“మీ కుటుంబ లేఖన అధ్యయనము మెరుగుపరచుటకు ఉపాయములు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“మీ కుటుంబ లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు:2022
మీ కుటుంబ లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు
మీ కుటుంబము సువార్తను నేర్చుకోవడానికి సహాయపడేందుకు క్రమంతప్పని కుటుంబ లేఖన అధ్యయనము ఒక శక్తివంతమైన మార్గము. మీ ప్రయత్నాలలో నిలకడగా ఉండడం కంటే కుటుంబంగా మీరు ఎంత మొత్తం మరియు ఎంత సమయం చదివారనేది అంత ముఖ్యము కాదు. మీ కుటుంబ జీవితంలో లేఖన అధ్యయనాన్ని ఒక ముఖ్యమైన భాగంగా మీరు చేసినప్పుడు, మీ కుటుంబ సభ్యులు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుకు దగ్గరవడానికి, దేవుని వాక్యము యొక్క పునాదిపై వారి సాక్ష్యాలను నిర్మించడానికి మీరు సహాయం చేస్తారు.
క్రింది ప్రశ్నలను పరిగణించండి:
-
స్వయంగా లేఖనాలను అధ్యయనం చేయడానికి కుటుంబ సభ్యులను మీరు ఎలా ప్రోత్సహించగలరు?
-
వారు నేర్చుకుంటున్న వాటిని పంచుకునేలా కుటుంబ సభ్యులను ప్రోత్సహించడానికి మీరు ఏమి చేయగలరు?
-
పాత నిబంధనలో మీరు నేర్చుకుంటున్న సూత్రాలను రోజువారీ బోధనా క్షణాల్లో ఎలా నొక్కి చెప్పగలరు?
సువార్త అభ్యాసానికి గృహమే ఆదర్శమైన ప్రదేశమని గుర్తుంచుకోండి. సంఘ తరగతిలో సాధ్యం కాని మార్గాల్లో మీరు ఇంటివద్ద సువార్తను నేర్చుకోగలరు మరియు బోధించగలరు. మీ కుటుంబము లేఖనాలనుండి నేర్చుకొనుటలో సహాయపడుటకు మార్గాలు ఆలోచించినప్పుడు సృజనాత్మకంగా ఉండండి. మీ కుటుంబ లేఖన అధ్యయనాన్ని పెంపొందించడానికి క్రింది ఉపాయాలను అనుసరించండి.
సంగీతాన్ని ఉపయోగించండి
లేఖనాలలో బోధించబడిన సూత్రాలను బలపరిచే పాటలను పాడండి. సూచించబడిన ఒక కీర్తన లేక పిల్లల పాట ప్రతి వారం సారాంశంలో జాబితా చేయబడింది. పాటలలోని మాటలు లేక వాక్యభాగములను గూర్చి కుటుంబ సభ్యులను మీరు ప్రశ్నలు అడగవచ్చు. పాట పాడుటకు అదనముగా, మీ కుటుంబము పాటలకు తగినట్లుగా అభినయించవచ్చు లేక వారు ఇతర ప్రోత్సాహకార్యక్రమాలను చేస్తుండగా నేపథ్య సంగీతముగా పాటలను వినవచ్చు. ఎక్కువ ఉపాయాల కోసం, ఈ వనరులో “మీ సువార్త శిక్షణలో పరిశుద్ధ సంగీతాన్ని చేర్చుట” చూడండి.
అర్థవంతమైన లేఖనాలను పంచుకోండి
కుటుంబ సభ్యులకు వారి వ్యక్తిగత అధ్యయనంలో అర్థవంతమైనవిగా కనుగొన్న లేఖన భాగాలను పంచుకోవడానికి సమయం ఇవ్వండి.
మీ స్వంత పదాలను ఉపయోగించండి
మీరు అధ్యయనం చేసే లేఖనాల నుండి వారు నేర్చుకున్న వాటిని వారి స్వంత మాటలలో సంగ్రహించడానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.
మీ జీవితానికి లేఖనాలను అన్వయించుకోండి
ఒక లేఖన భాగాన్ని చదివిన తరువాత, వారి జీవితాలకు ఆ భాగం వర్తించే మార్గాలను పంచుకోవాలని కుటుంబ సభ్యులను అడగండి.
ఒక ప్రశ్న అడగండి
ఒక సువార్త ప్రశ్న అడగడానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించండి, ఆపై ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సహాయపడే వచనాల కోసం వెదకండి.
ఒక లేఖనాన్ని ప్రదర్శించండి
మీకు అర్థవంతముగా అనిపించే వచనం ఎంచుకోండి మరియు కుటుంబ సభ్యులు తరచూ చూసే చోట దాన్ని ప్రదర్శించండి. ప్రదర్శించడానికి ఒక లేఖనాన్ని ఒంతుల వారీగా ఎంచుకోమని ఇతర కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.
లేఖన జాబితాను తయారు చేయండి
కుటుంబంగా, రాబోయే వారంలో మీరు చర్చించదలిచిన అనేక వచనాలను ఎంచుకోండి.
లేఖనాలను కంఠస్థం చేయండి
మీ కుటుంబానికి అర్థవంతంగా అనిపించే ఒక లేఖన భాగాన్ని ఎంచుకోండి మరియు ప్రతిరోజూ పునరావృతం చేయడం ద్వారా లేదా జ్ఞాపకశక్తి ఆట ఆడటం ద్వారా దాన్ని గుర్తుంచుకోవడానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.
వస్తు పాఠములను పంచుకోండి
ఒక కుటుంబముగా మీరు చదువుతున్న లేఖన భాగాలలో, సువార్త సూత్రములకు సంబంధమున్న వస్తువులను కనుక్కోండి. లేఖనాల్లోని బోధనలతో ప్రతీ ఉద్దేశము ఎలా సంబంధం కలిగి ఉందో మాట్లాడటానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.
ఒక అంశాన్ని ఎంచుకోండి
కుటుంబం కలిసి అధ్యయనం చేసే అంశాన్ని ఎంచుకోవడానికి ఒంతుల వారీగా కుటుంబ సభ్యులు చేయనివ్వండి. ఒక అంశం గురించి లేఖన భాగాలను కనుగొనడానికి విషయ దీపిక, బైబిల్ నిఘంటువు, లేఖన దీపిక (scriptures.ChurchofJesusChrist.org) ఉపయోగించండి.
చిత్రాన్ని గీయండి
కుటుంబంగా కొన్ని వచనాలను చదవండి, తరువాత మీరు చదివిన వాటికి సంబంధించినది ఏదైన గీయడానికి కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వండి. ఒక్కొక్కరు గీసిన చిత్రాల గురించి చర్చించడానికి సమయం కేటాయించండి.
ఒక కథను నటించండి
ఒక కథ చదివిన తరువాత, దాన్ని నటించడానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించండి. తరువాత, మీరు వ్యక్తిగతంగా మరియు కుటుంబముగా అనుభవిస్తున్న విషయాలతో ఆ కథ ఎలా సంబంధం కలిగి ఉందో అనేదాని గురించి మాట్లాడండి.