2024 రండి, నన్ను అనుసరించండి
జూన్ 17-23: “తన జనులను విమోచించుటకు యేసు క్రీస్తు వచ్చును.” ఆల్మా 8–12


“జూన్ 17-23: ‘తన జనులను విమోచించుటకు యేసు క్రీస్తు వచ్చును.’ ఆల్మా 8–12,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)

“జూన్ 17-23. ఆల్మా 8-12,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)

చిత్రం
ప్రవచించుచున్న ఆల్మా

Teaching True Doctrine [నిజమైన సిద్ధాంతాన్ని బోధించుట], మైఖేల్ టి. మామ్ చేత

జూన్ 17-23: తన జనులను విమోచించుటకు యేసు క్రీస్తు వచ్చును

ఆల్మా 8–12

దేవుని కార్యము విఫలము కాదు. కానీ ఆయన పనిలో సహాయపడేందుకు మన ప్రయత్నాలు కొన్నిసార్లు విఫలమైనట్లు కనిపిస్తాయి—కనీసం, మనం ఆశించిన ఫలితాలను వెంటనే మనం చూడలేము. కొన్నిసార్లు మనం అమ్మోనైహాలో సువార్తను ప్రవచించినప్పుడు ఆల్మా భావించినట్లు—నిరాకరించబడి, ఉమ్మివేయబడి మరియు గెంటి వేయబడినట్లు భావించవచ్చు. అయినప్పటికీ ఒక దూత అతడిని తిరిగివెళ్ళి, మరలా ప్రయత్నించమని చెప్పినప్పుడు, ఆల్మా ధైర్యంతో “వేగంగా తిరిగివెళ్ళాడు” (ఆల్మా 8:18) మరియు దేవుడు అతని ముందు మార్గమును సిద్ధపరిచారు. ఆయన ఆల్మాకు తినడానికి తిండి మరియు ఉండేందుకు స్థలమును సిద్ధం చేయడమే కాకుండా, అమ్యులెక్‌ను కూడా ఆయన సిద్ధపరిచారు, అతడు సహ శ్రామికుడయ్యాడు, సువార్త యొక్క భీకర సంరక్షకుడు మరియు విశ్వాసము గల స్నేహితుడయ్యాడు. మనం ప్రభువు యొక్క రాజ్యంలో సేవ చేస్తున్నప్పుడు ఎదురుదెబ్బలు మరియు నిరాశలు మనకు ఎదురైనప్పుడు, దేవుడు ఆల్మాకు ఏవిధంగా సహకారమిచ్చి, నడిపించారో మనం గుర్తుచేసుకోవచ్చు మరియు కష్ట సమయాల్లో మనకు కూడా దేవుడు సహకారమిచ్చి, నడిపిస్తారని మనం నమ్మవచ్చు.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

చిత్రం
సెమినరీ చిహ్నము

ఆల్మా 8

యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకోవడానికి నా ప్రయత్నాలలో సహనము అవసరం.

ఎవరితోనైనా యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకోవడానికి మీరు ప్రయత్నించినప్పుడు, మీ ఆహ్వానం ఎప్పుడైనా నిరాకరించబడిందా? ఆల్మా దానిని కూడా అనుభవించాడు. సవాళ్ళు మరియు వ్యతిరేకత ఉన్నప్పటికీ సువార్తను పంచుకోవడం గురించి ఆల్మా 8:13–16లో అతని నుండి మీరేమి నేర్చుకుంటారు? 17–32 వచనాలు చదవడాన్ని కొనసాగించండి మరియు మీరు సఫలం కానట్లు అనిపించినప్పటికీ, సువార్తను పంచుకోవడాన్ని కొనసాగించడానికి మిమ్మల్ని ప్రేరేపించే వాక్యభాగాల కొరకు చూడండి.

