2022 పాత నిబంధన
ఆగష్టు 15–21. కీర్తనలు 49–51; 61–66; 69–72; 77–78; 85–86: “ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను”


“ఆగష్టు 15–21. కీర్తనలు 49–51; 61–66; 69–72; 77–78; 85–86: “ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“ఆగష్టు 15–21. కీర్తనలు 49–51; 61–66; 69–72; 77–78; 85–86,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

లాంతరును పట్టుకొనిన యేసు

తప్పిపోయిన దానిని రక్షించుట, మైఖేల్ టి. మాల్మ్ చేత

ఆగష్టు 15–21

కీర్తనలు 49–51; 61–66; 69–72; 77–78; 85–86

“ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను”

ఈ కీర్తనలలో ప్రసంగించబడిన సిద్ధాంతపరమైన విషయాలలో కొన్నిటిని ఈ సంక్షేపము గుర్తిస్తుంది. మీరు అధ్యయనం చేసినప్పుడు, కొన్ని మాటలు, రూపములు లేదా ఆలోచనలు మీకు ఎక్కువ ముఖ్యమైనవిగా కనబడవచ్చు. ప్రభువు మీకు ఏమి బోధించడానికి ప్రయత్నిస్తున్నాడని మీరు భావిస్తున్నారు?

మీ మనోభావాలను నమోదు చేయండి

కీర్తనల రచయతలు వారి కవిత్వములో లోతైన వ్యక్తిగత భావాలను పంచుకొన్నారు. నిరాశ చెందిన, భయపడిన మరియు పశ్చాత్తాపపడిన భావన గురించి వారు వ్రాసారు. కొన్నిసార్లు, వారు దేవుని చేత విడవబడినట్లుగా భావించినట్లుగా కనబడ్డారు మరియు కొన్ని కీర్తనలు విసుగు లేక అధైర్యముగల స్వరమును కలిగి ఉంటాయి. ఇటువంటి భావనలు మీకు ఎప్పుడైన కలిగితే, కీర్తనలను చదవటం మీరు ఒంటరి వారు కాదని తెలుసుకొనుటకు మీకు సహయపడగలదు. అటువంటి భావాలు మీకు కలిగినప్పుడు కీర్తనలు మిమ్మల్ని ప్రోత్సహించేవిగా కూడా మీరు కనుగొంటారు, ఎందుకనగా కీర్తనాకారులు ప్రభువును ఆయన మంచితనము కొరకు స్తుతించారు, ఆయన శక్తియందు ఆశ్చర్యపడ్డారు మరియు ఆయన కనికరమందు సంతోషించారు. చెడు మరియు పాపము చేత లోకము భారమైనదని, కానీ ప్రభువు “దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల వాడని” (కీర్తనలు 86:5) వారు ఎరుగుదురు. ప్రభువుయందు విశ్వాసము కలిగియుండుట అనగా మీరు ఎన్నడూ ఆందోళన, పాపము లేదా భయము చేత శ్రమపడరని అర్థము కాదని వారు గ్రహించారు. ఆ విధముగా మీరు శ్రమ పడినప్పుడు ఎవరివైపు తిరగాలో మీకు తెలుసని దాని అర్థము.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

కీర్తనలు 49; 62:5–12

యేసు క్రీస్తు ద్వారా మాత్రమే విమోచన కలుగును.

కీర్తనలు 49 “తక్కువ, ఎక్కువ, ధనికులు మరియు పేదవారు ఇరువురికి” (2వ వచనము) ఒక సందేశమును కలిగియున్నది. ఈ సందేశము ఏమిటని మీరు చెప్పుదురు? ఆ సందేశమునకు అదనముగా కీర్తనలు 62:5–12 ఏమి చేర్చుతుందని మీరు భావిస్తున్నారు?

కొందరు జనులు విమోచన కొరకు దేవునికి బదులుగా వేరొకదాని యందు వారి నమ్మకముంచే విధానాలను ధ్యానించుటకు ఈ కీర్తనలు చదవటం మిమ్మల్ని ప్రేరేపించవచ్చు (కీర్తనలు 49:6–7 చూడండి). “పాతాళ బలములోనుండి ఆయన [మీ] ప్రాణమును విమోచించును” అనే మీ సాక్ష్యము చేత మీ జీవితం ఎలా దీవించబడింది? (15వ వచనము).

సామెతలు 28:6; ఆల్మా 34:8-17 కూడా చూడండి.

కీర్తనలు 51; 85–86

రక్షకుని కనికరము వలన, నేను నా పాపములను బట్టి క్షమించబడగలను.

