“అక్టోబరు 10–16. యిర్మీయా 1–3; 7; 16–18; 20: ‘గర్భమునుండి నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని,’”రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“అక్టోబరు 10–16. యిర్మీయా 1-3; 7; 16; -18; 20;” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
అక్టోబరు 10–16
యిర్మీయా 1–3; 7; 16–18; 20
యిర్మీయా 1–3; 7; 16–18; 20: “గర్భమునుండి నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని”
ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ అన్నారు: “నేను [ప్రభువును] వినే విధానాలలో ఒకటి లేఖనాలలో ఉన్నది. లేఖనములు ముందుగా వ్రాయబడిన ప్రభువు యొక్క స్వరము” (“‘Hear Him’ in Your Heart and in Your Mind,” ChurchofJesusChrist.org).
మీ మనోభావాలను నమోదు చేయండి
మొదట, తాను ఒక మంచి ప్రవక్తగా ఉండగలడని యిర్మీయా అనుకోలేదు. ప్రభువు అతడిని మొదట పిలిచినప్పుడు “అయ్యో, మాటలాడుటకు నాకు శక్తి చాలదు,” (యిర్మీయా 1:6) అని అతడు ప్రతిఘటించాడు. “నీ నోట నా మాటలు ఉంచియున్నాను” (9 వచనము) అని ప్రభువు అతడికి అభయమిచ్చాడు. తాను అనుభవములేని “బాలుడను” అని యిర్మీయా భావించాడు (6 వచనము), కానీ అతడు గ్రహించిన దానికంటే నిజంగా ఎక్కవగా సిద్ధపడ్డాడని — అతడు పుట్టకముందే ఈ పిలుపుకు నియమించబడ్డాడని ప్రభువు వివరించాడు (5 వచనము చూడండి). కనుక యిర్మీయా తన భయాలను ప్రక్కన పెట్టి, పిలుపును అంగీకరించాడు. వారి భూటకపు పరిశుద్ధత యెరూషలేము యొక్క రాజులు మరియు యాజకులను నాశనము నుండి రక్షించదని అతడు హెచ్చరించాడు. మాటలాడుట చేతకాని “బాలుడను” అనుకొన్న అతడు దేవుని వాక్యమును “[అతడి] హృదయములో అగ్నివలె మండుటను” భావించాడు మరియు చెప్పక మానలేదు (యిర్మీయా 20:9).
యిర్మీయా వృత్తాంతము మనది కూడా. మనము పుట్టకముందు, దేవుడు మనల్ని కూడా ఎరిగియున్నాడు. మిగిలిన విషయాల మధ్య, ఆ కార్యము యిర్మీయా ముందుగా చూసిన దానిని కలిపియున్నది: దేవుని యొక్క జనులను ఒకరి తరువాత ఒకరిని సమకూర్చి, “[వారిని] సీయోనుకు రప్పించెదను” (యిర్మీయా 3:14). మనకు ఏమి చేయాలి లేక చెప్పాలో ఖచ్చితంగా తెలియనప్పుడు కూడా, మనము “భయపడరాదు…; నేను మీకు తోడై యున్నాను, ఇదే యెహోవా వాక్కు” (యిర్మీయా 1:8,19).
యిర్మీయా గ్రంథము సమీక్షించుటకు, బైబిలు నిఘంటువులో “యిర్మీయా“ చూడండి.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
యిర్మీయా 1:4–19; 7:1–7; 20:8–10
ప్రవక్తలు ప్రభువు యొక్క మాటను మాట్లాడటానికి పిలవబడ్డారు.
యిర్మీయా 1:4–19 లో యిర్మీయా పిలుపు గురించి మీరు చదివినప్పుడు, మీ జీవితంలో ప్రవక్తల పాత్రను ధ్యానించండి. యిర్మీయాకు ప్రభువు మాటల నుండి ప్రవక్తల గురించి మీరు నేర్చుకొన్నదేమిటి? (యిర్మీయా 7:1–7 కూడా చూడండి). యిర్మీయా బోధన తరచుగా తిరస్కరించబడింది (యిర్మీయా 20:8,10 చూడండి). యిర్మీయా 20:9 వచనాలలో జోసెఫ్ స్మిత్ అనుభవం నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? యిర్మీయా బోధనలను గూర్చి మీ అధ్యయనము అంతటా ఈ ఆలోచనలను మీ మనస్సులో ఉంచుకోండి. మన కడవరి-దిన ప్రవక్తలను అనుసరించడానికి మిమ్మల్ని ప్రేరేపించునట్లు ఈ బోధనలలో మీరు కనుగొన్నదేమిటి?