ప్రవక్తలు మరియు అపొస్తలులు క్రీస్తు యొక్క ప్రత్యేక సాక్షులు, కావున ఆయన గురించి సాక్ష్యమివ్వడం గురించి పంచుకోవడానికి వారు ఎక్కువ ప్రేరేపిత ఉపదేశాన్ని కలిగియున్నారు. “కానీ అది కష్టంగా ఉంటే ఎలా?” లో (“సువార్త పరిచర్య: మీ హృదయములో నున్నది పంచుకొనుటలో ఒక విభాగము,” లియహోనా, మే 2019, 18) డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ చెప్పిన దానిని లేదా “ప్రేమించు, పంచు, ఆహ్వానించు,” (లియహోనా, మే 2022, 84–87) లో ఎల్డర్ గ్యారీ ఈ. స్టీవెన్‌సన్ పంచుకున్న దానిని చూడండి. సువార్తను పంచుకోవడం గురించి నిరుత్సాహంగా భావించడం మొదలుపెట్టిన ఒకరికి సహాయపడేలా మీరు అక్కడ ఏమి కనుగొంటారు?

ఇక్కడ మీరు చదివిన ప్రతీదానిని సువార్తను పంచుకోవడం గురించిన ఒకటి లేదా రెండు ప్రోత్సహించే వ్యాఖ్యానాలలో మీరు ఎలా సంక్షిప్తపరుస్తారు? ప్రయత్నాన్ని కొనసాగించడానికి మిమ్మల్ని (లేదా ఇతరులను) ప్రోత్సహించగలిగేలా ఒక పోస్టరు లేదా మీమ్‌ను తయారుచేయడాన్ని పరిగణించండి.

ఆల్మా 9:14-23

దేవుని దీవెనలు గొప్ప బాధ్యతతో వస్తాయి.

అమ్మోనైహాలో ఉన్న నీఫైయులు ప్రభువు యొక్క సేవకులపట్ల ప్రవర్తించిన తీరు గురించి చదివినప్పుడు, ఒకప్పుడు వారు సువార్తను జీవించిన జనులని మరియు ”ప్రభువు చేత అధికముగా అనుగ్రహము పొందిన జనులైయుండెనని” మరచిపోవుట చాలా తేలిక (ఆల్మా 9:20). నీఫైయులకు దేవుడిచ్చిన గొప్ప దీవెనల గురించి మీరు చదివినప్పుడు (ప్రత్యేకించి ఆల్మా 9:14–23 చూడండి), ఆయన మీకిచ్చిన గొప్ప దీవెనల గురించి ధ్యానించండి. ఈ దీవెనలతో వచ్చే బాధ్యతలేవి? ఈ బాధ్యతలకు యదార్థంగా ఉండడానికి మీరేమి చేస్తున్నారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 50:24; 82:3; 93:39 కూడా చూడండి.

ఆల్మా 11–12

దేవుని ప్రణాళిక, ఒక విమోచన ప్రణాళిక.

ఆల్మా 11–12లో, దేవుని ప్రణాళికను ఆల్మా మరియు అమ్యులెక్ విమోచన ప్రణాళిక అని పేర్కొన్నారు. మీరు ఈ అధ్యాయాలను చదివినప్పుడు, ప్రణాళికను వివరించడానికి విమోచన అనే పదం ఎందుకు ఉపయోగించబడిందో ధ్యానించండి. ప్రణాళిక యొక్క క్రింది అంశాల గురించి ఆల్మా మరియు అమ్యులెక్ బోధించిన దానిపై ఒక చిన్న సారాంశము కూడా వ్రాయడాన్ని పరిగణించండి.

  • పతనము

  • విమోచకుడు

  • పశ్చాత్తాపము

  • మరణము

  • పునరుత్థానము

  • తీర్పు

అమ్యులెక్ మాటలు జనులపై చూపిన ప్రభావాన్ని గమనించండి (ఆల్మా 11:46 చూడండి). దేవుని ప్రణాళిక గురించి తెలుసుకోవడం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

డాలిన్ హెచ్. ఓక్స్, “గొప్ప ప్రణాళిక,” లియహోనా, మే 2020, 93–96 కూడా చూడండి.

