2023 క్రొత్త నిబంధన
జూలై 3-9. అపొస్తలుల కార్యములు 1–5: “మీరు నాకు సాక్షులైయుందురు”


“జూలై 3-9. అపొస్తలుల కార్యములు 1–5: ‘మీరు నాకు సాక్షులైయుందురు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“జూలై 3-9. అపొస్తలుల కార్యములు 1-5,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
నది ఒడ్డున ఉన్న మరియు నదిలో బాప్తిస్మము పొందుతున్న జన సమూహము

పెంతుకోస్తు దినము, సిడ్నీ కింగ్ చేత

జూలై 3-9

అపొస్తలుల కార్యములు 1–5

“మీరు నాకు సాక్షులైయుందురు”

మీరు అపొస్తలుల కార్యములు 1–5 అధ్యయనము చేసినప్పుడు, మీ జీవితం కొరకు తగిన సత్యములను కనుగొనుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని ప్రేరేపించగలదు. మిమ్మల్ని ఆకట్టుకొన్న వచనాలను గమనించండి మరియు మీరు నేర్చుకొన్న దానిని పంచుకొనుటకు అవకాశముల కొరకు చూడండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

యేసు తన తండ్రి వద్ద ఆరోహణుడవుతుండగా మిగిలిన అపొస్తలులతో కలిసి పేతురు “ఆకాశము వైపు తేరి చూచినప్పుడు”, అతడు ఏమి ఆలోచిస్తున్నాడు మరియు భావిస్తున్నాడోనని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపడ్డారా? (అపొస్తలుల కార్యములు 1:10). దేవుని కుమారుని చేత స్థాపించబడిన సంఘము ఇప్పుడు పేతురు సంరక్షణలో ఉన్నది. “సమస్త జనులకు బోధించు” (మత్తయి 28:19) ప్రయత్నమును నడిపించు కార్యము ఇప్పుడు పేతురు బాధ్యతగా ఉన్నది. అయితే, అతడు తగనట్లు లేదా భయపడినట్లు భావించాడా అనడానికి అపొస్తలుల కార్యముల గ్రంథములో ఎటువంటి ఆధారాలు మనకు కనబడవు. మనము కనుగొనేది నిర్భయముగల సాక్ష్యము మరియు పరివర్తన, అద్భుతమైన స్వస్థతలు, ఆత్మీయ ప్రత్యక్షతలు, మరియు సంఘము కొరకు ప్రాముఖ్యమైన అభివృద్ధి యొక్క మాదిరులు. ఇది ఇప్పటికీ రక్షకుని సంఘమే, ఆయన చేత ఇంకా నడిపించబడుతున్నది. వాస్తవానికి, అపొస్తలుల కార్యముల గ్రంథము ఆయన అపొస్తలుల ద్వారా యేసు క్రీస్తు యొక్క క్రియలుగా కూడా పిలువబడగలదు. ఆత్మ యొక్క క్రుమ్మరింపు చేత నడిపించబడి, పేతురు ఇక గలిలయ సముద్ర తీరముల వద్ద యేసు కనుగొనిన నిరక్షరాస్యుడైన జాలరి కాదు. లేదా కేవలము కొద్ది వారముల క్రితం నజరేతు యొక్క యేసును ఎరుగనని నిరాకరించినందు వలన తీవ్రముగా విలపించి, విషాదం నిండిన వ్యక్తి కాదు.

అపొస్తలుల కార్యముల గ్రంథములో, యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి శక్తివంతమైన ప్రకటనలను మీరు చదువుతారు. సువార్త మీతో కలిపి—జనులను—వారు కాగలరని దేవుడు ఎరిగిన సాహసముగల శిష్యులుగా ఎలా మార్చగలదో కూడా మీరు చూస్తారు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత అధ్యయనము కొరకు ఉపాయములు

అపొస్తలుల కార్యములు 1:1–8, 15–26; 2:1–42; 4:1–13, 31–33

యేసు క్రీస్తు తన సంఘమును పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తారు.

అపొస్తలుల కార్యముల గ్రంథము రక్షకుడు ఆరోహణమైన తరువాత యేసు క్రీస్తు సంఘమును స్థాపించుటకు అపొస్తులుల ప్రయత్నాలను నమోదు చేయును. యేసు క్రీస్తు ఇక భూమి మీద లేనప్పటికీ, ఆయన సంఘమును పరిశుద్ధాత్మ ద్వారా బయల్పాటు చేత నడిపిస్తారు. క్రింది వాక్యభాగములను మీరు పునర్వీక్షించినప్పుడు క్రీస్తు సంఘము యొక్క క్రొత్త నాయకులను పరిశుద్ధాత్మ ఎలా నడిపించాడో ఆలోచించండి: అపొస్తలుల కార్యములు 1:1–8, 15–26; 2:1–42; 4:1–13, 31–33.

