“మీ సువార్త అభ్యాసములో పవిత్ర సంగీతాన్ని చేర్చుట,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“మీ సువార్త అభ్యాసములో పవిత్ర సంగీతాన్ని చేర్చుట,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
మీ సువార్త అభ్యాసములో పవిత్ర సంగీతాన్ని చేర్చుట
ప్రాథమిక పాటలు మరియు కీర్తనలు పాడడం మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని అనేకవిధాలుగా దీవించగలదు. మీరు సువార్తను అభ్యసించి, జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పవిత్ర సంగీతాన్ని ఉపయోగించడానికి ఈ ఉపాయాలు మీకు సహాయపడగలవు.
-
సిద్ధాంతపరమైన సూత్రాలను నేర్చుకోండి. మీరు పాడే లేదా వినే పాటలలో బోధించబడిన సత్యాల కొరకు చూడండి. ఈ సత్యాల గురించి రోజంతా సువార్త చర్చలకు ఇది దారితీయవచ్చు. యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి బోధించే ప్రాథమిక పాటలు లేదా కీర్తనలను పాడండి లేదా వినండి. రక్షకుడు మరియు ఆయన బోధనల గురించి పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చే విధానాల పట్ల శ్రద్ధ వహించండి.
-
సంగీతం యొక్క శక్తిని గుర్తించండి. ప్రాథమిక పాటలు మరియు కీర్తనలు పాడడం లేదా వినడం అవసరమైన సమయాల్లో దీవెన కాగలదు. ఉదాహరణకు, ఒక పాట పాడడం నిద్రించే సమయంలో బిడ్డను లాలించగలదు, మీ కుటుంబము కలిసి పనిచేస్తున్నప్పుడు ఆనందాన్నివ్వగలదు, అస్వస్థతతో ఉన్న పొరుగువారిని లేవనెత్తగలదు లేదా ఆందోళనలో ఉన్నవారిని ఓదార్చగలదు.
-
అనుభవాలను పంచుకోండి. పాటలలోని సందేశాలకు సంబంధించిన వ్యక్తిగత మరియు కుటుంబ అనుభవాలను పంచుకోండి. సంబంధిత లేఖన వృత్తాంతాలను కూడా మీరు పంచుకోవచ్చు.
-
మీ కుటుంబాన్ని చేర్చండి. మీ కుటుంబము క్రియాశీలకంగా పాల్గొంటున్నట్లయితే, వారు పాటల నుండి అధికంగా నేర్చుకుంటారు. మీ కుటుంబ సభ్యులను చేర్చడానికి, చిన్నపిల్లలకు ఒక పాట నేర్పించడంలో సహాయం చేయమని మీరు ఒక పెద్ద పిల్లవాడిని ఆహ్వానించవచ్చు లేదా ప్రాథమికలో వారు నేర్చుకున్న ఒక పాటను కుటుంబానికి నేర్పమని పిల్లల్ని ఆహ్వానించవచ్చు. ఒక పాటను పాడించడంలో కుటుంబ సభ్యులు వంతులు తీసుకొనేలా కూడా మీరు చేయవచ్చు.
-
సృజనాత్మకంగా ఉండండి. ఒక కుటుంబముగా పవిత్ర సంగీతాన్ని నేర్చుకోవడానికి రకరకాల పద్ధతులను ఉపయోగించండి. ఉదాహరణకు, పాటలోని పదాలు మరియు వాక్యభాగాలకు సరిపోయే అభినయాలను మీరు ఉపయోగించవచ్చు. లేదా మీరు పాటలోని భాగాలను వంతులవారీగా నటించి చూపుతూ, మిగిలిన కుటుంబ సభ్యులు ఆ పాటను ఊహించడానికి ప్రయత్నించేలా చేయవచ్చు. విభిన్న వేగాలలో లేదా శ్రుతులలో పాటలు పాడడాన్ని మీ కుటుంబము ఆనందించవచ్చు. Gospel Library (సువార్త గ్రంథాలయ) యాప్ మరియు Gospel for Kids (పిల్లల కొరకు సువార్త) యాప్‌లు పాటలు నేర్చుకోవడానికి మీకు సహాయపడగల ఆడియో మరియు వీడియో రికార్డింగులను కలిగియున్నాయి. వినడానికి పవిత్ర సంగీతం యొక్క పాటల జాబితాలను కూడా మీరు చేయవచ్చు.