2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
మే 17–23. సిద్ధాంతము మరియు నిబంధనలు 51–57: “విశ్వాసము, నీతి, తెలివి గల గృహనిర్వాహకుడు”


“మే 17–23. సిద్ధాంతము మరియు నిబంధనలు 51-57: ‘విశ్వాసము, నీతి, తెలివి గల గృహనిర్వాహకుడు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“మే 17–23. సిద్ధాంతము మరియు నిబంధనలు 51-57,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

చిత్రం
ఎద్దులతో రైతు

First Furrow (మొదటి నాగలిచాలు), జేమ్స్ టేలర్ హార్వుడ్ చేత

మే 17–23

సిద్ధాంతము మరియు నిబంధనలు 51–57

“విశ్వాసము, నీతి, తెలివి గల గృహనిర్వాహకుడు”

లేఖనాలను అధ్యయనం చేయడం ప్రభువు యొక్క స్వరాన్ని గుర్తించడానికి మీకు సహాయపడుతుంది, ఎందుకనగా లేఖనాలు ఆయన ఆత్మ ద్వారా ఆయన చేత ఇవ్వబడ్డాయి (సిద్ధాంతము మరియు నిబంధనలు 18:34–36 చూడండి).

మీ మనోభావాలను నమోదు చేయండి

1830లో సంఘ సభ్యులకు, పరిశుద్ధులను సమకూర్చుట మరియు సీయోను పట్టణాన్ని నిర్మించుట వంటివి ఆత్మీయమైన, అదేవిధంగా భౌతికమైన కార్యాలు, వాటితోపాటు చేయవలసిన ఆచరణాత్మకమైన విషయాలు అనేకమున్నాయి: పరిశుద్దులు స్థిరపడగలిగేలా ఒకరు భూములను కొని, పంపిణీ చేయాలి. ఒకరు పుస్తకాలను, ఇతర ప్రచురణలను ముద్రించాలి. మరొకరు సీయోనులో ఉన్నవారి కోసం వస్తువులు అందించడానికి ఒక అంగడి తెరవాలి. సిద్ధాంతము మరియు నిబంధనలు 51–57లో నమోదు చేయబడిన బయల్పాటులలో, ఈ పనులు నిర్వహించమని ప్రభువు జనులను నియమించి, ఆదేశించారు మరియు ఆయన ఇండిపెండెన్స్, మిస్సోరిని సీయోను “కేంద్ర ప్రదేశము”గా గుర్తించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 57:3)

కానీ భూములు కొనడం, ముద్రణ మరియు అంగడి నడపడం వంటివాటిలో నైపుణ్యాలు సీయోనును నిర్మించే భౌతిక కార్యంలో విలువైనవి అయినప్పటికీ, సీయోను జనులుగా పిలువబడేందుకు ఆత్మీయంగా యోగ్యులు కావాలని ప్రభువు తన పరిశుద్ధులను కోరుకున్నారని కూడా ఈ బయల్పాటులు బోధిస్తాయి. నలిగిన ఆత్మ కలిగి, మనకు నియమించబడిన బాధ్యతలలో “స్థిరముగా నిలిచియుండి,” మనలో ప్రతి ఒక్కరిని “విశ్వాసము, నీతి, తెలివి గల గృహనిర్వాహకునిగా” అవ్వమని ఆయన పిలుస్తున్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 51:19; 52:15; 54:2 చూడండి). మన భౌతిక నైపుణ్యాలతో సంబంధం లేకుండా మనం దానిని చేయగలిగినట్లయితే, సీయోనును నిర్మించడానికి ప్రభువు మనల్ని ఉపయోగించగలరు మరియు ఆయన “యుక్తకాలమందు పట్టణ నిర్మాణమును త్వరపెట్టును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 52:43).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 51

విశ్వాసము, నీతి, తెలివి గల గృహనిర్వాహకునిగా అవ్వమని ప్రభువు నన్ను కోరుతున్నారు.

మీరు 1831లో సంఘ సభ్యులైనట్లయితే, బిషప్పు ద్వారా మీ ఆస్థిని సంఘానికి అప్పగించి, సమర్పణ చట్టాన్ని జీవించడానికి మీరు ఆహ్వానించబడియుండేవారు. ఎక్కువ సందర్భాలలో మీరు విరాళమిచ్చిన దానిని ఆయన మీకు తిరిగి ఇస్తారు, కొన్నిసార్లు అదనంగా కొంత ఇస్తారు. కానీ ఇకపై అది మీరు కలిగియున్నది మాత్రమే కాదు—అది మీ గృహనిర్వాహకత్వము.

