2023 క్రొత్త నిబంధన
జూలై 17-23. అపొస్తలుల కార్యములు 10–15: “దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను”


“జూలై 17-23. అపొస్తలుల కార్యములు 10–15: ‘దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“జూలై 17-23. అపొస్తలుల కార్యములు 10-15,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
కొర్నేలీతో మాట్లాడుతున్న పేతురు

జూలై 17-23

అపొస్తలుల కార్యములు 10–15

“దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను”

ఆలోచనలు మరియు భావనలతో మిమ్మల్ని ప్రేరేపించుటకు ఆత్మ కొరకు సమయాన్ని అనుమతిస్తూ, అపొస్తలుల కార్యములు 10–15 జాగ్రత్తగా చదవండి. ఈ అధ్యాయాలలో మీరు నేర్చుకోవడానికి ఏమి ఉన్నది?

మీ మనోభావాలను నమోదు చేయండి

తన మర్త్య పరిచర్యలో యేసు క్రీస్తు తరచు జనుల యొక్క దీర్ఘకాలిక ఆచారాలను, నమ్మకాలను సవాలు చేసారు. బయల్పాటు ద్వారా ఆయన తన సంఘమును నడిపించుట కొనసాగించినందున, ఆయన పరలోకములోనికి ఆరోహణమైన తరువాత ఇది ఆగలేదు. ఉదాహరణకు, యేసు యొక్క జీవితకాలమందు ఆయన శిష్యులు సువార్తను యూదులకు మాత్రమే బోధించారు. కానీ రక్షకుడు చనిపోయిన వెంటనే, పేతురు భూమిపై సంఘము యొక్క నాయకుడయ్యాడు, యూదులు కాని వారికి సువార్త ప్రకటించుటకు ఇది సరైన సమయమని యేసు క్రీస్తు పేతురుకు బయల్పరిచారు. అన్యులతో సువార్తను పంచుకునే ఆలోచన నేడు ఆశ్యర్యము కలిగించినట్లు కనబడదు, కనుక ఈ వృత్తాంతములో మనకు ఏ పాఠమున్నది? బహుశా ఒక పాఠమేదనగా, ప్రాచీన మరియు ఆధునిక సంఘము రెండింటిలో, ప్రియమైన రక్షకుడు తాను ఎంపిక చేసిన సేవకులకు నడిపింపునిస్తారు (ఆమోసు 3:7; సిద్ధాంతము మరియు నిబంధనలు 1:38 చూడండి). నిరంతర బయల్పాటు నిజమైన మరియు జీవముగల యేసు క్రీస్తు సంఘము యొక్క ముఖ్య చిహ్నముగా ఉన్నది. పేతురు వలె, మనము నిరంతర బయల్పాటును అంగీకరించుటకు సమ్మతించాలి మరియు “[ఆయన] బయల్పరచిన సమస్తము, ఇప్పుడు ఆయన బయల్పరచే సమస్తము” మరియు “దేవుని రాజ్యమునకు సంబంధించి” ఆయన ఇంకా బయల్పరచబోయే “అనేక గొప్ప, ముఖ్యమైన విషయాలు” (విశ్వాస ప్రమాణాలు 1:9) కలిపి “దేవుని యొక్క ప్రతి మాట చొప్పున” (లూకా 4:4) జీవించాలి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత అధ్యయనము కొరకు ఉపాయములు

అపొస్తలుల కార్యములు 10

“దేవుడు పక్షపాతి కాడు.”

తరతరములుగా, యూదులు “అబ్రాహాము సంతానముగా” లేదా అబ్రాహాము యొక్క ఖచ్చితమైన వారసులుగా ఉండుటను నమ్మారు, దాని అర్థము ఒక వ్యక్తి దేవుని చేత అంగీకరించబడెను మరియు ఎంపిక చేయబడెను (లూకా 3:8 చూడండి). మిగిలిన వారెవరైనా దేవుని చేత అంగీకరించబడని “అపరిశుద్ధులైన” అన్యులుగా భావించబడ్డారు. అపొస్తలుల కార్యములు 10 లో, “ఆయన అంగీకరించు” వారి గురించి ప్రభువు పేతురుకు బోధించినదేమిటి? (అపొస్తలుల కార్యములు 10:35). ప్రభువుకు అంగీకారమైన నీతిగల జీవితమును కొర్నేలీ జీవిస్తున్నాడనుటకు ఈ అధ్యాయములో మీరు ఏ నిదర్శనము కనుగొంటారు? “దేవుడు పక్షపాతి కాడు” అనే వ్యాఖ్యానానికి అర్థమేమిటో ధ్యానించండి (34వ వచనము; 1 నీఫై 17:35 కూడా చూడండి). ఈ సత్యమును గూర్చి తెలుసుకొనుట మీకు ఎందుకు ముఖ్యమైనది?

