“మే 10–16. సిద్ధాంతము మరియు నిబంధనలు 49-50: ‘దేవుని నుండి కలిగినది వెలుగైయున్నది,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)
“మే 10–16. సిద్ధాంతము మరియు నిబంధనలు 49–50,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021
మే 10–16
సిద్ధాంతము మరియు నిబంధనలు 49–50
“దేవుని నుండి కలిగినది వెలుగైయున్నది”
“వెలుగును పొందినవాడు, దేవునియందు కొనసాగినయెడల, మరింత వెలుగును పొందును; పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు ఆ వెలుగు అంతకంతకు తేజరిల్లును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 50:24). దేవునియందు కొనసాగుట ద్వారా మీరు వెలుగును ఎట్లు పొందుతున్నారో ధ్యానించండి.
మీ మనోభావాలను నమోదు చేయండి
రక్షకుడు మన “మంచి కాపరి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 50:44). కొన్నిసార్లు గొర్రెలు దారి తప్పుతాయని, అడవిలో అనేక అపాయములున్నాయని ఆయనకు తెలుసు. కాబట్టి, “లోకమంతా వ్యాపించి, ప్రపంచమును మోసపుచ్చుచున్న అబద్ధ ఆత్మల” (సిద్ధాంతము మరియు నిబంధనలు 50:2) వంటి అపాయాలకు దూరంగా ఆయన సిద్ధాంతపు భద్రతకు ప్రేమతో ఆయన మనల్ని నడిపిస్తారు. తరచు ఆయనను అనుసరించడమంటే అర్థము, తప్పుడు ఆలోచనలు లేక ఆచారాలను నమ్మకపోవడం. పునఃస్థాపించబడిన సువార్తను అంగీకరించినప్పటికీ, ఇంకా కొన్ని తప్పుడు విశ్వాసాలను నమ్ముతున్న లేమన్ కోప్లి మరియు ఒహైయోలోని ఇతరుల విషయంలో ఇది నిజము. సిద్ధాంతము మరియు నిబంధనలు 49లో, వివాహము మరియు రక్షకుని రెండవ రాకడ వంటి విషయాల గురించి లేమన్ యొక్క పూర్వ నమ్మకాలను సరిచేసిన సత్యాలను ప్రభువు ప్రకటించారు. పరివర్తన చెందినవారు ఒహైయోలో “(వారు) గ్రహింపజాలని ఆత్మలను పొందినప్పుడు,” ఆత్మ యొక్క నిజమైన ప్రత్యక్షతలను ఎలా తెలుసుకోవాలో ప్రభువు వారికి బోధించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 50:15). మంచి కాపరి సహనముతో నున్నాడు; ఈ ప్రారంభ పరిశుద్ధులు— మనందరివలె—“చిన్న పిల్లలు,” “వారు కృపయందును, సత్యము యొక్క జ్ఞానమందును వృద్ధిచెందవలెనని” (సిద్ధాంతము మరియు నిబంధనలు 50:40) ఆయనకు తెలుసు.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 49:5–23
అబద్ధ బోధనలను గుర్తించడానికి సువార్త సూత్రాలు నాకు సహాయపడగలవు.
సంఘములో చేరకముందు లేమన్ కోప్లి, క్రీస్తు రెండవ దర్శనమందు విశ్వసించువారి ఐక్య సమాజము అని, షేకర్స్ అని కూడా పిలువబడిన మత సమూహములో భాగమైయుండెను. లేమన్‌తో మాట్లాడిన తర్వాత, షేకర్స్ బోధనలలో కొన్నింటి గురించి జోసెఫ్ స్మిత్ ప్రభువును స్పష్టత కోరగా, 49వ ప్రకరణములోని బయల్పాటుతో ప్రభువు స్పందించారు.
49వ ప్రకరణము యొక్క శీర్షికలో షేకర్స్ నమ్మకాలలో కొన్ని చెప్పబడడం మీరు కనుగొనవచ్చు. ఆ నమ్మకాలను సరిచేసేలా 5–23 వచనాలలో ఉన్న సత్యాలను గుర్తించడాన్ని లేక గమనించడాన్ని పరిగణించండి. నేడు ప్రపంచంలో ఉన్న ఇతర అబద్ధ బోధనలు లేక ఆచారాల గురించి ఆలోచించండి. వాటికి విరుద్ధంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏ సువార్త సత్యాలు మీకు సహాయపడగలవు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 49:15–17
స్త్రీ పురుషుల మధ్య వివాహము దేవుని ప్రణాళికకు ఆవశ్యకమైనది.
వివాహము గురించి ఏ సత్యాలను సిద్ధాంతము మరియు నిబంధనలు 49:15–17 నుండి మీరు నేర్చుకుంటారు? స్త్రీ పురుషుల మధ్య వివాహము పరలోక తండ్రి ప్రణాళికకు ఆవశ్యకమైనదని మీరెందుకు భావిస్తున్నారు? ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ రెండు కారణాలు చెప్పారు: “1వ కారణము: స్త్రీ పురుషుల ఆత్మల యొక్క స్వభావాలు ఒకదానినొకటి పూర్తిచేసి, సంపూర్ణం చేస్తాయి, కాబట్టి స్త్రీ పురుషులు ఉన్నతస్థితి వైపు కలిసి పురోగమించడానికి ఉద్దేశించబడ్డారు. … 2వ కారణము: దైవిక రూపకల్పన ద్వారా స్త్రీ పురుషులిద్దరూ పిల్లలను మర్త్యత్వంలోకి తీసుకువచ్చి, వారిని పెంచి, పోషించడానికి మంచి వాతావరణం కల్పించాలి” (“Marriage Is Essential to His Eternal Plan,” Ensign, June 2006, 83–84).
