2022 పాత నిబంధన
ఆగష్టు 8–14. కీర్తనలు 1–2; 8; 19–33; 40; 46: “యెహోవా నా కాపరి”


“ఆగష్టు 8–14. కీర్తనలు 1–2; 8; 19–33; 40; 46: ‘యెహోవా నా కాపరి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“ఆగష్టు 8–14. కీర్తనలు 1–2; 8; 19–33; 40; 46” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
గొర్రెలతో నడుస్తున్న యేసు

యెహోవా నా కాపరి, యాంగ్‌సుంగ్ కిమ్ చేత, havenlight.com

ఆగష్టు 8–14

కీర్తనలు 1–2; 8; 19–33; 40; 46

“యెహోవా నా కాపరి”

ఈ సారాంశములో సూచించబడిన కీర్తనలు లేక సూత్రాలను ఎంచుకోవడానికి మాత్రమే పరిమితము కాకండి. ప్రభువుకు దగ్గరగా ఉన్నట్లు భావించడానికి మీకు సహాయపడే సత్యాలకు ఆత్మ మిమ్మల్ని నడిపించనివ్వండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

కీర్తనలు ఎవరు వ్రాసారో ఖచ్ఛితముగా మనకు తెలియదు. కొన్ని దావీదు మహారాజు వ్రాసినట్లు ఆరోపించబడ్డాయి, కానీ వాటిలో అధికమును వ్రాసిన వారు అనామకులు. కీర్తనలు చదివిన తర్వాత, వారి పేర్లు మనకు తెలియకపోయినప్పటికీ, కీర్తనాకారుల హృదయాలు మనకు తెలుసునన్నట్లు మనము భావించవచ్చు. ఇశ్రాయేలీయుల ఆరాధనలో కీర్తనలు ముఖ్యభాగమని మనకు తెలుసు మరియు రక్షకుడు తరచు వాటిని ఉదహరించారని మనకు తెలుసు. కీర్తనలలో, దేవుని యొక్క ప్రాచీన జనుల ఆత్మలను స్పష్టంగా గ్రహించడం సాధ్యమవుతుంది. వారు దేవుని గురించి ఎలా భావించారు, దేని గురించి ఆందోళన చెందారు మరియు వారు శాంతిని ఎలా కనుగొన్నారో మనము చూస్తాము. నేడు విశ్వాసులుగా, ప్రపంచవ్యాప్తంగా మనము ఈ పదాలను ఇంకా మన దైవారాధనలో ఉపయోగిస్తాము. కీర్తనల రచయితలు మన ఆత్మలను స్పష్టంగా గ్రహించినట్లు అనిపిస్తుంది మరియు మనము దేవుని గురించి ఎలా భావిస్తాము, దేని గురించి ఆందోళన చెందుతాము, మనము సమాధానమును ఎలా కనుగొంటామో వ్యక్తపరచడానికి మార్గాన్ని కనుగొన్నట్లు అనిపిస్తుంది.

కీర్తనల గ్రంథమును సమీక్షించడానికి, బైబిలు నిఘంటువులో “కీర్తనలు” చూడండి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

కీర్తనలు 1; 23; 26–28; 46

ప్రభువును నమ్మమని కీర్తనలు మనకు బోధిస్తాయి.

మీరు కీర్తనలు చదువుతున్నప్పుడు, రచయితలు ఎంత తరచుగా భయాన్ని, బాధను లేదా ఆతురతను వ్యక్తపరుస్తారో మీరు గమనించవచ్చు. అటువంటి భావాలు విశ్వాసులకు కూడా సహజము. కానీ, ప్రభువు నందు పూర్తి నమ్మకముతో పాటు అవి అందించే పరిష్కారాలే కీర్తనలను ప్రేరేపించేవిగా చేస్తాయి. మీరు కీర్తనలు 1; 23; 26–28; 46 చదువుతున్నప్పుడు, ఈ ప్రేరణాత్మక సందేశాలను పరిగణించండి. క్రింది వాటిని గమనించండి మరియు మీరు కనుగొన్న దానిని వ్రాయండి:

  • ప్రభువును నమ్మడానికి ఆహ్వానాలు:

  • ప్రభువును వర్ణించే పదాలు:

  • ఆయన అందించే సమాధానము, బలము మరియు ఇతర దీవెనలను వర్ణించే పదాలు:

  • ఆయనను నమ్మేవారిని వర్ణించే పదాలు:

కీర్తనలు 2; 22

కీర్తనలు మన ఆలోచనలను యేసు క్రీస్తు యొక్క జీవితము మరియు పరిచర్య వైపు నడిపిస్తాయి.