అబ్రాహాము సంతానము కాని వారిని అల్పులుగా చూసిన యూదుల వలె, మీ కంటే భిన్నముగా ఉన్నవారి గురించి దయలేని లేదా తెలియని అంచనాలను మీకై మీరు చేయడం ఎప్పుడైనా గమనించారా? ఈ ధోరణిని మీరు ఎలా జయించగలరు? రాబోయే కొన్ని రోజులు ఒక సరళమైన ప్రోత్సాహకార్యక్రమాన్ని ప్రయత్నించుట ఆసక్తికరంగా ఉండవచ్చు: మీరు ఎవరితోనైనా సంభాషించినప్పుడల్లా, “ఈ వ్యక్తి దేవుని యొక్క బిడ్డ” అని మీకై మీరు ఆలోచించుటకు ప్రయత్నించండి. దీనిని మీరు చేసినప్పుడు, మీరు ఇతరులను గూర్చి ఆలోచించి, సంభాషించు విధానములో మీరు ఏ మార్పులను గమనిస్తారు?

1 సమూయేలు 16:7; 2 నీఫై 26:13, 33; రస్సెల్ ఎమ్. నెల్సన్, “దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిమ్ము,” లియహోనా, నవ. 2020, 92–95 కూడా చూడండి.

అపొస్తలుల కార్యములు 10; 11:1–18; 15

పరలోక తండ్రి బయల్పాటు ద్వారా వరుస వెంబడి వరుస నాకు బోధిస్తారు.

అపొస్తలుల కార్యములు 10 లో వివరించబడిన దర్శనమును పేతురు చూసినప్పుడు, దానిని గ్రహించడానికి అతడు మొదట కష్టపడ్డాడు మరియు “ఏమైయుండునో ఎటు తోచకయున్నాడు” (17వ వచనము). అయినప్పటికీ పేతురు దానిని కోరినప్పుడు, ప్రభువు పేతురుకు గొప్ప జ్ఞానము ఇఛ్చారు. అపొస్తలుల కార్యములు 10, 11, మరియు 15 మీరు చదివినప్పుడు, కాలక్రమేణా తన దర్శనమును గూర్చి పేతురు యొక్క జ్ఞానము ఎలా అధికం చేయబడిందో గమనించండి. మీకు ప్రశ్నలు కలిగినప్పుడు మీరు దేవుని నుండి గొప్ప జ్ఞానమును ఎలా కోరుకున్నారు మరియు పొందారు?

అపొస్తలుల కార్యములు 10 , 11, మరియు 15 బయల్పాటు ద్వారా ప్రభువు తన సేవకులను నడిపించిన ప్రత్యేక సంఘటలను వివరిస్తాయి. ఈ అధ్యాయములను మీరు చదివినప్పుడు బయల్పాటు గురించి మీరు నేర్చుకొనే దానిని వ్రాయుటకు అది సహాయపడవచ్చు. ఆత్మ మీతో ఏ విధాలుగా మాట్లాడును?

సువార్త అంశములు, “బయల్పాటు,” topics.ChurchofJesusChrist.org; క్వింటిన్ ఎల్. కుక్, “ప్రవక్తలకు నిరంతర బయల్పాటు మరియు మన జీవితాలను నడిపించడానికి వ్యక్తిగత బయల్పాటు యొక్క దీవెన,” లియహోనా, మే 2020, 96–100 కూడా చూడండి.

అపొస్తలుల కార్యములు 11:26

నేను యేసు క్రీస్తుయందు విశ్వసించి, అనుసరిస్తాను కనుక నేను క్రైస్తవుడను.

ఒక వ్యక్తి క్రైస్తవుడు అని పిలువబడడంలో విశేషమేమిటి? (అపొస్తలుల కార్యములు 11:26 చూడండి). మీ ఉద్దేశ్యములో ఒక క్రైస్తవునిగా పిలువబడుట అనగా అర్థమేమిటి? పేర్ల యొక్క ప్రాముఖ్యతను ఆలోచించండి. ఉదాహరణకు, మీ ఉద్దేశ్యములో మీ ఇంటి పేరుకు గల అర్థమేమిటి? సంఘము యొక్క పేరు మీకు ఎందుకు ముఖ్యమైనది? (సిద్ధాంతము మరియు నిబంధనలు 115:4 చూడండి). మీ ఉద్దేశ్యములో నిబంధన ద్వారా యేసు క్రీస్తు యొక్క నామమును మీపై తీసుకొనుట అనగా అర్థమేమిటి? (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77 చూడండి).

