2022 పాత నిబంధన
మీ వ్యక్తిగత లేఖన అధ్యయనము మెరుగుపరచుకొనుటకు ఉపాయములు


“మీ వ్యక్తిగత లేఖన అధ్యయనము మెరుగుపరచుట కొరకు ఉపాయములు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“మీ వ్యక్తిగత లేఖన అధ్యయనము మెరుగుపరచుకొనుటకు ఉపాయములు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

ఇంటివద్ద మహిళ లేఖనాలను చదువుట

మీ వ్యక్తిగత లేఖన అధ్యయనము మెరుగుపరచుకొనుటకు ఉపాయములు

లేఖనాలలో దేవుని వాక్యము యొక్క మీ అధ్యయనాన్ని మెరుగుపరిచే కొన్ని సులువైన మార్గాలు.

యేసు క్రీస్తు గురించిన సత్యాలను వెదకండి

సమస్త సంగతులు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చునని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి (2 నీఫై 11:4; మోషే 6:63 చూడండి), కాబట్టి రక్షకుడి గురించి బోధించి మరియు ఆయనను ఎలా అనుసరించాలో నేర్పే వచనాలను గమనించడాన్ని లేదా గుర్తించడాన్ని పరిగణించండి.

ప్రేరేపించే పదములు మరియు వాక్యభాగముల కొరకు వెదకండి

లేఖనములందు మీ కోసం ప్రత్యేకంగా వ్రాయబడినట్లుగా, మిమ్మల్ని ముగ్ధులను చేసే కొన్ని నిర్దిష్టమైన పదములు మరియు వాక్యభాగములను మీరు కనుగొనవచ్చు. అవి వ్యక్తిగతంగా మీకు సంబంధితమైనవిగా అనిపించి, మిమ్మల్ని ప్రేరేపించి, ప్రోత్సహించవచ్చు. వాటిని మీ లేఖనాలలో గుర్తించుటకు లేక దినచర్య పుస్తకములో వ్రాయుటకు ఆలోచించండి.

సువార్త సత్యముల కొరకు వెదకండి

కొన్నిసార్లు సువార్త సత్యములు (సిద్ధాంతము లేక సూత్రముగా తరచుగా పిలువబడినవి) సూటిగా వ్యాఖ్యానించబడతాయి, మరికొన్నిసార్లు అవి ఒక ఉదాహరణ లేక వృత్తాంతము ద్వారా సూచించబడతాయి. “ఈ వచనములలో బోధించబడిన నిత్య సత్యములేవి?” అని మీకై మీరు ప్రశ్నించుకోండి.

ఆత్మను ఆలకించండి

మీరు చదువుతున్న దానికి సంబంధించకపోయినప్పటికీ, మీ ఆలోచనలు మరియు భావనలపట్ల శ్రద్ధ వహించండి. ఆ మనోభావాలే మీ పరలోక తండ్రి మీరు నేర్చుకోవాలని కోరే విషయాలు కావచ్చు.

లేఖనాలను మీ జీవితమునకు పోల్చుకోండి

మీరు చదువుతున్న వృత్తాంతములు మరియు బోధనలు ఏవిధంగా మీ జీవితానికి వర్తిస్తాయో ఆలోచించండి. ఉదాహరణకు, మీకై మీరు ఇలా ప్రశ్నించుకోవచ్చు, “నాకు కలిగిన ఏ అనుభవాలు నేను చదివిన దానిని పోలియున్నాయి?” లేక “లేఖనాలలోని ఈ వ్యక్తి యొక్క మాదిరిని నేను ఎలా అనుసరించగలను?”

మీరు అధ్యయనము చేస్తున్నప్పుడు ప్రశ్నలు అడగండి

మీరు లేఖనాలను అధ్యయనము చేస్తున్నప్పుడు, మనస్సులో ప్రశ్నలు తలెత్తవచ్చు. ఈ ప్రశ్నలు మీరు చదివే దానికి లేక సాధారణంగా మీ జీవితానికి సంబంధించినవైయుండవచ్చు. మీరు లేఖనాలను అధ్యయనము చేయుట కొనసాగించినప్పుడు, ఈ ప్రశ్నలను ధ్యానించండి మరియు జవాబుల కొరకు వెదకండి.