కీర్తనలలో అనేకము యేసు క్రీస్తు యొక్క మర్త్య జీవితాన్ని ఉదహరిస్తాయి. క్రొత్త నిబంధన కాలములలో క్రైస్తవులు కూడా ఈ సంబంధాలను చూసారు—ఉదాహరణకు, హేరోదు రాజు మరియు పొంతి పిలాతు యెదుట యేసు విచారించబడుటగు గల (అపొస్తలుల కార్యములు 4:24–30 చూడండి) ఒక సంబంధాన్ని వారు కీర్తనలు 2లో గుర్తించారు. మత్తయి 27:35–46; లూకా 23:34–35; మరియు యోహాను 19:23–24తో పాటు కీర్తనలు 2 మరియు 22 చదవడాన్ని పరిగణించండి. ఈ కీర్తనలలోని పదాలకు, రక్షకుని జీవితానికి మధ్య గల సంబంధాల కొరకు చూడండి మరియు రాబోయే కొన్ని వారాలలో మీరు కీర్తనల గ్రంథమును చదువుతున్నప్పుడు, ఇలాంటి సంబంధాల కొరకు చూస్తూ ఉండండి.

మీరు యేసు కాలములో ఒక యూదుడైయున్నట్లు, కీర్తనలు బాగా ఎరిగియుండి రక్షకుని జీవితానికి సంబంధాలను చూచినట్లు ఊహించుకోండి. ఈ జ్ఞానము మీకు ఒక దీవెనగా ఎట్లు ఉండియుండవచ్చు?

కీర్తనలు 31:5; 34:20; 41:9; లూకా 24:44; హెబ్రీయులకు 2:9–12 కూడా చూడండి.

కీర్తనలు 8; 19; 33

“లోకము యెహోవా కృపతో నిండియున్నది.”

కీర్తనలు 8; 19; మరియు 33 చదవడం ప్రభువు యొక్క అనేక అద్భుత కల్పనలను పరిగణించడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. మీరు ఆవిధంగా చేసినప్పుడు, మీ ఆలోచనలు మరియు భావాలపట్ల శ్రద్ధ వహించండి. ప్రభువు యొక్క సృష్టి, “దేవుని మహిమను మీకెట్లు వివరిస్తుంది”? (కీర్తనలు 19:1).

కీర్తనలు 19:7–11; 29

యెహోవా వాక్కు శక్తివంతమైనది, “హృదయమును సంతోషపరచునది.”

కీర్తనలలో, సాక్ష్యము, కట్టడలు, ఆజ్ఞ మరియు తీర్పులు వంటి పదాలు యెహోవా వాక్కును సూచించగలవు. మీరు కీర్తనలు 19:7–11 చదువుతున్నప్పుడు, దీనిని జ్ఞాపకముంచుకోండి. యెహోవా వాక్కు గురించి ఈ వచనాలు మీకేమి సూచిస్తాయి? ఆయన స్వరము గురించి కీర్తనలు 29 మీకేమి బోధిస్తుంది? మీ అనుభవంలో, యెహోవా వాక్కు లేక స్వరము ఈ వర్ణనలతో ఎలా జతపరచబడింది?

చిత్రం
కాన్సెప్సియాన్ చిలి దేవాలయము

ప్రభువు సన్నిధిలో ప్రవేశించడానికి మనము ఆత్మీయంగా తప్పక శుద్ధముగా, స్వచ్ఛముగా ఉండాలి.

కీర్తనలు 24; 26–27

ప్రభువు సన్నిధిలో ప్రవేశించడానికి స్వచ్ఛత అవసరము.

