“డిసెంబరు 9-15: ‘క్రీస్తు నిన్ను పైకి లేపును గాక.’ మొరోనై 7–9,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)
“డిసెంబరు 9-15. మొరోనై 7-9,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)
డిసెంబరు 9-15: “క్రీస్తు నిన్ను పైకి లేపును గాక”
మొరోనై 7–9
నేడు మోర్మన్ గ్రంథముగా మనకు తెలిసిన గ్రంథాన్ని తన చివరి మాటలతో ముగించడానికి ముందు మొరోనై తన తండ్రియైన మోర్మన్ ఇచ్చిన మూడు సందేశాలను పంచుకున్నాడు: “క్రీస్తు యొక్క సమాధానకరమైన శిష్యులకు” ఒక ప్రసంగము (మొరోనై 7:3) మరియు మొరోనైకు మోర్మన్ వ్రాసిన రెండు లేఖలు. ఆయన కాలము మరియు మన కాలము యొక్క సమస్యల మధ్య పోలికలను ఆయన ముందుగానే చూసినందువలన బహుశా మొరోనై ఈ సందేశాలను మోర్మన్ గ్రంథంలో చేర్చాడు. ఈ మాటలు వ్రాయబడినప్పుడు, నీఫై జనులు రక్షకుని నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. వారిలో అనేకులు “ఒకరిపట్ల ఒకరు తమ ప్రేమను పోగొట్టుకొనియున్నారు” మరియు “మంచిదానిలో తప్ప, అన్నింటిలో” ఆనందించారు (మొరోనై 9:5, 19). అయినప్పటికీ, నిరీక్షణ అనగా అర్థము లోకము యొక్క సమస్యలను నిర్లక్ష్యం చేయడం లేదా అమాయకంగా ఉండడం కాదని మనకు బోధిస్తూ, మొరోనై ఇంకను నిరీక్షణకు కారణం కనుగొన్నాడు. నిరీక్షణ అనగా అర్థము, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు యందు విశ్వాసము కలిగియుండడం, వారి శక్తి గొప్పది మరియు ఈ సమస్యల కంటే అధిక శాశ్వతమైనది. దానర్థము, “ప్రతి మంచి సంగతిని హత్తుకొనియుండడం” (మొరోనై 7:19). దానర్థము యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము, “ఆయన మహిమ మరియు నిత్యజీవపు నిరీక్షణ మీ మనస్సునందు నిత్యము నిలిచియుండునట్లు” (మొరోనై 9:25) అనుమతించడం.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
పొరపాటు నుండి సత్యాన్ని తెలుసుకోవడానికి క్రీస్తు యొక్క వెలుగు నాకు సహాయపడుతుంది.
“ఒక మనోభావన దేవుని నుండి వచ్చిందా లేదా నా స్వంత ఆలోచనల నుండి వచ్చిందా అని నేను ఎలా తెలుసుకోగలను?” లేదా “ఎంతో మోసకరమైన ఈ రోజుల్లో, ఏది ఒప్పు ఏది తప్పు అని నేను ఎలా తెలుసుకోగలను?” అని చాలామంది ఆశ్చర్యపోతారు. మొరోనై 7 లోని మోర్మన్ యొక్క మాటలు ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి మనం ఉపయోగించగల అనేక సూత్రాలను అందిస్తాయి. ప్రత్యేకించి 12–20 వచనాలలో వాటి కొరకు చూడండి. ఈ వారం మీరు ఎదుర్కొనే సందేశాలు మరియు మీరు కలిగియుండే అనుభవాలను అంచనా వేయడానికి మీకు సహాయపడేలా మీరు ఈ సత్యాలను ఉపయోగించవచ్చు.
యేసు క్రీస్తు కారణంగా, నేను “ప్రతి మంచి సంగతిని హత్తుకొని” యుండగలను.
మోర్మన్ ఈనాడు చాలా ముఖ్యమైనదిగా అనిపించే ఒక ప్రశ్న అడిగాడు: “ప్రతి మంచి సంగతిని హత్తుకొనుట ఎట్లు సాధ్యము?” (మొరోనై 7:20). తరువాత అతను యేసు క్రీస్తునందు విశ్వాసం, నిరీక్షణ మరియు దాతృత్వము గురించి బోధించాడు. మీరు 20–48 వచనాలను చదువుతున్నప్పుడు, యేసు క్రీస్తు నుండి వచ్చిన ప్రతి మంచి సంగతిని కనుగొని, దానిని “హత్తుకోవడంలో” ప్రతీ లక్షణం మీకు ఎలా సహాయపడుతుందో చూడండి. యేసు క్రీస్తు శిష్యునికి ఈ లక్షణాలు ఎందుకు అవసరం?
