2024 రండి, నన్ను అనుసరించండి
జూన్ 24-30: “ప్రభువు యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించుము.” ఆల్మా 13–16


“జూన్ 24-30: ‘ప్రభువు యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించుము.’ ఆల్మా 13-16,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“జూన్ 24-30. ఆల్మా 13-16,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)

చిత్రం
చెరసాల నుండి బయటికి వస్తున్న ఆల్మా మరియు అమ్యులెక్

Illustration of Alma and Amulek being delivered from prison [చెరసాల నుండి విడిపించబడిన ఆల్మా మరియు అమ్యులెక్ యొక్క వివరణ], ఆండ్రూ బోస్లే చేత

జూన్ 24-30: “ప్రభువు యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించుము”

ఆల్మా 13–16

అమ్మోనైహాలో జీవితం అనేక విధాలుగా అమ్యులెక్ మరియు జీజ్రొమ్‌లు ఇరువురికి బాగుండేది. “అనేకమంది బంధువులు, స్నేహితులు” మరియు “అధిక సంపదల”తో అమ్యులెక్ “తక్కువ ప్రఖ్యాతి గలవాడేమి కాదు” (ఆల్మా 10:4). జీజ్రొమ్, న్యాయవాదుల మధ్య గల మిక్కిలి నేర్పరులలో ఒకడైయుండి, “అధిక వ్యాపారము” కలిగియున్నాడు (ఆల్మా 10:31). అప్పుడు పశ్చాత్తాపపడుము మరియు “ప్రభువు యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించుము” అనే దైవిక ఆహ్వానముతో ఆల్మా వచ్చాడు (ఆల్మా 13:16). అమ్యులెక్, జోజ్రొమ్ మరియు ఇతరులకు ఈ ఆహ్వానాన్ని అంగీకరించడం గొప్ప త్యాగముతో కూడుకున్నది మరియు దాదాపుగా భరింపజాలని కష్టాలకు దారితీసింది.

కానీ కథ అక్కడితో ముగిసిపోలేదు. ఆల్మా 13–16లో, “రక్షణ నిమిత్తము క్రీస్తు యొక్క శక్తి యందు” (ఆల్మా 15:6) నమ్మేవారికి చివరకు ఏమి జరుగుతుందో మనం నేర్చుకుంటాము. కొన్నిసార్లు విడుదల, కొన్నిసార్లు స్వస్థత—మరి కొన్నిసార్లు ఈ జీవితంలో పరిస్థితులు అంత తేలికగా ఉండవు. కానీ ఎల్లప్పుడూ, “ప్రభువు (తన జనులను) మహిమలో తన యొద్దకు చేర్చుకొనుచున్నాడు” (ఆల్మా 14:11). ఎల్లప్పుడూ “క్రీస్తునందున్న (మన) విశ్వాసమును బట్టి, ప్రభువు శక్తిననుగ్రహించును” (ఆల్మా 14:28). మరియు ఎల్లప్పుడూ ఆ విశ్వాసము, “(మనము) నిత్యజీవమును పొందుదుమను నిరీక్షణను” మనకిస్తుంది (ఆల్మా 13:29). మీరు ఈ అధ్యాయాలను చదివినప్పుడు, మీరు ఈ వాగ్దానాలలో ఓదార్పు పొందవచ్చు మరియు “ప్రభువు యొక్క విశ్రాంతి” (ఆల్మా 13:16) గురించి ఆల్మా మాట్లాడినప్పుడు అతడు చెప్పేదానిని మీరు బాగా అర్థం చేసుకోవచ్చు.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

ఆల్మా 13:1–19

చిత్రం
సెమినరీ చిహ్నము
విమోచన కొరకు యేసు క్రీస్తు వైపు చూడడానికి యాజకత్వ విధులు నాకు సహాయపడతాయి.