నేటి పద్ధతులు వేరు, కానీ సమర్పణ మరియు గృహనిర్వాహకత్వము యొక్క సూత్రాలు ఇప్పటికీ ప్రభువు కార్యానికి ముఖ్యమైనవి. ఎల్డర్ క్వింటిన్ ఎల్. కుక్ నుండి ఈ మాటలను పరిగణించండి: “మనం దేవునికి జవాబుదారులం కాదని, మనకోసం లేక ఇతరుల కోసం వ్యక్తిగత బాధ్యతను లేక గృహనిర్వాహకత్వాన్ని మనం కలిగిలేమని అనేకమంది నమ్ముతున్న అపాయకరమైన కాలాల్లో మనం జీవిస్తున్నాము. ప్రపంచంలో అనేకమంది వ్యక్తిగత ఆనందంపై దృష్టి కేంద్రీకరించారు … మరియు వారు తమ సహోదరుని కావలివారని నమ్మడం లేదు. ఏమైనప్పటికీ, సంఘములో ఈ గృహనిర్వాహకత్వాలు ఒక పరిశుద్ధ బాధ్యత అని మేము నమ్ముతున్నాము” (“Stewardship—a Sacred Trust,” Ensign or Liahona, Nov. 2009, 91).

మీరు 51వ ప్రకరణము చదువుతున్నప్పుడు, దేవుడు మీకు అప్పగించిన వాటి గురించి ఆలోచించండి. (19వ వచనము)లో “గృహనిర్వాహకుడు” మరియు (5వ వచనము)లో “ప్రతిష్ఠించిన” అనే పదాలకు అర్థం ఏమిటి? దేవుడు మీ నుండి ఆశించిన దాని గురించి అవి ఏమి సూచిస్తున్నాయి? గృహనిర్వాహకుడు అంటే అర్థాన్ని మీకు బోధించేలా 51వ ప్రకరణములో మరియు ఎల్డర్ కుక్ మాటల్లో ఏ సూత్రాలను మీరు కనుగొంటారు? (ప్రత్యేకించి 9, 15–20 వచనాలు చూడండి).

మత్తయి 25:14–30 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 52:14–19

మోసాన్ని తప్పించుకోవడానికి దేవుడు ఒక నమూనాను ఇచ్చాడు.

అనేకమంది ఆత్మీయ ప్రత్యక్షతల గురించి వాదిస్తుండడంతో, ప్రారంభ పరిశుద్ధులు మోసపోవడం గురించి చింతించారు. “(దేవుని) చేత ఎవరు అంగీకరించబడతారో” వారెలా చెప్పగలరు? (15వ వచనము). సిద్ధాంతము మరియు నిబంధనలు 52:14–19లో, ప్రభువు ఒక సహాయకరమైన నమూనా ఇచ్చారు. లోకంలోని అబద్ధ సందేశాలను గుర్తించడానికి మీరు ఈ నమూనాను ఎలా అన్వయించగలరు? మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవడానికి కూడా మీరు ఈ నమూనాను ఉపయోగించవచ్చు: “నేను మాట్లాడినప్పుడు, నా ఆత్మ నలిగియున్నదా?” వంటి ప్రశ్నలు వ్రాయడానికి ఈ వచనాల నుండి వాక్యభాగాలను ఉపయోగించడాన్ని పరిగణించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 54

ఇతరుల ఎంపికల చేత నేను బాధించబడినప్పుడు, నేను ప్రభువు తట్టు తిరుగగలను.

ఒహైయోలో సమకూడుటలో భాగంగా, న్యూయెల్ నైట్ చేత నడిపించబడిన పరిశుద్ధుల సమూహమొకటి న్యూయార్క్‌లోని కోల్స్‌విల్ నుండి వచ్చింది మరియు వారు ఉండడానికి ఒక స్థలం అవసరమయ్యింది. లేమన్ కోప్లీకి కర్ట్‌లాండ్ దగ్గరలో పెద్ద పొలం ఉంది మరియు తన స్థలంలో పరిశుద్ధులు స్థిరపడడానికి అనుమతిస్తానని అతడు నిబంధన చేసాడు. ఏమైనప్పటికీ, వారు అక్కడ స్థిరపడడం ప్రారంభించిన కొద్దికాలానికి కోప్లీ తన విశ్వాసంలో ఊగిసలాడాడు మరియు తన నిబంధనను మీరి, పరిశుద్ధులను తన స్థలం నుండి గెంటివేసాడు.

54వ ప్రకరణంలో నమోదు చేయబడినట్లు, ఈ పరిస్థితిలో పరిశుద్ధులు ఏమి చేయాలో ప్రభువు న్యూయెల్ నైట్‌కు చెప్పారు. ఇతరులు మీరిన ఒడంబడికలు లేక వారు చేసిన ఇతర చెడు ఎంపికలు మిమ్మల్ని ప్రభావితం చేసినప్పుడు, మీకు సహాయపడేలా ఈ బయల్పాటులో మీరేమి కనుగొంటారు?