ఆల్మా 12:8–18

నేను నా హృదయాన్ని కఠినపరచుకోనట్లయితే, నేను దేవుని వాక్యాన్ని ఎక్కువగా పొందగలను.

పరలోక తండ్రి అన్నింటిని మనకు ఎందుకు తెలియజేయరని కొంతమంది ఆశ్చర్యపోతుంటారు. ఆల్మా 12:9–14లో, సాధ్యమైన ఒక కారణాన్ని ఆల్మా వివరించాడు. అతడు బోధించిన దానిని ధ్యానించడానికి ఈ ప్రశ్నలు మీకు సహాయపడగలవు:

  • మీ హృదయాన్ని కఠినపరచుకోవడం అంటే అర్థమేమిటి? కఠిన హృదయాన్ని కలిగియుండడం యొక్క ఫలితాలేవి? (ఆల్మా 8:9–11; 9:5, 30–31; మరియు 10:6, 25 కూడా చూడండి).

  • మీ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పడానికి మీరేమి చేయగలరు? (యిర్మీయా 24:7; ఆల్మా 16:16; హీలమన్ 3:35 చూడండి).

  • దేవుని వాక్యము “(మీలో) కనబడేలా” నిశ్చయపరచడానికి మీరేమి చేయగలరు? (ఆల్మా 12:13). దేవుని వాక్యము మీలో ఉన్నప్పుడు, అది మీ “మాటలు,” “పనులు” మరియు “ఆలోచనల” మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగియుంటుంది? (ఆల్మా 12:14).

మృదువైన హృదయం కలిగియుండడం యొక్క దీవెనల గురించి అమ్యులెక్ అనుభవం మీకేమి బోధిస్తుంది? (ఆల్మా 10:1–11 చూడండి).

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

ఆల్మా 8-10

నేను యేసు క్రీస్తు సువార్తను పంచుకోగలను.

  • మీ పిల్లల కొరకు ఆల్మా 8–10 లోని సంఘటనలను సంక్షిప్తపరచడానికి ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీ సహాయపడగలదు. ఆల్మా మరియు అమ్యులెక్‌లను మంచి సువార్తికులుగా చేసిన సూత్రాలను కనుగొనడానికి మీరు వారికి సహాయపడాలని కోరవచ్చు. ఉదాహరణకు, వారు ఆశ వదులుకోలేదు (ఆల్మా 8:8–13 చూడండి), వారు క్రీస్తు గురించి సాక్ష్యమిచ్చారు (ఆల్మా 9:26–27 చూడండి) మరియు వారు కలిసి పనిచేసారు (ఆల్మా 10:12 చూడండి).

  • వారు కనుగొనే ఆలోచనలను మరియు వారు సువార్తను పంచుకోగల జనులను జాబితా చేయమని మీ పిల్లలను ఆహ్వానించండి. వారు ఏమి చెప్తారో లేదా చేస్తారో దానిని వారు నటించి చూపేలా కూడా మీరు చేయవచ్చు.

పాల్గొనడాన్ని ప్రోత్సహించండి. మీరు బోధించడానికి సిద్ధపడుతున్నప్పుడు, ఏమి చెప్పాలని ప్రణాళిక చేయడానికి బదులు, “నేర్చుకోవడానికి పిల్లలు ఏమి చేస్తారు?” అని మిమ్మల్ని మీరు అడగండి. పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నప్పుడు బాగా నేర్చుకుంటారు మరియు దీర్ఘకాలం గుర్తుంచుకుంటారు.

ఆల్మా 11–12

దేవుని ప్రణాళిక, ఒక విమోచన ప్రణాళిక.