“దాతృత్వము, క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమయైయున్నది.”
యేసు క్రీస్తుపై మనకున్న విశ్వాసం మరియు నిరీక్షణ మనల్ని దాతృత్వము కలిగియుండేలా చేస్తాయని మోర్మన్ గమనించాడు. కానీ దాతృత్వము అంటే ఏమిటి? ఈ వాక్యాన్ని పూర్తి చేయగల పదాలు లేదా వాక్యభాగాల కోసం వెదుకుతూ మీరు దాతృత్వము … అని వ్రాసి, ఆపై మొరోనై 7:44–48 చదువవచ్చు. మీరు పూర్తి చేసినప్పుడు, దాతృత్వము అనే పదాన్ని యేసు క్రీస్తు అనే పేరుతో భర్తీ చేయండి. ఇది రక్షకుని గురించి మీకు ఏమి బోధిస్తుంది? యేసు క్రీస్తు తన స్వచ్ఛమైన ప్రేమను ఎలా ప్రదర్శించారు? లేఖనాల నుండి మరియు మీ స్వంత జీవితం నుండి ఉదాహరణల గురించి ఆలోచించండి.
అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ ఇలా గమనించారు: “దాతృత్వము ఎన్నటికీ విఫలము కాదు మరియు చెప్పుకోదగిన అతి మంచి కార్యాలన్నిటి కంటే దాతృత్వము గొప్పది అనడానికి కారణము … దాతృత్వము, ‘క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ’ [మొరో. 7:47] అనేది ఒక పని కాదు, కానీ ఒక పరిస్థితి లేదా స్థితి. … దాతృత్వము అనేది ఒకరు కాగలిగినది” (“The Challenge to Become,” Ensign, Nov. 2000, 34). ఈ వ్యాఖ్యానాన్ని దృష్టిలో ఉంచుకుని, మీరు ఎల్డర్ మాస్సిమో డి ఫియో సందేశం, “శుద్ధమైన ప్రేమ: యేసు క్రీస్తు యొక్క ప్రతీ నిజమైన శిష్యుని యొక్క నిజమైన ప్రతీక” (లియహోనా, మే 2018, 81–83) చదువవచ్చు. దాతృత్వం మీ శిష్యత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మీరు “దాతృత్వాన్ని ఎలా హత్తుకొనియుండగలరు”? (46వ వచనము).
1 కొరింథీయులకు 13:1–13; ఈథర్ 12:33–34 కూడా చూడండి.
కోపం దుఃఖానికి మరియు బాధకు దారి తీస్తుంది.
మొరోనై 7:44–48 లో మోర్మన్ యొక్క ప్రేమ సందేశానికి విరుద్ధంగా, మొరోనైకి మోర్మన్ వ్రాసిన రెండవ లేఖలో నేడు అనేకమంది కష్టపడుతున్న—కోపానికి వ్యతిరేకంగా హెచ్చరికలు ఉన్నాయి. మొరోనై 9:3–5 ప్రకారం, నీఫైయుల కోపం యొక్క కొన్ని పరిణామాలు ఏవి? 3– 5, 18–20, 23 వచనాల నుండి మనం ఎలాంటి హెచ్చరికలు తీసుకోవచ్చు?
నా పరిస్థితులతో సంబంధం లేకుండా, క్రీస్తునందు నేను నిరీక్షణ కలిగియుండగలను.
తాను చూసిన దుష్టత్వమును వివరించిన తర్వాత, మోర్మన్ తన కుమారునితో బాధపడరాదని చెప్పాడు. నిరీక్షణ గురించి మోర్మన్ యొక్క సందేశములో ఏది మిమ్మల్ని ఆకట్టుకున్నది? మీ దృష్టిలో క్రీస్తు “(మిమ్మల్ని) పైకి లేపడమనగా” అర్థమేమిటి? క్రీస్తు యొక్క ఏ సద్గుణాలు మరియు ఆయన సువార్త యొక్క ఏ సూత్రాలు “మీ మనస్సు నందు నిలిచి,” మీకు నిరీక్షణనిస్తున్నాయి? (మొరోనై 9:25).
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
యేసు క్రీస్తునందు నాకు విశ్వాసం ఉంటే, నేను చేయాలని ఆయన కోరుకుంటున్నదేదైనా నేను చేయగలను.
