2022 పాత నిబంధన
ఆగష్టు 22–28. కీర్తనలు 102–103; 110; 116–119; 127–128; 135–139; 146–150: “సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక”


“ఆగష్టు 22–28. కీర్తనలు 102–103; 110; 116–119; 127–128; 135–139; 146–150: ‘సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“ఆగష్టు 22–28. కీర్తనలు 102–103; 110; 116–119; 127–128; 135–139; 146–150,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
మోకరించిన జనులచేత చుట్టుకొనబడి ఎర్రని అంగీ ధరించిన క్రీస్తు

ప్రతి మోకాలు వంగును, జె. కిర్క్ రిఛర్డ్స్ చేత

ఆగష్టు 22–28

కీర్తనలు 102–103; 110; 116–119; 127–128; 135–139; 146–150

“సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక”

దేవుని వాక్యము “(మీ) త్రోవకు వెలుగైయున్నదని” కీర్తనలు 119:105 బోధిస్తుంది. మీరు కీర్తనలు చదువుతున్నప్పుడు, మిమ్మల్ని ప్రేరేపించి, పరలోక తండ్రి వద్దకు తిరిగివెళ్ళడానికి మీ త్రోవను ప్రకాశింపజేయు వాక్యభాగములు మరియు ఆలోచనలను నమోదు చేయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

కీర్తనల గ్రంథానికి సనాతన యూదుల నామము ఒక హెబ్రీ పదము, దాని అర్థము “స్తుతులు.” తెహిల్లిమ్ అను పదము కూడా “హల్లెలూయా” (దానర్థము “యెహోవాను స్తుతించు” లేక “ప్రభువును స్తుతించు”) కేకకు సంబంధించినది. కీర్తనల ముఖ్య సందేశాన్ని ఒక్క పదములో మీరు చెప్పవలసినట్లయితే, “స్తుతించు” అనునది మంచి ఎంపికవుతుంది. కీర్తనలలో కొన్ని “యెహోవాను స్తుతించుడి” (ప్రత్యేకించి, కీర్తనలు 146–50 చూడండి) అనే తిన్నని ఆహ్వానాన్ని కలిగియుంటాయి మరియు అవన్నీ ఆరాధన, స్తుతి యొక్క భావనను ప్రేరేపించగలవు. ప్రభువు యొక్క శక్తి, ఆయన కనికరము మరియు ఆయన చేసిన గొప్ప పనులపై కేంద్రీకరించమని కీర్తనలు మనల్ని ఆహ్వానిస్తాయి. వీటిలో దేనికొరకు మనము ఆయనకు ఎన్నడూ తిరిగి చెల్లించలేము, కానీ వాటికొరకు మనము ఆయనను స్తుతించగలము. ఆ స్తుతి వివిధ వ్యక్తుల కొరకు వివిధ రూపాలలో ఉండవచ్చు—అది పాడుట, ప్రార్థించుట లేక సాక్ష్యమిచ్చుటను కలిపియుండవచ్చు. అది తరచు ప్రభువుకు మరియు ఆయన బోధనలను అనుసరించుటకు లోతైన నిబద్ధతకు దారితీస్తుంది. మీ జీవితంలో “యెహోవాను స్తుతించుడి” అనగా అర్థమేమైనప్పటికీ, మీరు కీర్తనలను చదివి ధ్యానించుచున్నప్పుడు, వాటిని చేయాలని మీరు మరింత ప్రేరేపణను పొందగలరు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

కీర్తనలు 102–3; 116

నా బాధలో ప్రభువు నన్ను ఓదార్చగలడు.

శ్రమలలో తరచు కలిగే ఆతురత మరియు ఒంటరితనము యొక్క భావాలను కీర్తనలు 102:1–11 ఎలా వివరిస్తాయో గమనించండి. బహుశా మీరు అలాంటి భావాలను అనుభవించియుండవచ్చు మరియు ఈ వివరణలు మీ అనుభవాలను బాగా గ్రహించడానికి మీకు సహాయపడవచ్చు. లేక బాధలో ఉన్న ఇతరుల భావాలను గ్రహించడానికి ఈ వచనాలు మీకు సహాయపడవచ్చు.