  • ఆదాము హవ్వల పతనము, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపము, మరణము, పునరుత్థానము మరియు తీర్పు వంటి విమోచన ప్రణాళిక యొక్క సూత్రాలను సూచించే చిత్రాన్ని బహుశా మీ పిల్లలు గీయవచ్చు. అప్పుడు ఆల్మా 11–12లో ఈ సూత్రాల గురించి బోధించే వచనాలతో వారి చిత్రాలను జతపరచడానికి మీరు వారికి సహాయపడవచ్చు.

ఆల్మా 8:18-22

నేను ఒక మంచి స్నేహితుడిని కాగలను.

  • మీరు ఆల్మా 8:18–22లో ఉన్న కథను చెప్తుండగా, ఒక బిడ్డను అమ్యులెక్ వలె నటించమని, మరొకరిని ఆల్మా వలె నటించమని మీరు ఆహ్వానించవచ్చు. అమ్యులెక్ ఏవిధంగా ఆల్మాకు మంచి స్నేహితునిగా ఉన్నాడు? అప్పుడు, ఎవరైనా ఒకరు వారికి స్నేహితునిగా ఎలా ఉన్నారో మరియు ఆ అనుభవం వారిని ఎలా భావించేలా చేసిందో మీ పిల్లలు పంచుకోవచ్చు.

  • మీరు స్నేహం గురించి ఒక పజిల్ తయారు చేయవచ్చు: స్నేహాన్ని సూచించే ఒక చిత్రాన్ని కనుగొనండి లేదా గీయండి మరియు దానిని పజిల్ ముక్కలుగా కత్తిరించండి. ప్రతీ ముక్క వెనుకవైపు, ఆల్మా మరియు అమ్యులెక్ చేసిన వాటితోపాటుగా ఒక మంచి స్నేహితునిగా ఉండేందుకు మీరు చేయగల దానిని వ్రాయండి. వెనుకవైపు వ్రాసిన దానిని మీరు చదువుతుండగా, మీ పిల్లలు వంతులవారీగా ఒక ముక్కను ఎంచుకొని, దానిని పజిల్‌కు జతచేయవచ్చు. మన స్నేహము ఎవరికి అవసరము?

చిత్రం
నవ్వుతున్న ఇద్దరు బాలికలు

మనం ఇతరులకు మంచి స్నేహితులుగా ఉండగలము.

ఆల్మా 11:43-44

యేసు క్రీస్తు మూలముగా నేను పునరుత్థానము చెందుతాను.

  • పునరుత్థానము గురించి బోధించడానికి ఇటువంటి వస్తుపాఠము నొకదానిని పరిగణించండి: మీ చేయి మీ ఆత్మను సూచించవచ్చు మరియు ఒక తొడుగు మీ శరీరాన్ని సూచించవచ్చు. మన ఆత్మలు మరియు శరీరాలు మరణంతో వేరుచేయబడతాయని చూపడానికి మీ చేతికి ఉన్న తొడుగును తీసివేయండి. తర్వాత, పునరుత్థానమప్పుడు మన ఆత్మలు మరియు శరీరాలు ఏకం చేయబడతాయని చూపడానికి తిరిగి మీ చేతికి తొడుగును వేసుకోండి. మీరు వారి కొరకు ఆల్మా 11:43 చదువుతుండగా, మీ పిల్లలు వంతులవారీగా తొడుగు వేసుకోవడం మరియు తీసివేయడం చేయనివ్వండి. పునరుత్థానం చెందిన రక్షకుని చిత్రాన్ని ఒకదానిని ప్రదర్శించండి మరియు పునరుత్థానం చెందడాన్ని ప్రతీఒక్కరి కొరకు యేసు క్రీస్తు సాధ్యం చేసారని సాక్ష్యమివ్వండి.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

చిత్రం
అమ్యులెక్‌తో పాటు భుజిస్తున్న ఆల్మా

Illustration of Alma eating with Amulek [అమ్యులెక్‌తో పాటు భుజిస్తున్న ఆల్మా యొక్క వివరణ], డాన్ బర్ చేత

ముద్రించు