2024 రండి, నన్ను అనుసరించండి
జూన్ 10-16: “మీరు మీ హృదయముల యందు ఈ బలమైన మార్పును అనుభవించియున్నారా?” ఆల్మా 5–7


“జూన్ 10-16: ’మీ హృదయములందు ఈ బలమైన మార్పును మీరు అనుభవించారా?’ ఆల్మా 5-7,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)

“జూన్ 10-16. ఆల్మా 5-7,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)

జోరమీయులకు బోధిస్తున్న చిన్నవాడగు ఆల్మా

జోరమీయులకు బోధిస్తున్న చిన్నవాడగు ఆల్మా

జూన్ 10-16: “మీరు మీ హృదయముల యందు ఈ బలమైన మార్పును అనుభవించియున్నారా?”

ఆల్మా 5–7

ఈ రోజుల్లో ప్రాణాలు కాపాడే గుండె మార్పిడి శస్త్రచికిత్సలు, అనగా గాయపడిన లేదా వ్యాధికి గురైన గుండెకు బదులుగా ఆరోగ్యంగా ఉండే గుండెను అమర్చడం గురించి ఆల్మాకు తెలియదు. కానీ మరింత అద్భుతమైన “హృదయం యొక్క మార్పు” (ఆల్మా 5:26) గురించి అతనికి తెలుసు—“మరలా జన్మించినట్లు” (ఆల్మా 5:14, 49 చూడండి), అందులో రక్షకుడు మనకు ఒక క్రొత్త ఆత్మీయ జీవితాన్నిస్తారు. నీఫైయులలో అనేకులకు అవసరమైనది సరిగ్గా హృదయము యొక్క ఈ మార్పేనని ఆల్మా చూడగలిగాడు. కొందరు ధనవంతులు, మరికొందరు పేదవారు, కొందరు గర్విష్టులు, మరికొందరు వినయము గలవారు, కొందరు హింసించువారు, మరికొందరు హింసింపబడువారు (ఆల్మా 4:6–15 చూడండి). కానీ మనందరం వచ్చినట్లుగానే—వారందరు స్వస్థపరచబడేందుకు యేసు క్రీస్తు యొద్దకు రావలసిందే. మనము గర్వాన్ని జయించాలనుకున్నా లేదా బాధలను సహించాలనుకున్నా, ఆల్మా సందేశము ఒక్కటే: “రండి, భయపడకుడి” (ఆల్మా 7:15). కఠినమైన, పాపపూరితమైన లేదా గాయపడిన హృదయాన్ని వినయముగల, స్వచ్ఛమైన, క్రొత్తదానిగా రక్షకుడిని మార్చనివ్వండి.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

ఆల్మా 5:14–33

హృదయమందు ఒక బలమైన మార్పును—నేను తప్పక అనుభవించాలి—మరియు అనుభవించడం కొనసాగించాలి.

అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బాల్లర్డ్ ఇలా అన్నారు: “‘నేను ఎలా ఉన్నాను?’ అని నన్ను నేను ప్రశ్నించుకొనేందుకు క్రమంగా నేను సమయం తీసుకోవాలి. ఈ వ్యక్తిగత, ఏకాంత పునశ్చరణలో నాకు మార్గదర్శిలా ఉండేందుకు ఆల్మా యొక్క ఐదవ అధ్యాయములో ఉన్న ఆలోచింపజేసే మాటలను చదివి, ధ్యానించడానికి నేనిష్టపడతాను” (“తిరిగి రండి మరియు పొందుము,” లియహోనా, మే 2017, 64).

మిమ్మల్ని మీరు ముఖాముఖి పరీక్ష చేసుకుంటున్నట్లుగా మరియు మీ హృదయాన్ని పరీక్షిస్తున్నట్లుగా ఆల్మా 5:14–33ను చదవడం గురించి ఆలోచించండి. ప్రశ్నలకు మీ జవాబులను నమోదు చేయాలని మీరు కోరుకోవచ్చు. మీ గురించి మీరేమి నేర్చుకుంటారు? మీ ముఖాముఖి పరీక్ష ఫలితముగా ఏమి చేయాలని మీరు ప్రేరేపించబడ్డారు?

