2022 పాత నిబంధన
జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: ప్రవక్తలు మరియు ప్రవచనము


“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: ప్రవక్తలు మరియు ప్రవచనము,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: ప్రవక్తలు మరియు ప్రవచనము,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
ఆలోచనల చిహ్నము

జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు

ప్రవక్తలు మరియు ప్రవచనము

పాత నిబంధన యొక్క సాంప్రదాయ క్రైస్తవ విభాగంలో, చివరి విభాగం (యెషయా నుండి మలాకీ వరకు) “ప్రవక్తలు”1 అని పిలవబడింది. ఈ భాగము, దాదాపు పాత నిబంధనలో నాలుగవ వంతు, దేవునిచేత నియమించబడిన సేవకుల మాటలను కలిగియున్నది, వారు ప్రభువుతో మాట్లాడారు మరియు దాదాపు 900 మరియు 500 క్రీ.పూ మధ్య ప్రజలతో ఆయన సందేశాన్ని పంచుకుంటూ, ఆయన కొరకు మాట్లాడారు.2

ప్రవక్తలు మరియు ప్రవచనము పాత నిబంధన అంతటా ప్రధాన పాత్ర పోషిస్తాయి. మూల పురుషులైన అబ్రాహాము, ఇస్సాకు, మరియు యాకోబులు దర్శనాలను చూసారు మరియు పరలోక రాయబారులతో మాట్లాడారు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు మరియు ఆయన చిత్తమును ఇశ్రాయేలీయులకు తెలియజేసాడు. మొదటి, రెండవ రాజుల గ్రంథాలు ప్రవక్తలు ఎలీయా మరియు ఎలీషాల యొక్క జ్ఞాపకార్థమైన కార్యములు మరియు సందేశాలను సమగ్రంగా వివరించును. పాత నిబంధన మిర్యాము (నిర్గమకాండము 15:20 చూడండి) దెబోరా (న్యాయాధిపతులు 4) ప్రవక్త్రిలతో పాటు, రిబ్కా, (ఆదికాండము 25:21–23చూడండి) హన్నా (1సమూయేలు 1:20–2:10చూడండి) వంటి, ప్రవచానత్మక ఆత్మతో దీవించబడిన మిగిలిన స్త్రీలను గూర్చి మాట్లాడును. కీర్తనలు లాంఛనంగా ప్రవక్తలచేత వ్రాయబడనప్పటికీ, మెస్సీయా రాకడకు కీర్తనలు ఆతృతగా ఎదురుచూచినప్పుడు, అవి కూడా ప్రవచనాత్మకతో నింపబడినవి.

దీనిలో ఏదీ కడవరి దిన పరిశుద్ధులకు ఆశ్చర్యం కలిగించవు. వాస్తవానికి, ప్రవక్తలు చరిత్రలో ముఖ్యమైన విషయము మాత్రమే కాదు కానీ దేవుని ప్రణాళికలో ముఖ్యమైన భాగమని యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త మనకు బోధించును. కొందరు ప్రవక్తలను పాత నిబంధన కాలములకు ప్రత్యేకమైనదిగా చూడగా, మనము వారిని పాత నిబంధన కాలములతో మనకు ఉమ్మడిగా ఉన్నదానిగా చూస్తాము.

ఇంకను, యెషయా లేక యెహెజ్కేలు నుండి ఒక అధ్యాయమును చదువుట, ప్రస్తుత సంఘ అధ్యక్షుని నుండి సర్వసభ్య సమావేశాలను చదువుట నుండి భిన్నంగా ఉండవచ్చు. కొన్నిసార్లు ఆ ప్రాచీన ప్రవక్తలు మనకు చెప్పడానికి ఏదైనా కలిగియున్నారని చూచుట కష్టమైనకావచ్చు. ఏమైనా, నేడు మనం జీవించే ప్రపంచం వారు ప్రకటించిన, ప్రవచించిన లోకం నుండి చాలా భిన్నమైనది. మనము జీవిస్తున్న ప్రవక్తను కలిగియున్నాము అనే వాస్తవము ఒక ప్రశ్నను రేకెత్తించవచ్చు. ప్రాచీన ప్రవక్తల మాటలను చదవడానికి ప్రయత్నం ఎందుకు విలువైనది-మరియు ప్రయత్నం అవసరం?

మనకు చెప్పడానికి వారు ఏదైనా కలిగియున్నారు.

చాలా వరకు, ఈరోజు జనులు పాత నిబంధన ప్రవక్తల యొక్క ప్రాధమిక ప్రేక్షకులు కాదు. మన కడవరి దిన ప్రవక్తలు ఈరోజు మన తక్షణ సమస్యలను పరిష్కరించినట్లుగా—ఆ ప్రవక్తలు వారి కాలము, ప్రదేశంలో వారు పరిష్కరించే తక్షణమైన ఆందోళనలను కలిగియున్నారు.