క్రీస్తు సంఘము యొక్క సభ్యులుగా నేడు—యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించుటకు, అవసరంలో ఉన్నవారి పట్ల శ్రద్ధ చూపుటకు, క్రీస్తు నొద్దకు రమ్మని ఇతరులను ఆహ్వానించుటకు మరియు నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకం చేయుటకు రక్షణ మరియు ఉన్నతస్థితి కార్యములో పాల్గొనే బాధ్యత మనలో ప్రతిఒక్కరికి ఉంది (General Handbook1.2 చూడండి). మీ ప్రయత్నాలను నడిపించుటకు పరిశుద్ధాత్మపై మీరు ఎలా ఆధారపడగలరనే దాని గురించి ఈ ప్రాచీన అపొస్తలుల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?

బైబిలు నిఘంటువు, “పరిశుద్ధాత్మ” చూడండి.

అపొస్తలుల కార్యములు 2:36–47; 3:12–21

సువార్త యొక్క సూత్రములు మరియు విధులు క్రీస్తు నొద్దకు వచ్చుటకు నాకు సహాయపడును.

పెంతుకోస్తు దినములోని యూదుల వలె “[మీ] హృదయములో నొచ్చుకొనుటను” మీరు ఎప్పుడైనా భావించారా? (అపొస్తలుల కార్యములు 2:37). మీరు విచారించునట్లు ఏదైనా చేసియుండవచ్చు లేదా కేవలము మీ జీవితాన్ని మార్చాలని మీరు కోరవచ్చు. ఈ భావనలు కలిగినప్పుడు మీరు ఏమి చేయాలి? యూదులకు పౌలు సలహా అపొస్తలుల కార్యములు 2:38 లో కనుగొనబడినది. సువార్త యొక్క మొదటి సూత్రములు మరియు విధులు (విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తిస్మము మరియు పరిశుద్ధాత్మ వరము కలిపి —లేదా కొన్నిసార్లు క్రీస్తు యొక్క సిద్ధాంతముగా సూచించబడినవి) అపొస్తలుల కార్యములు 2:37–47 లో వ్రాయబడినట్లుగా ఈ మార్పు చెందిన వారిని ప్రభావితం చేసాయని గమనించండి.

ఇదివరకే మీరు బాప్తిస్మము పొంది, పరిశుద్ధాత్మ వరమును పొందియుండవచ్చు, కనుక క్రీస్తు యొక్క సిద్ధాంతమును అన్వయించుటను మీరు ఎలా కొనసాగిస్తారు? ఎల్డర్ డేల్ జి. రెన్లండ్ నుండి ఈ మాటలను పరిగణించండి: “పలుమార్లు … [క్రీస్తు] నందు విశ్వాసమును సాధన చేయుట, పశ్చాత్తాపపడుట, బాప్తిస్మము యొక్క నిబంధనలు, దీవెనలను క్రొత్తవిగా చేసుకొనుటకు మరియు గొప్ప స్థాయిలో స్థిరమైన సహవాసిగా పరిశుద్ధాత్మను పొందుటకు సంస్కారములో పాలుపంచుకొనుట ద్వారా మనము పరిపూర్ణులము కావచ్చు. మనము ఆవిధంగా చేసినప్పుడు, మనము క్రీస్తువలె ఎక్కువగా మారతాము మరియు అనివార్యమైన సమస్తముతో అంతము వరకు సహించగలుగుతాము” (“Latter-day Saints Keep on Trying,” Liahona, May 2015, 56).

అపొస్తలుల కార్యములు 3:19-21

“విశ్రాంతి కాలములు” మరియు “కుదురుబాటు కాలములు” ఏవి?

“విశ్రాంతి కాలములు” యేసు క్రీస్తు భూమి మీదకు తిరిగి వచ్చినప్పుడు వెయ్యేండ్ల పరిపాలనను సూచించును. “కుదురుబాటు కాలములు” సువార్త యొక్క పునఃస్థాపనను సూచించును, అది వెయ్యేండ్ల పరిపాలన కొరకు లోకమును సిద్ధపరచును.

అపొస్తలుల కార్యములు 3; 4:1–31; 5:12–42

యేసు క్రీస్తు యొక్క శిష్యులు ఆయన నామములో అద్భుతములు చేయుటకు అధికారము ఇవ్వబడ్డారు.

