“సెప్టెంబరు 26–అక్టోబరు 2. యెషయా 50–57: ‘ఆయన మన రోగములను భరించెను, మరియు మన వ్యసనములను వహించెను,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“సెప్టెంబరు 26–అక్టోబరు 2. యెషయా 50–57,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
సెప్టెంబరు 26–అక్టోబరు 2
యెషయా 50–57
“ఆయన మన రోగములను భరించెను, మరియు మన వ్యసనములను వహించెను”
యెషయా 50–57 నుండి రక్షకునికి దగ్గర కావడానికి మీకు సహాయపడే పరిజ్ఞానములను ధ్యానించండి. మీరు పొందే మనోభావాలను నమోదు చేయండి.
మీ మనోభావాలను నమోదు చేయండి
అతడి పరిచర్య అంతటా, ఒక శక్తివంతుడైన విమోచకుని గురించి యెషయా మాట్లాడాడు (ఉదాహరణకు, యెషయా 9:3–7 చూడండి). బబులోనులో దాస్యములో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు, శతాబ్ధాల తరువాత వారికి ఈ ప్రవచనాలు ప్రత్యేకంగా ప్రశస్తమైనవి. బబులోను గోడలు పడగొట్టగల వారెవరైనా నిజంగా ఒక శక్తివంతమైన విజేత. కానీ 52–53 అధ్యాయాలలో యెషయా వివరించిన మెస్సీయా ఆవిధమైన వాడు కాదు: “ఆయన తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యుల వలన విసర్జించబడిన వాడును ఆయెను వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడుగాను మనుష్యులు చూడనొల్లనివాడు గాను ఉండెను, ఆయన మన రోగములను భరించెను, మరియు మన వ్యసనములను వహించెను.… ఆయన మొత్తబడినవానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి” (యెషయా 53:3–4). అటువంటి ఊహించని విమెచకుడిని పంపుట ద్వారా, నిజమైన విడుదల గురించి దేవుడు మనకు బోధించాడు. వ్యతిరేకత మరియు బాధ నుండి మనల్ని రక్షించడానికి, దేవుడు, “తనకు తానే మొత్తబడినవాడు, … శ్రమనొందిన,” ఒకరిని పంపాడు. కొందరు ఒక సింహము ఎదురుచూచిన చోట, ఆయన ఒక గొఱ్ఱెపిల్లను పంపాడు (యెషయా 53:7 చూడండి). నిశ్చయముగా, దేవుని త్రోవలు మన త్రోవలు వంటివికాదు (యెషయా 55:8–9 చూడండి). యేసు క్రీస్తు చెరసాలను తెరవడం మాత్రమే కాదు కానీ అక్కడ మన స్థానమును తీసుకొనుట ద్వారా మనల్ని స్వతంత్రులుగా చేసాడు. ఆయన తానే వాటిని భరించుట ద్వారా మన వ్యసనము, విచారముల నుండి మనకు ఉపశమనము ఇస్తాడు(యెషయా 53:4–5,12 చూడండి). దూరమునుండి ఆయన మనల్ని రక్షించడు. “నిన్ను విడిచిపోని” “నిత్యమైన కృప” గల చర్యయందు, ఆయన మనతోపాటు భరిస్తాడు (యెషయా 54:8,10).
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
ప్రభువు యొక్క జనులకు భవిష్యత్తు ప్రకాశవంతమైనది.
ఇశ్రాయేలీయులు చెరలో అనేక సంవత్సరాలు గడిపినప్పటికీ—ఆ చెర వారి బలహీనమైన ఎంపికల ఫలితంగా కలిగినప్పటికీ—నిరీక్షణతో భవిష్యత్తు వైపు చూడాలని ప్రభువు వారిని కోరుకున్నాడు. యెషయా 50–52 లో మీరు కనుగొన్న నిరీక్షణగల సందేశములేవి? ఈ అధ్యాయాలలో తనను గూర్చి ప్రభువు మనకు ఏమి బోధిస్తున్నాడు మరియు ఇది మీకు నిరీక్షణను ఎందుకు ఇస్తుంది? (ఉదాహరణకు, యెషయా 50:2, 5–9; 51:3–8, 15–16; 52:3, 9–10 చూడండి).
