2024 రండి, నన్ను అనుసరించండి
డిసెంబరు23–29: “తన జనులను విమోచించుటకు ఆయన లోకములోనికి వచ్చును.” క్రిస్మస్


“డిసెంబరు 23-29: ‘తన జనులను విమోచించుటకు ఆయన లోకములోనికి వచ్చును.’ క్రిస్మస్,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“డిసెంబరు 23-29. క్రిస్మస్,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)

యోసేపు, మరియ మరియు పశువుల తొట్టెలో యేసు

Behold the Lamb of God [దేవుని గొఱ్ఱెపిల్లను చూడుము], వాల్టర్ రానె చేత

డిసెంబరు23–29: “తన జనులను విమోచించుటకు ఆయన లోకములోనికి వచ్చును”

క్రిస్మస్

నీఫై నుండి మొరోనై వరకు, ప్రతీ మోర్మన్ గ్రంథ ప్రవక్త గ్రంథములోని శీర్షిక పేజీలో సంక్షిప్తపరచబడిన పరిశుద్ధ ఉద్దేశ్యమునకు కట్టుబడియున్నారు: “[సమస్త జనులను] యేసే క్రీస్తని ఒప్పించుట.” ఒక ప్రవక్త ఆయనను మర్త్యత్వమునకు ముందు ఆత్మగా చూసారు, మరొకరు ఆయన మర్త్య పరిచర్యను ఒక దర్శనములో చూసారు. ఒకరు గోడపైన నిలబడి, ఆయన పుట్టుక మరియు ఆయన మరణము యొక్క సూచనలు ప్రకటించారు, మరొకరు ఆయన చేతులు, పాదములు మరియు ప్రక్కన తాకుతూ పునరుత్థానము చెందిన ఆయన శరీరము యెదుట మోకరించారు. వారందరు ఈ ముఖ్యమైన సత్యమును ఎరుగుదురు: “యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త రక్తము ద్వారా తప్ప, మనుష్యుడు రక్షింపబడగలిగిన ఏ ఇతర మార్గము లేదా సాధనము లేదు … లోకమును విమోచించుటకు ఆయన వచ్చును” (హీలమన్ 5:9).

కనుక ఈ క్రిస్మస్ సమయంలో, ప్రపంచమంతటా విశ్వాసులు ఆయన కుమారుడిని పంపుటలో దేవుని మంచితనమును మరియు ప్రేమను వేడుక చేసుకుంటున్నప్పుడు, క్రీస్తునందు మీ విశ్వాసమును మోర్మన్ గ్రంథము ఎలా బలపరిచిందో ధ్యానించండి. ఆయన పుట్టుక గురించి మీరు ఆలోచించినప్పుడు, ఆయన ఎందుకు వచ్చారో మరియు ఆయన రాకడ మీ జీవితాన్ని ఎలా మార్చిందో ధ్యానించండి. అప్పుడు మీరు క్రిస్మస్ యొక్క నిజమైన ఆనందమును–యేసు క్రీస్తు మీకిచ్చే బహుమానమును అనుభవించగలరు.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

నా రక్షకునిగా ఉండుటకు యేసు క్రీస్తు జన్మించారు.

క్రిస్మస్ సమయంలో క్రొత్త నిబంధనలో ఉన్న రక్షకుని పుట్టుక యొక్క వృత్తాంతమును చదవడం సాంప్రదాయకమైనది, కానీ ఈ పరిశుద్ధ సంఘటన గూర్చి కదిలించే ప్రవచనాలను మోర్మన్ గ్రంథములో కూడా మీరు కనుగొనవచ్చు. ఉదాహరణకు, రక్షకుని పుట్టుక మరియు పరిచర్య గురించి ప్రవచనాలు 1 నీఫై 11:13–36; మోషైయ 3:5–10; హీలమన్ 14:1–13 లో కనుగొనబడ్డాయి. ఈ గద్యభాగాలను మీరు చదివినప్పుడు మరియు ఆయన పుట్టుకను గూర్చిన సూచనల యొక్క ప్రతీకను లోతుగా ధ్యానించినప్పుడు యేసు క్రీస్తు గురించి మీకు కలిగే అభిప్రాయాలేవి? ఈ ప్రవక్తల సాక్ష్యములు క్రీస్తు మరియు ఆయన నియమితకార్యమును గూర్చి మీ సాక్ష్యమును ఎలా బలపరుస్తాయి?