కీర్తనలు 51 లో కనికరము కొరకు విన్నపములు దావీదు మహారాజుకు ఆపాదించబడినవి, అతడు వ్యభిచారము మరియు హత్య విషయములలో నేరస్తుడు (2 సమూయేలు 11 చూడండి). మన పాపములు తక్కువ తీవ్రమైనవి అయినప్పుడు కూడా ఈ కీర్తనలో వ్యక్తపరచబడిన కనికరము కొరకు గల అవసరతను మనము సంబంధం కలిగియుండవచ్చు. పశ్చాత్తాపపడుట అనగా అర్థమేమిటో కూడా మనము నేర్చుకోవచ్చు. ఉదాహరణకు, కీర్తనలు 51 లోని మాటలు లేదా వాక్యభాగాలు పశ్చాత్తాపపడుటకు మనకు అవసరమైన లక్షణము గురించి మీకు ఏమి బోధిస్తాయి? మీ జీవితంలో రక్షకుని ప్రాయశ్చిత్తము కలిగియుండగల ప్రభావమును గూర్చి మీరు ఏమి నేర్చుకొంటారు?

కీర్తనలు 85–86 మీరు చదివినప్పుడు అదే ప్రశ్నలను మీరు అడగవచ్చు. ప్రభువును వర్ణించే వాక్యభాగాల కొరకు కూడా మీరు చూడవచ్చు. ఆయన మిమ్మల్ని క్షమించగలడనే మీ విశ్వాసమును ఈ వాక్యభాగాలు ఎలా బలపరుస్తాయి? (ఉదాహరణకు, కీర్తనలు 86:5, 13, 15 చూడండి).

కీర్తనలు 51:13–15; 66:16–17; 71:15–24

యేసు క్రీస్తును గూర్చి నా సాక్ష్యము ఇతరులు ఆయన యొద్దకు వచ్చుటకు సహాయపడగలదు.

యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తము గురించి మీ సాక్ష్యమును మీరు ఎలా పొందారో ధ్యానించండి. తరువాత , కీర్తనలు 51:13–15; 66:16–17; 71:15–24 మీరు చదివినప్పుడు, ఇతరులను “దేవుని ఆశ్చర్యకార్యములను చూడ రండి” (కీర్తనలు 66:5) అని మీరు ఎలా ఆహ్వానించగలరో ఆలోచించండి. “[ఆయన] నీతిని దినమెల్ల వర్ణించుట” అనగా మీకు అర్థమేమిటి? (కీర్తనలు 71:24). “ఆయన [మీ] ఆత్మ కొరకు చేసిన కార్యములను” మీరు ఇతరులకు ఎలా చెప్పగలరు? (కీర్తనలు 66:16).

మోషైయ 28:1–4; ఆల్మా 7:26; కూడా చూడండి.

ఒకరితోనొకరు మాట్లాడుకొనుచున్న ఇద్దరు యువకులు

ప్రభువు మన కొరకు చేసిన దానిని గూర్చి మన సాక్ష్యములను మనము ఇతరులతో పంచుకోగలము.

కీర్తనలు 63; 69; 77–78

నా అత్యవసర సమయములో ప్రభువు నాకు సహాయపడును.

దేవుని నుండి దూరము కావడం ఎలా ఉంటుంది మరియు ఎలా ఆయన సహాయం చాలా అవసరమో అనేక కీర్తనలు స్పష్టమైన భాషలో వివరిస్తాయి. కీర్తనలు 63:1, 8; 69:1–8, 18–21; 77:1–9 లో అటువంటి వివరణలు కొరకు వెదకడానికి మీరు ఆలోచించవచ్చు. కీర్తనలు 63; 69; 77–78 లో మీరు కనుగొనేవి, ఏవి ఈ కీర్తనాకారునికి అభయమిచ్చాయి?

మీరు నిరాశ చెందినప్పుడు, “పూర్వము జరిగిన ఆశ్చర్యకార్యములను” మరియు యెహోవా చేసిన కార్యములను మనస్సునకు తెచ్చుకొనుట” మీకు ఎలా సహాయపడుతుంది? (కీర్తనలు 77:11). ఆ ఆశ్చర్యకార్యములలో కొన్ని కీర్తనలు 78 లో వివరించబడినవి. మీరు వాటి గురించి చదివినప్పుడు, “దేవుని యందు నిరీక్షణ కలిగియుండుటకు” (7వ వచనము మీకు సహాయపడేదానిని ధ్యానించండి.) మీ కుటుంబ చరిత్ర నుండి మిమ్మల్ని ప్రేరేపించే అనుభవాలేవి?