నేను పుట్టకముందే దేవుడు నన్ను ఎరిగియున్నాడు.
యిర్మీయా పుట్టకముందు, దేవుడు అతడిని ఎరిగియున్నాడు మరియు భూమి మీద ఒక ప్రత్యేక మిషనును నెరవేర్చడానికి, అతడిని ఎన్నుకున్నాడు, లేక అతడిని ముందుగా నియమించాడు. (యిర్మీయా 1:5 చూడండి). దీనిని తెలుసుకోవడం యిర్మీయాకు విలువైనదని మీరు ఎందుకు అనుకుంటున్నారు?
నీవు పుట్టకముందే దేవుడు మిమ్మల్ని ఎరిగియున్నాడు మరియు ప్రత్యేక బాధ్యతలకు మిమ్మల్ని ముందుగా నియమించాడు (ఆల్మా 13:1–4; సిద్ధాంతము మరియు నిబంధనలు 138:53–56; అబ్రాహాము 3:22–23 చూడండి). మీ జీవితంలో ఈ జ్ఞానము ఏ ప్రత్యేకతను కలిగియున్నది? మీ గోత్ర జనకుని దీవెనను మీరు పొందిన యెడల, మీరు దానిని ప్రార్థనాపూర్వకంగా పునర్వీక్షించవచ్చు మరియు ఆయన మీరు చేయాలని ముందుగా నియమించిన దానిని ఎలా నెరవేర్చాలో దేవునిని అడగండి.
సువార్త విషయాలు, “Foreordination,” “Premortality,” topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.
“వారు జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు.”
ఇశ్రాయేలీయులు నివసించిన ఎండిన నేలలో, జనులు నీళ్ల తొట్టెలని పిలిచిన భూగర్భ జలాశయాలందు అమూల్యమైన నీటిని నిల్వ చేసేవారు. ఒక నీళ్ల తొట్టెపై ఆధారపడుట కంటె నీటి ఊట నుండి నీటిని పొందుట ఎందుకు మేలైనది? “జీవజలముల ఊటను” విడిచిపెట్టుట అనగా అర్థమేమిటి? యిర్మీయా 2:13 చెప్పబడిన “బ్రద్దలైన నీళ్ల తొట్టె” దేనికి చిహ్నముగా ఉన్నదని మీరనుకుంటున్నారు? యిర్మీయా 2 మరియు7 మీరు చదివినప్పుడు, ప్రభువు యొక్క జీవజలములను జనులు ఎలా విడిచిపెట్టారో గమనించండి, మరియు మీ జీవితంలో మీరు జీవజలమును ఎలా పొందుతారో ఆలోచించండి.
యిర్మీయా 7 “యెహోవా మందిర ద్వారమున … యెహోవాకు నమస్కారము చేయుటకు” (యిర్మీయా 7:2) ప్రవేశించు వారితో ప్రసంగించబడింది. అయినప్పటికీ, ఈ భక్తి యొక్క బాహ్యరూపం ఉన్నప్పటికీ, వారు గొప్ప చెడుతనముకు పాల్పబడ్డారు (2–11 వచనములు). 21–23 వచనములలో మీ కోసం ప్రభువు కలిగియున్నాడని మీరు భావించిన సందేశాలేవి?
ప్రభువు తన జనులను సమకూరుస్తాడు.
