆ అనుభవమును వ్రాసి, మీ సాక్ష్యమును వినుట అవసరమైన వారెవరితోనైనా దానిని పంచుకోవడానికి కోరవచ్చు.

ఈథర్ 2; 3:1–6; 4:7–15

సెమినరీ చిహ్నము
నా జీవితం కొరకు నేను బయల్పాటును పొందగలను.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు: “బయల్పాటును పొందడానికి మీ ఆత్మీయ సామర్థ్యమును పెంచుకోమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. … పరిశుద్ధాత్మ వరమును ఆనందించుటకు అవసరమైన ఆత్మీయ కార్యము చేయడానికి ఎంపిక చేయండి మరియు ఎక్కువ తరచుగా, మరింత స్పష్టంగా ఆత్మ యొక్క స్వరమును వినండి” (“సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు,” లియహోనా, మే 2018, 96).

మీరు ఈథర్ 2; 3:1–6; 4:7–15 చదివినప్పుడు, అధ్యక్షులు నెల్సన్ చెప్పిన “ఆత్మీయ కార్యము” గురించి మీరేమి నేర్చుకుంటారు? జెరెడ్ యొక్క సహోదరునికి గల ప్రశ్నలు లేదా చింతలను మరియు వాటి గురించి అతడు చేసిన దానిని ఒక రంగులో మీరు గుర్తించవచ్చు మరియు ప్రభువు అతడికి ఎలా సహాయపడ్డారు, ఆయన చిత్తమును ఎలా తెలియజేసారు అనేదానిని మరొక రంగులో గుర్తించవచ్చు.

మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు ఆలోచించడానికి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి:

  • ఈథర్ 2:18–25 లో జెరెడ్ యొక్క సహోదరుని ప్రశ్నలకు ప్రభువు సమాధానమిచ్చిన తీరు గురించి మిమ్మల్ని ఏది ఆకట్టుకుంది?

  • ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకుంటున్న వ్యక్తికి సహాయం చేయడానికి మీరు ఈథర్ 3:1–5 ని ఎలా ఉపయోగించవచ్చు?

  • ప్రభువు నుండి బయల్పాటు పొందకుండా మిమ్మల్ని ఏది నిరోధించవచ్చు? (ఈథర్ 4:8–10 చూడండి). మీరు ఆయన నుండి మరింత తరచుగా బయల్పాటును ఎలా పొందగలరు? (ఈథర్ 4: 7, 11–15 చూడండి).

  • మీ జీవితంలో “అవిశ్వాసపు తెరను చింపివేయడం” అంటే ఏమిటని మీరు అనుకుంటున్నారు” (ఈథర్ 4: 15).

వ్యక్తిగత బయల్పాటును గురించి జెరెడ్ సోదరుడి నుండి మీరు ఇంకా ఏమి నేర్చుకుంటారు?

ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్, “వ్యక్తిగత బయల్పాటు కొరకు ఒక అంతర్లీన నిర్మాణం” గురించి బోధించారు (లియహోనా, నవ. 2022, 16-19). ఒక చట్రపు ఆకారాన్ని గీసి, ఆ అంతర్లీన నిర్మాణంలోని నాలుగు అంశాలను ప్రతి వైపు రాయడాన్ని పరిగణించండి. ఈ అంతర్లీన నిర్మాణం “బయల్పాటును పొందే మీ సామర్థ్యమును” వృద్ధి చేసుకోవడానికి ఎలా సహాయపడుతుంది?

ఈథర్ 2:14–15; 3:1–20

ఆయన గద్దింపు ద్వారా, పశ్చాత్తాపపడి ఆయన వద్దకు రావాలని ప్రభువు నన్ను ఆహ్వానిస్తున్నారు.

