2022 పాత నిబంధన
అక్టోబరు 24–30. యెహెజ్కేలు 1–3; 33–34; 36–37; 47: “నూతన స్వభావము మీకు కలుగజేసెదను”


“అక్టోబరు 24–30. యెహెజ్కేలు 1–3; 33–34; 36–37; 47: ‘నూతన స్వభావము మీకు కలుగజేసెదను,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“అక్టోబరు 24–30. యెహెజ్కేలు 1-3; 33; -34; 36-37; 47;” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
గొర్రెలను నడిపించుచున్న యేసు

రండి, నన్ను అనుసరించండి స్కాట్ సమ్నర్

అక్టోబరు 24–30

యెహెజ్కేలు 1–3; 33–34; 36–37; 47

“నూతన స్వభావము మీకు కలుగజేసెదను”

దేవుని వాక్యమును చిహ్నపూర్వకంగా “భుజించమని”—దానితో తనను తాను నింపుకోమని (యెహెజ్కేలు 2:9–3:3,10 చూడండి) యెహెజ్కేలు ఆహ్వానించబడ్డాడు. ఈ వారము దేవుని వాక్యముతో మిమ్మల్ని మీరు ఎలా నింపుకుంటారు?

మీ మనోభావాలను నమోదు చేయండి

యెహెజ్కేలు నిర్గమంలో ఉన్న ప్రవక్త. మిగిలిన ఇశ్రాయేలీయులతోపాటు అతడు చెరపట్టబడి, యెరూషలేము చివరికి పూర్తిగా నాశనము చేయబడటానికి ముందుగా బబులోనకు పంపబడ్డాడు. యెరూషలేములో, యెహెజ్కేలు దేవాలయములో సేవ చేస్తున్న ఒక యాజకునిగా ఉండియుండవచ్చు. దేవాలయము నుండి వందల మైళ్లు మరియు దేవుని యొక్క ప్రియమైన మందిరానికి తిరిగి వచ్చే స్వల్ప నిరీక్షణతో బబులోనులో, అతడు “చెరపట్టబడిన వారి” మధ్య ఉన్నాడు, మరియు “వారు కూర్చున్న స్థలమందు, కూర్చున్నాడు,” (యెహెజ్కేలు 3:15). తరువాత ఒకరోజు యెహెజ్కేలుకు ఒక దర్శనము కలిగింది. అతడు “ప్రభువు యొక్క తేజస్సు” (యెహెజ్కేలు 1:28) చూసాడు—యెరూషలేము వద్ద దేవాలయముకు తిరిగి రాలేదు, కానీ నిర్గమముల మధ్య బబులోనులో ఉన్నాడు. యెరూషలేములో చెడుతనము తీవ్రమైందని, దేవుని సన్నిధి అక్కడ ఇక లేదని అతడు తెలుసుకొన్నాడు (యెహెజ్కేలు 8–11; 33:21 చూడండి).

యెహెజ్కేలు యొక్క కార్యాలలో ఒకటి ఇశ్రాయేలీయుల యొక్క తిరుగుబాటు యొక్క పర్యవసానాలను గూర్చి వారిని హెచ్చరించుట—అనేకమంది జనులు అతడి హెచ్చరికలను వినలేదు. యెహెజ్కేలు యొక్క సందేశము ఇంకా ఎక్కువ ఉన్నది: విషయాలు ఎంత చెడుగా మారినప్పటికీ, దేవుని సన్నిధిని తిరిగి పొందటం సాధ్యమని అతడు ప్రవచించాడు. “యెహోవా మాట ఆలకించుడి” అనే ఆహ్వానమును దేవుని జనులు అంగీకరించిన యెడల, యెహెజ్కేలు 37:4, ఒకసారి మృతమైన దాన్ని పునరుద్ధరించవచ్చు. ఒక “రాతి గుండె” బదులుగా “నూతన హృదయము”తో (యెహెజ్కేలు 36:26) ఉంచబడవచ్చు. “మరియు మీరు బ్రదుకునట్లు” “[నేను], నా ఆత్మను మీలో ఉంచెదను,” ( యెహెజ్కేలు 37:14) అని ప్రభువు వారితో చెప్పెను. కడవరి దినాలలో, క్రొత్త దేవాలయమును, ఒక క్రొత్త యెరూషలేమును ప్రభువు స్థాపించును, “యెహావాయుండు స్థలము నాటనుండి ఆ పట్టణమునకు పేరు” (యెహెజ్కేలు 48:35).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

యెహెజ్కేలు 1–3

“నా మాటలను నీవు తెలియజేయము”