ఇంటివద్ద యౌవనుడు లేఖనాలను చదువుట

లేఖన అధ్యయన సహాయములను ఉపయోగించండి

మీరు చదివే వచనాల యొక్క అదనపు అంతరార్థములను తెలుసుకొనుటకు, పాదవివరణలను, విషయదీపిక, బైబిల్ నిఘంటువు, లేఖనదీపిక (scriptures.ChurchofJesusChrist.org) మరియు ఇతర అధ్యయన సహాయకాలను ఉపయోగించండి.

లేఖనాల సందర్భాన్ని పరిగణించండి

ఒక లేఖనము యొక్క అర్థవంతమైన అంతరార్థములను దాని యొక్క సందర్భమును—అనగా ఆ లేఖనము యొక్క పరిస్థితులు లేదా స్థితిగతులను పరిగణించినట్లైతే—వాటిని మీరు కనుగొనగలరు. ఉదాహరణకు, ప్రవక్త మాట్లాడిన మనుషుల యొక్క నమ్మకాలను మరియు స్థితిగతులను తెలుసుకోవడం వలన ఆయన మాటల ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడగలవు.

మీ ఆలోచనలను మరియు అనుభూతులను నమోదుచెయ్యండి

మీరు అధ్యయనం చేసేటప్పుడు వచ్చే హావభావాలను వ్రాయడానికి వేర్వేరు విధానాలున్నాయి. ఉదాహరణకు, మీరు ఒక అర్థవంతమైన పదము లేక వాక్యభాగమును గుర్తించవచ్చు మరియు మీ లేఖనములందు ఒక వివరణగా మీ ఆలోచనలను వ్రాయవచ్చు. మీరు పొందే అంతర్‌జ్ఞానములు, భావనలు, మరియు మనోభావనలుగల దినచర్య పుస్తకము కూడా ఉంచవచ్చు.

కడవరి-దిన ప్రవక్తలు మరియు అపొస్తలుల మాటలను అధ్యయనము చేయండి

లేఖనములందు మీరు కనుగొనే సూత్రములను గూర్చి కడవరి-దిన ప్రవక్తలు మరియు అపొస్తలులు బోధించిన దానిని చదవండి (ఉదాహరణకు, conference.ChurchofJesusChrist.org మరియు Church magazines చూడండి).

అంతరార్థములను పంచుకోండి

మీ వ్యక్తిగత అధ్యయనము నుండి అంతరార్థములను చర్చించుట ఇతరులకు బోధించుటకు మంచి విధానము మాత్రమే కాదు, కానీ మీరు చదివిన దానిని గూర్చి మీ అవగాహనను బలపరచుటకు కూడా అది సహాయపడుతుంది.

మీరు నేర్చుకున్నదాని ప్రకారము జీవించండి

లేఖన అధ్యయనము మనల్ని ప్రేరేపించడం మాత్రమే కాదు, కానీ అది మనం జీవిస్తున్న మార్గాన్ని మార్చేలా కూడా ఉండాలి. మీరు చదువుతున్నప్పుడు ఆత్మ మిమ్మల్ని ఏమి చేయమని ప్రేరేపిస్తుందో వినండి, తరువాత ఆ ప్రేరణలపై పనిచేయడానికి కట్టుబడి ఉండండి.

ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా చెప్పారు: “మనము తెలుసుకోవలసిన సమస్తమును మనము బోధించుటకు లేక చెప్పుటకు, భక్తిగల శిష్యులగుటకు తెలుసుకోవలసిన దానిని, చేయవలసిన దానిని మరియు అంతము వరకు సాహసముగా సహించుటకు సంఘము ఒక నిర్మాణముగా మనము ఆశించరాదు [సిద్ధాంతము మరియు నిబంధనలు 121:29]. బదులుగా, మన వ్యక్తిగత బాధ్యత ఏదనగా మనము నేర్చుకోవలసిన దానిని నేర్చుకొనుట, మనము జీవించాలని మనకు తెలిసినట్లుగా జీవించుట, మరియు బోధకుడు మనము కావాలని కోరినట్లుగా మారుట. అభ్యసించుటకు, జీవించుటకు, ఆ విధముగా మారుటకు మన గృహాలే అంతిమ అమరిక” (“అవసరమైన ప్రతిదానిని పొందుటకు సిద్ధపడుము,” Ensign లేదా లియహోనా, మే 2019, 102).