2022 పాత నిబంధన
సెప్టెంబరు 19–25. యెషయా 40–49: “నా జనులను ఓదార్చుడి”


“సెప్టెంబరు 19–25. ఆదికాండము 40–49: ‘నా జనులను ఓదార్చుడి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“సెప్టెంబరు 19–25. యెషయా 40–49,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
గ్రుడ్డివానిని స్వస్థపరుస్తున్న యేసు

గ్రుడ్డివానిని స్వస్థపరచుట, కార్ల్ హెన్రిచ్ బ్రాక్ చేత

సెప్టెంబరు 19–25

యెషయా 40–49

“నా జనులను ఓదార్చుడి”

యెషయా చిహ్నరూపమైన భాషను తరచుగా ఉపయోగించాడు. మీ మనస్సు, హృదయములోనికి ఈ చిహ్నములు తెచ్చే ఆలోచనలు మరియు భావనలకు ఆసక్తిని చూపండి. అతడు బోధించిన దానిని మీరు బాగా గ్రహించటానికి ఇది మీకు సహాయపడవచ్చు.

మీ మనోభావాలను నమోదు చేయండి

యెషయా 40 అధ్యాయములో మొదటి మాట “ఓదార్చుడి.” అది ప్రవక్త సందేశములో భిన్నమైన భావన, భిన్నమైన ఉద్ఘాటన యొక్క ప్రారంభాన్ని గుర్తించును. యెషయా యొక్క ముందు రచనలు ఇశ్రాయేలు మరియు యూదా నాశనము, చెరను గూర్చి హెచ్చరించినప్పటికీ, ఈ తరువాత ప్రవచనాలు యెరూషలేము నాశనము చేయబడి, దేవాలయము అపవిత్రం చేయబడి, జనులు బబులోనుకు చెరపట్టబడిన తరువాత—భవిష్యత్తులో 150 సంవత్సరాలు పైగా యూదులను ఓదార్చుటకు ఉద్దేశించబడినవి. కానీ ఈ ప్రవచనాలు ఓడిపోయిన, నిరుత్సాహపడిన ఇశ్రాయేలీయుల కంటే భవిష్యత్తులో ముందున్న వారికి మరింత ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు ఓడిపోయి, నిరుత్సాహపడి, మరియు తప్పిపోయిన మనతో, యెషయా యొక్క ప్రవచనాలు మాట్లాడతాయి.

ఇశ్రాయేలీయులకు మరియు మనకు సందేశము సరళమైనది: “భయపడకుడి” (యెషయీ 43:1). సమస్తము కోల్పోబడలేదు. ప్రభువు మిమ్మల్ని మరచిపోలేదు, మీ ఆధీనములో లేనట్లుగా కనబడిన పరిస్థితులపై ఆయనకు శక్తి ఉన్నది. “ఆయన ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి, మరియు … భూమిని పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును ఇచ్చినది” ప్రభువు కాదా? (యెషయా 42:5). ఆయన బబులోను కంటె, పాపము కంటె, మిమ్మల్ని చెరపట్టిన పట్టినది దేనికన్నా ఆయన శక్తిమంతుడు కాదా? “నేను నిన్ను విమోచించియున్నాను” “నా యొద్దకు మళ్లుకొనుము,” (యెషయా 44:22) ఆయన వేడుకున్నాడు. మీ విషయంలో, విమోచించబడటానికి, మీ కవసరమైనది ఏదైనా ఆయన—స్వస్థపరచగలడు, పునఃస్థాపించగలడు, బలపరచగలడు, క్షమించగలడు, మరియు ఓదార్చగలడు.

నీఫై మరియు జేకబ్ వారి జనులకు యెషయా 48–49 ఎలా పోల్చారో నేర్చుకోవటానికి 1నీఫై 22 మరియు 2నీఫై 6 చూడండి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

యెషయా 40–49

యేసు క్రీస్తు నన్ను ఓదార్చగలడు మరియు నాకు నిరీక్షణను ఇవ్వగలడు.

