2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
మే 3–9. సిద్ధాంతము మరియు నిబంధనలు 46–48: “శ్రేష్టమైన బహుమానములను ఆసక్తితో వెదకుడి”


“మే 3–9. సిద్ధాంతము మరియు నిబంధనలు 46–48: ‘శ్రేష్టమైన బహుమానములను ఆసక్తితో వెదకుడి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“మే 3–9. సిద్ధాంతము మరియు నిబంధనలు 46-48,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

చిత్రం
కొలను వద్ద కలుసుకుంటున్న జనులు

దండు కలుసుకొనుట, వర్తింగ్టన్ విట్రెడ్జ్ చేత

మే 3–9

సిద్ధాంతము మరియు నిబంధనలు 46–48

“శ్రేష్టమైన బహుమానములను ఆసక్తితో వెదకుడి”

మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 46–48 చదువుతున్నప్పుడు, మీరు పొందే మనోభావాలను వ్రాయండి. అప్పుడు మీరు ఎల్డర్ రిఛర్డ్ జి. స్కాట్ సూచించినట్లుగా, “నేను తెలుసుకోవలసినది ఇంకేమైనా ఉన్నదా?” అని అడగవచ్చు(“To Acquire Spiritual Guidance,” Ensign or Liahona, Nov. 2009, 8).

మీ మనోభావాలను నమోదు చేయండి

పార్లీ పి. ప్రాట్, ఆలీవర్ కౌడరీ, జిబా పీటర్సన్ మరియు పీటర్ విట్మర్ జూ. కర్ట్‌లాండ్‌ను వదిలి, సేవచేయడానికి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, పరివర్తన చెందిన వారిలో అత్యంత ఉత్సాహమున్నప్పటికీ అతికొద్ది అనుభవము లేక నడిపింపు గల వందమందిని వారు విడిచివెళ్ళారు. సూచనిలిచ్చే చేతిపుస్తకాలు లేవు, నాయకత్వ శిక్షణా సమావేశాలు లేవు, సర్వసభ్య సమావేశ ప్రసారాలు లేవు—వాస్తవానికి, పంచుకోవడానికి మోర్మన్ గ్రంథ ప్రతులు కూడా ఎక్కువ లేవు. ఆత్మ యొక్క అద్భుతమైన ప్రత్యక్షతలు, ప్రత్యేకించి క్రొత్త నిబంధన చదవడం ద్వారా వారు తెలుసుకున్నవి వాగ్దానం చేయబడడం ద్వారా ఈ క్రొత్త విశ్వాసులలో అనేకమంది పునఃస్థాపించబడిన సువార్త వైపు ఆకర్షించబడ్డారు (ఉదాహరణకు, 1 కొరింథీయులకు 12:1–11 చూడండి.) త్వరలో—నేలపై పడడం లేక పాములా మెలికలు తిరగడం వంటివి— ఆరాధన యొక్క అసాధారణ వ్యక్తీకరణలు వారి సంఘ సమావేశాలలో పరిచయం చేయబడ్డాయి. ఏవి ఆత్మ యొక్క ప్రత్యక్షతలో, ఏవి కావో తెలుసుకోవడం అనేకమందికి కష్టతరమనిపించింది. ఈ గందరగోళాన్ని చూసి, జోసెఫ్ స్మిత్ సహాయం కొరకు ప్రార్థించారు. జనులు ఆత్మ యొక్క విషయాలను తరచు నిరాకరిస్తున్న లేక నిర్లక్ష్యం చేస్తున్న నేడు కూడా ప్రభువు యొక్క జవాబు అంతే విలువైనది. ఆత్మీయ ప్రత్యక్షతలు నిజమైనవని ప్రభువు బయల్పరిచారు మరియు అవి ఏమిటో స్పష్టం చేసారు—అవి ప్రియమైన పరలోక తండ్రి నుండి బహుమానములు, “(ఆయనను) ప్రేమించి, (ఆయన) ఆజ్ఞలన్నింటిని గైకొనువారి మేలు కొరకు అనుగ్రహింపబడినవి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 46:9).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 46:1–6

ఆసక్తితో వెదకు వారందరు ప్రభువు యొక్క సంఘములో ఆరాధించడానికి ఆహ్వానితులు.