ఈ ఆశాజనకమైన భవిష్యత్తును నిజమైనదిగా చేయడానికి ఇశ్రాయేలీయులను చేయమని 51–52 అధ్యాయాలలో ప్రభువు ఆహ్వానించిన సమస్తమును మీరు కూడా జాబితా చేయవచ్చు. ఈ మాటల ద్వారా ఏమి చేయమని ప్రభువు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారని మీరు భావిస్తున్నారు? ఉదాహరణకు, “లెమ్ము” మరియు “బలమును ధరించుకొనుము” అనగా అర్థమేమిటని మీరనుకుంటున్నారు? (యెషయా 51:9; యోహాను 52:1; గలతీయులకు 52:1; సిద్ధాంతము మరియు నిబంధనలు 113:7 కూడా చూడండి. “ఆలకించుడి” (లేక “విధేయులు కావాలనే ఉద్దేశ్యముతో వినుడి”) అనే ఆహ్వానమును చాలా తరచుగా ఎందుకు పునరావృతం చేయబడిందని మీరనుకుంటున్నారు? (రస్సెల్ ఎమ్. నెల్సన్, “Hear Him,” Liahona, May 2020,89).
మోషైయ 12:20–24; 15:13–18; 3 నీఫై 20:29–46 కూడా చూడండి.
యేసు క్రీస్తు నా పాపములు, బాధలు తనపై తీసుకొనెను.
యేసు క్రీస్తు యొక్క విమోచనా లక్ష్యము గురించి యెషయా 53 కంటె చాలా అందంగా లేఖనములో కొన్ని అధ్యాయాలు వర్ణించాయి. ఈ మాటలు ధ్యానించడానికి సమయాన్ని తీసుకోండి. ప్రతీ వచనముతో, సమస్త జనుల కొరకు మరియు ప్రత్యేకంగా మీకోసం–“వ్యసనములు,” “బాధలు,” మరియు “అతిక్రమములు” ఆయన భరించుటకు—రక్షకుడు అనుభవించిన దానిని ధ్యానించడానికి ఆగండి. మీరు చదివినప్పుడు “మేము” మరియు “మన” వంటి మాటలకు బదులుగా “నేను,” “నా” మాటలను ఉంచండి. ఈ వచనాలు మీలో ఏ భావాలను లేక ఆలోచనలను ప్రేరేపిస్తాయి? వాటిని వ్రాయడానికి పరిగణించండి.
రక్షకుని గురించి బోధించడానికి ప్రవక్త అబినడై యెషయా మాటలను ఎలా ఉపయోగించాడో చూచుటకు మీరు మోషైయ14; 15:1–13 పునర్వీక్షించవచ్చు.
యేసు క్రీస్తు నేను ఆయన వద్దకు తిరిగి వెళ్ళాలని కోరుతున్నాడు.
మనమందరం మన పాపములు లేక బలహీనతల వలన ప్రభువు నుండి మనము దూరముగా భావించినప్పుడు సమయాలున్నాయి. కొందరు ఆయన ఎప్పటికైనా వారిని క్షమించగలడా అని ఆశను కోల్పాయారు. అటువంటి సమయములందు భరోసా, ప్రోత్సాహము కొరకు చదవడానికి యెషయా 54 మరియు57 గొప్ప అధ్యాయములు. ప్రత్యేకంగా యెషయా 54:4–10; 57:15–19 లో, రక్షకుని యొక్క కరుణ మరియు మీ గురించి ఆయన భావాలను గూర్చి మీరు ఏమి నేర్చుకున్నారు? ఆయన గురించి ఈ విషయాలను తెలుసుకోవడం, మీ జీవితంలో ఏ ప్రత్యేకతను కలిగియుంటుంది?
యెషయా 54:11–17 లో వివరించబడిన దీవెనలు మీకు ఎలా అన్వయిస్తాయి?
“నా నిబంధనను ఆధారము చేసుకోమని” అందరిని ప్రభువు ఆహ్వానిస్తున్నాడు.