అదే సమయంలో, ప్రవక్తలు తక్షణ సమస్యలను మించి కూడా చూడగలరు. ఒక విషయమేమిటంటే, వారు ఏ వయస్సుకైనా సంబంధించే నిత్య సత్యములను బోధిస్తారు. బయల్పాటుతో దీవించబడి, వారు దేవుని కార్యము యొక్క విస్తృతమైన దృక్పథమును, పెద్ద చిత్రమును చూస్తారు. ఉదాహారణకు, యెషయా తన కాలములో జనులను వారి పాపములను గూర్చి హెచ్చరించుట మాత్రమే కాదు — అతడు భవిష్యత్తులో 200 సంవత్సరాలలో జీవిస్తున్న ఇశ్రాయేలీయుల కొరకు విడుదల గురించి వ్రాయగలడు, అదేవిధంగా దేవుని జనులందరూ వెదకాల్సిన విమోచన గురించి బోధించగలడు. అదనంగా, అతడు ఇప్పటికి వాటి పూర్తి నెరవేర్పు కోసం ఎదురుచూస్తున్న ప్రవచనాలను వ్రాయగలడు, “క్రొత్త భూమి” (యెషయా 65:17) అది “యెహోవాను గూర్చి జ్ఞానముతో నిండియున్నది” ( యెషయా 11:9), చెదరిపోయిన ఇశ్రాయేలు గోత్రములు సమకూర్చబడిన చోట, అక్కడ “రాజ్యములు” “యుద్ధము చేయ నేర్చుకొనుట మానివేయును” (యెషయా 2:4) వంటి వాగ్దానములు. యెషయా వంటి పాత నిబంధన ప్రవక్తల మాటలను చదవటం నుండి వచ్చిన సంతోషము మరియు ప్రేరేపణలో భాగము ఏదనగా వారు ఊహించిన మహిమకరమైన దినములో మనము ఒక పాత్రను పోషించుట.3

ప్రాచీన ప్రవచనాలను మీరు చదివినప్పుడు, అవి వ్రాయబడిన సందర్భము గురించి నేర్చుకొనుట సహాయకరంగా ఉంటుంది. కానీ మిమ్మల్ని మీరు ప్రవచనాలలో కూడా చూడాలి, లేక దానిని నీపై చెప్పినట్లుగా, “వాటిని [మీకు] పోల్చుకోవాలి,” (1నీఫై 19:23–24 చూడండి). కొన్నిసార్లు దానికి అర్థము బబులోనును ఒక ప్రాచీన పట్టణముగా చూడకుండా, లోకసంబంధమైనది మరియు గర్వము యొక్క చిహ్నముగా చూచుట. దానికి అర్థము ఏ యుగములోనైన దేవుని యొక్క జనులుగా ఇశ్రాయేలును గ్రహించుట మరియు యెరూషలేము కొరకు మరొక పదంగా కాకుండా, కడవరి దిన హేతువుగా సీయోనును గ్రహించుట దేవుని యొక్క జనులు హత్తుకొనునట్లు చేస్తుంది.

బహు విధాలుగా ఒక ప్రవచనం నెరవేర్చబడగలదని మనము గ్రహిస్తాము కనుక లేఖనాలను మనం పోల్చుకోగలము.4 ఈ ప్రవచనమునకు మంచి మాదిరి యెషయా 40:3 లో ఉన్నది: “అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, యెహోవాకు మార్గము సిద్ధపరచుడి.” బబులోనులో చెరపట్టబడిన యూదులకు, ఈ వ్యాఖ్యానము, చెరనుండి బయటకు మరియు యెరూషలేముకు తిరిగి వెళ్లుటకు ప్రభువు ఒక మార్గమును ఇచ్చుటను సూచించియుండవచ్చు. మత్తయి, మార్కు, మరియు లూకాలకు, ఈ ప్రవచనము బాప్తీస్మమిచ్చు యోహానుయందు నెరవేర్చబడింది, అతడు రక్షకుని యొక్క మర్త్య పరిచర్య కొరకు మార్గమును సిద్ధపరిచెను.5 మరియు క్రీస్తు యొక్క వెయ్యేండ్ల పరిచర్య కొరకు సిద్ధపాటులో కడవరి దినాలలో ఈ ప్రవచనం ఇంకా నెరవేర్చబడుచున్నదని జోసెఫ్ స్మిత్ బయల్పాటును పొందాడు.6 ఇంకా మనము గ్రహించగలిగే విధానాలలో, ప్రాచీన ప్రవక్తలు మనతో మాట్లాడారు. వారు ప్రాచీన ఇశ్రాయేలుకు అన్వయించినట్లుగా మనకు సంబంధించిన అనేక ప్రశస్తమైన, నిత్యమైన సత్యములను బోధించారు.