బబులోనులో తమను తాము బంధీలుగా చూచుట ఇశ్రాయేలీయులకు, నిరాశపరచి, వినాశనంగా కూడా కనిపించియుండవచ్చు. దేవుని యొక్క ఏర్పరచబడిన, నిబంధన జనులుగా వారి స్థానమును శాశ్వతంగా కోల్పోయారని అనేకమంది ఆశ్చర్యపడియుండవచ్చు. యెషయా 40–49 మీరు చదివినప్పుడు, ఓదార్పు మరియు నిరీక్షణను అందించే లేఖన భాగాల కోసం వెదకండి. మీరు కనుగొనే ప్రతీ లేఖన భాగములో, ఈ వచనాలలో ప్రభువు మీతో చెప్పబోయే దానిని ధ్యానించండి మరియు వ్రాయండి. మీరు ప్రారంభించగల కొన్ని ఆలోచనలు ఇక్కడున్నాయి:

ప్రోత్సాహము లేక నిరీక్షణ అవసరమైన ఒకరితో ఈ సందేశాలను మీరు ఎలా పంచుకోగలరు? (యెషయా 40:1–2 చూడండి).

జెఫ్రీ ఆర్. హాల్లండ్ “A Perfect Brightness of Hope,” Ensign or Liahona, May 2020, 81–84 కూడా చూడండి.

చిత్రం
అడవిలో నది

ప్రభువుకు విధేయులగుట ద్వారా “నదివలె … శాంతిని” మనము కలిగియుండగలము (యెషయా 48:18).

యెషయా 40:3–8, 15–23; 42:15–16; 47:7–11

దేవుని యొక్క శక్తి లోకసంబంధమైన శక్తి కంటె గొప్పది.

యెషయా దేవుని యొక్క అసమానమైన శక్తిని గూర్చి ఆయన జనులకు పలుమార్లు జ్ఞాపకం చేసాడు, వారిని చుట్టుముట్టిన అణచివేసే ప్రాపంచిక శక్తితో పోల్చాడు కూడా. యెషయా 40:3–8, 15–23; 42:15–16; మరియు 47:7–11 (47 అధ్యాయము మీరు చదివినప్పుడు, (ఇశ్రాయేలును చెరపట్టిన, బబులోనుతో ప్రసంగించబడిందని గమనించండి) ఈ సందేశము కోసం చూడండి. ఈ లేఖన భాగాలు మీకు లోకసంబంధమైన విషయాలను గూర్చి ఏమి బోధిస్తున్నాయి? అవి దేవుని గురించి మీకేమి బోధిస్తాయి? చెరలో ఉన్న యూదులకు ఈ సందేశము ఎందుకు విలువైనదో ధ్యానించండి. అది మీకెందుకు విలువైనది?

Abide with Me!” కూడా చూడండి కీర్తనలు, సం.166.

యెషయా 41:8–13; 42:1–7; 43:9–12; 44:21–28; 45:1–4; 48:10; 49:1–9

“నీవు నా సేవకుడవు.”

యెషయా 40–4 అంతటా ప్రభువు తన “సేవకుడు” మరియు “సాక్షులు” గురించి మాట్లాడాడు. కొన్ని లేఖన భాగాలలో ఈ మాటలు యేసు క్రీస్తును సూచిస్తున్నట్లు కనబడుతున్నాయి (యెషయా 42:1–7 చూడండి), (యెషయా 45:4 చూడండి), మరియు యూదులను యెరూషలేముకు తిరిగి వెళ్ళుటకు మరియు దేవాలయాన్ని పునర్న్మించటానికి అనుమతించిన, కోరెషు రాజును సూచిస్తున్నాయి (44:26–45:4 చూడండి). ప్రతి సందర్భములో, లేఖన భాగాలు ప్రభువు యొక్క సేవకునిగా మరియు ఒక సాక్షిగా మీకు ఎలా అన్వయిస్తాయో కూడా మీరు పరిగణించవచ్చు. ఉదాహరణకు, ఇటువంటి ప్రశ్నలను ధ్యానించండి:

యెషయా 41:8–13; 42:6; 44:21. ఏమి చేయమని ప్రభువు మిమ్మల్ని పిలిచాడు? ఆయనకు సేవ చేయటానికి ముందు సంఘ పిలుపులు అదేవిధంగా మిగిలిన నిబంధన బాధ్యతలను పరిగణించండి. మీరు సేవ చేసినప్పుడు, ఆయన మీకు ఎలా సహాయపడ్డాడు మరియు “[మీ] చేతిని పట్టుకొన్నాడు” (యెషయా 42:6)? ఆయన తన సేవకునిగా కావటానికి మిమ్మల్ని ఎలా “రూపించాడు”? (యెషయా 48:10 కూడా చూడండి).

