మిషను పిలుపులు
అధ్యాయము 3: బాప్తిస్మము పొంది, నిర్ధారించబడడానికి ఆహ్వానము


“అధ్యాయము 3: బాప్తిస్మము పొంది, నిర్ధారించబడడానికి ఆహ్వానము,” నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి (2023)

“బాప్తిస్మము పొంది, నిర్ధారించబడడానికి ఆహ్వానము,” నా సువార్తను ప్రకటించండి

అధ్యాయము 3

బాప్తిస్మము పొంది, నిర్ధారించబడడానికి ఆహ్వానము

చిత్రం
Come into the Fold of God [దేవుని సముదాయములోనికి రండి], వాల్టర్ రానె చేత

సిద్ధాంతపు పునాది

మనమందరం పరలోక తండ్రి యొక్క పిల్లలం. నేర్చుకోవడానికి, ఎదగడానికి అవకాశం కలిగియుండి, మరింతగా ఆయన వలె మారడానికి మనం భూమిపైకి వచ్చాము, తద్వారా మనం ఆయన సన్నిధికి తిరిగివెళ్ళగలము (మోషే 1:39 చూడండి). దైవిక సహాయం లేకుండా మనం ఆయన వలె మారలేము లేదా ఆయన వద్దకు తిరిగివెళ్ళలేము. మన కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి మరియు మరణ బంధకాలను త్రెంచడానికి మన పరలోక తండ్రి తన కుమారుడైన యేసు క్రీస్తును పంపారు (3 నీఫై 27:13–22 చూడండి).

పశ్చాత్తాపము నిమిత్తము ఆయన యందు విశ్వాసాన్ని సాధన చేయడం, బాప్తిస్మము పొందడం, నిర్ధారణ ద్వారా పరిశుద్ధాత్మ వరమును పొందడం మరియు అంతము వరకు సహించడం ద్వారా క్రీస్తు యొక్క విమోచన శక్తికి మనం ప్రవేశం పొందుతాము. మనల్ని మనం దేవునితో బంధించుకోవడంలో మొదటి అడుగు బాప్తిస్మపు నిబంధనను పాటించడం, తద్వారా పరిశుద్ధాత్మ మన స్వభావాన్ని శుద్ధి చేయగలడు, బలపరచగలడు మరియు మంచిగా మార్చగలడు. ఈ శుధ్ధీకరణ ప్రభావాన్ని అనుభవించడాన్ని ఆత్మీయ పునర్జన్మ అని పిలుస్తారు. (2 నీఫై 31:7, 13–14, 20–21; మోషైయ 5:1–7; 18; 27:24; 3 నీఫై 27:20; యోహాను 3:5 చూడండి.)

మనం నీటి ద్వారా మరియు ఆత్మ ద్వారా బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఆత్మీయ పునర్జన్మ ప్రారంభమవుతుంది. బాప్తిస్మము అనేది ఆనందకరమైన, ఆశాజనక విధి. మనం విరిగిన హృదయము మరియు నలిగిన ఆత్మతో బాప్తిస్మము పొందినప్పుడు, దేవుని యొక్క సంరక్షణ శక్తితో మనం ఒక క్రొత్త జీవితాన్ని ఆరంభిస్తాము. మనము బాప్తిస్మము పొంది, నిర్ధారించబడిన తర్వాత, సంస్కారమందు యోగ్యులుగా పాలుపంచుకోవడం ద్వారా బలపరచబడడాన్ని మనము కొనసాగించగలము. (2 నీఫై 31:13; మోషైయ 18:7–16; మొరోనై 6:2; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37 చూడండి.)

ఆహ్వానాన్ని ఇవ్వడం

ఆత్మ చేత నడిపించబడినట్లుగా మీరు భావించినప్పుడు, బాప్తిస్మము పొంది, నిర్ధారించబడవలసిన వారిని ఆహ్వానించండి. ఇది ఏ పాఠము జరుగుతున్నప్పుడైనా సంభవించవచ్చు.

బాప్తిస్మపు సిద్ధాంతాన్ని బోధించండి మరియు క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి జనులకు సహాయపడండి (పాఠము 3 చూడండి). బాప్తిస్మపు నిబంధన, పాప పరిహారాన్ని పొందడం, నిర్ధారణ ద్వారా పరిశుద్ధాత్మ వరమును పొందడం యొక్క ప్రాముఖ్యత మరియు ఆనందం గురించి బోధించండి.

