2022 పాత నిబంధన
ఆగష్టు 29–సెప్టెంబరు 4. సామెతలు 1–4; 15–16; 22; 31; ప్రసంగి 1–3; 11–12: “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము”


“ఆగష్టు 29–సెప్టెంబరు 4. సామెతలు 1–4; 15–16; 22; 31; ప్రసంగి 1–3; 11–12: ‘యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021

ఆగష్టు 29–సెప్టెంబరు 4. సామెతలు 1–4; 15-16; 2231; 1-3; 11-12,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

లేఖనములను అధ్యయనము చేయుచున్న పురుషుడు

ఆగష్టు 29–సెప్టెంబరు 4.

సామెతలు 1–4; 15–16; 22; 31; ప్రసంగి 1–3; ప్రసంగి 1–3; 11–12

“యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము”

సామెతలు మరియు ప్రసంగిని అధ్యయనం చేయుట మీరు “జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించుటకు” (సామెతలు 2:2) ఎలా సహాయపడుతుందో ఆలోచించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

సామెతల గ్రంథము యొక్క మొదటి అధ్యాయములో, ఈ మాటలను మనము కనుగొంటాము: “నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము” (సామెతలు 1:8). సామెతలు ఒక ప్రేమగల తల్లి, తండ్రి నుండి తెలివైన సామెతల సేకరణగా చూడబడవచ్చు, వారి ప్రధాన సందేశము ఏదనగా శాంతి, అభివృద్ధి యొక్క దీవెనలు, ప్రత్యేకంగా దేవుడిచ్చే జ్ఞానము—జ్ఞానము వెదకు వారికి వస్తాయి. కానీ సామెతలు తరువాత, ప్రసంగి గ్రంథము, “అది అంత సులువైనది కాదు,” అని చెప్పినట్లు కనబడును. ప్రసంగి రచయత “జ్ఞానమును తెలుసుకొనుటకు [అతడి] మనస్సు నిలిపాడని,” కానీ “ఆత్మ యొక్క ప్రయాసము” మరియు “విస్తారమైన దుఃఖము” (ప్రసంగి 1:17–18) గమనించాడని ప్రసంగిలో వ్యాఖ్యానించాడు. వివిధ విధానాలలో, గ్రంథము ఇలా అడుగును, “సమస్తము వ్యర్థము, తాత్కాలికమైనది, మరియు అస్థిరమైనది గల ప్రపంచంలో నిజమైన అర్థమున్నదా?”

రెండు గ్రంథాలు జీవితాన్ని భిన్నమైన దృక్పథాలనుండి చూచినప్పటికీ, అవి ఒక విధమైన సత్యములను బోధిస్తాయి. ప్రసంగి ప్రకటించాడు: “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను. మానవకోటికి ఇదియే విధి” (ప్రసంగి 12:13). ఇదే సూత్రము సామెతలు అంతటా కనబడతాయి: “నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. … నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు: యెహోవాయందు భయభక్తులు కలిగియుండుము” (సామెతలు 3:5,7). మీ జీవితంలో ఏమి జరిగినప్పటికీ, అది గందరగోళంగా మరియు యాదృచ్ఛికమైనట్లు కనబడినప్పుడు కూడా, ప్రభువైన యేసు క్రీస్తునందు మనము విశ్వాసముంచినప్పుడు అది ఎల్లప్పుడు మేలైనది.

ఈ గ్రంథాల సమీక్ష కోసం, బైబిలు నిఘంటువులో “సామెతలు, గ్రంథాలు” మరియు “ప్రసంగి” చూడండి.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సామెతలు 1–4; 15–16

“జ్ఞానమునకు మీ చెవియొగ్గుడి”

సామెతల గ్రంథము జ్ఞానము గురించి అంతర్‌జ్ఞానములతో నిండియున్నది. 1–4 అధ్యాయములు మరియు 15–16లో మీరు కనుగొనినట్లుగా, “తెలివి” అను మాట మరియు “జ్ఞానము,” “వివేచన” వంటి సంబంధిత మాటలను గుర్తించడానికి పరిగణించండి. తెలివి గురించి మీరు ఆలోచించే విధానమును ఈ అధ్యాయములను ఎలా ప్రభావితం చేస్తుంది? మీరు కనుగొన్నదానిపై ఆధారపడి, “ప్రభువు ఇచ్చే” జ్ఞానమును మీరు ఎలా వివరిస్తారు? (సామెతలు 2:6). “జ్ఞాన హృదయునిగా” (సామెతలు 16:21) ఉండటానికి ప్రభువు యొక్క సహాయమును మీరు ఎలా కోరతారో పరిగణించండి. దేవుని జ్ఞానము నుండి వచ్చే దీవెనలు ఏవి?

