“సెప్టెంబరు 5–11. యెషయా 1–12: ‘దేవుడే నా రక్షణాధారము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“సెప్టెంబరు 5–11. యెషయా 1–12,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
సెప్టెంబరు 5–11
యెషయా 1–12
“దేవుడే నా రక్షణాధారము”
మీరు చదువుతున్నప్పుడు ఆత్మీయ నడిపింపును వెదకండి. నీఫై బోధించినట్లుగా, మనము “ప్రవచనాత్మతో నింపబడినప్పుడు” యెషయా మాటలు బాగా గ్రహించబడతాయి (2 నీఫై 25:4).
మీ మనోభావాలను నమోదు చేయండి
మీరు యెషయా గ్రంథాన్ని చదవడం ఇదే మొదటిసారి అయినప్పటికీ, వాక్యభాగాలు పరిచయమున్న వాటిలా మీకనిపించవచ్చు. అది ఎందుకంటే, పాత నిబంధన ప్రవక్తలందరిలో చాలా తరచుగా ఇతర లేఖన గ్రంథాలలో, అలాగే రక్షకుని చేత ఉదహరించబడిన వారిలో ప్రవక్త యెషయా ఒకరు. యెషయా మాటలు తరచు కీర్తనలలో మరియు ఇతర పవిత్ర సంగీతంలో కనిపిస్తాయి. ఎందుకింత తరచుగా యెషయా ఉదహరించబడ్డాడు?
ఖచ్చితంగా దానికి కారణం దేవుని వాక్యాన్ని స్పష్టంగా, జ్ఞాపకముంచుకోదగిన భాషలో వ్యక్తపరిచే బహుమానాన్ని యెషయా కలిగియుండడం. కానీ, ఇది అంతకు మించినది. తరతరాలకు యెషయా ప్రవక్తలను ప్రేరేపించాడు, ఎందుకంటే ఆయన బోధించిన సత్యాలు ఆయన కాలాన్ని, అనగా క్రీ.పూ. 740 నుండి 701 మధ్య జీవించిన ఇశ్రాయేలీయులను అధిగమించినవి. దేవుని యొక్క గొప్ప కార్యమైన విమోచనను గ్రహించడానికి మనకు సహాయపడడమే ఆయన పాత్ర, అది ఒక దేశం లేదా ఒక సమయం కంటే ఎంతో పెద్దది. మిగిలిన ఇశ్రాయేలీయుల నుండి వేరుచేయబడినప్పటికీ, అతడు మరియు అతని జనులు ఇంకా దేవుని నిబంధన జనులలో భాగమేనని యెషయా నుండి నీఫై నేర్చుకున్నాడు. మెస్సీయా గురించి తమ కళ్ళ ముందు నెరవేర్చబడిన ప్రవచనాలను క్రొత్త నిబంధన లేఖకులు యెషయాలో కనుగొన్నారు. ఇశ్రాయేలు సమకూర్పు మరియు సీయోను నిర్మాణము యొక్క కడవరి-దిన కార్యము కొరకు ప్రేరేపణను యెషయాలో జోసెఫ్ స్మిత్ కనుగొన్నారు. మీరు యెషయాను చదివినప్పుడు, మీరేమి కనుగొంటారు?
యెషయా మరియు ఆయన వ్రాతల గురించి మరింతగా తెలుసుకోవడానికి బైబిలు నిఘంటువులో “యెషయా” చూడండి. యెషయా జీవించిన కాలం గురించి సమాచారం కొరకు 2 రాజులు 15–20 మరియు 2 దినవృత్తాంతములు 26–32 చూడండి.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
యెషయా బోధనలను నేను బాగా ఎలా అర్థం చేసుకోగలను?