మంచం ప్రక్కన ప్రార్థిస్తున్న బాలిక

మనం దేవుని వైపు తిరిగినప్పుడు, “హృదయము యొక్క మార్పును” మనం అనుభవించగలము.

ఆల్మా 5:44-51

రక్షకుడు మరియు ఆయన సువార్త గురించి నా స్వంత సాక్ష్యమును పరిశుద్ధాత్మ ద్వారా నేను పొందగలను.

ఆల్మా 5 లో, ఆల్మా తన సాక్ష్యమును ఎలా పొందాడో వివరించినప్పుడు, ఒక దేవదూతను చూసిన తన అనుభవాన్ని అతడు ప్రస్తావించలేదు (మోషైయ 27:10–17 చూడండి). ఆల్మా తనకైతాను సత్యాన్ని ఎలా తెలుసుకున్నాడు? యేసు క్రీస్తు మరియు ఆయన బోధనల గురించి సాక్ష్యాన్ని పొందడానికి ఒక “తయారీ విధానం” కొరకు బహుశా మీరు ఆల్మా 5:44–51లో కనుగొనే దానిని మీరు ఉపయోగించవచ్చు. ఆల్మా చేర్చిన “పదార్థాలు” (సువార్త సత్యాలు) మరియు “సూచనలు” (సత్యాన్ని వెదకడానికి మనం చేయగల విషయాలు) ఏవి? మీ స్వంత అనుభవాలు లేదా లేఖనాలలోని ఇతర అనుభవాల నుండి మీ తయారీ విధానానికి మీరు జతచేయగల “పదార్థాలు” మరియు “సూచనలు” ఏవి?

ఆల్మా 7

“మీరు నీతి మార్గములలో ఉన్నారని నేను చూచుచున్నాను.”

కొన్నిసార్లు మనం పశ్చాత్తాపమునకు పిలువబడవలసిన జరహేమ్లలోని జనుల వలె ఉన్నాము (ఆల్మా 5:32 చూడండి). మరికొన్నిసార్లు మనం “నీతి మార్గములలో” (ఆల్మా 7:19) నడవాలని ప్రయత్నిస్తున్న గిడియన్‌లో నున్న జనుల వలె ఎక్కువగా ఉన్నాము. జరహేమ్లలో అతడు చెప్పిన దానిని (ఆల్మా 5లో) పోలియుండునట్లు గిడియన్‌లో ఆల్మా చెప్పిన సందేశంలో (ఆల్మా 7లో) మీరు ఏమి కనుగొంటారు? మీరు గమనించిన తేడాలు ఏవి? మీరు “దేవుని రాజ్యమునకు నడిపించు త్రోవలో” (ఆల్మా 7:19) ఉండడానికి సహాయపడేలా ఆల్మా బోధించిన వాటి కొరకు చూడండి.

సెమినరీ చిహ్నము

ఆల్మా 7:7–16

రక్షకుడు నా పాపములు, బాధలు మరియు శ్రమలను తనపైకి తీసుకున్నారు.

మీ శ్రమలను లేదా సవాళ్ళను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని మీరెప్పుడైనా భావించారా? అలాగైతే, ఆల్మా బోధించిన సత్యాలు సహాయపడగలవు. మీరు చదువుతున్నప్పుడు, రక్షకుని త్యాగము యొక్క ఉద్దేశాల గురించి ఈ వచనాలు బోధించే దానిపై ప్రతిబింబించండి. రక్షకుడు ఏమి బాధ అనుభవించారు మరియు ఆయన ఎందుకు బాధ అనుభవించారు అనే శీర్షికలతో మీరు ఒక పటమును తయారుచేసి, ఆల్మా 7:7–16లో (యెషయా 53:3–5 కూడా చూడండి) మీరు కనుగొనే వాటి జాబితా చేయవచ్చు. వీటిలో కొన్నింటిని ఆయన అనుభవించిన నిర్దిష్ట సమయాల గురించి మీరు ఆలోచించగలరా? లేఖనాల నుండి ఇక్కడ కొన్ని మాదిరులున్నాయి: మత్తయి 4:1–13; 26:55–56; 27:39–44; మార్కు 14:43–46; లూకా 9:58. ఈ వచనముల నుండి మీ జాబితాకు మీరు ఏమైనా జతచేయగలరా?