మీరు బోధించిన దానిని మరియు వారు చేయబోయే నిబంధనను వారు అర్థం చేసుకున్నారని నిశ్చయపరచడం ద్వారా బాప్తిస్మపు ఆహ్వానం కొరకు జనులను సిద్ధం చేయండి. బాప్తిస్మపు నిబంధన క్రింది విధంగా ఉంటుంది:

  • యేసు క్రీస్తు నామమును మనపై తీసుకోవడానికి సమ్మతించడం.

  • దేవుని ఆజ్ఞలు పాటించడం.

  • దేవునికి మరియు ఇతరులకు సేవ చేయడం.

  • అంతము వరకు సహించడం. (పాఠము 4 చూడండి.)

క్రింది వాటిని మీరు పంచుకోవచ్చు:

“మనం బాప్తిస్మము పొందినప్పుడు, ‘[మనం] ఆయనకు సేవ చేస్తామని మరియు ఆయన ఆజ్ఞలను పాటిస్తామని [మనం] ఆయనతో నిబంధనలోనికి ప్రవేశించామని మనం [దేవుని] యెదుట సాక్ష్యమిస్తాము.’ మనం ఈ నిబంధనను చేసినప్పుడు, ‘[మన]పై తన ఆత్మను అధిక విస్తారముగా క్రుమ్మరిస్తానని’ (మోషైయ 18:10) ఆయన వాగ్దానమిస్తారు.”

బాప్తిస్మము తీసుకోవడానికి మీ ఆహ్వానము నిర్దిష్టంగా మరియు ప్రత్యక్షంగా ఉండాలి. మీరు ఇలా చెప్పవచ్చు:

ఈ విధిని నిర్వహించడానికి నియమించబడిన ఒకరి చేత బాప్తిస్మము పొందడం ద్వారా మీరు యేసు క్రీస్తు యొక్క మాదిరిని అనుసరిస్తారా? బాప్తిస్మము కొరకు సిద్ధపడడానికి మేము మీకు సహాయపడతాము. [తేదీ] నాటికి మీరు సిద్ధపడగలరని మేము నమ్ముతున్నాము. ఆ తేదీన బాప్తిస్మము తీసుకోవడానికి మీరు సిద్ధపడతారా?

మీరు ఇచ్చే ఆహ్వానంతో పాటుగా, బాప్తిస్మము తీసుకోమనే ఆహ్వానాన్ని అంగీకరించి, దానికి సంబంధించిన నిబంధనలను వారు పాటించినప్పుడు జనులు పొందే గొప్ప దీవెనలను వాగ్దానం చేయండి. ఈ దీవెనల గురించి మీ సాక్ష్యాన్ని పంచుకోండి.

బాప్తిస్మము మరియు నిర్ధారణ అనేవి వారు చేసే చివరి పనులు కావని బోధించండి. బదులుగా, అవి పరివర్తన మార్గంలో ఒక బిందువు వంటివి, అవి ఒక వ్యక్తి జీవితంలో నిరీక్షణను, ఆనందాన్ని, మరింత పూర్తిగా దేవుని శక్తిని తీసుకువస్తాయి (మోషైయ 27:25–26 చూడండి). జనులు బాప్తిస్మము పొంది, నిర్ధారించబడిన తర్వాత, వారు నిబంధన మార్గం వెంబడి పురోగమిస్తున్నప్పుడు ఆత్మ చేత శుద్ధిచేయబడడం కొరకు వారు ఎదురుచూడవచ్చు.

సాధ్యమైతే, మీరు బోధిస్తున్న వారిని బాప్తిస్మపు సేవకు మరియు ఎవరైనా నిర్ధారించబడుతున్న సంస్కార సమావేశానికి హాజరుకమ్మని ఆహ్వానించండి.

బాప్తిస్మం తీసుకోమని ఆహ్వానించడం కొరకు ఉపాయాలు

యేసు బాప్తిస్మం పొందే లేఖన వృత్తాంతాన్ని చదవడం గురించి ఆలోచించండి (మత్తయి 3:13–17 చూడండి). రక్షకుని బాప్తిస్మమును చూపుతున్న బైబిలు వీడియో లేదా రక్షకుని శిష్యులు బాప్తిస్మమిస్తున్న మోర్మన్ గ్రంథ వీడియో కూడా మీరు చూపవచ్చు.

యేసు బాప్తిస్మం గురించి నీఫై యొక్క వృత్తాంతాన్ని కూడా మీరు చదువవచ్చు (2 నీఫై 31:4–12 చూడండి). యేసు క్రీస్తు యొక్క బాప్తిస్మపు వృత్తాంతములను చదవడం బోధింపబడుతున్న వారిని బలపరచగలదు.

లేఖన అధ్యయనము

క్రింది లేఖనాలను అధ్యయనం చేయండి:

మీరు నేర్చుకున్న దాని సారాంశం వ్రాయండి.

ముద్రించు