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క సమావేశాలు ప్రపంచంలోనే అత్యంత స్వాగతించబడే, ప్రేరేపించబడే కూడికలు కావాలి. మన సమావేశాలకు హాజరయ్యే వారిని ఎలా ఆదరించాలని సిద్ధాంతము మరియు నిబంధనలు 46:1–6లో ప్రభువు మనకు ఉపదేశించారు? మీ వార్డు ఆరాధనా సేవలలో మీ స్నేహితులు మరియు మీ పొరుగువారు స్వాగతించబడినట్లు భావించారా? మీ సంఘ సమావేశాలను, జనులు తిరిగి రావాలని కోరుకునే ప్రదేశాలుగా చేయడానికి మీరేమి చేస్తున్నారు? సంఘ సమావేశాలలో పరిశుద్ధాత్మను అనుసరించడానికి మీ ప్రయత్నాలు ఏవిధంగా మీ అనుభవాన్ని ప్రభావితం చేస్తాయో ధ్యానించండి.

3 నీఫై 18:22–23; మొరోనై 6:5–9 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 46:7–33

ఆయన పిల్లలను దీవించడానికి దేవుడు ఆత్మీయ బహుమానాలను ఇచ్చారు.

ప్రారంభ పరిశుద్ధులు ఆత్మీయ బహుమానాలను నమ్మారు, కానీ వాటి ఉద్దేశము గురించి వారికి కొంత నడిపింపు అవసరమైంది. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 46:7–33 ఉపయోగించి ఆత్మ యొక్క వరముల గురించి చదివినప్పుడు, “అవి ఎందుకు అనుగ్రహింపబడినవో మీరు ఎల్లప్పుడు (జ్ఞాపకముంచుకొనుట)” (8వ వచనము) ఎందుకు ముఖ్యమైనదో ధ్యానించండి. ఎల్డర్ రాబర్ట్ డి. హేల్స్ నుండి ఈ వ్యాఖ్యానానికి ఈ వచనాలు ఎలా అన్వయించబడతాయో పరిగణించండి: “క్రీస్తుపట్ల విశ్వాసంగా ఉన్న వారికి ఈ బహుమానాలు ఇవ్వబడ్డాయి. సువార్త సత్యాలను తెలుసుకోవడానికి మరియు బోధించడానికి అవి మనకు సహాయపడతాయి. ఇతరులను దీవించడానికి అవి మనకు సహాయపడతాయి. అవి మనల్ని తిరిగి మన పరలోక తండ్రి వైపు నడిపిస్తాయి” (“Gifts of the Spirit,” Ensign, Feb. 2002, 16). ఆత్మీయ ప్రత్యక్షతల గురించి ఈ వచనముల నుండి మీరింకేమి నేర్చుకుంటారు? “మోసగించబడకుండునట్లు” ఈ సత్యాలు మీకెలా సహాయపడతాయి? (8వ వచనము).

ఆత్మీయ బహుమానాలు ఏమిటి మరియు వాటిని మీరు “దేవుని పిల్లల మేలుకొరకు” (26వ వచనము) ఎలా ఉపయోగించగలరో ధ్యానించండి. మీరు గోత్రజనకుని దీవెనను కలిగియున్నట్లయితే, మీకివ్వబడిన బహుమానాలను బహుశా అది గుర్తించవచ్చు.

Gospel Topics, “Spiritual Gifts,” topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 47

చరిత్రను వ్రాసియుంచాలని తన సంఘమును ప్రభువు కోరుతున్నారు.

సంఘము యొక్క చరిత్రను వ్రాసియుంచడానికి జాన్ విట్మర్ యొక్క పిలుపు దేవుని జనుల మధ్య గ్రంథకర్తల సుదీర్ఘ ఆచారాన్ని కొనసాగించింది (2 నీఫై 29:11–12; మోషే 6:5; అబ్రాహాము 1:28, 31 చూడండి). వాస్తవానికి, సంఘ చరిత్రకారుడు లేక గ్రంథకర్త యొక్క స్థానము నేటికీ ఉంది. చరిత్రను వ్రాసియుంచడం ప్రభువుకు ఎందుకంత ముఖ్యమైనదని మీరనుకుంటున్నారు? 47వ ప్రకరణములో ఈ నియామకము గురించి జాన్ విట్మర్‌కు ఆయన సూచనలను మీరు చదువుతున్నప్పుడు, దీనిని ధ్యానించండి. ఏ వ్యక్తిగత అనుభవాలను మీరు నమోదు చేయాలో కూడా పరిగణించండి. ఉదాహరణకు, భద్రపరచబడాలని మీరు కోరుకొనేలా ప్రభువు మీకు ఏమి బోధించారు?

