2023 క్రొత్త నిబంధన
జూలై 24-30. అపొస్తలుల కార్యములు 16–21: “సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడు”


“జూలై 24-30. అపొస్తలుల కార్యములు 16–21: ‘సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“జూలై 24-30. అపొస్తలుల కార్యములు 16–21,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
కొండపై బోధిస్తున్న పౌలు

జూలై 24-30

అపొస్తలుల కార్యములు 16–21

“సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడు”

సువార్తను ప్రకటించుటకు పౌలు ప్రయత్నాలను గూర్చి మీరు చదివినప్పుడు, ఆలోచనలు లేదా భావనలతో ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. ఈ ప్రేరేపేణలను వ్రాసియుంచండి మరియు వాటిని అమలు చేయుటకు ప్రణాళికలు చేయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

తన అపొస్తలులకు ప్రభువు చెప్పిన చివరి మాటలలో ఈ ఆజ్ఞ గలదు, “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు మరియు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారి బోధించుడి” (మత్తయి 28:19–20). అపొస్తలులు అన్ని రాజ్యములను చేరుకోలేకపోయినప్పటికీ, పౌలు మరియు అతని సహవాసులు సంఘమును స్థాపించుటలో అసాధారణమైన పురోగతిని సాధించారని అపొస్తలుల కార్యములు 16–21 చూపును. వారు బోధించారు, బాప్తిస్మమిచ్చారు మరియు పరిశుద్ధాత్మ వరమును దయచేసారు. వారు అద్భుతాలను చేసారు, ఒక మనుష్యుని మరణము నుండి లేపారు మరియు గొప్ప విశ్వాస భ్రష్టత్వమును ముందుగా తెలిపారు (అపొస్తలుల కార్యములు 20:7–12, 28–31). వారు ప్రారంభించిన కార్యము నేడు జీవిస్తున్న అపొస్తలులతో, పేతురు ఎన్నడూ ఊహించని విధానాలలో రక్షకుని యొక్క కార్యమును నెరవేర్చుటకు సహాయపడుతున్న మీవంటి సమర్పించబడిన శిష్యులతో కొనసాగుతోంది. వారి పరలోక తండ్రిని లేదా ఆయన సువార్తను ఎరుగని జనులను బహుశా మీరు ఎరిగియున్నారు. బహుశా మీరు ఆయన గురించి మీకు తెలిసిన దానిని వారితో పంచుకొనుటకు మీ “ఆత్మ (మీలో) పరితాపము చెందుటను” (అపొస్తలుల కార్యములు 17:16) భావించియున్నారు. సువార్తను పంచుకోవడంలో మీరు పౌలు యొక్క దీనమనస్సును మరియు ధైర్యమును అనుసరించిన యెడల, “ప్రభువు హృదయము తెరిచిన” (అపొస్తలుల కార్యములు 16:14) ఎవరినైనా మీరు కనుగొనవచ్చు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

అపొస్తలుల కార్యములు 16–21

సువార్తను పంచుకొనుటకు నా ప్రయత్నాలలో ఆత్మ నన్ను నడిపించును.

ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ఇలా బోధించారు, “పరిశుద్ధాత్మ లేకుండా ఎవరూ సువార్తను ప్రకటించలేరు”(Teachings of Presidents of the Church: Joseph Smith [2007], 332). అపొస్తలుల కార్యములు 16–21 మీరు చదివినప్పుడు, ప్రవక్త యొక్క వ్యాఖ్యానము ఎందుకు నిజమైనదో ఆలోచించండి. పౌలు మరియు అతడి సహవాసులను ఆత్మ నడిపించిన సంఘటనలను గమనించండి. వారు ఆత్మను అనుసరించుట వలన కలిగిన దీవెనలేవి? సువార్తను పంచుకొనుటకు మీ ప్రయత్నములందు ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించుటను మీరెప్పుడు భావించారు?

అపొస్తలుల కార్యములు 16–21

అన్ని పరిస్థితులందు నేను సువార్తను ప్రకటించగలను.

