2022 పాత నిబంధన
అక్టోబరు 17–23. యిర్మీయా 30–33; 36; విలాపవాక్యములు 1; 3: “వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చెదను”


“అక్టోబరు 17–23. యిర్మీయా 30–33; 36; విలాపవాక్యములు 1; 3: “వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చెదను” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“అక్టోబరు 17–23. యిర్మీయా 30–33; 36; విలాపవాక్యములు 1; 3,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
యిర్మీయా ప్రవక్త యొక్క చెక్కడం

నజారేన్ పాఠశాల చేత చెక్కడం నుండి యిర్మీయా ప్రవక్త యొక్క విలాపము

అక్టోబరు 17–23

యిర్మీయా 30–33; 36; విలాపవాక్యములు1; 3

“వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చెదను”

మీ భావాలను మీరు వ్రాసినప్పుడు, యిర్మీయా మరియు విలాపవాక్యములలో సూత్రములు పాత నిబంధనలో మీరు నేర్చుకొన్న మిగిలిన విషయాలకు ఎలా అన్వయిస్తాయో ఆలోచించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

ఒక ప్రవక్తగా ఉండటానికి ప్రభువు యిర్మీయాను మొదట పిలిచినప్పుడు, అతడి నియమితకార్యము “పెల్లగించుట, విరుగగొట్టుట” (యిర్మీయా 1:10) అని ఆయన అతడికి చెప్పాడు—మరియు యెరూషలేములో, పెల్లగించుటకు, విరుగగొట్టుటకు చెడుతనము అత్యధికంగా ఉన్నది. కానీ ఇది యిర్మీయా యొక్క నియమితకార్యములో కొంత భాగము మాత్రమే—అతడు “కట్టుటకు, నాటుటకును” (యిర్మీయా 1:10) కూడా పిలవబడ్డాడు. ఇశ్రాయేలీయుల తిరుగుబాటు వలన విడువబడిన నిర్జనమైన శిధిలాలలో ఏమి కట్టబడవచ్చు లేక నాటబడవచ్చు? అదేవిధంగా, పాపము లేక దుర్దశ మన జీవితాలను శిధిలాలలో విడిచిపెట్టినప్పుడు, మనము మరలా ఎలా పునర్మిర్నించగలము మరియు నాటగలము? “నీతి చిగురు” లో (యిర్మీయా 33:15) జవాబు నిలిచియున్నది, అది వాగ్దానమివ్వబడిన మెస్సీయా. మెస్సీయా “ఒక క్రొత్త నిబంధనను” (యిర్మీయా 31:31) తెచ్చును—దానికి అంతరంగములో నిబద్ధత లేక భక్తి యొక్క బాహ్య రూపమును మించి అవసరము. ఆయన ధర్మివిధి “[మన] మనస్సులలో,” ఉంచబడాలి “[మన] హృదయాలలో” వ్రాయబడాలి. ప్రభువు “[మన] దేవునిగా ఉండుట” మరియు మనము “[ఆయన] జనులుగా ఉండుటకు” (యిర్మీయా 31:33) నిజంగా అర్థము ఇదే. ఇది జీవితకాల ప్రక్రియ, మనము ఇంకా తప్పులు చేస్తాము మరియు అప్పుడప్పుడు దుఃఖించడానికి కారణాన్ని కలిగియుంటాము. కానీ మనము చేసినప్పుడు, మనము ప్రభువు నుండి ఈ వాగ్దానము కలిగియుంటాము: “వారి దుఃఖమునకు ప్రతిగా నేను సంతోషమిచ్చెదను” (యిర్మీయా 31:13).

విలాపవాక్యముల సమీక్ష కొరకు, లేఖనాలకు మార్గదర్శిలో “విలాపవాక్యముల, గ్రంథము” (scriptures.ChurchofJesusChrist.org) చూడండి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

యిర్మీయా 30–31; 33

ప్రభువు ఇశ్రాయేలును చెర నుండి వెలుపలికి తెచ్చును మరియు వారిని సమకూర్చును.

యిర్మీయా 30–31; 33 లో ఇశ్రాయేలీయులు చెరలోనికి వెళ్ళినప్పుడు, వారనుభవించే, “అంగలార్పును, మహా రోదన ధ్వనిని” (యిర్మీయా 31:15) ప్రభువు అంగీకరించాడు. అయినప్పటికీ ఆయన ఓదార్పును, నిరీక్షణగల మాటలు కూడా ఇచ్చాడు. ఈ అధ్యాయాలలో ఏ వాక్యభాగాలు ఇశ్రాయేలీయులకు ఓదార్పును మరియు నిరీక్షణను ఇచ్చియుండవచ్చని మీరనుకుంటున్నారు? ఆయన జనులకు ప్రభువు నుండి మీరు కనుగొన్న వాగ్దానములేవి? ఈ వాగ్దానములు ఈరోజు మీకు ఎలా అన్వయిస్తాయి?

