2023 క్రొత్త నిబంధన
జూలై 10-16. అపొస్తలుల కార్యములు 6–9: “నేనేమి చేయాలని నీవు కోరుచున్నావు?”


“జూలై 10-16. అపొస్తలుల కార్యములు 6-9: ‘నేనేమి చేయాలని నీవు కోరుచున్నావు?,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“జూలై 10-16. అపొస్తలుల కార్యములు 6-9,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
నేలపై పడియున్న పౌలు

దమస్కునకు పోవు దారిలో పరివర్తన, మైఖెలాంజిలో మెరిసి డా కారవాజ్జియో చేత

జూలై 10-16

అపొస్తలుల కార్యములు 6–9

“నేనేమి చేయాలని నీవు కోరుచున్నావు?”

అపొస్తలుల కార్యములు 6–9 చదువుట ద్వారా ప్రారంభించండి. మీ స్వంత అధ్యయనంలో మీరు వేరేవాటిని కనుగొన్నప్పటికీ, ఈ అధ్యాయాలలో ముఖ్యమైన సూత్రాలలో కొన్నిటిని గుర్తించడానికి ఈ సారాంశములోని సూచనలు మీకు సహాయపడగలవు.

మీ మనోభావాలను నమోదు చేయండి

పరివర్తనకు అవకాశం లేని అభ్యర్థిగా ఎవరైనా కనిపించారంటే, బహుశా అది సౌలు కావచ్చు—క్రైస్తవులను హింసించడంలో పేరుమోసిన పరిసయ్యుడతడు. కావున సౌలును వెదకి, అతనికి ఒక దీవెన ఇవ్వమని అననీయ అనబడే శిష్యునితో ప్రభువు చెప్పినప్పుడు, అననీయ సందేహించాడు. అతడిలా అన్నాడు, “ప్రభువా, యీ మనుష్యుడు నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసియున్నాడని అతని గూర్చి అనేకులవలన వింటిని” (అపొస్తలుల కార్యములు 9:13). కానీ సౌలు హృదయాన్ని, అతని సామర్థ్యాన్ని ఎరిగిన ప్రభువు తన మనస్సులో సౌలు కొరకు ఒక కార్యమును కలిగియుండెను: “అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు” (అపొస్తలుల కార్యములు 9:15). కావున అననీయ విధేయుడయ్యాడు మరియు ఈ మాజీ హింసకుడిని కనుగొనినప్పుడు అతడు, ”సౌలా, సహోదరుడా” అని అతడిని పిలిచాడు (అపొస్తలుల కార్యములు 9:17). అంత పూర్తిగా సౌలు మారగలిగినప్పుడు, అంత ఆనందంగా అననీయ అతనికి స్వాగతమివ్వగలిగినప్పుడు, మనతోపాటుగా — ఎవరినైనా పరివర్తనకు అవకాశం లేని అభ్యర్థిగా మనము ఎప్పుడైనా యెంచవచ్చా?

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

అపొస్తలుల కార్యములు 6–8

నా హృదయము “దేవుని యెదుట సరియైనదిగా” ఉండవలెను.

సంఘము ఎదుగుతున్నదంటే, రాజ్యములో సేవచేయడానికి శిష్యుల అవసరం పెరుగుతున్నదని దానర్థము. అపొస్తలుల కార్యములు 6:1-5 ప్రకారం, వారితో పాటు సేవచేసే వారిలో పన్నెండుమంది అపొస్తలులు వెదుకుతున్న లక్షణాలేవి? మీరు అపొస్తలుల కార్యములు 6–8 చదివినప్పుడు, స్తెఫను మరియు ఫిలిప్పు వంటి వారిలో ఇవి మరియు ఇతర లక్షణాలు ఎలా నిరూపించబడ్డాయో గమనించండి. సీమోనులో ఉన్న లోపమేమిటి మరియు మారడానికి సమ్మతించడం గురించి అతని నుండి మనమేమి నేర్చుకోగలము?

మీ హృదయము “దేవుని యెదుట సరియైనదిగా” ఉన్నదని నిశ్చయపరచడానికి ఏదైనా మార్చాలని ప్రేరేపించబడినట్లు మీరు భావించారా? (అపొస్తలుల కార్యములు 8:21–22). మీరు దేవుడిని సేవించినప్పుడు, ఈ మార్పును చేయడం మిమ్మల్ని ఎలా దీవించవచ్చు?

అపొస్తలుల కార్యములు 6–7

పరిశుద్ధాత్మను ఎదిరించడం, రక్షకుడిని మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించడానికి దారితీయగలదు.