యెషయా వ్రాతల గురించి మాట్లాడుతూ, “ఈ విషయములను శ్రద్ధగా వెదకండి; ఏలయనగా యెషయా మాటలు గొప్పవి” (3 నీఫై 23:1–3 చూడండి) అని రక్షకుడు చెప్పారు. అయినప్పటికీ, చాలామందికి యెషయాను అర్థం చేసుకోవడం కష్టం కాగలదు. యెషయా మాటలలో గొప్ప అర్థాన్ని కనుగొనడానికి మీకు సహాయపడేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి:
-
యెషయా ఉపయోగించిన చిహ్నాలను మరియు ఉదాహరణలను ధ్యానించండి. ఉదాహరణకు, ద్రాక్షతోట (యెషయా 5:1–7 చూడండి), షిలోహు నీళ్ళు (యెషయా 8:5–10 చూడండి), ధ్వజము (యెషయా 5:26 చూడండి) మరియు ధ్వజము (యెషయా 11:10,12 చూడండి) గురించి వ్రాసినప్పుడు ఏమి చెప్పాలని యెషయా కోరుతున్నాడని మీరనుకుంటున్నారో ధ్యానించండి.
-
ప్రతి అధ్యాయాన్ని మీరు చదివినప్పుడు, “నేను యేసు క్రీస్తు గురించి ఏమి నేర్చుకుంటున్నాను?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి (1 నీఫై 19:23 చూడండి).
-
మన కాలానికి తగినట్లుగా, యేసు క్రీస్తు యొక్క జీవితం మరియు నియమిత కార్యము, ఇశ్రాయేలు చెదిరిపోవుట మరియు సమకూర్చబడుట, అంత్యదినములు మరియు వెయ్యేండ్లు వంటి విషయాల కొరకు చూడండి. యెషయా నుండి ఈ విషయాల గురించి బోధించే ఉదాహరణల జాబితాలను కూడా మీరు చేయవచ్చు.
-
లభ్యతను బట్టి నిఘంటువు, బైబిలు పాదవివరణలు, అధ్యాయ శీర్షికలు మరియు లేఖన దీపిక వంటి అధ్యయన సహాయాలను ఉపయోగించండి.
2 నీఫై 25:1–8 కూడా చూడండి.
“కీడు చేయుట మానుడి.”
వారి ఆధ్యాత్మిక స్థితి గురించి యెషయా నిరంతరము యూదా రాజ్యాన్ని హెచ్చరించాడు. యెషయా 1, 3 మరియు 5 చదివిన తర్వాత, జనుల ఆధ్యాత్మిక స్థితి గురించి మీరెలా వివరిస్తారు? మన కాలానికి అన్వయించదగినట్లు అనిపించే ఏ హెచ్చరికలను మీరు కనుగొంటారు?
హెచ్చరికలకు అదనంగా, పాపపూరితమై ఇశ్రాయేలు కొరకు నిరీక్షణ సందేశాలను కూడా మీరు నమోదు చేసుకోవచ్చు ( ఉదాహరణకు,యెషయా 1:16–20, 25–27; 3:10 చూడండి). ఈ సందేశాల నుండి ప్రభువు గురించి మీరేమి నేర్చుకుంటారు?
కడవరి దినాలలో దేవుడు గొప్ప కార్యము జరిగిస్తారు.
యెషయా వ్రాతలలో అనేకము మన కాలము కొరకు ప్రత్యేక అర్థమున్న ప్రవచనాలైయున్నాయి. 2; 4; 11–12 అధ్యాయాలలో కడవరి దినముల గురించి యెషయా వర్ణనలలో ప్రత్యేకంగా ఏది మీకు ప్రేరణగా ఉంది? (యెషయా 11 గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 113:1–6 సహాయకరమైన అంతరార్థములను అందిస్తుంది.) ఇశ్రాయేలు సమకూర్పు మరియు సీయోను విమోచన గురించి మీరేమి నేర్చుకుంటారు? ఈ అధ్యాయాలను చదివిన తర్వాత మీరు ఏమి చేయడానికి ప్రేరేపించబడ్డారు?
యెషయా 5:26; 10:20. కూడా చూడండి.
ప్రవక్తలు దేవునిచేత పిలువబడ్డారు.
అధ్యాయము 6లో, ఒక ప్రవక్తగా తన పిలుపును యెషయా వివరించాడు. మీరు ఈ అధ్యాయమును చదువుతున్నప్పుడు, యెషయా అనుభవించిన దానిలో ఏది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది? ప్రభువు, ఆయన ప్రవక్తలు మరియు వారు చేయాలని పిలువబడిన కార్యము గురించి మీ ఆలోచనా విధానాన్ని ఈ అధ్యాయము ఎలా ప్రభావితం చేస్తుంది?