యిర్మీయా చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను సమకూర్చుటను గూర్చి ప్రవచించినప్పుడు, అతడు ఐగుప్తు నుండి నిర్గమము కంటె అది ఎక్కువ జ్ఞాపకార్థమైనదని కూడా అతడు చెప్పాడు యిర్మీయా 16:14–15 చూడండి). అదే ఆత్మయందు, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పారు: “ఈ ప్రశస్తమైన సమయమందు … ఇశ్రాయేలీయులను సమకూర్చుటకు సహాయపడుటకు … భూమిమీదకు మీరు పంపబడ్డారు. ఇప్పుడు జరుగుతున్నది ఏదియు [సమకూర్చుట]. … కంటె ఎక్కువ ముఖ్యమైనది కాదు. ఈ సమకూర్చుట అనేది మీకు సమస్తమైనదిగా ఉండాలి” (రస్సెల్ ఎమ్. నెల్సన్ మరియు వెండీ డబ్ల్యు. నెల్సన్, “Hope of Israel” [worldwide youth devotional, June3, 2018], supplement to the New Era and Ensign, Aug. 2018,12, ChurchofJesusChrist.org).
యిర్మీయా 3:14–18; 16:14–21 మీరు అధ్యయనము చేసినప్పుడు, కడవరి దినాలలో ఇశ్రాయేలును సమకూర్చుట గురించి మిమ్మల్ని ప్రేరేపించేదేమిటి? ఆ సమకూర్చుట ఎలా జరుగుతుందో ఈ వచనాలు ఏమి సూచిస్తాయి? పైన ఉదహరించబడిన అధ్యక్షులు నెల్సన్ యొక్క మిగిలిన సందేశములో మీరు కనుగొనే అదనపు అంతర్‌జ్ఞానములేవి?
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
యిర్మీయా 1:5.మనము పుట్టకముందు పరలోక తండ్రితో మన జీవితం గురించి మాట్లాడటానికి ఈ వచనాన్ని మీరు ఉపయోగించవచ్చు. “I Lived in Heaven” (Children’s Songbook,4) and “Introduction: Our Heavenly Father’s Plan” (in New Testament Stories, 1–5) వంటి వనరులు సహాయపడగలవు. మన మర్త్యత్వానికి ముందు జీవితం గురించి తెలుసుకొనుట మన మర్త్య జీవితాన్ని జీవించే విధానాన్ని ఎలా ప్రభావితం చేయగలదు?
-
యిర్మీయా 2:13; 17:13–14.ఈ వచనాలను దృశ్యీకరించడానికి కుటుంబ సభ్యులకు సహాయపడటానికి, పగిలిన, లేక విరిగిన పాత్రలో మీరు నీళ్లు వేసినప్పుడు ఏమి జరుగుతుందో రుజువు చేయవచ్చు. “జీవజలముల ఊట” మరియు “బ్రద్దలైన నీళ్ల తొట్టె” దేనిని సూచిస్తున్నాయి? యిర్మీయా 2:13. ప్రభువు యొక్క జీవజలము నుండి మనము ఎలా త్రాగగలము?
-
యిర్మీయా 16:16.అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ వచనములో జాలరులు మరియు వేటగాళ్లను కడవరి-దిన మిషనరీలతో పోల్చారు (“The Gathering of Scattered Israel,” ఎన్‌సైన్ లేదా లియహోనా, నవం. 2006,81 చూడండి). కుటుంబ సభ్యులు మీ ఇంటిలోని వస్తువుల కొరకు “వెదకవచ్చు” మరియు చెదరిపోయిన ఇశ్రాయేలు కొరకు మీరు “వెదకి” “పట్టుకొనుటకు” ఎలా సహాయపడగలరో మాట్లాడండి.
-
యిర్మీయా 18:1–6.ఈ వచనాలను పరిశోధించడానికి, కుండలు ఎలా తయారు చేయబడతాయో మీరు చూపవచ్చు లేక చర్చించవచ్చు. యిర్మీయా18:1–6 లో ఇశ్రాయేలీయుల కొరకు ప్రభువు కలిగియున్న సందేశమేమిటి? ప్రభువు యొక్క హస్తములలో మన్నుగా ఉండుట అనగా అర్థమేమిటి? (యెషయ64:8 కూడా చూడండి). కుమ్మరివాని మన్నుతో మనల్ని పోల్చే మరొక వృత్తాంతము కొరకు, ఎల్డర్ రిచర్డ్ జె. మేనిస్ యొక్క సందేశము చూడండి, “The Joy of Living a Christ-Centered Life” (ఎన్‌సైన్ లేదా లియహోనా, నవం. 2015, 27–30).
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.