సువార్తను ప్రకటించినందుకు చెరసాలలో వేయబడుట, ప్రకటించుటను ఆపివేయుటకు గ్రహించదగిన కారణము వలె కనబడవచ్చు. కానీ పౌలు మరియు సీలకు, అది జైలు అధికారిని మార్చుటకు ఒక అవకాశముగా మారింది (అపొస్తలుల కార్యములు 16:16–34 చూడండి). అపొస్తలుల కార్యములు 16–21 అంతటా, ప్రతీఒక్కరితో తన సాక్ష్యమును పంచుకొనుటకు పౌలు యొక్క సమ్మతిని గూర్చిన ఇతర మాదిరుల కొరకు చూడండి. అతడు అంత ధైర్యముగా మరియు నిర్భయముగా ఎందుకున్నాడని మీరనుకుంటున్నారు? పౌలు యొక్క మాదిరి నుండి మీరేమి నేర్చుకుంటారు?

అపొస్తలుల కార్యములు 16–21లో సువార్తను పంచుకొనుట గురించి ఇంకా అనేకానేక సందేశాలున్నాయి. మీరు ఈ అధ్యాయాలను చదువుతున్నప్పుడు, ప్రత్యేకంగా మీకు అన్వయించదగిన వాటి కొరకు చూడండి.

చిత్రం
పట్టుకొనబడిన బిడ్డ

మనలో ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డే.

అపొస్తలుల కార్యములు 17:16–34

“మనము దేవుని సంతానమై యున్నాము.”

ఏథెన్సులో, పౌలు భిన్న అభిప్రాయాలు మరియు మతపరమైన దృక్పథములు గల జనులను కనుగొన్నాడు. వారు ఎల్లప్పుడూ “ఏదోయొక క్రొత్త సంగతి వినుటకు” వెదకుచున్నారు, మరియు పౌలు వారికి ఇచ్చేది ఖచ్చితంగా క్రొత్తది (అపొస్తలుల కార్యములు 17:19–21 చూడండి). “తెలియబడని దేవుడు” (అపొస్తలుల కార్యములు 17:23 ) అని వారు పిలిచిన వానిని కలిపి, వారు అనేక దేవుళ్ళను పూజించారు, కానీ వారు దేవుళ్ళు అధికారములు లేదా శక్తులు అని, జీవము గల వ్యక్తులు కాదని మరియు నిశ్చయముగా మన తండ్రి కాదని నమ్మారు. దేవుడిని తెలుసుకోవడానికి వారికి సహాయపడేందుకు పౌలు ఏమి చెప్పాడో ధ్యానించండి. మీ ఉద్దేశ్యములో “దేవుని సంతానముగా” ఉండుట అనగా అర్థమేమిటి? (అపొస్తలుల కార్యములు 17:29). మీ అభిప్రాయములో, దేవుని యొక్క బిడ్డగా ఉండుట అనునది కేవలము ఆయన సృష్టిలో ఒకరిగా ఉండుట నుండి ఎలా భిన్నముగా ఉన్నది? ఈ సత్యమును గ్రహించడం మనల్నిమరియు ఇతరులను మనము ఆదరించే విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

అతడు సాక్ష్యమిస్తున్నప్పుడు మీరు పౌలు ప్రక్కన నిలబడిన యెడల, ప్రాచీన గ్రీకు వారితో మన పరలోక తండ్రి గురించి మీరు ఏమి చెప్పియుండేవారు? మీ సాక్ష్యము వినుట నుండి ప్రయోజనము పొందగల వారెవరైనా మీకు తెలుసా?

రోమా 8:16; 1 యోహాను 5:2 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

అపొస్తలుల కార్యములు 16–21.అపొస్తలుల కార్యములు 16–21 గురించి మీ కుటుంబము యొక్క గ్రహింపును అధికం చేయడానికి, ఈ అధ్యాయాలలో పౌలు సువార్తను ప్రకటించిన పట్టణాల కొరకు చూస్తూ ఈ సారాంశం చివరన ఉన్న భౌగోళిక పటమును మీరు అధ్యయనం చేయవచ్చు. సమస్త జనములకు సువార్తను అందించుటలో సహాయపడేందుకు నేడు మనకు గల వనరులేవి?