యెషయా 43:9–12. ఏ భావములో మీరు యేసు క్రీస్తు యొక్క సాక్షి? మీ జీవితంలో ఏ అనుభవాలు ఆయన రక్షకుడని మీకు చూపాయి?

యెషయా 49:1–9. మీ ప్రయత్నాలు మరియు సేవ “వ్యర్థముగా, వృధాగా” కనపించినప్పుడు ఈ వచనాలలో మీరు కనుగొనే సందేశాలేవి? (4 వచనము).

మోషైయ 18:9; హెన్రీ బి. ఐరింగ్, “A Child and a Disciple,” Ensign or లియహోనా, మే 2003, 29–32 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

యెషయా 40:3–4.“యెహోవాకు మార్గము … సిద్ధపరచుడి” అనగా అర్థమేమిటో అన్వేషించటానికి, మీ కుటుంబము వంగిన దానిని సరిచేయవచ్చు, చిందరవందరగా ఉన్న నేలను శుభ్రం చేయవచ్చు, లేక రాతి నేలలో ఒక స్పష్టమైన బాటను చేయవచ్చు. బాప్తీస్మమిచ్చే యోహాను మరియు జోసెఫ్ స్మిత్ యొక్క చిత్రాలను కూడా మీరు చూపించవచ్చు (Gospel Art Book, nos. 35,87 చూడండి). ప్రభువు యొక్క రాకడ కోసం వారు మార్గమును ఎలా సిద్ధపరిచారు? (లూకా 3:2–18; సిద్ధాంతము మరియు నిబంధనలు 135:3 చూడండి). ఆయన కోసం మార్గము సిద్ధపరచటానికి మనము ఎలా సహాయపడగలము? (ఉదాహరణకు, సిద్ధాంతము మరియు నిబంధనలు 33:10 చూడండి).

యెషయా 40:28; 43:14–15; 44:6.ఈ వచనాలలో మనము కనుగొనే యేసు క్రీస్తు యొక్క పేర్లు లేక శీర్షికలేవి? ప్రతీ పేరు ఆయన గురించి మనకు ఏమి బోధిస్తుంది?

యెషయా 41:10; 43:2–5; 46:4.How Firm a Foundation” (Hymns, no.85) కీర్తనలో ఈ వచనాలు ప్రతిఫలిస్తాయి. మీ కుటుంబము కీర్తనను కలిసి పాడుటను మరియు ఈ పల్లవులతో పోలిన వాక్యభాగాలను దానిలో కనుగొనుటను ఆనందించవచ్చు. యేసు క్రీస్తు గురించి ఈ లేఖన భాగాలు మనకేమి బోధిస్తాయి?

యెషయా 44:3–4; 45:8.ఈ వచనాలు చదివిన తరువాత, ప్రభువు వారిపై కుమ్మరించిన దీవెనలను గూర్చి మీరు మాట్లాడినప్పుడు, మీ కుటుంబము ఒక మొక్కకు నీటిని వేయవచ్చు. మనము ఒక మొక్కకు నీటిని వేసినప్పుడు ఏమి జరుగుతుంది? ఆయన మనల్ని దీవించినప్పుడు, ప్రభువు మన నుండి ఏమి ఆశిస్తున్నాడు?

యెషయా 48:17–18.నదులు మరియు సముద్ర తరంగాల చిత్రాలు లేక వీడియోలను చూపడానికి పరిగణించండి. శాంతి, ఒక నదివలె ఎలా ఉన్నది? నీతి సముద్ర తరంగము వలె ఎలా ఉన్నది?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

పదాలను నిర్వచించండి. లేఖనాలలో మీకు అర్థము కాని పదాలకు—మీరు అర్థం చేసుకొన్నారని అనుకొనే మాటలకు కూడా నిర్వచనాలను వెదకటానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు నిర్వచనాలు ఒక వచనాన్ని భిన్నంగా చదవడానికి మరియు క్రొత్త అంతరార్థమును పొందడానికి మీకు సహాయపడగలవు.

చిత్రం
బాలిక మరియు వ్యక్తితో యేసు

“శ్రమనొందిన తన జనులయందు జాలిపడి, యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు” (యెషయా 49:13).గిలాదులో గుగ్గిలము, ఆన్ అడిలె హెన్రీ చేత

ముద్రించు