మెస్సీయ రాకడ కొరకు జనులను సిద్ధపరచు బాధ్యత యూదుల నాయకులపై ఉంది. అయినప్పటికీ, వారు మెస్సీయను గుర్తించడంలో విఫలమై, ఆయనను నిరాకరించారు. ఇదెలా జరిగింది? జవాబులో కొంత స్తెఫను మాటలలో కనుగొనబడవచ్చు: “మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు” (అపొస్తలుల కార్యములు 7:51). పరిశుద్ధాత్మను ఎదిరించడమనగా అర్థమేమిటని మీరనుకుంటున్నారు? పరిశుద్ధాత్మను ఎదిరించడం, రక్షకుడిని మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించడానికి ఎందుకు దారితీస్తుంది?

మీరు అపొస్తలుల కార్యములు 6–7 చదివినప్పుడు, యూదులకు స్తెఫను బోధించిన ఇతర సందేశాల కొరకు చూడండి. ఎటువంటి వైఖరులకు వ్యతిరేకంగా అతడు హెచ్చరిస్తున్నాడు? మీలో అటువంటి వైఖరులేవైనా మీరు గుర్తించారా? పరిశుద్ధాత్మను ఎదిరించడం వల్ల కలిగే పర్యవసానాల గురించి స్తెఫను మాటలు మీకేమి బోధిస్తున్నాయి? మీ జీవితంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణలపట్ల మీరు మరింత సున్నితంగా మరియు ప్రతిస్పందించే విధంగా ఎలా ఉండగలరు?

అపొస్తలుల కార్యములు 8:26-39

ఇతరులను యేసు క్రీస్తు వైపు నడిపించడానికి పరిశుద్ధాత్మ నాకు సహాయపడతాడు.

అపొస్తలుల కార్యములు 8:26–39 లోని వృత్తాంతము నుండి సువార్తను పంచుకోవడం గురించి మీరేమి నేర్చుకుంటారు? పరిశుద్ధాత్మ ఫిలిప్పుకు ఎలా సహాయపడ్డాడు? ఇతరులతో సువార్తను పంచుకోవడం, ఒక మార్గదర్శిగా ఉన్నట్లు ఎలా అవుతుంది? (అపొస్తలుల కార్యములు 8:31 చూడండి).

ఈ వృత్తాంతము “యేసు క్రీస్తు సువార్తను అభ్యసించుట కొరకు మరియు ఒకరికొకరు బోధించుకొనుటకు ప్రయత్నించుటకు మనందరము కలిగియున్న దివ్యమైన శాసనమును మనకు గుర్తుచేయునని ఎల్డర్ యులిసెస్ సోవారెస్ చెప్పారు. … కొన్నిసార్లు మనం ఐతియొపీయుని వలె ఉన్నాము—విశ్వాసముగా, ప్రేరేపించబడిన బోధకుని సహాయము మనకు కావలెను; మనము కొన్నిసార్లు ఫిలిప్పు వలె ఉన్నాము—ఇతరులకు బోధించి వారి పరివర్తనలో వారిని మనం బలపరచాలి” (“నేనేలాగు గ్రహించగలను?,” లియహోనా, మే 2019, 6). ఎల్డర్ సోవారెస్ సందేశములో మిగిలిన దానిని చదవడాన్ని పరిగణించండి మరియు మెరుగైన సువార్త అభ్యాసకునిగా, బోధకునిగా కావడానికి పరిశుద్ధాత్మ మీకెలా సహాయపడగలడో ధ్యానించండి.

అపొస్తలుల కార్యములు 9

ప్రభువు యొక్క చిత్తానికి నన్ను లోబరచుకున్నప్పుడు, ఆయన చేతులలో నేనొక సాధనం కాగలను.

సౌలు పరివర్తన చాలా అకస్మాత్తుగా అనిపిస్తుంది; క్రైస్తవులను చెరసాలలో బంధించడం నుండి వెంటనే అతడు సమాజమందిరాలలో క్రీస్తు గురించి ప్రకటించుచు వచ్చాడు. మీరు అతని వృత్తాంతాన్ని చదివినప్పుడు, అతడు మారడానికి ఎందుకంత సమ్మతించాడో ధ్యానించండి. ( సౌలు పరివర్తన గురించి అతని స్వంత వర్ణన చదవడానికి, అపొస్తలుల కార్యములు 22:1–16 మరియు 26:9–18 చూడండి. ఈ వృత్తాంతాలలో సౌలు పేరు పౌలుగా చెప్పబడిందని గమనించండి [అపొస్తలుల కార్యములు 13:9 చూడండి].)