అపొస్తలుల కార్యములు 17:10-12; 18:24-28.ఈ అధ్యాయములలోని పరిశుద్ధుల వలే ఎక్కువగా మనము ఎలా ఉండగలము? “ఆసక్తితో వాక్యమును [అంగీకరించుట]” అనగా అర్థమేమైయుండవచ్చు? (అపొస్తలుల కార్యములు 17:11). “లేఖనములందు ప్రవీణులుగా” ఉండుటకు మనము ఏమి చేయగలము? (అపొస్తలుల కార్యములు 18:24).

అపొస్తలుల కార్యములు 19:1–7.ఈ వచనాలు బాప్తిస్మము పొందుట మరియు నిర్ధారించబడుట యొక్క ప్రాముఖ్యత గురించి ఒక చర్చను ప్రారంభించుటకు మీ కుటుంబానికి సహాయపడగలవు. అపొస్తలుల కార్యములు 19:1–7లోని సత్యాలను బాగా గ్రహించడానికి, బ్యాటరీ లేని సెల్‌ఫోను వంటివి, ఒకటి లేకుండా పనికిరాని మరొక దాని గురించి మీరు చర్చించవచ్చు. లేదా ప్రవక్త జోసెఫ్ స్మిత్ నుండి ఈ బోధనను మీరు పంచుకోవచ్చు: “నీటి చేత బాప్తిస్మము సగము బాప్తిస్మము, మిగిలిన సగము లేకుండా అది ఉపయోగపడదు— అది, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము” (Teachings: Joseph Smith95). పరిశుద్ధాత్మ వరమును పొందకుండా బాప్తిస్మము ఎందుకు “పనికిరాదు”? (3 నీఫై 27:19–20; మోషే 6:59–61 చూడండి).

అపొస్తలుల కార్యములు 19:18-20. మీరు అపొస్తలుల కార్యములు 19:18-20 చదువుతున్నప్పుడు, సువార్తను హత్తుకోవడానికి జనులు ఇచ్చివేయాలనుకున్న ఆస్థుల విలువను గమనించండి (19వ వచనము చూడండి). పరలోక దీవెనలు పొందుటకు బదులుగా మనము వదిలివేయాల్సిన లోకసంబంధమైన ఆస్థులు లేదా కార్యక్రమాలున్నాయా?

అపొస్తలుల కార్యములు 20:32-35. “పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము” అనే క్రీస్తు యొక్క బోధనను మీ కుటుంబము ఎప్పుడు అనుభవించింది? (అపొస్తలుల కార్యములు 20:35). మీ కుటుంబము ఇవ్వగల సేవ, సమయము లేదా వరముల నుండి ప్రయోజనము పొందగలవారు ఎవరైనా ఉన్నారా? ఒక కుటుంబముగా, కొన్ని ఉపాయములను చర్చించండి మరియు ఎవరికైనా సేవ చేయడానికి ప్రణాళిక చేయండి. మనము ఇతరులకు సేవ చేసినప్పుడు మనము ఎలా భావిస్తాము? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ఎందుకు ఎక్కువ ఆశీర్వాదకరమైనది?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

మనోభావాలను నమోదు చేయండి. “మీరు ఆత్మీయ మనోభావాలను వ్రాసినప్పుడు, ఆయన నడిపింపుకు మీరు విలువిస్తున్నట్లు మీరు ప్రభువుకు చూపుతారు మరియు ఆయన మిమ్మల్ని మరింత తరచుగా బయల్పాటుతో దీవిస్తారు” (Teaching in the Savior’s Way, 12; 30 పేజీ కూడా చూడండి).

చిత్రం
పౌలు యొక్క సువార్తసేవ ప్రయాణముల భౌగోళికపటము

అపొస్తలుడైన పౌలు యొక్క సువార్తసేవ ప్రయాణములు.

ముద్రించు