“ప్రభువు యొక్క విశ్రాంతి”లోనికి ప్రవేశించడానికి లేదా నిత్యజీవానికి మనల్ని సిద్ధపరచడానికి—ఆల్మా 13లో ఆల్మా యొక్క మాటలు దేవుని యాజకత్వ శక్తి మరియు దాని ఉద్దేశ్యము గురించి శక్తివంతమైన సత్యాలను బయల్పరుస్తాయి (ఆల్మా 13:16). బహుశా ఆల్మా 13:1-19లో ప్రతీ వచనానికి ఒక సత్యము చొప్పున మీరు వ్రాయవచ్చు. మీరు ప్రారంభించడానికి ఇక్కడ కొన్ని ఆలోచనలున్నాయి:

1వ వచనము.యాజకత్వము, “(దేవుని) కుమారుని క్రమము” అని కూడా పిలువబడును (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:1–4 కూడా చూడండి).

వచనము 2.విమోచన కొరకు ఆయన కుమారుని వైపు చూడడానికి జనులకు సహాయపడేందుకు దేవుడు యాజకులను నియమించును.

మీరు ఇంకేమి కనుగొంటారు? ఈ సత్యాలను మీరు ధ్యానించినప్పుడు, యాజకత్వము గురించి మీరేవిధంగా భావిస్తారు?

“విమోచన నిమిత్తము ఆయన కుమారుని కొరకు ఎదురుచూడడానికి” మీకు సహాయపడేందుకు దేవుని నుండి ఒక బహుమానముగా మీరెప్పుడైనా యాజకత్వ విధుల గురించి ఆలోచించారా? (2వ వచనము; 16వ వచనము కూడా చూడండి). బహుశా మీరు బాప్తిస్మము, నిర్ధారణ, సంస్కారము, ఒక పిలుపు కొరకు ప్రత్యేకపరచబడుట, ఓదార్పు లేదా స్వస్థత యొక్క దీవెన, గోత్రజనకుని దీవెన మరియు దేవాలయ విధులు వంటి మీరు పొందిన విధుల జాబితా తయారు చేయవచ్చు. ఈ విధమైన విధులతో మీ అనుభవాలను ధ్యానించండి. అందులో ఉన్న ప్రతీకవాదాన్ని మరియు మీరు అనుభవించిన ఆత్మను పరిగణించండి. ఈ విధులలో ప్రతీఒక్కటి విమోచన కొరకు ఏవిధంగా మిమ్మల్ని యేసు క్రీస్తు వైపుకు నడిపిస్తాయి?

విధులు—మరియు వాటిని నిర్వహించడానికి యాజకత్వ అధికారము—అవసరం లేదని కొంతమంది తప్పుగా నమ్ముతారు. ఆ ఆలోచనకు మీరెలా స్పందిస్తారు? మీ ఆలోచనకు సమాచారమివ్వగల సర్వసభ్య సమావేశ సందేశము ఇక్కడుంది; దానిని ఎంచుకొని, మీకు వచ్చే సమాధానాలను వ్రాయండి: రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఆత్మీయ నిధులు,” లియహోనా, నవ. 2019, 76–79 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 84:19–22 కూడా చూడండి.

చిత్రం
సంస్కారపు బల్ల వద్ద యువకులు

విమోచన కొరకు యేసు క్రీస్తు వైపు చూడడానికి యాజకత్వ విధులు మనకు సహాయపడతాయి.

ఆల్మా 13

ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించమని ప్రభువు నన్ను ఆహ్వానిస్తారు.

“ప్రభువు యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించుము” (ఆల్మా 13:16) అనే ఆహ్వానము ఆల్మా 13లో తరచూ పునరావృతం చేయబడింది. ప్రతీ వచనంలో “విశ్రాంతి” అనే పదం ఎక్కడ కనిపిస్తుందో బహుశా మీరు చూడవచ్చు మరియు “ప్రభువు యొక్క విశ్రాంతి” అనగా అర్థమేమిటనే దాని గురించి ప్రతీ వచనం మీకు ఏమి బోధిస్తుందో ధ్యానించవచ్చు. శారీరక విశ్రాంతి నుండి ఇది ఏవిధంగా భిన్నంగా ఉంది? మనం దానిని ఎలా కనుగొనగలము?