యిర్మీయా 31:31–34; 32:37–42 చూడుము.

“నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు.”

ఇశ్రాయేలీయులు ప్రభువుతో వారి నిబంధనను ఉల్లంఘించినప్పటికీ, ప్రభువు తన జనులతో మరలా ఒక “క్రొత్త” మరియు “నిత్యమైన నిబంధన” (యిర్మీయా 31:31; 32:40) చేస్తాడని యిర్మీయా ప్రవచించాడు. క్రొత్త మరియు నిత్యమైన నిబంధన “యేసు క్రీస్తు సువార్త యొక్క సంపూర్ణత [సిద్ధాంతము మరియు నిబంధనలు 66:2 చూడండి]. విశ్వాస భ్రష్టత్వ కాలము తరువాత అది క్రొత్తగా బయల్పరచబడిన ప్రతీసారి అది క్రొత్తది. దేవుని యొక్క నిబంధన భావనలో అది శాశ్వతమైనది మరియు దానిని అంగీకరించడానికి సమ్మతించిన జనులున్న ప్రతీ సువార్త యుగములో ఆనందించబడింది,” (Guide to the Scriptures, “క్రొత్త మరియు నిత్యమైన నిబంధన,” scriptures.ChurchofJesusChrist.org; italics added).

మీరు యిర్మీయా 31:31–34; 32:37–42 చదివినప్పుడు, దేవుని యొక్క నిబంధన జనులుగా ఉండుటలో భాగముగా ఉండుట అనగా మీకు అర్థమేమిటో ధ్యానించండి. దేవునితో మీ నిబంధన అనుబంధమును మీరు చూసే విధానమును ఈ వచనాలు ఎలా ప్రభావితం చేస్తాయి? మీ హృదయములో ఆయన ధర్మశాస్తము వ్రాయబడియుండుట అనగా అర్థమేమిటి? (యిర్మీయా 31:33 చూడండి).

యిర్మీయా 24:7; హెబ్రీయులకు 8:6-12 కూడా చూడండి.

చిత్రం
బాలిక లేఖనాలను అధ్యయనం చేయుట

పశ్చాత్తాపపడుటకు, ప్రభువు వైపు తిరుగుటకు లేఖనాలు మనల్ని ప్రేరేపించగలవు.

యిర్మీయా 36

నేను చెడు నుండి మరలిపోవడానికి లేఖనాలు శక్తి కలిగియున్నవి.

జనులు ఈ ప్రవచనాలను వింటున్న యెడల, “వారి దోషమును, వారి పాపమును క్షమించునట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చత్తాపపడుదురేమో,” (యిర్మీయా 36:2–3) అని వివరిస్తూ యిర్మీయా తన ప్రవచనాలను “ఒక పుస్తకపు చుట్ట,” లేక ఒక పట్టికలో వ్రాయమని ప్రభువు ఆజ్ఞాపించాడు. యిర్మీయా 36 మీరు చదివినప్పుడు, ఈ ప్రవచనాలను గూర్చి జనులు ఎలా భావించారో గమనించడానికి పరిగణించండి.

ప్రభువు:

యిర్మీయా:

బారూకు:

యెహగాది మరియు యెహోయాకీము:

ఎల్నాతాను, దెలాయ్యా, గెమర్యా:

లేఖనాలు మరియు మీ జీవితంలో వాటి పాత్రను గురించి మీరు ఎలా భావిస్తున్నారో ధ్యానించండి. చెడు నుండి మరలిపోవడానికి అవి మీకు ఎలా సహాయపడినవి?

జూలీ బి. బెక్ “My Soul Delighteth in the Scriptures,” Ensign or Liahona, May 2004, 107–9 కూడా చూడండి.

విలాపవాక్యములు1; 3

పాపము వలన మనము అనుభవించే విచారమును ప్రభువు ఉపశమనం కలిగించగలడు.