యెరూషలేములో దేవాలయము కొండపై నిర్మించబడడం వలన, “యెహోవా పర్వతము” (కీర్తనలు 24:3) అనేది దేవాలయాన్ని లేక దేవుని సన్నిధిని సూచించవచ్చు. కీర్తనలు 24 గురించి మీ గ్రహింపుకు ఇది ఏమి జతచేస్తుంది? మీ దృష్టిలో “నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును” కలిగియుండడమనగా అర్థమేమిటి? (కీ ర్తనలు 24:4).

యెహోవా మందిరము గురించి కీర్తనలు 26 మరియు 27 మీకేమి బోధిస్తుంది?

కీర్తనలు 15 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

కీర్తనలు 22.ఒక కుటుంబ సభ్యుడు ఈ కీర్తనను చదువుతుండగా, ఇతరులు మత్తయి 27:35–46లో పోలికల కొరకు చూడవచ్చు. తర్వాత వారు యేసు క్రీస్తు మరియు మన కొరకు ఆయన త్యాగము గురించి వారి భావాలను పంచుకోవచ్చు.

కీర్తనలు 23. కీర్తనలో వారు కనుగొనిన దాని చిత్రాలను గీయడాన్ని మీ కుటుంబము ఆనందించవచ్చు మరియు ఆ చిత్రాలకు సరిపోవు వచనాలు లేక పదాలను కుటుంబ సభ్యులు ఊహించేలా చేయవచ్చు. ఏవిధంగా ప్రభువు మనకు ఒక కాపరియైయున్నాడు?

కీర్తనలు 24:3–5.నిర్దోషమైన చేతులును, శుద్ధమైన హృదయమును కలిగియుండవలసిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి, కుటుంబ సభ్యులు వారి చేతులను కడుగుతుండగా మీరు కీర్తనలు 24:3–5 చదవవచ్చు. ఈ కీర్తనలో చేతులు దేనిని సూచించవచ్చు? హృదయము దేనికి చిహ్నము కాగలదు? ఆత్మీయముగా మన చేతులను నిర్దోషముగా మరియు మన హృదయములను శుద్ధముగా చేసుకోవడానికి మనమేమి చేయగలము?

కీర్తనలు 30:5, 11.“ఏడ్పు వచ్చి రాత్రియుండినను, ఉదయమున సంతోషము కలుగును” అను వాగ్దానాన్ని కీర్తనలు 30:5 కలిగియుంది. మన దుఃఖమును ప్రభువు సంతోషముగా ఎలా మార్చివేసారు? 11వ వచనము వివరించే దానిని అభినయించడాన్ని కొద్దిమంది కుటుంబ సభ్యులు ఆనందించవచ్చు.

కీర్తనలు 33.ఈ కీర్తనలో అందరు అనే పదము ఎన్నిసార్లు ఉపయోగించబడిందో గమనించండి. ప్రత్యేకించి 13–15 వచనాలలో, ఈ పదము మళ్ళీ మళ్ళీ ఉపయోగించబడడం నుండి ప్రభువు గురించి మనమేమి నేర్చుకుంటాము?

కీర్తనలు 46:10.కుటుంబ సభ్యులు “ఊరకుండవలసిన” అవసరము కలుగునట్లు మీరు కలిసి ఏదైనా చేయవచ్చు. దేవుడిని తెలుసుకోవడానికి ఊరకుండడం మనకెలా సహాయపడగలదు? ఊరకుండి, దేవుడిని తెలుసుకోవడానికి మనకు గల అవకాశాలేవి?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

సృజనాత్మకంగా ఉండండి. ప్రభువును సృజనాత్మక విధానాలలో స్తుతించడానికి కీర్తనల వంటి లేఖనములు తరచు జనులను ప్రేరేపిస్తాయి. సంగీతము, కవిత్వము, దృశ్య చిత్రాల ద్వారా లేక మరేవిధంగానైనా మీ భక్తిని వ్యక్తపరచాలని మీకనిపించినప్పుడు, ఆ భావాలపై పనిచేయండి. పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు నందు విశ్వాసాన్ని వృద్ధిచేయడానికి ఇతరులకు సహాయపడేందుకు మీరు సృష్టించిన దానిని పంచుకోవడాన్ని పరిగణించండి.

చిత్రం
భుజాలపై గొర్రెను మోసుకెళ్తున్న యేసు

మంచి కాపరి, కెన్ స్పెన్సర్ చేత

ముద్రించు