రస్సెల్ ఎమ్. నెల్సన్, “లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడి,” లియహోనా, నవ. 2022, 95-98 కూడా చూడండి.

ఆల్మా 14

కష్టకాలములో మనము తప్పకుండా ప్రభువును నమ్మాలి.

నీతిగా జీవించడానికి ప్రయత్నిస్తున్న వారికి ఎందుకు భయంకరమైన సంగతులు జరుగుతాయోనని అనేకమంది లాగా మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆల్మా 14 లోని ఈ కష్టమైన ప్రశ్నకు జవాబులన్నిటిని మీరు కనుగొనలేకపోవచ్చు, కానీ వారు ఎదుర్కొనిన పరిస్థితులకు ఆల్మా మరియు అమ్యులెక్ స్పందించిన తీరు నుండి ఎంతో నేర్చుకోవచ్చు. కొన్నిసార్లు నీతిమంతులు బాధపడేందుకు దేవుడు ఎందుకు అనుమతిస్తాడనే దాని గురించి వారి మాటలు మరియు చర్యలు మీకేమి బోధిస్తాయి? మనం కష్టమైన సమస్యలను అనుభవిస్తున్నప్పుడు ఆల్మా మరియు అమ్యులెక్‌లు మనకు ఏ సలహానివ్వవచ్చు?

రోమా 8:35–39; 1 పేతురు 4:12–14; సిద్ధాంతము మరియు నిబంధనలు 122:5-9; డేల్ జి. రెన్లండ్, “తీవ్రమైన అన్యాయము,” లియహోనా, మే 2021, 41–45 కూడా చూడండి.

ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. బోధించగల క్షణాలు త్వరగా గడిచిపోతాయి, కాబట్టి అవి వచ్చినప్పుడు వెంటనే ఉపయోగించుకోండి. ఉదాహరణకు, అమాయకులు బాధపడేలా కొన్నిసార్లు ప్రభువు ఎందుకు అనుమతిస్తారనే దాని గురించి ఆల్మా 14 నుండి సూత్రాలను పంచుకోవడానికి లోకంలోని విషాదం ఒక అవకాశం కాగలదు.

ఆల్మా 15:16, 18

శిష్యత్వానికి త్యాగము అవసరము.

సువార్తను హత్తుకోవడానికి అమ్యులెక్ విడిచిపెట్టిన విషయాల జాబితా తయారు చేసి (ఆల్మా 10:4–5; 15:16 చూడండి), అతడు పొందిన వాటి జాబితాతో దానిని పోల్చడం (ఆల్మా 15:18; 16:13–15; 34:8 చూడండి) ఆసక్తికరంగా ఉండవచ్చు. యేసు క్రీస్తు యొక్క మరింత విశ్వాసము గల శిష్యులవడానికి ఏమి త్యాగం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

ఈ ఆదివారం నెలలో ఐదవ ఆదివారం కాబట్టి, “అనుబంధం బి: దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు పిల్లలను సిద్ధపరచుట”లోని అభ్యాస కార్యకలాపాలను ఉపయోగించమని ప్రాథమిక బోధకులు ప్రోత్సహించబడ్డారు.

ఆల్మా 13:1-2, 16

క్రీస్తుకు దగ్గర కావడానికి యాజకత్వ శక్తి నాకు సహాయపడుతుంది.

  • యాజకత్వ శక్తి మనల్ని క్రీస్తు వైపుకు ఎలా నడిపిస్తుందో చూడడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు ఒక విధానము, యాజకత్వ శక్తి ఉపయోగించబడే విధానాల చిత్రాలను వారికి చూపడం. యేసు తన శక్తిని ఉపయోగించిన విధానాల గురించి మీరు ఆలోచించడానికి మీ పిల్లలు సహాయపడగలరు (ఉదాహరణకు, మత్తయి 26:26–28; మార్కు 5:22–24, 35–43 చూడండి). తర్వాత మీరు కలిసి ఆల్మా 13:2 చదువవచ్చు మరియు “[దేవుని] కుమారుని కొరకు ఎదురుచూడడానికి” మరియు మరింతగా ఆయన వలె మారడానికి యాజకత్వ శక్తి మనకెలా సహాయపడుతుందో మాట్లాడవచ్చు.