ఒక విషయం ఏమిటంటే, రక్షకుడు మీ కొరకు బాధ పడ్డారని నమ్మడం. కానీ, ఆయన బాధ మీ అనుదిన జీవితంలో ఏవిధంగా మార్పు తెస్తుంది? యేసు క్రీస్తు మీకేవిధంగా సహాయపడగలరు లేదా మిమ్మల్ని “ఉపశమింపజేయగలరు” అని చూపే కొన్ని లేఖనాలు ఇక్కడున్నాయి: ఈనస్ 1:5–6; మోషైయ 16:7–8; 21:15; 24:14–15; 3 నీఫై 17:6–7; ఈథర్ 12:27–29; సిద్ధాంతము మరియు నిబంధనలు 121:7–10. ఈ వచనముల నుండి మీరు ఏమి నేర్చుకున్నారు? ఆయన మీకు సహాయం చేయగల ఇతర విధానాలేవి? ఆయన సహాయాన్ని మీరెప్పుడు అనుభవించియున్నారు?

ఈ కీర్తనలలోని ఏ వాక్యభాగాలు ఆయన పట్ల మీ భావాలను వ్యక్తం చేస్తాయి?

యేసు క్రీస్తు గురించి సాక్ష్యమివ్వండి. రక్షకుడు, ఆయన దైవత్వం, కృప మరియు ప్రేమ గురించి మీ సాక్ష్యాన్ని పంచకోగల విధానాలను పరిగణించండి. ఆయన గురించి వారు ఎలా భావిస్తున్నారో పంచుకోవడానికి వారిని ప్రేరేపించే ప్రశ్నలు అడగడం ద్వారా ఆయన గురించి సాక్ష్యమివ్వడానికి మీరు బోధించేవారిని మీరు ప్రోత్సహించవచ్చు.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

ఆల్మా 5:44-48

పరిశుద్ధాత్మ ద్వారా నా స్వంత సాక్ష్యాన్ని నేను పొందగలను.

  • వారి స్వంత సాక్ష్యములో ఎదగడాన్ని నేర్చుకోవడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు, మీరు క్రింది చిత్రాన్ని వారికి చూపించి, జంతువుల పిల్లలు ఎదగడానికి మనం ఎలా సహాయపడతామని వారిని అడగవచ్చు. తర్వాత మీరు మన సాక్ష్యాల పట్ల శ్రద్ధ వహించడం గురించి చెప్పవచ్చు. మన సాక్ష్యాలకు ఎటువంటి శ్రద్ధ అవసరము? అవి పెరుగుతున్నాయని మనమెలా చెప్పగలము?

    జంతువుల పిల్లలతో ఇద్దరు బాలురు

    మనం సువార్తను అంగీకరించినప్పుడు, ఒక క్రొత్త జీవితాన్ని మొదలుపెట్టినట్లు ఉంటుంది.

  • యేసు క్రీస్తును గూర్చి అతని బలమైన సాక్ష్యాన్ని ఆల్మా ఎలా పొందాడు? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి మీరు మీ పిల్లలతో కలిసి ఆల్మా 5:44–46 చదువవచ్చు. బహుశా వారి సాక్ష్యాన్ని బలపరచుకోవడానికి ఈ వారంలో ఏదైనా ఒకటి చేయడానికి ప్రణాళికను మీ పిల్లలు వ్రాయవచ్చు.