విలాపవాక్యముల గ్రంథము యెరూషలేము, దాని దేవాలయము నాశనమైన తరువాత వ్రాయబడిన కవితల సేకరణను కలిగియున్నది. ఈ విలాపవాక్యములు కాపాడబడి, పాత నిబంధనలో చేర్చబడుట ఎందుకు ముఖ్యమైనదని మీరనుకుంటున్నారు? విలాపవాక్యములు1 మరియు 3 లోని ఏ రూపకములు ఇశ్రాయేలు అనుభవించిన గొప్ప విచారము గురించి గ్రహించడానికి మీకు సహాయపడతాయో పరిగణించండి. క్రీస్తునందు మీరు కనుగొనే నిరీక్షణా సందేశాలు ఏవి? (ప్రత్యేకంగా విలాపవాక్యములు 3:20–33 చూడండి; మత్తయి 5:4; యాకోబు 4:8–10; ఆల్మా 36:17–20 కూడా చూడండి).

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

యిర్మీయా 31:3.పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు మన కొరకు వారి “నిత్యమైన ప్రేమను” ఎలా చూపించారు? మన కోసం క్రీస్తు సృష్టించిన లేక ఆయన మర్త్య పరిచర్యయందు చేసిన విషయాల చిత్రములను చూపించుట ఆయన “ప్రేమగల దయను” అనుభవించుటకు మీ కుటుంబానికి సహాయపడవచ్చు.

యిర్మీయా 31:31–34; 32:38–41.ఆయనతో మనము నిబంధనలు చేసినప్పుడు, ఈ వచనాలలో ప్రభువు వాగ్దానమిచ్చిన విషయాలను జాబితా చేయడానికి ఆలోచించండి. మన నిబంధనల యొక్క ప్రాముఖ్యత గురించి ఈ వచనాలు మనకు ఏమి బోధిస్తాయి?

కుటుంబ సభ్యులు రక్షకుని గురించి ఎలా భావిస్తున్నారో చూపేవి ఏవైనా కాగితపు హృదయాకారాలపై కూడా వారు వ్రాయవచ్చు (లేక గీయవచ్చు). మన హృదయాలలో ఆయన ధర్మశాస్త్రము వ్రాసియుండబడుట అనగా అర్థమేమిటి? (యిర్మీయా 31:33 చూడండి). ఆయన జనులుగా మనముండాలని కోరుతున్నామని ప్రభువుకు మనము ఎలా చూపుతాము?

యిర్మీయా 36.లేఖనముల ప్రాముఖ్యత గురించి మీ కుటుంబము నేర్చుకోవడానికి సహాయపడటానికి యిర్మీయా 36 మీరు ఎలా ఉపయోగిస్తారు? (ఉదాహరణకు, 1–6, 10, 23–24, 27–28,32 వచనాలు చూడండి). బారూకు యిర్మీయా కోసం చేసినట్లుగా, మరొక కుటుంబ సభ్యుడు దానిని వ్రాస్తుండగా, ఈ అధ్యాయము నుండి ఒక వచనము చదవమని ఒక కుటుంబ సభ్యుని మీరు అడగవచ్చు. ప్రవక్తల మాటలను కాపాడిన, బారూకు వంటి జనుల ప్రయత్నాల కోసం మనము ఎందుకు కృతజ్ఞత కలిగియున్నాము? లేఖనాలలో ఆయన మాటలకు మనము విలువిస్తున్నామని ప్రభువుకు చూపడానికి మనము ఏమి చేయగలం?

విలాపవాక్యములు 3:1–17, 21–25, 31–32ఒక కుటుంబముగా, విలాపవాక్యములు 3:1–17{ లో వ్యక్తపరచబడిన భావనలు మనము పాపము చేసినప్పుడు మనకు కలిగే భావనలతో ఎలా అన్వయించగలమో మీరు మాట్లాడవచ్చు. 21–25, 31–32 వచనాలలో సందేశాలు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

బయల్పాటును వెదకండి. దినమంతా మీరు ధ్యానించినప్పుడు, మీరు అధ్యయనం చేసిన లేఖనాలను గూర్చి అదనపు ఆలోచనలు మరియు భావనలు మీరు పొందవచ్చు. సువార్త అధ్యయనము మీరు సమయాన్ని వెచ్చించే దానిగా ఆలోచించకుండా, మీరు ఎల్లప్పుడు చేసే దానిగా ఆలోచించండి. (రక్షకుని విధానములో బోధించుట, 12 చూడండి.)

చిత్రం
బయట పట్టణము కాలిపోవుచుండగా గుహలోని మనుష్యుడు విచారంగా కనిపించుట.

యెరూషలేము నాశనమును బట్టి యిర్మీయా విలపించుట, రెంబ్రాడ్ వాన్ రిజ్న్ చేత

ముద్రించు