క్రిస్మస్ సమయంలో యేసు క్రీస్తుపై దృష్టి కేంద్రీకరించడంలో మీకు సహాయపడడానికి ఇక్కడ మరికొన్ని సూచనలు ఉన్నాయి:

  • క్రిస్మస్ ఆనందాన్ని వ్యాపింపజేయడానికి ఈ సందేశాలను మరియు సంగీతాన్ని పంచుకోవడాన్ని పరిగణించండి.

  • క్రీస్తు ఆత్మను అనుభూతి చెందడానికి మీరు లేదా మీ కుటుంబం క్రిస్మస్‌కు ముందు దినాలలో ఎవరికైనా సేవ చేయడం లేదా కలిసి క్రిస్మస్ కీర్తనలు పాడడం వంటి కార్యక్రమాలను ప్రణాళిక చేయండి. కొన్ని ఉపాయాల కొరకు LighttheWorld.org చూడండి.

మత్తయి 1:18–25; 2; లూకా 2; 3 నీఫై 1:4–22 కూడా చూడండి.

యేసు క్రీస్తు లోక విమోచకుడు.

యేసు క్రీస్తు యొక్క పుట్టుకను మనం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఆయన ప్రాయశ్చిత్త త్యాగము. ఆ త్యాగము కారణంగా, ఆయన మనల్ని పాపము మరియు మరణము నుండి రక్షించగలరు, బాధలలో మనల్ని ఓదార్చగలరు మరియు “ఆయనలో పరిపూర్ణులము” (మొరోనై 10:32) కావడానికి మనకు సహాయపడగలరు. మిమ్మల్ని విమోచించడానికి రక్షకుని యొక్క శక్తి గురించి ఈ సంవత్సరం మోర్మన్ గ్రంథము నుండి మీరేమి నేర్చుకున్నారు? ఏవైనా వృత్తాంతములు లేదా బోధనలు మీకు ప్రత్యేకమైనవిగా కనబడుతున్నాయా? రక్షకుని యొక్క విమోచన కార్యము గురించి క్రింది గద్యభాగములు మీకు బోధించేదానిని పరిగణించండి: 2 నీఫై 2:6; ఆల్మా 7:7–13; 11:40; మరియు హీలమన్ 5:9; 14:16–17. ఆయనకు మీ కృతజ్ఞతను చూపడానికి మీరు ఏమి చేయడానికి ప్రేరేపించబడినట్లు భావిస్తున్నారు?

సెమినరీ చిహ్నము
మోర్మన్ గ్రంథము యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిస్తుంది.

“యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన” అనేది మోర్మన్ గ్రంథానికి ఉపశీర్షిక కంటే అధికమైనది; అది దాని యొక్క దైవిక ఉద్దేశ్యమును గూర్చిన వ్యాఖ్యానము. క్రీస్తును గూర్చి సాక్ష్యమివ్వడానికి మోర్మన్ గ్రంథము యొక్క నియమితకార్యము గురించి క్రింది లేఖనాలనుండి మీరు నేర్చుకొనే దానిని ధ్యానించండి: 1 నీఫై 6:4; 19:18; మరియు 2 నీఫై 25:23, 26; 33:4, 10.