యెహెజ్కేలు 1–3 లో పరిచర్యకు యెహెజ్కేలు యొక్క పిలుపు గురించి చదవటం, ఇతరులతో “[ఆయన] మాటలను మాట్లాడుటకు” దేవుడు మీకిచ్చిన అవకాశాలను గూర్చి ఆలోచించటానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు (యెహెజ్కేలు 3:4). యెహెజ్కేలు 2–3 లో, యెహెజ్కేలుకు ఆయన ప్రోత్సాహము మరియు ఉపదేశపు మాటలను గమనించండి. బహుశా మీరు సేవ చేసే జనులు యెహెజ్కేలు యొక్క జనుల వలె తిరుగుబాటు చేయనప్పటికీ, యెహెజ్కేలుకు దేవుని యొక్క మాటలు సంఘములో, ఇంటిలో మరియు వేరొక చోట మీ సేవను మీరు చూసే విధానమును ఎలా ప్రభావితం చేస్తాయో ఆలోచించండి.

యెహెజ్కేలు 33:1–9; D.Todd Christofferson, “The Voice of Warning,” Ensign or Liahona, May 2017, 108–11 కూడా చూడండి.

యెహెజ్కేలు 33:10–19

ప్రభువు క్షమించాలని కోరుతున్నాడు.

“మా … పాపదోషములు మామీద పడియున్నవి,” “మనమెట్లు బ్రదుకుదుము?” అని చెరపట్టబడిన ఇశ్రాయేలీయులు ఆశ్చర్యపడ్డారు. (యెహెజ్కేలు 33:10). స్పందనగా, ప్రభువు పశ్చాత్తాపము మరియు క్షమాపణ గురించి ముఖ్యమైన సత్యములను వారికి బోధించాడు. ఈ ప్రశ్నలు ఈ సత్యములను ధ్యానించడానికి మీకు సహాయపడతాయి.

  • “[మీ] స్వనీతిని ఆధారము చేసుకొనుట” అనగా అర్థమేమిటని మీరనుకుంటున్నారు”? (యెహెజ్కేలు 33:12–13 చూడండి).

  • యెహెజ్కేలు 33:12–19 లో వివరించబడిన నీతిమంతుడైన వ్యక్తి మరియు చెడ్డ వ్యక్తి న్యాయంగా చూడబడలేదని భావించే వారికి మీరు ఏమని చెప్తారు? (మత్తయి 21:28–31; లూకా 18:9–14 కూడా చూడండి)

  • ఈ వచనాలలో మీరు కనుగొనే వాక్య భాగాలు ఏవి పశ్చాత్తాపపడుట అనగా అర్థమేమిటో గ్రహించటానికి మీకు సహాయపడతాయి? యెహెజ్కేలు 36:26–27 మరియు ఆల్మా 7:14–16 లో మీరు కనుగొన్న అదనపు అంతరార్థములేవి?

యెహెజ్కేలు 34

ఆయన గొఱ్ఱె పిల్లలను మేపమని ప్రభువు నన్ను ఆహ్వానిస్తున్నాడు.

యెహెజ్కేలులో, ప్రభువు తన జనుల యొక్క నాయకులను, “గొఱ్ఱెల కాపరులుగా” సూచించాడు. మీరు చదివినప్పుడు, ఒక నాయకునిగా ఉండుట అనగా అర్థమేమిటో ఈ శీర్షిక ఏమి సూచిస్తుందో పరిగణించండి. ప్రభువు మీరు ఆహారమివ్వాలని కోరిన “గొఱ్ఱెలు” ఎవరు? మన కాపరిగా రక్షకుని మాదిరిని మీరు ఎలా అనుసరించగలరు? (11–31 వచనాలు చూడండి).

యోహాను 21:15-17 కూడా చూడండి.

చిత్రం
ఎడారి మరియు మృత సముద్రము

దేవాలయము నుండి నది ప్రవాహమును మరియు మృత సముద్రమును స్వస్థపరచుటను ఒక దర్శనములో యెహెజ్కేలు చూసాడు.

యెహెజ్కేలు 37

ప్రభువు తన జనులను సమకూర్చి, వారికి క్రొత్త జీవితాన్ని ఇస్తున్నాడు.

ఇశ్రాయేలును సమకూర్చుట యెహెజ్కేలు 37 లో రెండు చిహ్నముల ద్వారా చిత్రీకరించబడింది. మొదటిది—మృతమైన ఎముకలకు ప్రాణము తిరిగివ్వబడుట (1–14 వచనాలు చూడండి) గురించి మీరు చదివినప్పుడు—తెరకు రెండువైపుల ఇశ్రాయేలును సమకూర్చుడం గురించి మీరు నేర్చుకొన్న దానిని ధ్యానించండి యెహెజ్కేలు 36:24–30కూడ చూడండి).