యేసు క్రీస్తు గురించి యెషయా ప్రవచించాడు.
యెషయా పరిచర్య ప్రారంభంలో, ఇశ్రాయేలు రాజ్యము (ఇఫ్రాయిము అని కూడా పిలువబడింది) అష్షూరు నుండి తననుతాను కాపాడుకోవడానికి సిరియాతో సంబంధము ఏర్పరచుకుంది. యూదా రాజైన ఆహాజును తమతో చేరమని బలవంతం చేయాలని ఇశ్రాయేలు మరియు సిరియా కోరాయి. కానీ ఆ సంబంధము విఫలమవుతుందని యెషయా ప్రవచించాడు మరియు ప్రభువు నందు నమ్మికయుంచమని ఆహాజుకు సలహా ఇచ్చాడు (యెషయా 7–9, ప్రత్యేకించి యెషయా 7:7–9; 8:12–13 చూడండి).
యెషయా ఆహాజుకు సలహా ఇచ్చినప్పుడు, యెషయా 7:14; 8:13–14; 9:2, 6–7 కనుగొనబడునటువంటి సుప్రసిద్ధ ప్రవచనాలనేకము ఆయన చేసాడు. ఈ ప్రవచనాలకు అర్థమేమిటో ఆహాజు కాలంలో పూర్తిగా స్పష్టం కానప్పటికీ, అవి స్పష్టంగా యేసు క్రీస్తుకు అన్వయిస్తాయి (మత్తయి 1:21–23; 4:16; 21:44; లూకా 1:31–33 కూడా చూడండి). ఈ వచనాల నుండి రక్షకుని గురించి మీరేమి నేర్చుకుంటారు?
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
యెషయా 1:16–18.ఈ వచనాలను గ్రహించడానికి కుటుంబ సభ్యులకు సహాయపడేందుకు మీరు సహోదరి షారన్ యుబాంక్ గారి సందేశము “క్రీస్తు: అంధకారములో ప్రకాశించు వెలుగు” (ఎన్‌సైన్ లేదా లియహోనా, మే 2019,75) నుండి “మనం ఎప్పటికీ తగినంతగా కాలేమని మనలో కొందరు భావిస్తారు” అనే భాగాన్ని చదువవచ్చు. లేదా బట్టల నుండి మరకలు ఏవిధంగా తొలగించబడగలవో మీరు చేసి చూపవచ్చు. ఈ వచనాలలో ఉన్న ప్రభువు యొక్క సందేశము మనం నమ్మాలని సాతాను కోరుతున్న దానినుండి భిన్నంగా ఎలా ఉంది?
-
యెషయా 2:1–5.కుటుంబ సభ్యులు ఈ వచనాలలో ఒకదానిని ఎంచుకొని, అది వివరించే దానిని చిత్రించవచ్చు. ప్రభువు యొక్క విధానాల గురించి దేవాలయము మనకు ఏమి బోధిస్తుంది? మనము “యెహోవా వెలుగులో నడచుకొనినప్పుడు”, మనమెలా దీవించబడ్డాము? (యెషయా 2:5).
-
యెషయా 4:5–6.ఈ వచనాలలో ప్రభువు మనకు ఏమి వాగ్దానమిస్తున్నారు? ఈ వాగ్దానాలకు అర్థము ఏమైయుండవచ్చు? ఆయన వాటిని ఎలా నేరవేరుస్తున్నారు? (నిర్గమకాండము 13:21–22 కూడా చూడండి.)
-
యెషయా 7:14; 9:1–7.ఈ వచనాల నుండి యేసు క్రీస్తు గురించి మనం నేర్చుకొనే కొన్ని విషయాలను వివరిస్తూ, సంఘ మాసపత్రికల నుండి చిత్రాలను లేదా బొమ్మలను ఉపయోగించి మీరొక పోస్టరును తయారు చేయవచ్చు.
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.