2022 పాత నిబంధన
సెప్టెంబరు 12–18. యెషయా 13–14; 24–30; 35: “ఒక ఆశ్చర్యకార్యము మరియు అద్భుతము”


“సెప్టెంబరు 12–18. “యెషయా 13–14; 24–30; 35: ‘ఒక ఆశ్చర్యకార్యము మరియు అద్భుతము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“సెప్టెంబరు 12–18. యెషయా 13–14; 24–30; 35,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
పరిశుద్ధ వనములో జోసెఫ్ స్మిత్ పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తును చూచుట

పరిశుద్ధ వనము, బ్రెంట్ బోరప్ చేత

సెప్టెంబరు 12–18

యెషయా 13–14; 24–30;35

“ఒక ఆశ్చర్యకార్యము మరియు అద్భుతము”

అధ్యక్షులు బోన్నీ హెచ్. కార్డన్ ఇలా బోధించారు, “లేఖనాలు మన మనస్సులకు జ్ఞానవృద్ధి కలిగిస్తాయి, మన ఆత్మలను పోషిస్తాయి, మన ప్రశ్నలకు జవాబిస్తాయి, ప్రభువునందు మన నమ్మకాన్ని వృద్ధి చేస్తాయి, మరియు మన జీవితాలను ఆయనపై కేంద్రీకరించడానికి మనకు సహాయపడతాయి” (“Trust in the Lord and Lean Not,” Liahona, May 2017,7).

మీ మనోభావాలను నమోదు చేయండి

ప్రభువు ప్రవక్తలను చేయమని అడిగిన విషయాలలో ఒకటి ఏదనగా, పాపము యొక్క పర్యవసానములను గూర్చి హెచ్చరించడం. పాత నిబంధన ప్రవక్తల సందర్భములో, తరచుగా దీని అర్థము, బలమైన రాజ్యముల యొక్క శక్తిమంతులైన పరిపాలకులతో పశ్చాత్తాపం చెందమని లేదా నాశనం చేయబడతారని చెప్పుట. అది అపాయకరమైన పని, కానీ యెషయా నిర్భయంగా ఉన్నాడు, మరియు ఇశ్రాయేలు, యూదా, మరియు చుట్టుప్రక్కల దేశములు కలిపి—అతడి కాలములోని రాజ్యములకు అతడి హెచ్చరికలు ధైర్యముగలవి (యెషయా 13–23 చూడండి).

అయినప్పటికీ, యెషయా నిరీక్షణ సందేశాన్ని కూడా కలిగియున్నాడు. చివరకు ప్రవచించబడిన నాశనములు ఈ రాజ్యములపై వచ్చినప్పటికీ, పునఃస్థాపన మరియు క్రొత్తగా చేయుటకు ఒక అవకాశాన్ని యెషయా ముందుగా చూసాడు. ఆయన వద్దకు తిరిగి రమ్మని ప్రభువు తన జనులను ఆహ్వానించును. ఆయన “ఎండమావులు మడుగులగునట్లు … ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టునట్లు” (యెషయా 35:7) చేయును. ఆయన వారికి వాగ్దానము చేసిన దీవెనలను ఇశ్రాయేలీయులకు పునఃస్థాపిస్తూ, “ఒక ఆశ్చర్యకార్యము మరియు అద్భుతము” (యెషయా 29:14), చేస్తాడు. యెషయా లేక ఆ కాలంలో బ్రతికియున్న వారెవరూ ఈ అద్భుతమైన కార్యమును చూడటానికి జీవించిలేరు. కానీ మనము ఈరోజు దాని అంతిమ నెరవేర్పును చూస్తున్నాము. వాస్తవానికి, మనము దాని యొక్క భాగము!

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

యెషయా 13:1–11, 19–22; 14:1–20

లోకము యొక్క దుష్ట రాజ్యములు మరియు వాటి పాలకులు నాశనమవుతారు.

యెషయా 13–14 బబులోను “యొక్క భారము” (గురించి ఒక ప్రవచనాత్మక సందేశము) (యెషయా 13:1) అని పిలవబడింది. ఒక శక్తిమంతుడైన పాలకునితో ఒకసారి బలమైన రాజ్యము, ఇప్పుడు బబులోను ప్రాచీన చరిత్రలో భాగముగా మాత్రమే చర్చించబడుతుంది. అయితే బబులోనుకు సందేశము ఈరోజు మనకు ఎందుకు ముఖ్యమైనది? లేఖనములలో, బబులోను గర్వము, ప్రాపంచికత మరియు పాపముకు చిహ్నముగా ఉన్నది మరియు ఈరోజు మనము వీటన్నటి చేత చుట్టబడియున్నాము. యెషయా 13:1–11, 19–22; 14:1–20 మీరు చదివినప్పుడు, ఈ ప్రతీకవాదము గురించి ఆలోచించండి. ఇటువంటి ప్రశ్నలను కూడా మీరు పరిగణించవచ్చు:

  • బబులోనుకు యెషయా హెచ్చరికలు రక్షకుని రెండవ రాకడకు ముందు లోకమును గూర్చి ప్రవచనాలతో పోలికగా ఎలా ఉన్నాయి? (యెషయా 13:1–11; సిద్ధాంతము మరియు నిబంధనలు 45:26–42 చూడండి).

  • బబులోనియ రాజు యొక్క గర్వము మరియు సాతాను గర్వము మధ్య ఏ పోలికలను మీరు చూస్తారు? (యెషయా 14:4–20; మోషే 4:1–4 చూడండి). ఈ వచనాలలో మీకైమీరు కనుగొన్న హెచ్చరికలు ఏవి?

  • రక్షకుడు “నీ బాధను, నీ ప్రయాసము నుండి విశ్రాంతిని” ఎలా కలుగచేస్తాడు? (యెషయా 14:3).

చిత్రం
ఎరుపు దుస్తులలో యేసు

ఆయన పరిపాలించుటకు, ఏలుటకు మరలా తిరిగి వస్తాడు మేరీ ఆర్. సౌర్ చేత

యెషయా 24:21–23; 25:6–8; 26:19; 28:16

యెషయా రచనలు యేసు క్రీస్తు వైపు నన్ను సూచిస్తాయి.

ఆయన ప్రాయశ్చిత్త త్యాగము, పునరుత్థానము మరియు రెండవ రాకడ కలిపి, రక్షకుని నియమితకార్యమును యెషయా బోధనలు సూచిస్తాయి. క్రింది వచనాలను మీరు చదివినప్పుడు మీ మనస్సులోనికి వచ్చే ఆయన నియమితకార్యము యొక్క అంశాలు ఏవి: యెషయా 24:21–23; 25:6–8; 26:19; 28:16? రక్షకుని గూర్చి మీకు జ్ఞాపకం చేసేవి మీరు కనుగొన్న ఇతర లేఖన భాగాలేవి?

యెషయా 22:22–25 కూడా చూడండి.

యెషయా 24:1–12; 28:7–8; 29:7–10; 30:8–14

విశ్వాస భ్రష్టత్వము అనగా ప్రభువు మరియు ఆయన ప్రవక్తలనుండి మరలిపోవుట అని అర్థము.

ప్రభువు నుండి మరలిపోవడం, ఆయన ప్రవక్తలను తిరస్కరించుట గురించి హెచ్చరించుటకు యెషయా అనేక వివిధ రూపకాలను ఉపయోగించాడు. అవి వట్టిదైన దేశము (యెషయా 24:1–12), తాగుడు (యెషయా 28:7–8), ఆకలి, దప్పిక(యెషయా 29:7–10), మరియు పడబోవుచున్న గోడ లేక కుండను (యెషయా 30:8–14) కలిపియున్నవి. ఈ వచనాలలో మీరు చదివిన దానిపై ఆధారపడి, మన నిబంధనలు పాటించుట ఎందుకు ముఖ్యమైనది? ప్రభువుకు మరియు ఆయన సేవకులకు యదార్ధంగా నిలిచియుండటానికి మీరు చేస్తున్న దానిని పరిగణించండి.

ఎమ్. రస్సెల్ బ్యాలర్డ్, “Stay in the Boat and Hold On!” కూడా చూడండి. Liahona, Nov. 2014, 89–92; Gospel Topics, “Apostasy,” topics.ChurchofJesusChrist.org.

యెషయా 29; 30:18–26;35

కోల్పోయినవి లేక విరిగిన వాటిని ప్రభువు పునఃస్థాపించగలడు.

జనులు లేక సమాజములు ప్రభువునుండి తొలగిపోయినప్పుడు, పర్యవసానాలు మార్చలేనివని మనము ఆలోచించాలని సాతాను కోరుతుంది. అయినప్పటికీ, జనులు పశ్చాత్తాపపడి, ఆయన వైపు తిరిగినప్పుడు ప్రభువు చేసే అద్భుతమైన విషయాలలో కొన్నిటిని యెషయా వర్ణించాడు. ప్రభువు, ఆయన ప్రేమ, ఆయన శక్తి గురించి యెషయా 29:13–24; 30:18–26;35 నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?