మీరు కీర్తనలు 102:12–28; 103; 116 చదువుతున్నప్పుడు, మీ శ్రమలలో మీరు “యెహోవా నామమున ప్రార్థన చేయగలరు” (కీర్తనలు 116:13) అనే నమ్మకాన్ని మీకిచ్చే వాక్యభాగాల కొరకు చూడండి. ఆయన యందు మీకు నిరీక్షణనిచ్చే వాక్యభాగాలను గుర్తించాలని, కంఠస్థం చేయాలని లేక ఇతరులతో పంచుకోవాలని మీరు కోరవచ్చు.

యెషయా 25:8; 2 కొరింథీయులకు 1:3–7; హెబ్రీయులకు 2:17–18; ఆల్మా 7:11–13 కూడా చూడండి.

చిత్రం
స్వస్థపరచుచున్న యేసు

స్వస్థపరచుట, జె. కిర్క్ రిఛర్డ్స్ చేత

కీర్తనలు 110; 118

కీర్తనలు నన్ను రక్షకుని వైపు నడిపించగలవు.

యేసు క్రీస్తు యొక్క జీవితము మరియు పరిచర్య వైపు దారిచూపే వాక్యభాగాలను కీర్తనలు కలిగియున్నాయి. ఇక్కడ కొన్ని మాదిరులున్నాయి:

యేసు క్రీస్తు గురించి ఈ వచనాలు మీకు ఏ సత్యాలను బోధిస్తాయి? ఈ సత్యాలను తెలుసుకోవడం మిమ్మల్ని ఎలా దీవిస్తుంది?

మీరు ఈ వారం కీర్తనలను చదువుతున్నప్పుడు, రక్షకుని గురించి మీకు బోధించే ఇతర వాక్యభాగాలను గుర్తించడం కొనసాగించండి. మీకిష్టమైన కీర్తనలలో ఆయన గురించి ఆలోచించడానికి మీకు సహాయపడే కొన్నింటిని మీరు చదువవచ్చు లేక వినవచ్చు.

కీర్తనలు 119

దేవుని వాక్యము నన్ను ఆయన త్రోవలో నిలుపుతుంది.

మన జీవితాలను పరలోక తండ్రి వద్దకు తిరిగి వెళ్ళే ప్రయాణంతో పోల్చే అనేక వాక్యభాగాలను ఈ కీర్తన కలిగియుంది. మీరు చదువుతున్నప్పుడు, నడుచుకొను, త్రోవ, మార్గము, పాదము, మరియు తిరుగుట వంటి పదాల కొరకు చూడండి. మీరెక్కడ ఉండేవారు, ఇప్పుడు మీరెక్కడ ఉన్నారు మరియు మీరు ఏ వైపు కొనసాగుతున్నారు అని మీ స్వీయ జీవన గమనాన్ని ధ్యానించండి. ఇంటికి తిరిగి వెళ్ళే మీ ప్రయాణం గురించి ఈ కీర్తన నుండి మీరేమి నేర్చుకుంటారు? ఈ కీర్తన ప్రకారము, సరైన దారిలో నిలిచేందుకు మీకు సహాయపడడానికి దేవుడు ఏమి సమకూర్చెను?

ఆదిమ హెబ్రీ భాషలో, కీర్తనలు 119లోని మొదటి ఎనిమిది వచనాలు హెబ్రీయ అక్షరమాలలో మొదటి అక్షరంతో మొదలవుతాయని తెలుసుకోవడం మీకు ఆసక్తికరంగా ఉండవచ్చు. తరువాతి ఎనిమిది వచనాలు తరువాతి అక్షరంతో మొదలవుతాయి మరియు అక్షరమాలలోని చివరి అక్షరం వరకు అలాగే కొనసాగుతాయి.

యెషయా 42:16; 2 నీఫై 31:17–21; ఆల్మా 7:19–20 కూడా చూడండి.

కీర్తనలు 134–36

ప్రభువు సకల విగ్రహముల కంటే అధిక శక్తిమంతుడు.

అబద్ధ దేవుళ్ళను నమ్మడం ఎందుకు అవివేకము అనేదాని గురించి కీర్తనలు 135:15–18లో ఇవ్వబడిన కారణాలను గమనించండి. ఈ వచనాలలో వర్ణించబడిన విగ్రహాలను పోలియున్న దేనియందు నమ్మకముంచుటకు మీకు శోధింపబడవచ్చు?

