2022 పాత నిబంధన
ఆగష్టు 1–7. యోబు 1–3; 12–14; 19; 21–24; 38–40; 42: “నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను”


“ఆగష్టు 1–7. యోబు 1–3; 12–14; 19; 21–24; 38–40; 42: ‘నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“ఆగష్టు 1–7. యోబు 1–3; 12–14; 19; 21–24; 38–40; 42,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
నేలపైనున్న వ్యక్తితో మాట్లాడుచున్న ముగ్గురు వ్యక్తులు

యోబు గురించి తీర్పులు, జోసెఫ్ బ్రిక్కీ చేత

ఆగష్టు 1–7

యోబు 1–3; 12–14; 19; 21–24; 38–40; 42

“నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను”

మీరు యోబు గురించి చదువుతున్నప్పుడు, మీకు తగిన ముఖ్య సత్యాలను కనుగొనడానికి ఆత్మ మిమ్మల్ని నడిపించును. మీరు కనుగొనే దానిని వ్రాయండి మరియు ఈ సత్యాలు మీకెలా అన్వయిస్తాయో ధ్యానించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

మంచివారికే ఎందుకు చెడు జరుగుతుందని—లేక ఆ విషయానికొస్తే, చెడ్డవారికి ఎందుకు మంచి జరుగుతుందని ఆశ్చర్యపడడం సహజమే. న్యాయవంతుడైన దేవుడు దానిని ఎందుకు అనుమతిస్తాడు? చెడు విషయాలు జరిగిన మంచివారిలో ఒకడైన యోబు అనుభవాల ద్వారా ఇటువంటి ప్రశ్నలు అన్వేషించబడతాయి. యోబు శ్రమల కారణంగా, అతడు నిజంగా మంచివాడేనా అని అతని స్నేహితులు ఆశ్చర్యపడ్డారు. యోబు తన నీతియుక్తత గురించి స్థిరముగా చెప్పాడు మరియు దేవుడు నిజంగా అందరిపట్ల న్యాయవంతుడేనా అని ఆశ్చర్యపడ్డాడు. కానీ అతడు శ్రమించి, ఆశ్చర్యపడినప్పటికీ, యేసు క్రీస్తు నందు తన చిత్తశుద్ధిని, విశ్వాసాన్ని యోబు నిలుపుకున్నాడు. యోబు గ్రంథములో విశ్వాసము ప్రశ్నించబడి, పరీక్షించబడింది, కానీ ఎన్నడూ పూర్తిగా విడిచిపెట్టబడలేదు. దాని అర్థము, అన్ని ప్రశ్నలు జవాబివ్వబడ్డాయని కాదు. కానీ, అవి జవాబివ్వబడే వరకు, ప్రశ్నలు మరియు విశ్వాసము ఏకకాలంలో ఉంటాయని, ఈ మధ్యలో ఏమి జరిగినప్పటికీ, “నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను” (యోబు 13:15) అని మన ప్రభువు గురించి మనం చెప్పగలమని యోబు గ్రంథము బోధిస్తుంది.

చిత్రం
Learn More image
చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

యోబు 1–3; 12–13

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు నందు నా నమ్మకము నేను అన్ని పరిస్థితులలో విశ్వాసంగా ఉండేందుకు నాకు సహాయపడగలదు.

యోబులోని మొదటి కొన్ని అధ్యాయాలు మన విరోధిగా లేక నేరారోపకునిగా సాతాను పాత్రను నొక్కి చెప్పడానికి ఉద్దేశించబడ్డాయి, కానీ దేవుడు మరియు సాతాను నిజానికి ఒకరితోనొకరు ఎలా ప్రతిస్పందిస్తారని వివరించడానికి కాదు. యోబుపై సాతాను చేసిన ఆరోపణలను (యోబు 1:9–11; 2:4–5 చూడండి) మీరు చదువుతున్నప్పుడు, మీ గురించి అలాగే చెప్పబడగలదా అని మీరు ధ్యానించవచ్చు. దేవుని పట్ల విశ్వాసంగా నిలిచియుండేందుకు నాకు గల కారణాలేవి? అని మిమ్మల్ని మీరు అడగవచ్చు. యోబుకివ్వబడిన శ్రమలు మరియు అతని స్పందనలను ధ్యానించండి (యోబు 1:20–22; 2:9–10 చూడండి). మీ సవాళ్ళపట్ల స్పందించడానికి మీకు సహాయపడేలా అతని నుండి మీరేమి నేర్చుకుంటారు?