ఈ సంవత్సరం మోర్మన్ గ్రంథమును అధ్యయనం చేయడం మిమ్మల్ని క్రీస్తుకు దగ్గరగా ఎలా తెచ్చిందో ఒక దినచర్య పుస్తకంలో వ్రాయడానికి ఆలోచించండి. క్రింది ప్రేరేపణలు సహాయపడవచ్చు:

  • “ఈ సంవత్సరం రక్షకుని గురించి నేను నేర్చుకొన్న లేదా భావించిన విషయము …”

  • “మోర్మన్ గ్రంథములో రక్షకుని గురించి నేర్చుకోవడం … నేను చూసే విధానాన్ని మార్చింది.”

  • “మోర్మన్ గ్రంథములో నాకిష్టమైన వ్యక్తి [లేదా వృత్తాంతము] రక్షకుడు … అని నాకు బోధించింది.”

మోర్మన్ గ్రంథము గురించి మీరు ఎలా భావిస్తున్నారో తెలుసుకోవడం వలన ఆశీర్వాదం పొందుకొనేవారు ఎవరైనా ఉండవచ్చు. మీరు మీ అనుభవాలను మరియు సాక్ష్యాన్ని ఎలా పంచుకోవచ్చు? క్రిస్మస్ బహుమతిగా ఒక ప్రతిని ఇవ్వడానికి మీరు ప్రేరణ పొంది ఉండవచ్చు. మోర్మన్ గ్రంథ యాప్ పంచుకోవడాన్ని సులభతరం చేస్తుంది.

బిషప్ జెరాల్డ్ కాస్సే యేసు క్రీస్తు గురించి మోర్మన్ గ్రంథము నుండి అనేక సత్యాలను జాబితా చేశారు (“జీవముతోనున్న క్రీస్తుకు ఒక సజీవ సాక్ష్యము,” లియహోనా, మే 2020, 39–40 కూడా చూడండి). మీరు ఆయన జాబితాను చూడవచ్చు మరియు ఈ సత్యాలలో ప్రతీ ఒక్కటి మీ జీవితాన్ని ఎలా మార్చింది—లేదా మార్చగలదని ఆలోచించవచ్చు.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

ఈ ఆదివారం నెలలో ఐదవ ఆదివారం కాబట్టి, “అనుబంధం బి: దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు పిల్లలను సిద్ధపరచుట”లోని అభ్యాస కార్యకలాపాలను ఉపయోగించమని ప్రాథమిక బోధకులు ప్రోత్సహించబడ్డారు.

యేసు క్రీస్తు నాకు పరలోక తండ్రి ఇచ్చిన బహుమతి.

  • ఆయన కుమారుడిని పంపడం ద్వారా పరలోక తండ్రి మనకిచ్చిన బహుమానముపై దృష్టిసారించడానికి మీ పిల్లలకు సహాయపడడానికి, యేసు క్రీస్తు యొక్క చిత్రమును ఒక క్రిస్మస్ బహుమతిగా మీరు చుట్టవచ్చు. మీరు మరియు మీ పిల్లలు మీరు పొందిన లేదా పొందాలని ఆశిస్తున్న ఇష్టమైన క్రిస్మస్ బహుమానాలను గూర్చి మాట్లాడవచ్చు. తరువాత వారు క్రీస్తు యొక్క చిత్రమును విప్పి, ఆయన మనకు ప్రశస్థమైన బహుమానముగా ఎలా ఉన్నారో చర్చించవచ్చు.

నా రక్షకునిగా ఉండుటకు యేసు క్రీస్తు జన్మించారు.

  • మీ పిల్లలు యేసు జననం గురించి తమకు తెలిసిన వాటిని మీతో పంచుకోవడాన్ని ఆనందించవచ్చు. మీరు రక్షకుని జీవితాన్ని మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగాన్ని వర్ణించే చిత్రాలను కూడా చూడవచ్చు. పరలోక తండ్రి యేసు క్రీస్తును ఎందుకు పంపారు?