(15–28 వచనాలు చూడండి) రెండవ చిహ్నము రెండు కర్రలను కలిపియున్నది, దానిని చాలా మంది పండితులు కీలుతో జతపరచి వ్రాసే చెక్క బోర్డులుగా వ్యాఖ్యానిస్తారు. యూదా కర్ర బైబిలును సూచిస్తుంది (బైబిలులో అధికము యూదా వంశస్థుల చేత వ్రాయబడినది కనుక), మరియు (లీహై కుటుంబము ఐగుప్తు యొక్క యోసేపు వంశస్థులు కనుక) యోసేపు యొక్క కర్ర మోర్మన్ గ్రంథమును సూచిస్తుంది. అది మనస్సులో ఉంచుకొని, ఇశ్రాయేలును సమకూర్చుటలో లేఖనాల పాత్ర గురించి ఈ వచనాలు మీకేమి బోధిస్తాయి? (జోసెఫ్ స్మిత్ మరియు మోర్మన్ గ్రంథము గురించి ఒక ప్రవచనము) గురించి 2నీఫై 3:11–13 మీ జ్ఞానమునకు ఏమి చేరుస్తుంది?

2నీఫై 29:14; “The Book of Mormon Gathers Scattered Israel” (video, ChurchofJesusChrist.org) కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

యెహెజ్కేలు 33:1–5.ఈ వచనాలను వివరించటానికి, ఒక కుటుంబ సభ్యుడు కిటికీ బయటకు చూడటం ద్వారా, బయట జరుగుతున్న దానిని మిగిలిన కుటుంబానికి చెప్పుట ద్వారా ఒక “కావలివానిగా” నటించవచ్చు. మన జీవిస్తున్న ప్రవక్త మనకు ఒక కావలివానికి ఎలా ఉన్నాడు?

యెహెజ్కేలు 33:15–16.యేసు క్రీస్తు ద్వారా మనము పొందగల క్షమాపణ గురించి ఈ లేఖనాలు మనకేమి బోధిస్తాయి?

యెహెజ్కేలు 36:26–27.“రాతి గుండె” కలిగియుండుట అనగా అర్థమేమిటో మీరు చర్చించినప్పుడు, మీ కుటుంబానికి కొన్ని రాళ్ళను చూపండి. రక్షుకుడు మనకిచ్చే “నూతన హృదయము” మరియు “నూతన ఆత్మ” వర్ణించే మాటలను వారిని సూచించనివ్వండి (మోషైయ 3:19; 5:2 చూడండి).

యెహెజ్కేలు 37:15–28.కుటుంబ సభ్యులు రెండు కర్రలను కనుగొని, ఒక దానిపై యూదా కొరకు (Bible) మరొకదానిపై యోసేపు కొరకు (మోర్మన్ గ్రంథము) (16–19 వచనాలు చూడండి) వ్రాయవచ్చు. రక్షకునికి దగ్గర కావడానికి మరియు “[ఆయన] జనులు” (23 వచనాలు) కావడానికి వారికి సహాయపడునట్లు బైబిలు మరియు మోర్మన్ గ్రంథము నుండి కధనాలు లేక లేఖనాలను వారు పంచుకోవచ్చు.

యెహెజ్కేలు 47:1–12 చూడండి.ఈ వచనాలు దేవాలయము నుండి నీళ్లు ప్రవాహిస్తూ, మృత సముద్రమును స్వస్థపరచే యెహెజ్కేలు దర్శనమును వర్ణిస్తాయి—అది ఎంత ఉప్పగా ఉంటుందంటే దానిలో చేపలు, మొక్కలు నివసించలేవు. పిల్లలు ఈ దర్శనము యొక్క చిత్రమును గీయుటను ఆనందించవచ్చు. దేవాలయము నుండి నీళ్లు ప్రవహించుట దేనికి చిహ్నముగా ఉన్నది? (“And the River Will Grow,” ChurchofJesusChrist.org వీడియో చూడండి). మనము స్వస్థపడటానికి దేవాలయము ఎలా సహాయపడుతుంది? (యెహెజ్కేలు 47:8–9,11 చూడండి).

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

ప్రతీది పొందుపరచడానికి ప్రయత్నించవద్దు. మీ కుటుంబముతో మీరు యెహెజ్కేలులో ప్రతీ సత్యమును అన్వేషించలేకపోవచ్చు. దేనిపై దృష్టిసారించాలో తీర్మానించడానికి ఆత్మీయ నడిపింపును వెదకండి. (Teaching in the Savior’s Way,7 చూడండి.)

చిత్రం
దేవాలయము నుండి నది ప్రవహించుట యొక్క దృష్టాంతము

“మందిరపు గడప క్రిందనుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. … ఈ నది వచ్చుచోట్లనెల్ల జలచరములన్నియు బ్రదుకును” (యెహెజ్కేలు 47:1,9). shutterstock.com నుండి లైసెన్సు పొంది క్రింద చిత్రము ఉపయోగించబడింది.

ముద్రించు