విశ్వాసంగా నిలిచియుండడానికి యోబు ప్రయత్నిస్తున్నప్పటికీ, అతని శ్రమలు మరియు అతని బాధ కొనసాగింది (3వ అధ్యాయములో అతని విలాపములను గమనించండి). వాస్తవానికి, అతని బాధ తీవ్రమవుతున్నట్లు అనిపించింది, మరియు దేవుడు అతడిని శిక్షిస్తున్నాడని అతని స్నేహితులు సూచించారు (యోబు 4–5; 8; 11 చూడండి). 12–13 అధ్యాయాలలో యోబు స్పందనలో కొంతభాగాన్ని మీరు చదువుతున్నప్పుడు, అతడు బాధను మరియు జవాబులేని ప్రశ్నలను కలిగియున్నప్పటికీ, నమ్మకాన్ని కొనసాగించడాన్ని అతనికి సాధ్యపరచునట్లు దేవుని గురించి యోబుకు తెలిసినదేమిటో ఆలోచించండి. సవాళ్ళను ఎదుర్కొనేందుకు మీకు సహాయపడేలా దేవుని గురించి మీకేమి తెలుసు? ఈ సత్యాలను మీరెలా తెలుసుకున్నారు మరియు అవి మీ విశ్వాసాన్ని ఎలా బలపరిచాయి?

యోబు 19

యేసు క్రీస్తు నా విమోచకుడు.

కొన్నిసార్లు మన తీవ్ర వేదన మధ్య అతిముఖ్యమైన సత్యాలు మనకు బయల్పరచబడతాయి. యోబు 19:1–22లో యోబు వివరించిన శ్రమలను మరియు యోబు 19:23–27లో అతడు ప్రకటించిన సత్యాలను ధ్యానించండి. తర్వాత, మీ విమోచకుడు సజీవుడని మీకెలా తెలుసో ధ్యానించండి. మీరు కష్టమైన శ్రమలను అనుభవిస్తున్నప్పుడు, ఈ జ్ఞానము ఏధంగా సహాయపడుతుంది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 121:1–12; 122 కూడా చూడండి.

చిత్రం
పైకి చూస్తున్న వ్యక్తి

యోబు, గ్యారి ఎల్. కాప్ చేత

యోబు 21–24

“ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును.”

యోబు యొక్క బాధకు గల కారణాల గురించి యోబు మరియు అతని స్నేహితుల మధ్యనున్న వాదనను ఎక్కువగా మీరు చదువుతున్నప్పుడు, వారి వాదనలో ముఖ్య ప్రశ్నకు మీరెలా జవాబిస్తారో ధ్యానించవచ్చు: ఎందుకు కొన్నిసార్లు నీతిమంతులు కష్టపడతారు మరియు దుష్టులు శిక్షింపబడకుండా విడిచిపెట్టబడతారు? మీరు యోబు 21–24 చదువుతున్నప్పుడు, దీని గురించి ఆలోచించండి. జవాబులనివ్వడంలో సహాయపడేలా పరలోక తండ్రి మరియు ఆయన ప్రణాళిక గురించి మీకేమి తెలుసు? ఉదాహరణకు, 2 నీఫై 2:11–13; మోషైయ 23:21–23; 24:10–16; అబ్రాహాము 3:22–26; డాల్లిన్ హెచ్. ఓక్స్, “Opposition in All Things,” లియహోనా, మే 2016, 114–17 చూడండి.

ఎల్. టాడ్ బడ్జ్, “స్థిరమైన, స్థితిస్థాపకమైన నమ్మకము,” లియహోనా, నవ. 2019, 47–49.

యోబు 38; 40; 42

దేవుని దృష్టికోణం నా దానికంటే గొప్పది.

