2022 పాత నిబంధన
అక్టోబరు 3–9. యెషయా 58–66: “సీయోను నొద్దకును విమోచకుడు వచ్చును”


“అక్టోబరు 3–9. యెషయా 58–66: ‘సీయోను నొద్దకును విమోచకుడు వచ్చును,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“అక్టోబరు 3–9. యెషయా 58–66,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
యేసు సమాజమందిరంలో బోధించుట

గ్రెగ్ కె. చేత నజరేతు వద్ద సమాజ మందిరంలో యేసు ఓల్సన్

అక్టోబరు 3–9

యెషయా 58–66

“సీయోను నొద్దకును విమోచకుడు వచ్చును”

యెషయా 58–66 మీరు అధ్యయనం చేసినప్పుడు, యెషయా మాటలు మీకు సంతోషాన్ని మరియు భవిష్యత్ కొరకు నిరీక్షణను ఎలా తెస్తాయో ఆలోచించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

ఆయన భూలోక పరిచర్య ప్రారంభంలో, యేసు క్రీస్తు తాను పెరిగిన గ్రామము నజరేతులో ఒక సమాజమందిరాన్ని సందర్శించాడు అక్కడ ఆయన నిలబడి లేఖనాలనుండి చదివాడు, యెషయా గ్రంథాన్ని తెరిచాడు, మరియు యెషయా 61:1–2 గా ఇప్పుడు మనకు తెలిసిన దానిని చదవాడు. తరువాత ఆయన ప్రకటించాడు, “నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది.” ఇది ఆయన అభిషేకించబడ్డాడని రక్షకుని అత్యంత నిష్కపటమైన సూటియైన ప్రకటనలలో ఒకటి, ఆయనే “నలిగిన వారిని విడిపించును” మరియు “చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించును” (లూకా 4:16–21 చూడండి). ఈ లేఖనము ఆ రోజున వాస్తవంగా నెరవేర్చబడింది. మరియు, యెషయా యొక్క మిగిలిన అనేక ప్రవచనాల వలె, అది మన కాలంలో నెరవేర్చబడుట కొనసాగుతున్నది. రక్షకుడు తన వద్దకు వచ్చిన విరిగిన హృదయము గల వారందరిని స్వస్థపరచుట కొనసాగిస్తున్నాడు. విమోచన ప్రకటించబడాల్సిన చెరపట్టబడిన వారు ఇంకా చాలామంది ఉన్నారు. ప్రభువు “క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని సృజించుటకు” (యెషయా 65:17) మరియు “సమస్త జనముల యెదుట నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయు” (యెషయా 61:11) సమయము కొరకు—సిద్ధపడుటకు మహిమకరమైన భవిష్యత్తు అక్కడ ఉన్నది. యెషయాను చదువుట, ప్రభువు అంతకుముందు చేసిన దానికి, ఆయన చేస్తున్న దానికి, మరియు ఆయన తన జనుల కొరకు ప్రభువు ఇదివరకే చేసిన దానిని గమనించునట్లు చేస్తుంది.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

యెషయా 58:3–12

ఉపవాసము దీవెనలను తెచ్చును.

అనేకమంది ఇశ్రాయేలీయులకు, ఉపవాసముండుట ఒక ఆశీర్వాదము కంటె ఎక్కువ భారముగా ఈ వచనాలు సూచిస్తాయి. కొన్నిసార్లు మనలో అనేకులు ఆ భావనతో సంబంధము కలిగియుండవచ్చు. “మనము ఎందుకు ఉపవాసముండాలి?” ప్రశ్నకు ప్రభువు యొక్క జవాబులను కనుగొనడానికి మీ ఉపవాసమందు ఎక్కువ అర్థమును, ఉద్దేశమును కనుగొనాలని మీరు కోరిన యెడల, యెషయా 58:3–12 చదవండి. మీ అనుభవములో, ఉపవాసము “దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు” మరియు “ప్రతి కాడిని విరుగగొట్టుటగా” ఎలా ఉన్నది? (యెషయా 58:6). ఉపవాసము యెషయా 58:8–12 లో వివరించబడిన దీవెనలను మీకు ఎలా తెచ్చింది? ఉపవాసము గురించి మీరు ఆలోచించే విధానమును యెషయా 58:3–12 ఎలా ప్రభావితం చేస్తుంది?