చిత్రం
వ్రాయుచున్న ప్రాచీన ప్రవక్త

సంపూర్ణ కాలములు గ్రెగ్ కె. చేత ఓల్సన్

వారు యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చారు

బహుశా పాత నిబంధన ప్రవచనాలలో మిమ్మల్ని చూడటం కంటే చాలా ముఖ్యమైనది వాటిలో యేసు క్రీస్తును చూడటం. మీరు ఆయన కోసం వెదకిన యెడల, ఆయన పేరు చెప్పబడకపోయినా కూడా మీరు ఆయనను కనుగొంటారు. పాత నిబంధన యొక్క దేవుడు, ప్రభువైన యెహోవా అని జ్ఞాపకముంచుకొనుట సహాయపడవచ్చు. ఏ సమయంలోనైనా ప్రవక్తలు ప్రభువు చేస్తున్న దానిని లేక ఆయన చేయబోయే దానిని వివరిస్తారు, వారు రక్షకుని గూర్చి మాట్లాడుతున్నారు.

అభిషేకించబడిన వాడు (యెషయా 61:1), ఒక విమోచకుడు (హోషేయ 13:14), మరియు దావీదు వంశము నుండి రాబోయే రాజుకు (యెషయా 9:6–7; జెకర్యా 9:9 చూడండి) రిఫరెన్సులను కూడా మీరు కనుగొంటారు. ఇవన్నీ యేసు క్రీస్తు గురించి ప్రవచనాలు. మరింత సాధారణంగా, మీరు విడుదల, క్షమాపణ, విమోచన, మరియు పునఃస్థాపన గురించి చదువుతారు. మీ మనస్సు, హృదయంలో రక్షకుడితో, ఈ ప్రవచనాలు సహజంగానే మిమ్మల్ని దేవుని కుమారునివైపు సూచిస్తాయి. అన్నిటికంటె, ప్రవచనమును గ్రహించడానికి శ్రేష్ఠమైన విధానము “ప్రవచనాసారమైన ఆత్మ,” కలిగియుండుట దానిని యోహాను “యేసును గూర్చి సాక్ష్యము” (ప్రకటన 19:10) అని మనకు చెప్పాడు.

వివరణలు

  1. వారి గ్రంథాల యొక్క నిడివిని బట్టి యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, మరియు దానియేలు తరుచుగా పెద్ద ప్రవక్తలుగా సూచించబడ్డారు. మిగిలిన ప్రవక్తలు వారి గ్రంథాలు చాలా చిన్నవి గనుక (హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మరియు మలాకీ) వారు చిన్న ప్రవక్తలుగా పిలవబడ్డారు. విలాపవాక్యములు రచనలలో భాగముగా భావించబడింది, ప్రవక్తలలో కాదు.

  2. ప్రవచనాత్మక గ్రంథాలు ఎలా సంగ్రహించబడ్డాయో మనకు తెలియదు. కొన్ని సందర్భాలలో, ఒక ప్రవక్త తన రచనలు మరియు ప్రవచనాల సేకరణను పర్యవేక్షించవచ్చు. మిగిలిన సందర్భాలలో, అవి వ్రాయబడియుండవచ్చు మరియు అతడి మరణం తరువాత సంగ్రహించబడియుండవచ్చు.

  3. “దాని సమస్తము యొక్క ఉత్సాహము మరియు అత్యవసరతను ఒక్కసారి ఆలోచించండి: ఆదాము మొదలుకొని ప్రతీ ప్రవక్త మన దినమును చూసారు. ఇశ్రాయేలు సమావేశమైనప్పుడు మరియు రక్షకుని యొక్క రెండవ రాకడ కొరకు లోకము సిద్ధపడినప్పుడు, ప్రతీ ప్రవక్త మన దినము గురించి మాట్లాడారు. దాని గురించి ఆలోచించండి! భూగ్రహంపై ఇప్పటివరకు జీవించిన జనులందరిలో, మనము మాత్రమే ఈ చివరి, గొప్ప సమకూర్చు కార్యములో పాల్గొనడానికి అవకాశమివ్వబడ్డాము. అది ఎంత ఉత్సాహకరమైనది!” (రస్సెల్‌ ఎమ్. నెల్సన్, “Hope of Israel” [worldwide youth devotional, June3, 2018], supplement to the New Era and Ensign,8, ChurchofJesusChrist.org). రోనాల్డ్ ఎ. రాస్బాండ్‌, “Fulfillment of Prophecy,” ఎన్‌సైన్ లేదా లియహోనా, మే 2020, 75–78 కూడా చూడండి.

  4. యెషయాను గూర్చి మాట్లాడుతూ, రక్షకుడు చెప్పాడు, “అతడు పలికిన మాటల ప్రకారము కూడా అతడు పలికిన సంగతులున్నియు ఉండెను మరియు ఉండును“ (3నీఫై 23:3; ఏటవాలు అక్షరాలు జోడించబడినవి).

  5. మత్తయి 3:1–3; మార్కు 1:2–4; లూకా 3:2–6 చూడండి.

  6. సిద్ధాంతము మరియు నిబంధనలు 33:10; 65:3; 88:66 చూడండి.

ముద్రించు