2022 పాత నిబంధన
రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు ఉపయోగించుట


రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు ఉపయోగించుట,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు ఉపయోగించుట,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు ఉపయోగించుట

ఈ వనరు ఎవరి కొరకైనది?

ఈ వనరు సంఘములోని ప్రతి వ్యక్తి మరియు కుటుంబము కొరకైనది. మీ స్వంతంగానైనా లేక మీ కుటుంబంతోనైనా సువార్తను నేర్చుకోవడానికి మీకు సహాయపడేందుకు ఇది రూపొందించబడింది. గతంలో మీరు క్రమం తప్పక సువార్తను అధ్యయనం చేయనట్లయితే, మీరు ప్రారంభించడానికి ఈ వనరు సహాయపడగలదు. సువార్తను అధ్యయనం చేసే మంచి అలవాటు మీకు ఇదివరకే ఉన్నట్లయితే, మరిన్ని అర్థవంతమైన అనుభవాలను కలిగియుండేందుకు ఈ వనరు మీకు సహాయపడగలదు.

ఈ వనరును నేనెలా ఉపయోగించాలి?

మీకు సహాయకరంగా ఉండే ఏ విధానంలోనైనా ఈ వనరును ఉపయోగించండి. వ్యక్తిగత మరియు కుటుంబ లేఖన అధ్యయనం కొరకు ఒక మార్గదర్శిగా లేక సహాయముగా మీరు దీనిని ఉపయోగకరమైనదిగా కనుగొనగలరు. మీరు దీనిని కుటుంబ గృహ సాయంకాలము కొరకు కూడా ఉపయోగించవచ్చు. ఇందులోని సారాంశాలు పాత నిబంధనలో కనుగొనబడే ముఖ్యమైన సూత్రాలను నొక్కి చెప్తాయి, వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు అధ్యయన ఉపాయాలను, ప్రోత్సాహ కార్యక్రమాలను సూచిస్తాయి, మరియు మీ మనోభావాలను నమోదు చేయడానికి స్థలమును అందిస్తాయి.

రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు అనునది మీరు చేస్తున్న మంచి పనులకు బదులుగా లేక వాటితో పోటీపడేందుకు ఉద్దేశించబడినది కాదు. దేవుని వాక్యాన్ని మీ స్వంత పద్ధతిలో ఎలా అధ్యయనం చేయాలో నిర్థారించడానికి ఆత్మ యొక్క నడిపింపును అనుసరించండి.

ఇంటిలో లేఖనమును అధ్యయనం చేస్తున్న దంపతులు

సంఘంలో జరిగే దానితో ఈ వనరు ఏవిధమైన సంబంధం కలిగియుంది?

ఈ వనరులోని సారాంశాలు ఒక వారపు పఠన పట్టిక ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. రండి, అనుసరించండి వనరుల కొరకు ప్రాథమిక, ఆదివారపు బడి, మరియు అహరోను యాజకత్వ సమూహములు మరియు యువతుల కొరకు తరగతులు అదే ప్రణాళికను అనుసరిస్తాయి. సువార్తను నేర్చుకొని, జీవించడానికి ఇంటివద్ద మీ ప్రయత్నాలలో సహకరించేందుకు, ఇంటివద్ద మీరు చదువుతున్న లేఖన భాగాల గురించి మీ అనుభవాలను, ఆలోచనలను మరియు ప్రశ్నలను పంచుకోవడానికి సంఘములో మీ బోధకులు మీకు అవకాశాన్ని ఇస్తారు.

ఆదివారపు బడి నెలకు రెండుసార్లు మాత్రమే బోధించబడుతుంది కాబట్టి, వారపు కాలపట్టికతో పాటు నిలిచేందుకు ఆదివారపు బడి యొక్క బోధకులు సారాంశాలను వదిలివేయడానికి లేక కలిపి చెప్పడానికి ఎంచుకోవచ్చు. స్టేకు సమావేశం లేదా ఇతర కారణాల వల్ల నియమిత సంఘ సమావేశాలు జరగని వారాలలో (ఆదివారపు బడి మరియు ప్రాథమికకు) కూడా ఇది అవసరం కావచ్చు. ఈ వారాలలో ఇంటివద్ద పాత నిబంధన అధ్యయనాన్ని కొనసాగించడానికి మీరు ఆహ్వానించబడ్డారు.

నేను పట్టికను అనుసరించవలెనా?

సంవత్సరాంతానికి, పాత నిబంధన మరియు గొప్ప వెలగల ముత్యము నుండి ఎంపిక చేయబడినవి చదవడానికి పట్టిక మీకు సహాయపడుతుంది. అదనంగా, మిగిలిన వాటివలే అదే పట్టికను అనుసరించడమనేది గృహములో, సంఘములో మరియు ఎక్కడైనా అర్థవంతమైన అనుభవాలకు దారితీయవచ్చు. కానీ పట్టిక‌కు కట్టుబడి ఉండనవసరము లేదు లేదా ప్రతి వచనం చదువుటకు బలవంతం చేయబడవద్దు; పట్టిక కేవలం మిమ్మల్ని వేగవంతం చేయడంలో సహాయపడడానికి ఇవ్వబడింది. ముఖ్యమైన విషయమేదనగా, మీరు వ్యక్తిగతంగా మరియు కుటుంబంగా సువార్తను నేర్చుకుంటున్నారు.

పాత నిబంధన పఠన పట్టిక గురించి గమనిక

2022 కొరకు సూచించబడిన రండి, నన్ను అనుసరించండి పఠనా పట్టిక పాత నిబంధనలో ప్రతీ అధ్యాయమును చేర్చదు. పాత నిబంధన లేఖనములో మిగిలిన సంపుటల కంటె పొడుగైనది కనుక, మీకు, మీ కుటుంబానికి పఠనా పట్టిక ఎక్కువ నిర్వహించేదగినదిగా చేయడానికి కొన్ని అధ్యాయాలు మరియు గ్రంథాలు తీసివేయబడినవి.

విస్తీర్ణతను తగ్గించడానికి మరియు యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిచ్చే లేఖన భాగాలను సిద్ధాంతములో గొప్పవి, మరియు ప్రత్యేకంగా మన కాలముకు సంబంధించినవి నొక్కి చెప్పడానికి అధ్యాయాలు మరియు గ్రంథాలు ఎంపిక చేయబడినవి. ఉదాహరణకు, సూచించబడిన పఠన పట్టిక 1 మరియు 2 దినవృత్తాంతములను కలిపిలేదు ఎందుకనగా ఆ గ్రంథాలలో అధిక విషయము 1 మరియు 2 రాజులు లో కనుగొనబడిన విషయాలను నకలు చేయును. పట్టిక పరమగీతమును కూడా కలిగిలేదు, ఎందుకనగా అది ప్రేరేపించబడిన లేఖనము కాదని ప్రవక్త జోసెఫ్ స్మిత్ బోధించాడు (Guide to the Scriptures, “Song of Solomon,” scriptures.ChurchofJesusChrist.org చూడండి). అయిప్పటికీ, ఇది కేవలము సూచించబడిన అధ్యయన పట్టిక అని గుర్తుంచుకోండి. మీ వ్యక్తిగత, కుటుంబ లేఖన అధ్యయనము వ్యక్తిగత బయల్పాటు చేత నడిపించబడాలి.