ఆయన సందేశములో, “నేను ఏర్పరచుకొనిన ఉపవాసము ఇదే గదా?” (Liahona, May 2015, 22–25), అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ ఉపవాసము మరియు ఉపవాస అర్పణల చేత జనులు ఎలా దీవించబడ్డారో అనేక మాదిరులను పంచుకున్నారు. మీ జీవితంలో అటువంటి దీవెనలు మీరు ఎలా చూసారు?

Gospel Topics, “Fasting and Fast Offerings” (topics.ChurchofJesusChrist.org) కూడా చూడండి.

యెషయా 59:9–21; 61:1–3; 63:1–9

యేసు క్రీస్తు నా రక్షకుడు మరియు విమోచకుడు.

యెషయా 58–66 లో యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త నియమిత కాార్యమునకు బహుళ పదబంధాలను మీరు కనుగొంటారు. వాటిని మీరు ధ్యానించడానికి సహాయపడటానికి కొన్ని ప్రశ్నలతోపాటు, ఇక్కడ కొన్ని ఉదాహరణలున్నాయి.

  • యెషయా 59:9–21. 9–15 వచనాలలో వివరించబడిన జనుల ఆత్మీయ పరిస్థితిని మీరు ఎలా సంక్షిప్తపరచగలరు? 16–21 వచనాలలో “మధ్యవర్తిని” గూర్చి మరియు ఆయన వైపు తిరిగిన వారితో ఆయన చేసిన నిబంధన యొక్క వివరణ గురించి మిమ్మల్ని ఆకట్టుకున్నదేమిటి?

  • యెషయా 61:1–3. ఈ వచనాలలో వివరించబడిన విధానాలలో యేసు క్రీస్తు మిమ్మల్ని ఎలా దీవించాడు? ఆయన మీకు “సువర్తమానమును” ఎలా తెచ్చాడు? బూడిదెకు ప్రతిగా పూదండను ఆయన మీకు ఎలా ఇచ్చాడు?

  • యెషయా 63:7–9. ఏ “యెహోవా కృపాతిశయమును” మీరు చెప్పగలరు? ఈ వచనాలు రక్షకుని కొరకు ఏ భావాలను మీ హృదయంలో ప్రేరేపిస్తాయి?

యెషయా 58–66 లో రక్షకునికి ఏ ఇతర రిఫరెన్సులను మీరు కనుగొంటారు?

మోషైయ 3:7; సిద్ధాంతము మరియు నిబంధనలు 133:46–53 కూడా చూడండి.

చిత్రం
పురుషుని చేతులతో పట్టుకోబడిన దీపం నుండి స్త్రీ మట్టి నూనె దీపం వెలిగించుట

“యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును” (యెషయా 60:19). ఈవా తిమోతి చేత వెలుగు యొక్క వరము

యెషయా 60; 62

“యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును”

కడవరి దినాలలో యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రపంచాన్ని ఎలా దీవిస్తుందో బోధించటానికి, యెషయా60 మరియు 62 వెలుగు, చీకటిని, కళ్ళు మరియు చూచుట గురించి మాట్లాడును. ప్రత్యేకంగా యెషయా 60:1–5, 19–20; 62:1–2 లో ఈ భావనల కొరకు చూడండి. ఈ అధ్యాయాలను మీరు చదివినప్పుడు, దేవుడు తన పిల్లలను చీకటి నుండి వెలుగుకు ఎలా నడిపించగలడో ధ్యానించండి. ఈ కార్యములో మీ పాత్ర ఏమిటి?

1నీఫై 22:3–12; 3నీఫై 18:24; సిద్ధాంతము మరియు నిబంధనలు 14:9; బోన్నీ హెచ్. కార్డన్, “That They May See,” Liahona, May 2020, 78–80 కూడా చూడండి.

యెషయా 64:1–5; 65:17–25; 66

వెయ్యేండ్ల పరిపాలన సమయమందు క్రీస్తు భూమిని పరిపాలించును.