మన కాలములో ప్రభువు తన శక్తిని ప్రత్యక్షపరిచిన ఒక విధానము ఏదనగా ఆయన సువార్తను పునఃస్థాపించుట ద్వారా. యెషయా 29 ఆ పునఃస్థాపన యొక్క సంఘటనలకు సమాంతరాలను కలిగియున్న అనేక భాగాలను కలిగియున్నది. ఉదాహరణకు:

ఈ లేఖన భాగాలను మీరు చదివినప్పుడు, సువార్త యొక్క పునఃస్థాపన గురించి మీకు కలిగిన ఆలోచనలు లేక భావనలు ఏవి?

The Restoration of the Fulness of the Gospel of Jesus Christ: A Bicentennial Proclamation to the World” (ChurchofJesusChrist.org) కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

యెషయా 25:4–9.ఒక తుఫాను సమయంలో సురక్షితమైన ఆశ్రయమును లేక ఒక వేడి వేసవి దినములో నీడను కలిగిన దీవెనను మీ కుటుంబం ఎప్పుడైన అనుభవించిందా? (4 వచనము చూడండి.) యెషయా 25:4–9 లో కనుగొనబడిన ఈ వచనాలను మరియు ప్రభువును గూర్చి వివరణలను మీరు చదివినప్పుడు దీని గురించి మాట్లాడండి. ఈ విషయాల వలే ప్రభువు ఎలా ఉన్నాడు?

యెషయా 25:8–9; 26:19.గెత్సేమనే వనములో, సిలువపై మరియు ఆయన పునరుత్థానము తరువాత రక్షకుని చిత్రములను చూపించుట, ఈ వచనాలు, యేసు క్రీస్తు మధ్య ఉన్న సంబంధాలను చూడటానికి మీ కుటుంబానికి సహాయపడుతుంది (Gospel Art Book, nos. 56, 57, 58,59 చూడండి). వారు ఎందుకు “ఆయన రక్షణను బట్టి సంతోషించారో” (యెషయా 25:9) పంచుకోమని మీ కుటుంబాన్ని ఆహ్వానించండి.

యెషయా 29:11–18.సువార్త యొక్క పునఃస్థాపన మరియు మోర్మన్ గ్రంథము రాకడ గురించి “ఒక ఆశ్చర్యకార్యము మరియు అద్భుతము” ( 14 వచనము) చర్చించడానికి ఈ వచనాలు మీ కుటుంబానికి సహాయపడగలవు. ఈ విషయాలు మనకు ఎందుకు ఒక ఆశ్చర్యమైనవి మరియు అద్భుతమైనవి? పునఃస్థాపన యొక్క అద్భుతమైన దీవెనలను సూచించే వస్తువులను మీ గృహములో కనుగొనమని కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.

యెషయా 35మన కాలములో యేసు క్రీస్తు సీయోనును ఎలా నిర్మిస్తున్నాడో గ్రహించుటకు మనకు సహాయపడునట్లు ఈ అధ్యాయములో దృశ్యముల చిత్రములను గీయుట మీ కుటుంబం ఆనందించవచ్చు. ఈ చిత్రములనుండి మనము ఏమి నేర్చుకున్నాము? సీయోనును నిర్మించుటకు సహాయపడుటకు మనమేమి చేయగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

పిల్లలు తమ సృజనాత్మకతను వ్యక్తపరచనివ్వండి. సువార్త సూత్రములకు సంబంధించిన దానిని పిల్లలు సృష్టించినప్పుడు, సూత్రమును బాగా గ్రహించుటకు అది వారికి సహాయపడుతుంది. వారు కట్టడానికి, గీయడానికి, రంగు వేయడానికి మరియు సృష్టించడానికి అనుమతించండి. (Teaching in the Savior’s Way,25 చూడండి.)

చిత్రం
సిలువపై యేసును చూచుచున్న మరియ, యోహానులు

“ఇదిగో మనలను రక్షించునని; మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు” (యెషయా 25:9). జేమ్స్ టిస్సాట్ (ఫ్రెంచ్, 1836–1902). అమ్మా, ఇదిగో నీ కుమారుడు (స్టాబాట్ మాటర్), 1886–1894. బూడిద రంగు నేసిన కాగితంపై గ్రాఫైట్ మీద అపారదర్శక వాటర్ కలర్, చిత్రం: 11 11/16 x 6 in. (29.7 x 15.2 cm). బ్రుక్లిన్ మ్యూజియమ్, పబ్లిక్ విరాళము ద్వారా కొనుగోలు చేయబడింది, 00.159.300

ముద్రించు