కీర్తనలు 134–36లో వర్ణించబడినట్లు, ప్రభువు చేయగల శక్తివంతమైన విషయాలను మీరు జాబితా చేయవచ్చు. ఆయన మీ కొరకు చేసిన శక్తివంతమైన విషయములేవి?

కీర్తనలు 146–50

“యెహోవాను స్తుతించుడి.”

ఈ చివరి స్తుతి కీర్తనలను మీరు చదువుతున్నప్పుడు, ప్రభువును స్తుతించడానికి మీకు గల కారణాలను గురించి ఆలోచించండి. ఆయనను స్తుతించుట ఎందుకు ముఖ్యమైనది? మీరు ఆయనను స్తుతించగల విధానాలేవి?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

కీర్తనలు 119:105.బహుశా మీ కుటుంబము ఒక త్రోవను తయారుచేసి, ముందున్న దారిని ప్రకాశింపజేయడానికి ఒక దీపమును ఉపయోగిస్తూ, చీకటిలో ఆ దారిగుండా నడువవచ్చు. మీరు నడుస్తున్నప్పుడు, “మన జీవితాల్లో ఈ చీకటివలె ఉన్నదేది?” లేక “దేవుని వాక్యము వెలుగువలె ఎట్లున్నది?” వంటి ప్రశ్నలను మీరు అడుగవచ్చు. దేవుని వెలుగు గురించి ఒక పాట పాడడం కీర్తనలు 119:105లో బోధించబడిన సూత్రాన్ని బలపరచడానికి మీకు సహాయపడగలదు.

కీర్తనలు 127–28.“(మన) గృహమును నిర్మించుటకు” ప్రభువు మనకు సహాయపడుట అనగా అర్థమేమిటి? (కీర్తనలు 127:1). నీతివంతమైన గృహాన్ని సృష్టించుకోవడానికి మన ప్రయత్నాలలో మనము ఆయనను బాగా ఎలా చేర్చుకోగలము? ఈ ప్రశ్నకు జవాబివ్వడానికి మీ కుటుంబానికి సహాయపడేందుకు, మీరు ఒక కాగితంపై ఇల్లు బొమ్మ గీసి, దానిని పజిల్ ముక్కలుగా కత్తిరించవచ్చు. ప్రభువును మీ గృహములో భాగంగా చేయగల విధానాలను కుటుంబ సభ్యులు ప్రతి ముక్క వెనుకవైపు వ్రాయవచ్చు లేక గీయవచ్చు. అప్పుడు మీరు పజిల్‌ను ఒకటిగా చేర్చవచ్చు. ప్రభువు యొక్క మార్గములలో నడుచుటకు మనల్ని ప్రేరేపించునట్లు ఈ కీర్తనలలో మనము ఇంకేమి కనుగొంటాము?

కీర్తనలు 139.1–4 వచనాలు చదివిన తర్వాత, దేవుడు వారిని వ్యక్తిగతంగా ఎరుగునని (14–15, 23–24 వచనాలు కూడా చూడండి) వారికెలా తెలిసిందో అనేదాని గురించి కుటుంబ సభ్యులు మాట్లాడవచ్చు.

కీర్తనలు 146–50.రచయిత యొక్క భావాలను తెలుపడానికి ప్రయత్నిస్తూ, కీర్తనలు 146–50 నుండి కొన్ని వచనాలను గట్టిగా చదవమని మీరు మీ కుటుంబాన్ని ఆహ్వానించవచ్చు. ప్రభువుకు మన స్తుతిని మనమెలా వ్యక్తపరచగలము? వారి స్వంత స్తుతి కీర్తనలను వ్రాసి, వాటిని ఒకరితోనొకరు పంచుకోవడాన్ని కుటుంబ సభ్యులు ఆనందించవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

ఆడియో రికార్డింగులను ఉపయోగించండి. మీరు మీ కుటుంబానికి బోధిస్తున్నప్పుడు, ChurchofJesusChrist.org or the Gospel Library యాప్‌లో ఉన్న లేఖనాల ఆడియో వర్ణనను వినడం గురించి ఆలోచించండి. కీర్తనలను వినడం ప్రత్యేకంగా శక్తివంతము కాగలదు, ఎందుకనగా అవి బిగ్గరగా గానం చేయడానికి ఉద్దేశించబడినవి.

చిత్రం
అడవిలో త్రోవ

“నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దానియందు నన్ను నడువజేయుము” (కీర్తనలు 119:35).

ముద్రించు