ఆల్మా 7:10–13

రక్షకుడు నా పాపములు, బాధలు మరియు శ్రమలను తనపైకి తీసుకున్నారు.

  • యేసు క్రీస్తు వారి గురించి శ్రద్ధచూపుతారని మరియు వారికి సహాయం చేయగలరని వారు తెలుసుకోగలిగేలా ఆల్మా 7:10–13ను అర్థం చేసుకోవడానికి మీ పిల్లలకు మీరెలా సహాయపడగలరు? బహుశా వారిని బాధపెట్టేలా వారు అస్వస్థతగా లేదా బాధలో ఉన్నప్పుడు లేదా మరేదైనా సమస్య కలిగియున్నప్పటి అనుభవాన్ని పంచుకోమని మీరు వారిని అడగవచ్చు. మంచిగా భావించడానికి ఇతరులు వారికెలా సహాయపడ్డారు? రక్షకుడు కూడా వాటిని అనుభవించారని మీ సాక్ష్యమివ్వండి మరియు ఆయన మిమ్మల్ని ఓదార్చి, సహాయపడిన ఒక సమయం గురించి మాట్లాడండి.

  • మీరు, మీ పిల్లలు ఆల్మా 7:11–13 చదువుతున్నప్పుడు, యేసు క్రీస్తు మన కోసం బాధననుభవించిన విషయాల కొరకు చూడండి. ఈ వాక్యాన్ని పూరించడానికి వారు కనుగొనిన పదాలు మరియు వాక్యభాగాలు ఉపయోగించమని మీ పిల్లలను ఆహ్వానించండి: “నాకు సహాయపడగలిగేలా యేసు అనుభవించారు.” యేసు మన కష్టాలను అర్థం చేసుకుంటారని తెలుసుకోవడానికి ఇది మనకెలా సహాయపడుతుంది? ఆయన సహాయాన్ని మనము ఎలా పొందగలము? యేసు క్రీస్తు గురించి మీ సాక్ష్యాన్ని పంచుకోండి.

ఆల్మా 5:14; 7:19-20

యేసు క్రీస్తును అనుసరించడం పరలోక తండ్రి వద్దకు తిరిగి వెళ్ళే తిన్నని మార్గంలో నన్ను ఉంచుతుంది.

  • మీరు ఆల్మా 5:14 (ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీని కూడా చూడండి) చదువుతున్నప్పుడు, మీ పిల్లలు అద్దంలో చూసుకొనేలా చేయండి. రక్షకుని స్వరూపమును మీ ముఖాలపై కలిగియుండడమంటే అర్థము ఏమైయుండవచ్చు?

  • మంచి ఎంపికలు చేయడాన్ని నేర్చుకోవడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు పరలోక తండ్రి వద్దకు తిరిగివెళ్ళే మార్గం గురించి ఆల్మా వర్ణించిన దానిని మీరెలా ఉపయోగించగలరు? మీరు వారి కొరకు ఆల్మా 7:19–20ను చదువవచ్చు మరియు వారు “వక్ర మార్గాలలో” నడవడాన్ని, తిన్నని మార్గంలో నడవడాన్ని అభినయించేలా చేయవచ్చు. మార్గంలో నిలవడానికి మనకు సహాయపడే ఎంపికలు మరియు మార్గం నుండి మనల్ని తొలగించే ఇతర ఎంపికల గురించి ఆలోచించడానికి వారికి సహాయపడండి. మీరు కలిసి యేసు యొక్క చిత్రాలను కూడా చూడవచ్చు మరియు పరలోక తండ్రి వద్దకు తిరిగివెళ్ళే మార్గాన్ని మనకు చూపడానికి ఆయన చేసిన వాటి గురించి మాట్లాడవచ్చు.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

ఎర్రని అంగీ ధరించిన యేసు

Our Advocate [మన న్యాయవాది], జే బ్రయంట్ వార్డ్ చేత