“పూర్వము కలిగిన బాధలు మరువబడినప్పుడు” (యెషయా 65:16) దినము గురించి యెషయా మాట్లాడాడు. ఈ ప్రవచనము అనేక నెరవేర్పులను కలిగియుండగా, దాని పరిపూర్ణమైన భావనలో, యేసు క్రీస్తు భూమి మీదకు తిరిగి వచ్చి, వెయ్యేండ్ల పరిపాలన అని పిలవబడిన శాంతి, నీతి యొక్క యుగమును స్థాపించినప్పుడు—ఆ రోజు ఇంకా రావాల్సియున్నది యెషయా 64:1–5; 65:17–25; 66 లో ఈ భవిష్యత్తు దినమును యెషయా వివరించాడు. “ఆనందించు” “ఆనందించుట” వంటి మాటలను అతడు ఎంత తరచుగా ఉపయోగించాడో గమనించండి. రక్షకుని రాకడ మీకు ఆనందించే దినముగా ఎందుకు ఉంటుందో ధ్యానించండి. ఆయన రాకడ కొరకు సిద్ధపడటానికి మీరు ఏమి చేయగలరు?

విశ్వాస ప్రమాణాలు 1:10 కూడా చూడండి; రస్సెల్ ఎమ్. నెల్సన్, “The Future of the Church: Preparing the World for the Savior’s Second Coming,” Ensign, Apr. 2020, 13–17.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

యెషయా 58:3–11.కుటుంబ సభ్యులు యెషయా 58:3–5 లో వివరించబడిన ఉపవాసం రకమును మరియు యెషయా 58:6–8 లో వివరించబడిన ఉపవాసం రకమును నటించిన యెడల యెషయా యొక్క సందేశమును వారు బాగా గ్రహించవచ్చు. “[దేవుడు] ఏర్పరచిన ఉపవాసము” వలె మన ఉపవాసాలను మనం ఎలా చేయగలము? ఉపవాసముండుట వలన మనము చూసిన దీవెనలు ఏవి?

యెషయా 58:13–14.విశ్రాంతిదినమున “[మనకు] ఇష్టమైన పనులు చేయుట” మరియు “యెహోవాయందు… ఆనందమును” కనుగొనుట మధ్య తేడా ఏమిటి? మనము సబ్బాతును “ఒక ఆనందముగా” ఎలా చేయగలము?

యెషయా 60:1–5.యెషయా 60:1–3 మీరు చదివినప్పుడు, వచనాలు వెలుగును చెప్పినప్పుడు కుటుంబ సభ్యులు లైటు వేసి, చీకటి చెప్పినప్పుడు దాని ఆపవచ్చు. యేసు క్రీస్తు యొక్క సువార్త మనకు ఒక వెలుగు వలె ఎలా ఉన్నది? దేవుని యొక్క జనులు సువార్త వెలుగును పంచుకొన్నప్పుడు, ఏమి జరుగుతుందని యెషయా ముందుగా చూసాడు? (యెషయా 60:3–5 చూడండి).

యెషయా 61:1–3.ఈ వచనాలలో యెషయా యొక్క ప్రవచనాలను రక్షకుడు ఎలా నెరవేర్చాడు? ఆయన నియమితకార్యము యొక్క అంశములను వివరిస్తాయని వారు భావించే రక్షకుని చిత్రముల కొరకు వెదకమని మీరు కుటుంబ సభ్యులను అడగవచ్చు (చిత్రములు సంఘ మాసపత్రికలలో లేక Gospel Art Book లో కనుగొనబడవచ్చు). రక్షకుడు మనల్ని ఎలా దీవిస్తాడో “I Feel My Savior’s Love” (Children’s Songbook, 74–75) వంటి పాటను కూడా మీరు పాడవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

మీ పరిసరాలను సిద్ధం చేయండి. మన పరిసరాలు నేర్చుకొనుటకు మన సామర్ధ్యాన్ని ప్రభావితం చేయగలవు. ఆత్మ యొక్క ప్రభావమును మీరు అనుభవించగలచోట లేఖనాలను అధ్యయనం చేయడానికి ఒక ప్రదేశమును వెదకండి. (Teaching in the Savior’s Way, 15 చూడండి.)

చిత్రం
ఆకాశంలో యేసు

“నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీమీద ఉదయించెను” (యెషయా 60:1). వెలుగు, జీవితం, మార్క్ మబ్రి చేత

ముద్రించు