    చిత్రం
    బాప్తిస్మము
    చిత్రం
    అపొస్తలులను నియమిస్తున్న యేసు
  • దేవుడు ఎందుకు మనకు యాజకత్వ విధులనిచ్చారు? ఆల్మా 13:16లో జవాబు కనుగొనడానికి మీ పిల్లలకు సహాయపడండి. ఒక విధి అనగా ఏమిటో తెలుసుకోవడానికి వారికి సహాయం అవసరమైతే, General Handbook, 18.1 మరియు 18.2లో జాబితాలున్నాయి. ఈ విధులను పొందినప్పటి మీ అనుభవాల గురించి బహుశా మీరు, మీ పిల్లలు మాట్లాడవచ్చు. “[మన] పాపముల పరిహారము నిమిత్తము [యేసు క్రీస్తు] కొరకు ఎదురు చూడడానికి” అవి మనకు ఏవిధంగా సహాయపడతాయి?

ఆల్మా 13:10–12

యేసు క్రీస్తు నన్ను శుద్ధి చేయగలరు.

  • ఈ వచనాలను కలిసి చదివిన తర్వాత, అవి బోధించే వాటిని మీ పిల్లలు ఊహించుకొనేలా సహాయపడేందుకు మార్గాలను పరిగణించండి. బహుశా మీరు కలిసి ఏదైనా ఉతకవచ్చు. మనము మలినంగా ఉన్నప్పుడు మనమెలా భావిస్తాము? మరలా మనం శుభ్రమైనప్పుడు మనమెలా భావిస్తాము? ఈ భావనలు, మనము పాపము చేసి, తర్వాత పశ్చాత్తాపపడి, రక్షకుని ప్రాయశ్చిత్తము ద్వారా శుభ్రపడినప్పుడు మనం భావించేవాటిని ఏవిధంగా పోలియున్నాయి?

ఆల్మా 14:18-29

యేసు క్రీస్తునందు నాకు విశ్వాసమున్నప్పుడు పరలోక తండ్రి నన్ను బలపరుస్తారు.

  • ఆల్మా 14:18–29 లోని కథను చెప్పడానికి మీకు లేదా మీ పిల్లలకు ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీ సహాయపడగలదు. “క్రీస్తునందున్న వారి విశ్వాసమును” (ఆల్మా 14:26) బట్టి, ఆల్మా మరియు అమ్యులెక్‌లకు శక్తి అనుగ్రహింపబడిందని నొక్కిచెప్పండి. “[మీ] విశ్వాసమును బట్టి” దేవుడు మీకు బలాన్నిచ్చిన సమయం గురించి కూడా మీరు మాట్లాడవచ్చు. ఆల్మా మరియు అమ్యులెక్‌ల వలె మనము విశ్వాసంగా ఎలా ఉండగలము?

ఆల్మా 15:3-12

యేసు క్రీస్తు హృదయాలను మార్చగలరు.

  • యేసు క్రీస్తు ద్వారా జీజ్రొమ్ యొక్క హృదయం మార్పుచెందడం ప్రేరణతో కూడినది. జీజ్రొమ్ గురించి గతవారం మీ పిల్లలు నేర్చుకున్న దానిని వారితో పునర్వీక్షించడాన్ని పరిగణించండి. తర్వాత, అతడు ఎలా మారాడో కనుగొనడానికి మీరు కలిసి ఆల్మా 15:3–12 చదువవచ్చు. ప్రభువు యొక్క శక్తి గురించి జీజ్రొమ్ అనుభవం నుండి మనమేమి నేర్చుకుంటాము?

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

చిత్రం
చెరసాలలో ఆల్మా మరియు అమ్యులెక్

Alma and Amulek in Prison [చెరసాలలో ఆల్మా మరియు అమ్యులెక్], గ్యారీ ఎల్. కాప్ చేత

ముద్రించు