చిత్రం
పచ్చని పొలము

సంఘానికిస్తానని లేమన్ కోప్లీ వాగ్దానం చేసిన ఒహైయోలోని పొలము యొక్క ప్రదేశము.

సిద్ధాంతము మరియు నిబంధనలు 56:14–20

హృదయశుద్ధి గలవారు ధన్యులు.

ఈ వచనాలలో ప్రభువు ధనవంతులు మరియు బీదవారు ఇరువురితో మాట్లాడారు; ఈ రెండు సమూహాలకు ఆయనిచ్చిన ఉపదేశాన్ని పోల్చి చూడడం ఆసక్తికరంగా ఉండవచ్చు. ఈ వచనాలలో ఉన్నదేది వ్యక్తిగతంగా మీకు సంబంధించినదని భావిస్తున్నారు? సంపదలపై దృష్టి కేంద్రీకరించడం ఏవిధంగా మీ ఆత్మను “చెరిపివేస్తుంది”? (16వ వచనము). మీ దృష్టిలో భౌతిక వస్తువులకు సంబంధించి “హృదయశుద్ధి” (18వ వచనము) కలిగియుండడమంటే అర్థమేమిటి?

జేకబ్ 2:17–21 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 51:9.కుటుంబము ఆనందించే ఒక ఆటను మీరు ఆడవచ్చు, తర్వాత అందులో ఎవరైనా మోసం చేస్తే ఆట ఎలా ఉండియుండేదని మాట్లాడవచ్చు. ఒకరితోనొకరు “నిజాయితీగా వ్యవహరించడం” ఎందుకు ముఖ్యము? “ఒక్కటిగా ఉండడానికి” నిజాయితీ మనకెలా సహాయపడుతుంది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 52:14–19.ఈ వచనాలలో వివరించబడిన నమూనాను మీరు చర్చిస్తున్నప్పుడు, మీరు ఉపయోగించే—బట్టలు కుట్టడం లేక కళాకృతిని తయారు చేయడం వంటి ఇతర నమూనాలను చూడడాన్ని మీ కుటుంబము ఆనందించవచ్చు. మోసాన్ని తప్పించుకోవడానికి ప్రభువు ఇచ్చిన నమూనా గురించి మాట్లాడుతూ ఒక నమూనా నుండి ఏదైనా తయారు చేయడానికి మీరు కలిసి పనిచేయవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 53:1.సిడ్నీ గిల్బర్ట్ వలె మీరు, “మీ పిలుపు గురించి” ప్రభువును అడిగిన అనుభవాన్ని మీ కుటుంబంతో పంచుకోవడాన్ని పరిగణించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 54:2; 57:6–7.దేవుడు మనల్ని చేయమని అడిగిన దానిలో “స్థిరముగా నిలిచియుండడం“ (సిద్ధాంతము మరియు నిబంధనలు 54:2) అంటే అర్థమేమిటి? లేచి నిలబడి, దేవుడు వారిని చేయమని అడిగిన ఒకదానిని చెప్పమని మీరు కుటుంబ సభ్యులను ఆహ్వానించవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 55.ఒక రచయితగా, అచ్చు వేసే వ్యక్తిగా విలియం ఫెల్ప్స్ సామర్థ్యాలను ప్రభువు ఎలా వినియోగించుకున్నారు? (విలియం ఫెల్ప్స్ అనేక కీర్తనలకు సాహిత్యాన్ని అందించారు). కుటుంబ సభ్యులు ఒకరిలో ఒకరు చూసే నైపుణ్యాలు మరియు సామర్థ్యాల గురించి మాట్లాడవచ్చు. మన తలాంతులు దేవుని కార్యానికి ఎలా సహాయపడతాయి?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “‘Give,’ Said the Little Stream,” Children’s Songbook, 236.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

అధ్యయన దినచర్య పుస్తకాన్ని పెట్టుకోండి. మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు వచ్చే ఆలోచనలు, ఉపాయాలు, ప్రశ్నలు లేక మనోభావాలను వ్రాయడానికి ఒక దినచర్య పుస్తకము లేక నోటు పుస్తకమును ఉపయోగించడం మీకు సహాయపడుతుంది.

చిత్రం
ఎడ్వర్డ్ పార్ట్రిడ్జ్‌కు వస్తువులు ఇస్తున్న సభ్యులు

Bishop Partridge Receives Consecration (సమర్పణను అందుకొంటున్న బిషప్పు పార్ట్రిడ్జ్), ఆల్బన్ వెసెల్కా చేత

ముద్రించు