మోషైయ 5:7–15; ఆల్మా 46:13–15; 3 నీఫై 27:3–8; రస్సెల్ ఎమ్. నెల్సన్, “సంఘం యొక్క సరియైన పేరు,” లియహోనా, నవ. 2018, 87–90 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

అపొస్తలుల కార్యములు 10:17, 20.మనము ఎప్పుడైనా ఆత్మీయ అనుభవాలను కలిగియుండి, తరువాత మనము అనుభవించిన దానిని లేదా నేర్చుకొనిన దానిని సందేహించామా? మన సందేహాలను జయించుటకు మనకు సహాయపడునట్లు మనము ఒకరికొకరికి ఇవ్వగల సలహా ఏమిటి? (నీల్ ఎల్. ఆండర్సెన్, “ఆత్మీయంగా నిర్వచించే జ్ఞాపకాలు,” లియహోనా, మే 2020, 18–22 చూడండి.)

అపొస్తలుల కార్యములు 10:34-35. “దేవుడు పక్షపాతి కాడు” అని మీ కుటుంబానికి మీరెట్లు బోధించగలరు? (అపొస్తలుల కార్యములు 10:34). మీ కుటుంబము ఈ వచనాలను చదువుతున్నప్పుడు, బహుశా మీరు భిన్నమైన నేపథ్యాలు మరియు సంప్రదాయాలు గల జనుల చిత్రాలను ప్రదర్శించవచ్చు. ఈ వచనాలలోని సత్యాలు మన చర్యలను ఎలా ప్రభావితం చేయాలి?

అపొస్తలుల కార్యములు 12:1–17.పేతురు చెరసాలలో వేయబడుట మరియు సంఘ సభ్యులు కలిసి సమావేశమై అతడి కొరకు ప్రార్థించు వృత్తాంతాన్ని మీ కుటుంబము అభినయించవచ్చు. ప్రార్థన చేత మనము ఎప్పుడు దీవించబడ్డాము? సంఘ నాయకుడు లేదా ప్రియమైన వారెవరి కొరకైనా ప్రార్థించుటకు మనం ప్రేరేపించబడ్డామా? “అత్యాసక్తితో” ప్రార్థించుట అనగా అర్థమేమిటి? (అపొస్తలుల కార్యములు 12:5; ఆల్మా 34:27 కూడా చూడండి).

చిత్రం
చెరసాల నుండి విడిపించబడిన పేతురు

చెరసాల నుండి విడిపించబడిన పేతురు, ఎ. ఎల్. నోక్స్ చేత

అపొస్తలుల కార్యములు 14.ఈ అధ్యాయమును మీరు కలిసి చదివినప్పుడు, కొందరు కుటుంబ సభ్యులు శిష్యులకు మరియు సంఘమునకు వచ్చిన దీవెనలను వ్రాయవచ్చు. మిగిలిన కుటుంబ సభ్యులు శిష్యులు అనుభవించిన వ్యతిరేకత లేదా శ్రమలను వ్రాయవచ్చు. నీతిమంతులైన జనులకు కష్టమైన విషయాలు జరుగుటకు దేవుడు ఎందుకు అనుమతించును?

అపొస్తలుల కార్యములు 15:1–21.పరివర్తన చెందిన వారు సున్నతితో పాటు మోషే ధర్మశాస్త్రమును పాటించవలసిన అవసరమున్నదో లేదోయని సంఘములో ఒక అసమ్మతిని ఈ వచనాలు వర్ణిస్తాయి. ఈ అసమ్మతి గురించి అపొస్తలులు ఏమి చేసారు? సంఘ నాయకులు సంఘము యొక్క కార్యమును ఎలా నడిపిస్తారనే దాని గురించి ఈ మాదిరి నుండి మనము ఏమి నేర్చుకోగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

ఒక బొమ్మను గీయండి. కుటుంబ సభ్యులు లేఖన బోధనలు మరియు వృత్తాంతములను దృశ్యీకరించుకొనుటకు చిత్రములు సహాయపడగలవు. మీరు చదివే అపొస్తలుల కార్యములు 10 లోని పేతురు యొక్క దర్శనము వంటి వాటి చిత్రములను గీయుటకు మీరు కుటుంబ సభ్యులను ఆహ్వానించవచ్చు.

చిత్రం
పేతురు మరియు కొర్నేలీ

పేతురు మరియు కొర్నేలీ యొక్క అనుభవాలు “దేవుడు పక్షపాతికాడు” (అపొస్తలుల కార్యములు 10:34) అని రుజువు చేయును.

ముద్రించు