2022 పాత నిబంధన
అదనపు వనరులు


“అదనపు వనరులు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“అదనపు వనరులు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
ఇంటిలో లేఖనాలను అధ్యయనం చేస్తున్న కుటుంబము

అదనపు వనరులు

ఈ వనరులలో అధికము ChurchofJesusChrist.org వద్ద మరియు సువార్త గ్రంథాలయ యాప్‌లో కనుగొనబడగలవు.

కీర్తనలు మరియు పిల్లల పాటల పుస్తకము

పరిశుద్ధమైన సంగీతము ఆత్మను ఆహ్వానించును మరియు జ్ఞాపకార్థమైన విధానములో సిద్ధాంతమును బోధించును. కీర్తనలు మరియు పిల్లల పాటల పుస్తకము యొక్క ముద్రించబడిన పాఠాంతరములను ఉపయోగించుటకు అదనంగా, ఇంకా ఎన్నో కీర్తనలు మరియు పిల్లల పాటల ఆడియోలు మరియు వీడియో రికార్డింగులు music.ChurchofJesusChrist.org లో పవిత్ర సంగీతము మరియు సువార్త మీడియా యాప్‌లో మీరు కనుగొనవచ్చు.

సెమినరీ మరియు ఇనిస్టిట్యూట్ కరదీపికలు

సేమినరీ మరియు ఇన్‌స్టిట్యూట్ కరదీపికలు లేఖనాలలో కనిపించే సూత్రాలు మరియు వృత్తాంతాలకు చారిత్రక నేపథ్యం మరియు సిద్ధాంత వ్యాఖ్యానాన్ని అందిస్తాయి.

సంఘ మాసపత్రికలు

ఫ్రెండ్, యౌవనుల బలము కొరకు, మరియు లియహోనా పత్రికలు రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు నుండి మీరు బోధించే సూత్రాలకు అదనపు సహాయాన్ని అందించే కథలు మరియు కార్యక్రమాలను అందిస్తాయి.

సువార్త విషయాలు

సువార్త విషయాలలో(topics.ChurchofJesusChrist.org) సంబంధిత సర్వసభ్య సమావేశ ప్రసంగాలు, వ్యాసాలు, లేఖనాలు, మరియు వీడియోలతో పాటు, వేర్వేరు సువార్త విషయాలను గూర్చి ముఖ్యమైన సమాచారమును మీరు కనుగొనవచ్చు. Gospel Topics Essays కూడా మీరు కనుగొనవచ్చు, అది సిద్ధాంతపరమైన, చారిత్రక సమస్యలను గూర్చి లోతైన సమాచారాన్ని అందిస్తాయి.

పాత నిబంధన కథలు

పాత నిబంధన కథలు (2005) పాత నిబంధనలో కనిపించే సిద్ధాంతం మరియు కథలను నేర్చుకోవడానికి పిల్లలకు సహాయపడవచ్చు. ఈ కథల యొక్క వీడియోలను మరియు కథలను సువార్త గ్రంథాలయ యాప్‌లో medialibrary.ChurchofJesusChrist.org కూడా మీరు కనుగొనవచ్చు.

లేఖన కథలను రంగులు వేసే పుస్తకం—పాత నిబంధన

ఈ వనరు పాత నిబంధన నుండి పిల్లల శిక్షణను పెంపొందించటానికి సరదాగల రంగు వేసే కార్యక్రమ పేజీలను రూపొందించింది.

వీడియోలు మరియు కళ

కళాకృతులు, వీడియోలు, మరియు ఇతర మీడియా లేఖనాలకు సంబంధించిన సిద్ధాంతం మరియు కథలను దృశ్యమానం చేయడంలో మీ కుటుంబానికి సహాయపడగలవు. సంఘము సేకరించిన మీడియా వనరులను చూడటానికి MediaLibrary.ChurchofJesusChrist.org వద్ద సువార్త మీడియా దర్శించండి. మొబైల్ యాప్‌లో కూడా సువార్త గ్రంథాలయం అందుబాటులో ఉంటుంది. మీరు ఉపయోగించగల అనేక చిత్రములు సువార్త కళా గ్రంథములో కనుగొనబడవచ్చు.

రక్షకుని విధానములో బోధించుట

రక్షకుని విధానములో బోధించుట క్రీస్తువంటి బోధనా సూత్రములను గూర్చి నేర్చుకొనుటకు, అన్వయించుటకు మీకు సహాయపడతాయి.

ముద్రించు