తరములుగా, దేవుని నిబంధన జనులుగా ఇశ్రాయేలీయులు గుర్తించబడ్డారు. అయినను, దేవుని ప్రణాళిక ఎల్లప్పుడు ఒకటి కంటె ఎక్కువ రాజ్యమును కలిగియుంటుంది. ఏలయనగా “దప్పిగొనువారలారా,” “నీళ్ళ యొద్దకు … రండి,” (యెషయా 55:1) అని ఆహ్వానించబడ్డారు. యెషయా 55 మరియు 56 చదివినప్పుడు, దీనిని మనస్సులో ఉంచుకొనండి, దేవుని యొక్క జనులుగా ఉండుట అనగా అర్థమేమిటో ధ్యానించండి. ఆయన నుండి “పూర్తిగా వేరుచేయబడినట్లుగా,” భావించిన వారికి దేవుని యొక్క సందేశమేమిటి? (యెషయా 56:3). “నా నిబంధనను ఆధారము చేసుకొను” (యెషయా 56:4–7 చూడండి) వారి యొక్క స్వభావాలు మరియు క్రియలను వివరించే వచనాలను గుర్తించుటకు పరిగణించండి.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
యెషయా 51–52.ఈ అధ్యాయాలలో ప్రభువు యొక్క ఆహ్వానాలను మీరు చర్చించినప్పుడు, వారిని నటించమని కుటుంబ సభ్యులను మీరు ఆహ్వానించవచ్చు. ఉదాహరణకు, “ఆకాశము వైపు కన్నులెత్తుడి,” “లేచి, కూర్చుండుట,” లేక “ ధూళి దులుపుకొనుట,” ఎలా కనబడతాయి? (యెషయా 51:6,17; 52:2). యేసు క్రీస్తు గురించి ఈ వాక్యభాగాలు మనకేమి బోధిస్తాయి?
-
యెషయా 52:9.ఈ వచనము చదివిన తరువాత, మీ కుటుంబము ఒక కీర్తనను “కలిసి పాడగలరు” లేక వారికి సంతోషాన్ని తెచ్చే పిల్లల పాటను పాడవచ్చు. యెషయా 52 లోని ఏ వాగ్దానాలు “పెల్లుబుకే ఆనందము” మనం పొందునట్లు చేస్తాయి?
-
యెషయా 52:11; 55:7.ఈ వచనాలు “శుద్ధిగా ఉండుట,” అనే వాక్యభాగము అర్థమేమిటో ఒక చర్చకు నడిపించగలదు. ఈ చర్చలో భాగముగా, యౌవనుల బలము కొరకు లో విషయాలను మీరు సమీక్షించవచ్చు లేక ఆత్మీయంగా పరిశుద్ధంగా ఉండుట వలన కలిగే దీవెనలు గురించి లేఖనాలను చదవండి (కరపత్రము, 2011) (3 నీఫై 12:8; సిద్ధాంతము మరియు నిబంధనలు 121:45–46 చూడండి).
-
యెషయా 53రక్షకుని గూర్చి యెషయా యొక్క వివరణను పరిచయం చేయడానికి, జనులను విడిపించే నాయకులను తరుచుగా చిత్రించే కధలు, చిత్రములు, మరియు ఇతర మీడియా గురించి మీ కుటుంబము మాట్లాడవచ్చు. యెషయా 53 లో మీరు చదివే రక్షకుని గూర్చి వివరణలతో పోల్చవచ్చు. “నా రాజ్యము ఈ లోకమునకు చెందదు,” (ChurchofJesusChrist.org) వీడియోను కూడా మీరు చూడవచ్చు మరియు యెషయా 53 లో ప్రవచనాలు ఎలా నెరవేర్చబడినవో మాట్లాడవచ్చు. రక్షకుడు మన కోసం వహించే వ్యసనములు మరియు బాధలు కొన్ని ఏవి?
-
యెషయా 55:8–9.మీరు నేల పైగా ఉన్నప్పుడు ఇవి భిన్నంగా ఎలా కనబడతాయి? దేవుని మార్గములు మరియు ఆలోచనలు మనకంటె ఉన్నతమైనవి అనగా మీకు అర్థమేమిటి?
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.