మీరు ఈ ప్రశ్నలను ధ్యానించినప్పుడు, డెబ్బది యొక్క ఎల్డర్ మార్లిన్ కె. జెన్సెన్ నుండి ఈ అంతరార్థమును పరిగణించండి, ఆయన 2005 నుండి 2012 వరకు సంఘ చరిత్రకారునిగా, గ్రంథకర్తగా సేవచేసారు:

“జ్ఞాపకముంచుకోవడానికి మాకు సహాయపడేందుకు మేము గ్రంథాలను భద్రపరుస్తాము. … దేవుడు తన పిల్లల కొరకు చేసిన గొప్ప సంగతులను జ్ఞాపకముంచుకోవడానికి సంఘ సభ్యులకు సహాయపడాలని మేము కోరుకుంటాము. … గతం నుండి పాఠాలు ప్రస్తుతముతో మన పోరాటంలో మనకు సహాయపడతాయి మరియు మన భవిష్యత్తు కొరకు మనకు నిరీక్షణనిస్తాయి” (“There Shall Be a Record Kept among You,” Ensign, Dec. 2007, 28, 33).

చిత్రం
జాన్ విట్మర్

సంఘము యొక్క చరిత్రను వ్రాసియుంచడానికి జాన్ విట్మర్ పిలువబడ్డాడు.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 46:2–6.మన సంఘ సమావేశాల్లో ఇతరులు స్వాగతించబడినట్లు భావించేలా నిశ్చయపరచడానికి ఒక కుటుంబంగా మనమేమి చేయగలము? (3 నీఫై 18:22–23 కూడా చూడండి). ఈ సారాంశముతో పాటు ఉన్న చిత్రపటము ఈ చర్చను అధికం చేస్తుంది.

సిద్ధాంతము మరియు నిబంధనలు 46:7–26.మనం ఒకరిలో ఒకరం ఏ ఆత్మీయ బహుమానాలను చూస్తాము? ఆ బహుమానాలు మన కుటుంబాన్ని ఏవిధంగా దీవించగలవు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 47.వారమంతా వారి వ్యక్తిగత చరిత్రలను వ్రాయమని మీ కుటుంబాన్ని మీరెలా ప్రోత్సహించగలరు? మీరు మీ వ్యక్తిగత దినచర్య పుస్తకము నుండి కొంత పంచుకోవచ్చు లేక ఒక పూర్వీకుని గురించిన కథను పంచుకోవచ్చు. ప్రతి ఒక్కరు వారి దినచర్య పుస్తకాల్లో వ్రాయడానికి కొన్ని కుటుంబాలు ప్రతివారం కొన్ని నిముషాలు కేటాయిస్తాయి. దినచర్య పుస్తకంలో వ్రాయడానికి, “ఈ వారంలో జరిగినదేది నీ మనుమలు తెలుసుకోవాలని నువ్వు కోరుతున్నావు?” లేక “ఈ వారం నీ జీవితంలో ప్రభువు యొక్క హస్తాన్ని నువ్వెలా చూసావు?” వంటి ప్రేరణలను మీరు అందించవచ్చు. చిన్నపిల్లలు వారి అనుభవాలను బొమ్మలుగా గీయవచ్చు లేక వారి కథలను చెప్తూ మీరు వాటిని నమోదు చేయవచ్చు. “క్రమ చరిత్ర” వ్రాసియుంచడం వలన ఏ దీవెనలు వస్తాయి? (1వ వచనము).

సిద్ధాంతము మరియు నిబంధనలు 48.తూర్పు సంయుక్త రాష్ట్రాల నుండి ఒహైయోకు వస్తున్న వారితో తమ భూమిని పంచుకోవాలని ఒహైయోలోని పరిశుద్దులు ఆజ్ఞాపించబడ్డారు. ఇతరుల అవసరాలు తీర్చడానికి మనమేమి పంచుకోగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “Have I Done Any Good?Hymns, no. 223.

మన బోధనను మెరుగుపరచుట

కథలు మరియు ఉదాహరణలను ఉపయోగించండి. సువార్త సూత్రాలను బోధించడానికి రక్షకుడు తరచు కథలు మరియు ఉపమానాలను ఉపయోగించారు. మీ జీవితం నుండి ఒక సువార్త సూత్రము మీ కుటుంబానికి అన్వయించబడేలా చేయగల మాదిరులను, వృత్తాంతములను ఆలోచించండి (Teaching in the Savior’s Way, 22 చూడండి).

చిత్రం
సంఘము వద్దనున్న జనులు

ఇతరుల జీవితాలను దీవించడానికి పరలోక తండ్రి తన పిల్లలకు ఆత్మీయ బహుమానాలను ఇస్తారు.

ముద్రించు