    దేవదూత
  • మీ పిల్లలు కూడా యేసు జననం మరియు పరిచర్య గురించి వారి స్వంత చిత్రాలు గీయడాన్ని ఆనందించవచ్చు. బహుశా వారు 1 నీఫై 11:13–23; మోషైయ 3:5–10; హీలమన్ 14:1–13; మరియు 3 నీఫై 1:4–22 లో వివరించిన వాటిని గీయవచ్చు. అప్పుడు వారు తమ చిత్రాలు యేసు క్రీస్తు గురించి ఏమి బోధిస్తున్నాయో మీతో పంచుకోవచ్చు.

  • బైబిలు మరియు మోర్మన్ గ్రంథము రెండూ యేసు పుట్టుక గురించి బోధిస్తున్నాయని నొక్కి చెప్పడానికి, మీరు లూకా 2:4–14; మత్తయి 2:1–2; మరియు 3 నీఫై 1:15, 19-21 లో వివరించబడిన సంఘటనలను జాబితా చేయవచ్చు. అప్పుడు మీ పిల్లలు బేత్లెహేము, అమెరికా లేదా రెండింటిలో ఏ సంఘటనలు జరిగాయో తెలుసుకోవడానికి ఈ లేఖనాలను శోధించవచ్చు. యేసు జననానికి రెండవ సాక్షిగా మోర్మన్ గ్రంథాన్ని కలిగి ఉన్నందుకు మనం ఎందుకు కృతజ్ఞులము?

పిల్లలు కథలను ఇష్టపడతారు. పిల్లలు సత్యాలను తెలుసుకోవడానికి మరియు గుర్తుంచుకోవడానికి సహాయపడే ఉత్తమ మార్గాలలో కథలు ఒకటి. మీరు యేసు జన్మ వృత్తాంతాన్ని పంచుకుంటున్నప్పుడు, మీ జీవితంలో రక్షకునిపై మీ విశ్వాసాన్ని బలపరచడానికి సహాయపడిన కథనాలను కూడా పంచుకోండి.

మోర్మన్ గ్రంథము యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిస్తుంది.

  • మీరు మరియు మీ పిల్లలు ఈ సంవత్సరం మోర్మన్ గ్రంథము యొక్క మీ అధ్యయనాన్ని ముగించినప్పుడు, ఈ పవిత్ర గ్రంథము నుండి మీకు ఇష్టమైన కథలు లేదా గద్యభాగాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి ఇది మంచి సమయం కావచ్చు. రండి, నన్ను అనుసరించండి లోని కొన్ని చిత్రాలను చూడడం మీ పిల్లలు ఈ సంవత్సరం నేర్చుకుంటున్న వాటిని గుర్తుంచుకోవడానికి సహాయపడగలదు. ఈ కథలు యేసు క్రీస్తు గురించి మనకు ఏమి బోధిస్తున్నాయో చూడడానికి వారికి సహాయం చేయండి.

  • మీరు మీ పిల్లలకు యేసు యొక్క చిత్రాన్ని కూడా ఇవ్వవచ్చు లేదా వారి స్వంత చిత్రాన్ని గీయనీయవచ్చు. మీరు 2 నీఫై 25:23, 26 చదివేటప్పుడు క్రీస్తు పేరు విన్న ప్రతిసారీ వారి చిత్రాలను పట్టుకోమని వారిని ఆహ్వానించండి. “క్రీస్తునందు విశ్వాసముంచుటకు” మనకు సహాయపడడానికి మోర్మన్ గ్రంథము వ్రాయబడిందని సాక్ష్యమివ్వండి (2 నీఫై 25:23).

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

ఒక దర్శనములో కన్యకయైన మరియను నీఫైకు చూపుతున్న దేవదూత

Nephi’s Vision of the Virgin Mary [కన్యకయైన మరియ గురించి నీఫై యొక్క దర్శనము], జూడిత్ ఎ. మెహర్ చేత