జెరెడ్ సోదరుని వంటి ఒక గొప్ప ప్రవక్త కూడా ప్రభువు చేత గద్దింపబడవలసి వచ్చింది. ప్రభువు గద్దింపు గురించి ఈథర్ 2:14–15 నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? ప్రభువు యొక్క గద్దింపు మరియు జెరెడ్ సోదరుని ప్రతిస్పందన, ఈథర్ 3:1–20 లోని అతని అనుభవాల కొరకు అతన్ని సిద్ధం చేయడంలో ఎలా సహాయపడి ఉండవచ్చో ఆలోచించండి.

ఈథర్ 2:16–25

నా “గొప్ప అగాధమును” దాటడానికి ప్రభువు నన్ను సిద్ధపరుస్తారు.

కొన్నిసార్లు, “గొప్ప అగాధమును” దాటడం మన కోసం దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఏకైక మార్గం కావచ్చు. ఈథర్ 2:16–25 లో మీ జీవితానికి పోలికలను మీరు చూసారా? మీ సవాళ్ళ కోసం ప్రభువు మిమ్మల్ని ఎలా సిద్ధపరిచారు? భవిష్యత్తులో మీరు చేయాలని ఆయన కోరేదాని కొరకు సిద్ధపడడానికి ఇప్పుడు ఏమి చేయమని ఆయన మిమ్మల్ని అడుగుతున్నారు?

ఎల్. టాడ్ బడ్జ్, “స్థిరమైన, స్థితిస్థాపకమైన నమ్మకము,” లియహోనా, నవ. 2019, 47–49 కూడా చూడండి.

మీరు నేర్చుకున్న వాటిని అన్వయించండి. సువార్త అధ్యయనం మన జీవితాలను మార్చుకోవడానికి మనల్ని ప్రేరేపించాలి. ఈథర్ 4:11–12 చదివిన తరువాత, మీరు మీ జీవితంలోని కొన్ని ప్రభావాలను జాబితా చేయవచ్చు మరియు మంచి చేయడానికి అవి మిమ్మల్ని ఒప్పించాయో లేదో పరిశీలించవచ్చు. ఏ మార్పులు చేయడానికి మీరు ప్రేరణ పొందారు?

ఈథర్ 5

సాక్షులు మోర్మన్ గ్రంథము యొక్క సత్యాన్ని గురించి సాక్ష్యమిస్తారు.

మీరు ఈథర్ 5 లో మొరోనై యొక్క ప్రవచనాన్ని చదువుతున్నప్పుడు, మోర్మన్ గ్రంథానికి సంబంధించిన అనేకమంది సాక్షులను సిద్ధం చేయడంలో ప్రభువు యొక్క ఉద్దేశ్యాన్ని ధ్యానించండి. మోర్మన్ గ్రంథము దేవుని వాక్యమని నమ్ముటకు ఏ సాక్షులు మిమ్మల్ని ప్రేరేపించారు? మోర్మన్ గ్రంథము “దేవుని శక్తిని మరియు ఆయన వాక్యమును” మీకు ఎలా చూపించింది? (ఈథర్ 5:4).

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

ఈథర్ 1:33–37; 2:16–25; 3:1–6

పరలోక తండ్రి నా ప్రార్థనలను ఆలకిస్తారు మరియు జవాబిస్తారు.

  • మీ పిల్లలకు తెలియని భాష మీకు తెలిస్తే, ఆ భాషలో వారికి కొన్ని సాధారణ సూచలను ఇవ్వండి (లేదా మరొక భాషలో రికార్డు చేసినదానిని వినిపించండి). ఈథర్ 1:33–37 లో సహాయం కోసం జెరెడ్ సోదరుడు ఎందుకు ప్రార్థించాడో వివరించడానికి మీరు దీన్ని ఉపయోగించవచ్చు.