కుంటివాడైన మనుష్యుడు దేవాలయమునకు వచ్చు వారినుండి డబ్బును పొందాలని ఆశించాడు. కానీ ప్రభువు యొక్క సేవకులు అతనికి ఇంకా ఎక్కువ ఇవ్వజూపారు. అపొస్తలుల కార్యములు 3; 4:1–31; మరియు 5:12–42 మీరు చదివినప్పుడు, దాని తరువాత జరిగిన అద్భుతము ఈ జనులను ఎలా ప్రభావితం చేసిందో ఆలోచించండి:

  • కుంటి మనుష్యుడు

  • పేతురు మరియు యోహాను

  • దేవాలయము వద్ద గల సాక్షులు

  • ప్రధాన యాజకులు మరియు పరిపాలకులు

  • మిగిలిన పరిశుద్ధులు

చిత్రం
ఒక వ్యక్తిని స్వస్థపరుస్తున్న పేతురు

నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, వాల్టర్ రానె చేత

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

అపొస్తలుల కార్యములు 1:21–26.అపొస్తలుల కార్యములు 1:21–26 చదవడం, నేడు భూమిపై అపొస్తలులను కలిగియుండడం వలన వచ్చే దీవెనలను చర్చించడానికి మీ కుటుంబానికి సహాయపడగలదు. నేటి అపొస్తలులు మరియు ప్రవక్తలు దేవుని చేత పిలువబడ్డారనే సాక్ష్యాన్ని వారు ఎలా పొందారో కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు. ఈ సాక్ష్యము కలిగియుండుట ఎందుకు ముఖ్యమైనది?

అపొస్తలుల కార్యములు 2:37.“వారి హృదయములో నొచ్చుకొనుట” అను వాక్యభాగమునకు అర్థము ఏమైయుండవచ్చు? అటువంటి దానిని మీరెప్పుడు భావించారు? మనకు అటువంటి భావనలు కలిగినప్పుడు, “మనము ఏమి చేయాలి?” అని చెప్పుట ఎందుకు ముఖ్యమైనది?

అపొస్తలుల కార్యములు 3:1–10.ఈ వచనాలలోని వృత్తాంతమును అభినయించుటను మీ కుటుంబము ఆనందించవచ్చు. దేవాలయము వద్దనున్న మనుష్యుడు తాను ఆశించిన దానికి భిన్నంగా ఎలా దీవించబడ్డాడు? పరలోక తండ్రి యొక్క దీవెనలు ఊహించని రీతిలో మనకు వచ్చుటను మీరు ఏవిధంగా చూసియున్నారు?

అపొస్తలుల కార్యములు 3:12–26; 4:1–21; 5:12–42.పేతురు మరియు యోహాను యొక్క విశ్వాసము గురించి మిమ్మల్ని ఆకట్టుకునేది ఏమిటి? యేసు క్రీస్తును గూర్చి మన సాక్ష్యమందు మనము ధైర్యముగా ఎలా ఉండగలము? చిన్నపిల్లలు వారి సాక్ష్యాన్ని పంచుకోవడాన్ని సాధన చేయడంలో సహాయపడడాన్ని పరిగణించండి.

అపొస్తలుల కార్యములు 4:315:4.అపొస్తలుల కార్యములు 4:31–5:4 4:31–37లో వివరించినట్లుగా ఎక్కవగా కావడానికి మన కుటుంబము, వార్డు లేదా సమాజానికి మనమెట్లు సహాయపడగలము? “ఏకహృదయమును ఏకాత్మయు గలవారై” యుండుట అనగా అర్థమేమిటి? కొన్నిసార్లు ఏ విధాలుగా మనం మన వంతులో “కొంత [దాచుకుంటాము]”? ఆ విధంగా చేయడం ఎందుకు “దేవునితో [అబద్ధమాడడం]” అవుతుంది? (అపొస్తలుల కార్యములు 5:2, 4). నిజాయితీగా లేకపోవడం ఆత్మీయంగా మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

ఒక విషయమును ఎంపిక చేయండి. కలిసి అధ్యయనము చేయుటకు అపొస్తలుల కార్యములు1–5 నుండి ఒక విషయమును కుటుంబ సభ్యులు వంతులవారీగా ఎంపిక చేయనివ్వండి.

చిత్రం
పైకి చూపిస్తున్న ఇద్దరు దేవదూతల చుట్టూ ఉన్న అపొస్తలులు

ఆరోహణము, హ్యారీ ఆండర్సన్ చేత

ముద్రించు