ఆదికాండము 2:20–24; 1 కొరింథీయులకు 11:11; “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” ఎన్‌సైన్ లేక లియహోనా, మే 2017, 145 కూడా చూడండి.
ప్రభువు యొక్క బోధనలు నన్ను సాతాను మోసాల నుండి కాపాడగలవు.
ఒహైయోలో క్రొత్తగా పరివర్తన చెందినవారు లేఖనాలలో వాగ్దానం చేయబడిన ఆత్మీయ ప్రత్యక్షతలను పొందడానికి ఆతృతగా ఉన్నారు, కానీ సాతాను కూడా వారిని మోసం చేయడానికి ఆతృతగా ఉండెను. ఎవరైనా అరిచినప్పుడు లేక స్పృహ తప్పి పడిపోయినప్పుడు, అది ఆత్మ యొక్క ప్రభావమా అని వారు ఆశ్చర్యపడ్డారు?
పరిశుద్ధాత్మ యొక్క నిజమైన ప్రత్యక్షతలను ఎలా గుర్తించాలో మరియు సాతాను అనుకరణల చేత మోసపోకుండా ఎలా తప్పించుకోవాలో గ్రహించడానికి ఈ నూతన పరివర్తకులకు సహాయపడేందుకు మీరు అడగబడ్డారని ఊహించుకోండి. మీరు పంచుకోగలిగేలా సిద్ధాంతము మరియు నిబంధనలు 50లో ఏ సూత్రాలను మీరు కనుగొంటారు? (ప్రత్యేకించి 22–25, 29–34, 40–46వచనాలు చూడండి).
2 తిమోతి 3:13–17 కూడా చూడండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 50:13–24
ఆత్మ చేత బోధకులు మరియు అభ్యాసకులు కలిపి బోధించబడతారు.
మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 50:13–24 చదవడానికి ఒక విధానమేదనగా, ఒక బోధకుడు మరియు ఒక అభ్యాసకుని చిత్రాన్ని గీసి, వారి ప్రక్కన ఈ వచనాలలో సువార్త అభ్యాసము మరియు బోధన గురించి మీకు బోధించే పదాలు మరియు వాక్యభాగాల జాబితా చేయడం. బోధన మరియు అభ్యాసములో ఆత్మ యొక్క ప్రాముఖ్యతను మీకు బోధించిన అనుభవాలను మీరెప్పుడు కలిగియున్నారు? ఒక సువార్త అభ్యాసకునిగా మరియు బోధకునిగా మీ ప్రయత్నాలను మెరుగుపరచుకోవడానికి మీరు ఏమి చేయగలరో ఆలోచించండి.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 49:2.“సత్యమంతటినీ కాకుండా, అందులో కొంత భాగాన్నే తెలుసుకోవాలని కోరుకోవడానికి” గల అర్థమేమిటి? మీరు కొంతభాగం మూసియున్న చిత్రాన్ని చూపించి, కుటుంబ సభ్యులు అదేమిటో ఊహించేలా చేయవచ్చు. మనం సత్యములో కొంతభాగాన్ని మాత్రమే అంగీకరించినప్పుడు ఏమి జరుగుతుంది? (2 నీఫై 28:29 చూడండి). సువార్త యొక్క సంపూర్ణత మనకేవిధంగా ఒక దీవెన వంటిది?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 49:26–28.“నేను మీకు ముందుగా వెళ్ళి, మీ బహుమానముగా నుండెదను; నేను మీమధ్య నుందును” అనే ప్రభువు యొక్క వాగ్దానము చేత మనమేవిధంగా దీవించబడ్డాము? ప్రభువు “(వారి) ముందు వెళ్ళడాన్ని” లేక ఆయన “(వారి) మధ్య ఉండడాన్ని” వారు భావించినప్పటి అనుభవాలను కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 50:23–25.సిద్ధాంతము మరియు నిబంధనలు 50:23–25 చదవడానికి మీరు ఒక చీకటిగదిలో సమకూడవచ్చు మరియు ఒకదాని తర్వాత ఒకటిగా క్రొవ్వొత్తులను వెలిగిస్తూ లేక లైట్లను ఆన్‌చేస్తూ క్రమక్రమంగా ఎక్కువ వెలుగును జోడించవచ్చు. ప్రొద్దున సూర్యోదయాన్ని చూస్తూ కూడా మీరు ఈ వచనాలను చదువవచ్చు. మన సువార్త వెలుగు ఎదగడాన్ని కొనసాగించడానికి మనమేమి చేయగలము? వారములో సువార్త గురించి ఏదైనా క్రొత్తదానిని కుటుంబ సభ్యులు నేర్చుకున్నప్పుడు ఒక చీటి వ్రాసి, దానిని ఒక దీపానికి లేదా ఇంటిలో ఉన్న వేరే లైటుకు అంటించడం ద్వారా కుటుంబముతో దానిని పంచుకోవడానికి వారిని ప్రోత్సహించండి.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 50:40–46.సిద్ధాంతము మరియు నిబంధనలు 50:40–46 చదివిన తర్వాత, ఈ సారాంశముతో పాటు ఉన్న రక్షకుని చిత్రాన్ని చూపించి, ఇటువంటి ప్రశ్నలు మీరు అడగవచ్చు: రక్షకుడు గొర్రెలను ప్రేమిస్తారని మీరెలా చెప్పగలరు? రక్షకుడు మనకు ఏలాగు కాపరి వంటివాడు? లేఖనాలలోని ఏ వాక్యభాగాలు రక్షకుడు ఒక కాపరియని, మనము ఆయన గొర్రెలమనే ఆలోచనను ప్రతిబింబిస్తాయి?
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.
సూచించబడిన పాట: “Shine On,” Children’s Songbook, 144.