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

కీర్తనలు 51:17.విరిగిన హృదయమును కలిగియుండుట అనగా అర్థమేమిటో మీ కుటుంబానికి మీరు ఎలా బోధించవచ్చో ఆలోచించండి. ఉదాహరణకు, కుటుంబ సభ్యులు ఒకరి తరువాత ఒకరు గట్టి పెంకు గల ఒక గుడ్డు లేదా ఒక గింజ వంటి దానిని పగుల గొట్టి తెరచుటను ఒకరి తరువాత ఒకరు చేయవచ్చు. కొన్నిసార్లు మన హృదయాలు ఆ గట్టి పెంకు వలె ఎలా ఉన్నాయి? ప్రభువుకు మన హృదయాలను మనము ఎలా తెరవగలము? కీర్తనలు 51 కలిసి చదువుట కొన్ని ఉపాయములను ఇవ్వవచ్చు.

కీర్తనలు 61:2–3.కుటుంబ సభ్యులు ఈ వచనాలలోని చిత్రములను వేయడం మరియు యేసు క్రీస్తు ఎలా ఒక ఉన్నతమైన “బండ,” “[మనకు] ఒక ఆశ్రయము,” మరియు “ఒక బలమైన కోటగా” ఉన్నాడో చర్చించడాన్ని ఆనందించవచ్చు.

కీర్తనలు 71:17; 78:5–7.ప్రభువు దేనిని “[మీ] పిల్లలకు … వివరించాలని” మిమ్మల్ని కోరుతున్నాడు? (కీర్తనలు 78:5). బహుశా ప్రతీ కుటుంబ సభ్యుడు ప్రభువు యొక్క “ఆశ్చర్య కార్యముల,” యొక్క మాదిరిని పంచుకోవచ్చు, అది ఒక లేఖనపు కథ, ఒక అనుభవము లేదా “దేవునియందు నిరీక్షణ గలవారు” అగుటకు వారికి సహాయపడిన ఒక వ్యక్తిగత సాక్ష్యము వంటి వాటిని పంచుకోవచ్చు(కీర్తనలు 71:17; 78:7).

కీర్తనలు 72.కీర్తనలు 72 తన కుమారుడైన సొలొమోను గురించి దావీదు చేత వ్రాయబడింది, కానీ దానిలో అధికము యేసు క్రీస్తుకు కూడా వర్తిస్తుంది. మీ కుటుంబము ఈ కీర్తన చదివినప్పుడు, యేసు క్రీస్తు గురించి వారికి జ్ఞాపకం చేసే వచనాలను వారు కనుగొన్నప్పుడు వారు రక్షకుని చిత్రమును పైకెత్తి చూపించవచ్చు. “సర్వ భూమియు ఆయన మహిమతో నిండియుండును” అనే కోరికను నెరవేర్చుటకు మనము ఎలా సహాయపడగలము? (కీర్తనలు 72:19; సిద్ధాంతము మరియు నిబంధనలు 65:2 కూడా చూడండి.)

కీర్తనలు 85:11మోర్మన్ గ్రంథము ఎలా “భూమి నుండి [పుట్టుకొచ్చింది] ”మరియు పరలోక దూతలు ఎలా “పరలోకము నుండి” వచ్చారు—మొదలైన సువార్త పునఃస్థాపన యొక్క సంఘటనల గురించి చర్చను ఈ వచనము ప్రేరేపించగలదు (మోషే 7:62 కూడా చూడండి). “జోసెఫ్ స్మిత్ యొక్క సిద్ధపాటు: Tutored by Heaven” (ChurchofJesusChrist.org) వీడియో ఈ సంఘటనలలో కొన్నిటిని చిత్రీకరించును.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

వైవిధ్యాన్ని ఉపయోగించండి. “సువార్త జీవించుటకు మీ ప్రయత్నములకు మీరు వైవిధ్యమును చేర్చగల విధానముల కోసం చూడండి. ఆవిధంగా చేయడం అనుభవానికి గొప్పతనమును, అందమును చేరుస్తుంది. … ఆత్మను ఆహ్వానించే సంగీతము, కథలు, చిత్రములు మరియు ఇతర కళా రూపములను ఎలా ఉపయోగించాలో ఆలోచించండి” (Teaching in the Savior’s Way,22).

యేసు యెదుట మోకరించిన వ్యక్తి

సందేహించవద్దు, తోమా, కిర్క్ రిచర్డ్స్ చేత