సామెతలు 8–9; మత్తయి 7:24–27; 25:1–13 కూడా చూడండి.

సామెతలు 1:7; 2:5; 16:6; 31:30; ప్రసంగి 12:13

“యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట” అనగా ఏమిటి?

ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నారు వివరించారు: “భయాన్ని మరియు అందోళనను కలిగించే లోక సంబంధమైన భయములా కాకుండా, దైవిక భయం, శాంతి, అభయాన్ని, మరియు విశ్వాసము యొక్క ఆధారము. [అది] ప్రభువైన యేసు క్రీస్తు కొరకు లోతైన భక్తిని, గౌరవాన్ని, మరియు విస్మయము ఆయన ఆజ్ఞలకు విధేయతను; అంతిమ తీర్పు మరియు ఆయన నుండి న్యాయమును గూర్చి ఎదురుచూచుటను కలిగియున్నది. … దేవునియందు భయము ఆయనను ప్రేమించుట, ఆయనయందు విశ్వసించుట” (“Therefore They Hushed Their Fears,” Liahona, May 2015, 48–49).

సామెతలు 8:13 కూడా చూడండి.

సామెతలు 4

“నీవు నడుచు మార్గము సరాళము చేయుము”

సామెతలు 4 జ్ఞానము మరియు నీతిని, ఒక “బాట” లేక ఒక “మార్గముగా” ( సామెతలు 3:5–6 కూడా చూడండి) వర్ణించును. ఈ అధ్యాయమును మీరు చదివినప్పుడు, “నీవు నడుచు మార్గము” ధ్యానించటానికి మీకు సహాయపడునట్లు లేఖన భాగాలను మరియు మీ అడుగులు ప్రభువుకు మిమ్మల్ని ఎలా దగ్గరగా చేస్తున్నాయో మీరు కనుగొనవచ్చు. ఉదాహరణకు, 11–12 వచనాలు మరియు 18–19 సరైన మార్గమును అనుసరించుట వలన కలిగే దీవెనలను గూర్చి ఏమి బోధిస్తాయి? 26 మరియు 27 వచనాలు మీకు ఏ అర్థాన్ని కలిగియున్నాయి?

నీఫై 31:18–21 కూడా చూడండి.

సామెతలు 15:1–2, 4, 18,28; 16:24–32

“మృదువైన మాట క్రోధమును చల్లార్చును.”

15 మరియు 16 అధ్యాయాలలో కొన్ని సామెతలు ఇతరులతో, ప్రత్యేకంగా ప్రియమైన వారితో మీరు సంభాషించే విధానమును మెరుగుపరచుకోవటానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. ఉదాహరణకు,“నొప్పించు మాటల” కంటె “మృదువైన మాటను” మీరు ఉపయోగించినప్పటి ప్రత్యేక సమయాలను గూర్చి ఆలోచించండి (సామెతలు15:1). లో సలహా మీరు ఉపయోగించే మాటలను గూర్చి ఆలోచించటానికి మీకు ఎలా సహాయపడుతుంది?

ఎల్డర్ డబ్ల్యూ. క్రైయిగ్ ఝ్విక్ నుండి అంతర్‌జ్ఞానమును పరిగణించండి: “ఒక ‘మృదువైన మాట’ హేతుబద్ధమైన ప్రతిస్పందన—వినయముగల హృదయం నుండి క్రమశిక్షణ కలిగిన మాటలు. మనము ఎన్నడూ నేరుగా మాట్లాడము లేక మనము సిద్ధాంతపరమైన సత్యమును రాజీపడతామని దాని అర్థము కాదు. వేరొకరు అంగీకరించటానికి కష్టమైన సమాచారము గల మాటలు ఆత్మయందు మృదువుగా ఉండవచ్చు” (“What Are You Thinking?Liahona, May 2014,42).

కొంగలకు ఆహారమిస్తున్న స్త్రీ

గుణవతియైన స్త్రీని ఎవరు కనుగొనగలరు? II, లూయీస్ పార్కర్ చేత

సామెతలు 31:10–11.

“యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును.”

సామెతలు 31:10–31 “గుణవతియైన స్త్రీ,” లేక గొప్ప ఆత్మీయ బలము, సామర్థ్యము మరియు ప్రభావముగల స్త్రీని వర్ణించును. ఆమె గురించి ఈ వచనాలు చెప్పు ప్రతీదానిని మీ స్వంత మాటలలో సంక్షిప్తపరచటానికి మీరు ప్రయత్నించవచ్చు. ఆమెలో మీరు అనుకరించగల కొన్ని లక్షణాలేవి?

ప్రసంగి 1–3;12

మర్త్య జీవితం తాత్కాలికమైనది.

ఈ లోకములో అత్యధికము ప్రసంగి 1–2నొక్కిచెప్పినట్లుగా, “వ్యర్థము” (లేక తాత్కాలికమైన మరియు తరచుగా ముఖ్యముకానిది) అని జ్ఞాపకముంచుకొనుట మీకు ఎందుకు విలువైనది? అధ్యాయము 12 లో మీరు కనుగొనేది ఏది నిత్యజీవిత విలువను ఇస్తుంది?

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సామెతలులేఖనాలు మరియు కడవరి–దిన ప్రవక్తల నుండి తెలివైన సలహా సేకరణను—మీ స్వంత “సామెతల గ్రంథములు” సృష్టించుటను మీ కుటుంబము ఆనందించవచ్చు.

సామెతలు 1:7; 2:5; 16:6; ప్రసంగి 12:13–14.కుటుంబ సభ్యులు గ్రహించటానికి సహాయపడటానికి, సామెతలు 1:7; 2:5; 16:6; ప్రసంగి 12:13, భయము మాటకు బదులుగా భక్తిగల గౌరవము, ప్రేమ, లేక విధేయత (హెబ్రీయులకు 12:28 కూడా చూడండి) మాటను ఉంచుట సహాయపడవచ్చు. ఈ వచనాలను గూర్చి మనము ఆలోచించే విధానమును ఇది ఎలా ప్రభావితం చేస్తుంది? మనము ప్రభువుకు భయపడుతున్నామని ఎలా చూపగలము?

సామెతలు 3:5–7.కుటుంబ సభ్యులు ఈ వచనాలు బోధించే దానిని దృశ్యీకరించటానికి సహాయపడటానికి వారిని గోడవంటి దృఢమైన మరియు స్థిరమైన దానికి, ఆనుకోమని అడగండి. తరువాత చీపురు వంటి, దృఢముగా లేని దానికి ఆనుకోవడానికి వారు ప్రయత్నించవచ్చు. మనము ఎందుకు “[మన] స్వబుద్ధిని ఆధారము చేసుకొనకుండా” ఉండాలి? మన పూర్ణ హృదయాలతో యేసు క్రీస్తును మనము నమ్ముతున్నామని ఎలా చూపగలము?

సామెతలు 15:1–2,18; 16:24,32.మన మాటలు మన గృహములో ఎటువంటి ప్రభావాన్ని కలిగియుంటాయి? కుటుంబ సభ్యులు “నొప్పించు మాటలకు” “మృదువైన జవాబును” ఇవ్వడాన్ని సాధన చేయవచ్చు మరియు ఒకరినొకరితో వారి పరస్పర చర్యలందు వారు నేర్చుకొన్న దానిని ఉపయోగించడానికి ప్రయత్నించగలరు. “Kindness Begins with Me” (Children’s Songbook,145) వంటి పాట ఈ సూత్రమును బలపరచగలదు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

లేఖనముల మాటలు అందరికీ అన్వయిస్తాయి. కొన్ని లేఖన భాగాలు పురుషులకు మాత్రమే లేక స్త్రీలకు మాత్రమే సూచిస్తాయి (సామెతలు 3:13; 31:10 వంటివి). అయినప్పటికీ, అనేక సందర్భాలలో ఈ లేఖన భాగాలలో సూత్రములు ప్రతీఒక్కరికి అన్వయిస్తాయి.

రెండు గొఱ్ఱెలను అడవిలోనికి నడిపించుచున్న యేసు

“నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును”(సామెతలు 3:6). ఆయన నన్ను నడిపించును, యోంగ్‌సంగ్ కిమ్ చేత, havenlight.com