సౌలు అనుభవం అసాధారణమైనదే అయినప్పటికీ—చాలామందికి, పరివర్తన అనేది దీర్ఘకాలిక ప్రక్రియ—సౌలు నుండి పరివర్తన గురించి మీరు నేర్చుకోగలిగినది ఏమైనా ఉందా? సౌలు పరివర్తన పట్ల అననీయ మరియు ఇతర శిష్యులు ప్రతిస్పందించిన తీరు నుండి మీరేమి నేర్చుకుంటారు? మీ జీవితంలో ఈ పాఠాలను అన్వయించడానికి మీరేమి చేస్తారు? సౌలు చేసినట్లుగా, “నేనేమి చేయాలని నీవు కోరుచున్నావు?” అని ప్రార్థనలో అడగడం ద్వారా మీరు ప్రారంభించవచ్చు.

అపొస్తలుల కార్యములు 9:36–42 మీరు చదివినప్పుడు, తబితా దేవుని చేతులలో ఒక సాధనంగా ఎలా ఉందో ఆలోచించండి. ఆమె మాదిరి గురించి మిమ్మల్ని ప్రేరేపించేది ఏమిటి?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

అపొస్తలుల కార్యములు 6:8; 7:51-60.అపొస్తలుల కార్యములు 6:8 మరియు అపొస్తలుల కార్యములు 7:51–60 లో ఉన్న స్తెఫను వృత్తాంతాలను లూకా 23:1–46 లో ఉన్న రక్షకుని వృత్తాంతాలతో పోల్చండి. స్తెఫను రక్షకుని మాదిరిని ఎలా అనుసరించాడు?

అపొస్తలుల కార్యములు 7:51–60. అతడు హింసింపబడుతున్నప్పుడు స్తెఫనును పరిశుద్ధాత్మ ఎలా దీవించాడు? కష్టసమయాల్లో ఎప్పుడు మనం పరిశుద్ధాత్మ నుండి బలాన్ని పొందాము?

అపొస్తలుల కార్యములు 9:5.ముల్లుకర్ర అనగా పశువులను తోలడానికి ఉపయోగించే పదునైన ఈటె. ముల్లుకర్రతో తోలినప్పుడు తరచుగా పశువులు వెనక్కి తన్నుతాయి, అది ఈటెను పశువుల శరీరంలో లోతుగా గ్రుచ్చుకొనేలా చేస్తుంది. కొన్నిసార్లు ఈ పోలిక మీకు ఎలా అన్వయించవచ్చు? ప్రభువు నుండి దిద్దుబాటును బాగా అంగీకరించడానికి మనము ఏమి చేయగలము?

చిత్రం
మరణించిన వారి నుండి తబితాను లేపుతున్న పేతురు

తబితా లెమ్ము, శాండీ ఫ్రెకల్టన్ గగోన్ చేత

అపొస్తలుల కార్యములు 9:32–43.అపొస్తలుల కార్యములు 9:32–43 లోని కథల బొమ్మలు వేయమని మీ కుటుంబ సభ్యులను ఆహ్వానించడం గురించి ఆలోచించండి. ఈ కథల నుండి నిజమైన శిష్యత్వం గురించి మనం ఏమి నేర్చుకుంటాము? తబితా వలె, “సత్‌క్రియలు బహుగా చేసిన” వారు ప్రభువు నందు విశ్వసించడానికి ఇతరులకు ఎలా సహాయపడగలరు? (అపొస్తలుల కార్యములు 9:36 చూడండి).

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

లేఖనాలను మీ జీవితానికి సరిపోల్చండి. మీరు చదివినప్పుడు, లేఖనాలలోని కథలు మరియు బోధనలు మీ జీవితానికి ఎలా అన్వయిస్తాయో ఆలోచించండి. ఉదాహరణకు, అపొస్తలుల కార్యములు 9:36–39లో తబితా చేసినట్లు, ఇతరులకు సేవచేయడానికి మీకు గల అవకాశాలేవి?

చిత్రం
మరణించు వరకు రాళ్ళతో కొట్టబడుతున్న స్తెఫను

“ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టిరి” (జోసెఫ్ స్మిత్ అనువాదము, అపొస్తలుల కార్యములు 7:59 [అపొస్తలుల కార్యములు 7:59, పాదవివరణ  లో]).

ముద్రించు