-
లేఖనాలలో ఏదైనా ముఖ్యమైన దానిని సాధించిన వారి చిత్రాలు కొన్నింటిని కలిసి చూడడాన్ని పరిగణించండి. క్రీస్తునందు విశ్వాసం, ఈ ఉదాహరణలలో వ్యత్యాసాన్ని ఎలా తీసుకు వస్తుంది? యేసు క్రీస్తునందు మనకు విశ్వాసం ఉన్నప్పుడు మనం ఏమి చేయగలమనే దాని కొరకు చూస్తూ, మీరు మరియు మీ పిల్లలు మొరోనై 7:33 ను చదువవచ్చు. దేవుడు తన చిత్తాన్ని చేసే శక్తిని మీకు అనుగ్రహించినప్పటి అనుభవాలను కూడా మీరు ఒకరితో ఒకరు పంచుకోవచ్చు.
యేసు క్రీస్తును నమ్మడం నాకు నిరీక్షణనివ్వగలదు.
-
మీరు మీ పిల్లల కొరకు మొరోనై 7:41 చదువుతున్నప్పుడు, మనం నిరీక్షించాలని మోర్మన్ చెప్పినది విన్నప్పుడు బహుశా వారు తమ చేతులు పైకెత్తవచ్చు. యేసు క్రీస్తు వలన మీకు కలిగిన నిరీక్షణ గురించి వారికి చెప్పండి.
-
మీరు మరియు మీ పిల్లలు ఏదో ఒక విషయంలో కష్టపడుతున్న వారి గురించి కూడా ఆలోచించవచ్చు. బహుశా మీ పిల్లలు ఆ వ్యక్తి కోసం ఒక చిత్రాన్ని గీయవచ్చు, అది అతనికి లేదా ఆమెకు యేసు క్రీస్తుపై నిరీక్షణ కలిగించవచ్చు.
కష్టమైన శ్రమలలో కూడా నేను యేసు క్రీస్తుపై నిరీక్షణ కలిగియుండగలను.
-
యేసు క్రీస్తుపై నిరీక్షణ గురించి మీ పిల్లలకు బోధించడానికి, మీరు ఒక స్పష్టమైన తొట్టెను నీటితో నింపి, అందులో రెండు వస్తువులను వేయవచ్చు—తేలే వస్తువొకటి మరియు మునిగిపోయే వస్తువొకటి. మీరు మొరోనై 7:40–41 మరియు 9:25–26 కలిసి చదువుతున్నప్పుడు, మీ పిల్లలు నిరీక్షణ మనకు ఏమి చేస్తుందనే దాని కొరకు చూడవచ్చు. అప్పుడు వారు తేలియాడే వస్తువును క్రీస్తుపై నిరీక్షణ ఉన్న వ్యక్తితో పోల్చవచ్చు. మనం కష్టమైన శ్రమలను ఎదుర్కొన్నప్పుడు ఆయన ఎలా “[మనలను] పైకి లేపుతారు”? రక్షకుడిని మరియు ఆయన ప్రోత్సాహకరమైన బోధనలను “[వారి] మనస్సులో శాశ్వతంగా” ఉంచుకోగల మార్గాల గురించి ఆలోచించడానికి మీ పిల్లలకు సహాయపడండి.
“దాతృత్వము, క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమయైయున్నది.”
-
మీరు మొరోనై 7:47 ను చదవవచ్చు లేదా సంగ్రహంగా చెప్పవచ్చు మరియు ఎవరికైనా ప్రేమను చూపుతున్న తమ చిత్రాలను గీయమని మీ పిల్లలను ఆహ్వానించవచ్చు. యేసులా ఇతరులను ప్రేమించాలని వారికి గుర్తు చేసే చోట తమ చిత్రాన్ని ఉంచాలని సూచించండి.
-
వారి జీవితాలలో క్రీస్తు యొక్క స్వచ్ఛమైన ప్రేమను వెదకడానికి మరియు అభివృద్ధి చేయడానికి మీరు మీ పిల్లలను ఎలా ప్రేరేపించగలరు? యేసు దాతృత్వము చూపిన మార్గాల గురించి ఆలోచించడానికి బహుశా మీరు వారికి సహాయపడవచ్చు (ఉదాహరణకు, లూకా 23:34; యోహాను 8;1-11; ఈథర్ 12:33-34 చూడండి). ఆయన మాదిరిని మనము ఎలా అనుసరించగలము?