  • మీరు ఈథర్ 2:16–17 చదువుతున్నప్పుడు, మీ పిల్లలు ఒక పడవను నిర్మించినట్లు నటించవచ్చు. అప్పుడు మీరు మరియు మీ పిల్లలు జెరెడీయులు తమ పడవలతో ఎదుర్కొన్న సమస్యల గురించి (ఈథర్ 2:19 చూడండి) మరియు జెరెడ్ సోదరుని ప్రార్థనలకు ప్రభువు సమాధానమిచ్చిన వివిధ మార్గాల గురించి (ఈథర్ 2:19–25; 3:1–6 చూడండి) చదవగలరు. ఈ సారాంశం చివరన ఉన్న చిత్రం మరియు ప్రోత్సాహ కార్యక్రమ పేజీ, మీకు మరియు మీ పిల్లలకు కథ చెప్పడంలో సహాయపడగలదు. ప్రార్థన గురించి జెరెడ్ సోదరుడి నుండి మనమేమి నేర్చుకుంటాము? మీరు సహాయం కోసం ప్రార్థించినప్పుడు పరలోక తండ్రి మీకు సహాయం చేసిన అనుభవాన్ని పంచుకోవడం గురించి ఆలోచించండి.

ఈథర్ 3:6–16

నేను దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాను.

  • వారు పెరిగేకొద్దీ, మీ పిల్లలు దేవుని గురించి, తమ గురించి మరియు వారి భౌతిక శరీరాల గురించి అనేక తప్పుడు సందేశాలను ఎదుర్కొంటారు. ఈథర్ 3:6–16 లో ఈ అంశాలకు సంబంధించిన సత్యాలను కనుగొనడంలో మీకు సహాయం చేయమని మీరు వారిని అడగవచ్చు. ఈథర్ 3:13, 15 లో బోధించబడిన సత్యాన్ని నొక్కిచెప్పేందుకు, మీరు కలిసి రక్షకుని చిత్రాన్ని చూడవచ్చు మరియు ఆయన శరీరంలోని వివిధ భాగాలను సూచించమని మీ పిల్లలను ఆహ్వానించవచ్చు. అప్పుడు వారు తమ శరీరంలోని అదే భాగాన్ని సూచించవచ్చు. మీరు మరియు మీ పిల్లలు మీ శరీరాల పట్ల ఎందుకు కృతజ్ఞత కలిగి ఉన్నారనే దాని గురించి మాట్లాడవచ్చు.

ఒక పొలంలో పరిగెత్తుతున్న పిల్లవాడు

మనము దేవుని స్వరూపములో సృష్టించబడ్డాము.

ఈథర్ 5

ముగ్గురు సాక్షులు మోర్మన్ గ్రంథము గురించి సాక్ష్యమిచ్చారు.

  • మోర్మన్ గ్రంథము యొక్క సత్యాన్ని స్థాపించడంలో ముగ్గురు సాక్షులు సహాయం చేస్తారని మొరోనై ప్రవచించాడు. సాక్ష్యము అంటే ఏమిటో బోధించడానికి, వారు చూసినవి లేదా ఇతరులు అనుభవించని వాటిని వివరించమని మీరు మీ పిల్లలను అడగవచ్చు. మీరు ఈథర్ 5 ను కలిసి చదువుతున్నప్పుడు, ఆయన కార్యములో ప్రభువు సాక్షులను ఎందుకు ఉపయోగించుకుంటారనే దాని గురించి మీరు మాట్లాడవచ్చు. మోర్మన్ గ్రంథము సత్యమని మీకు ఎలా తెలుసో మరియు మీరు మీ సాక్ష్యాలను ఇతరులతో ఎలా పంచుకోవాలో కూడా మీరు ఒకరితో ఒకరు పంచుకోవచ్చు.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

జెరెడ్ యొక్క సహోదరుని సమక్షంలో పదహారు రాళ్ళను తాకుతున్న యేసు

Sowest Thou More Than This? [నీవు దీనికంటె ఎక్కువ చూసావా?], మార్కస్ అలాన్ విన్సెంట్ చేత