తన స్నేహితుల నిందారోపణల చేత (యోబు 16:1–5; 19:1–3 చూడండి) నిరాశపరచబడి, తన కష్టం కొరకు వివరణను కోరుతూ యోబు మళ్ళీ మళ్ళీ దేవునికి మొరపెట్టాడు (యోబు 19:6–7; 23:1–931 చూడండి). ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ ఇలా గమనించారు, యోబు కనిపించినట్లుగా “మనము సర్వాంతర్యామియైన దేవుని సమయాన్ని బట్టి చాలా అసహనంగా ఉన్నప్పుడు, ఏది మంచిదో మనకు తెలుసని నిజంగా మనము సూచిస్తున్నాము. ఆశ్చర్యంగా ఉంది కదా—చేతి గడియారాలను ధరించే మనము విశ్వ గడియారాలను, క్యాలెండరులను పర్యవేక్షించే ఆయనకు సలహా ఇవ్వాలని కోరుతున్నాము” (“Hope through the Atonement of Jesus Christ,” Ensign, Nov. 1998, 63). 38 మరియు 40వ అధ్యాయములలో యోబుకు దేవుడిచ్చిన సమాధానాన్ని మీరు చదువుతున్నప్పుడు, ఈ మాటలను ధ్యానించండి. ఆయన యోబుకు ఏ సత్యాలను బోధిస్తున్నారు? విరోధితో మరియు మర్త్యత్వములోని ప్రశ్నలతో మనము పోరాడుతున్నప్పుడు, ఈ సత్యాలను మనము తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము? యోబు 42:1–6లో యోబు స్పందన గురించి మీ మనస్సున ముద్రవేసినదేది?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

యోబు 1:20–22.ఈ వచనాలలో వివరించబడినట్లు, యోబు ఎలా భావించియుంటాడో గ్రహించడానికి, మీ కుటుంబము పాత నిబంధన కథలులో “యోబు” చదువవచ్చు లేదా యోబు 1:13–22 అభినయించవచ్చు. యోబు మాదిరి నుండి మనం ఏమి నేర్చుకోగలము?

యోబు 14:14.ఈ వచనములో యోబు ప్రశ్నకు మనమెలా జవాబిస్తాము? ఆల్మా 11:42–44 మనకేవిధంగా సహాయపడగలదు?

యోబు 16:1–5.అతనికి ఓదార్పు అవసరమైనప్పుడు తీర్పుతీరుస్తూ, విమర్శించిన యోబు స్నేహితుల వలె మనమెప్పుడైనా ఉన్నామా? (యోబు 16:1–4 చూడండి; యోహాను 7:24 కూడా చూడండి). బాధలో ఉన్న ఇతరులను మన మాటలు ఎలా బలపరచగలవు? (యోబు 16:5 చూడండి).

యోబు 19:23–27.ఈ వచనాలను చదివిన తర్వాత, మన విమోచకుడు సజీవుడని వారికెలా తెలుసో కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు. కుటుంబ దినచర్య పుస్తకము వంటి పుస్తకమొక దానిలో మీ సాక్ష్యపు మాటలు (లేక పిల్లలు గీసిన రక్షకుని చిత్రాలు) పెట్టడానికి మీరు కలిసి పనిచేయవచ్చు (23వ వచనము చూడండి).

యోబు 23:8–11.శోధనల తర్వాత “సువర్ణము వలె కనబడుదును” అనేదానికి అర్థమేమిటి? ( “The Refiner’s Fire,” ChurchofJesusChrist.org వీడియో కూడా చూడండి). మనకు తెలిసి దీనిని చేసిన వారెవరు? దానిపై 10వ వచనము నుండి పదాలను వ్రాస్తూ ఏదైనా తయారు చేయడాన్ని పిల్లలు ఆనందించవచ్చు. యేసు క్రీస్తు తన శ్రమలను ఏవిధంగా జయించారో కూడా మీరు చర్చించవచ్చు (లూకా 22:41–44; సిద్ధాంతము మరియు నిబంధనలు 19:16–19 చూడండి).

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

ఊహించండి. మనల్ని మనము లేఖనములలో ఊహించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అర్థవంతమైన అంతరార్థములు రాగలవు. ఉదాహరణకు, మిమ్మల్ని మీరు యోబు స్థానంలో ఊహించుకోవడం పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో మీ సంబంధాన్ని ధ్యానించడానికి మీకు సహాయపడగలదు.

చిత్రం
నేలపైనున్న వ్యక్తితో మాట్లాడుతున్న వ్యక్తులు

యోబు మరియు అతని స్నేహితులు, ఇల్యా రెపిన్ చేత

ముద్రించు