2024 రండి, నన్ను అనుసరించండి
డిసెంబరు 16–22: “క్రీస్తు నొద్దకు రండి, ఆయనలో పరిపూర్ణులు కండి.” మొరోనై 10


“డిసెంబరు 16-22: ‘క్రీస్తు నొద్దకు రండి, ఆయనలో పరిపూర్ణులు కండి.’ మొరోనై 10,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“డిసెంబరు 16-22. మొరోనై 10,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)

చిత్రం
నీఫైయులకు ప్రత్యక్షమయిన యేసు

That Ye May Know [మీరు తెలుసుకొనునట్లు], గ్యారీ ఎల్. కాప్ చేత

డిసెంబరు 16–22: “క్రీస్తు నొద్దకు రండి, ఆయనలో పరిపూర్ణులు కండి”

మొరోనై 10

“వారి విశ్వాసమును బట్టి, ప్రభువు యొక్క మృదు కనికరములు ఆయన ఏర్పరచుకొనిన వారందరి మీద ఉండునని” (1 నీఫై 1:20) మనకు చూపుటకు నీఫై యొక్క వాగ్దానముతో మోర్మన్ గ్రంథము ప్రారంభమవుతుంది. మొరోనై నుండి వచ్చిన ఒక సమాంతర ఆహ్వానంతో పుస్తకం ముగుస్తుంది: “ప్రభువు ఎంత కనికరముతోనుండెనో మీరు జ్ఞాపకము చేసుకొనవలెను” (మొరోనై 10:2–3). మోర్మన్ గ్రంథంలో ప్రభువు యొక్క కరుణకు ఏ ఉదాహరణలు మీరు చూశారు? అరణ్యము గుండా మరియు గొప్ప జలముల మీదుగా లీహై కుటుంబాన్ని దేవుడు నడిపించిన కనికరమైన విధానమును, క్షమాపణ కొరకు ఈనస్‌ ఆత్మ ఆకలిగొన్నప్పుడు అతడిపట్ల ఆయన చూపిన మృదు కనికరములను లేదా సంఘానికి పరమ విరోధియైయుండి, దాని నిర్భయమైన రక్షకులలో ఒకరిగా మారిన ఆల్మాపట్ల ఆయన చూపిన కనికరమును గురించి మీరు ఆలోచించవచ్చు. లేదా వారి రోగులను స్వస్థపరచి, వారి చిన్న పిల్లలను ఆశీర్వదించినప్పుడు పునరుత్థానుడైన రక్షకుడు జనులపట్ల చూపిన కనికరము వైపు మీ ఆలోచనలు మరలవచ్చు. బహుశా అతి ముఖ్యమైనది, ఇదంతా మీపట్ల “ప్రభువు ఎంత కనికరము కలిగియుండెనో” మీకు జ్ఞాపకము చేయగలదు, ఏలయనగా మోర్మన్ గ్రంథము దేవుని యొక్క కనికరమును పొందుటకు మనలో ప్రతీఒక్కరిని ఆహ్వానించుటకు వ్రాయబడింది—“క్రీస్తు నొద్దకు రండి, ఆయనలో పరిపూర్ణులు కండి” (మొరోనై 10:32) అని మొరోనై యొక్క వీడ్కోలు మాటలలో స్పష్టంగా వ్యక్తపరచబడిన ఆహ్వానమది.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

మొరోనై 10:3–7

చిత్రం
సెమినరీ చిహ్నము
నేను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అన్ని విషయాల సత్యమును తెలుసుకోగలను.

మొరోనై 10:3–7 లో ఉన్న వాగ్దానము ప్రపంచమంతటా లక్షలమంది జీవితాలను మార్చివేసింది. అది మీ జీవితాన్ని ఎలా మార్చింది? మీరు మొరోనై 10:3–7 ను చదివినప్పుడు, గతములో మీరు చదివిన దానికంటే ఎక్కువ జాగ్రత్తగా చదవడానికి ఆలోచించండి. ఈ విధమైన ప్రశ్నలు అడుగుతూ, ప్రతీ వాక్యభాగమును మీరు పరిశీలించవచ్చు: దీని అర్థమేమిటి? నేను దీనిని బాగా ఎలా చేయగలను? దీనితో నాకు ఎటువంటి అనుభవాలు కలిగాయి?

ఆధ్యాత్మిక సత్యము కోసం మీ వ్యక్తిగత అన్వేషణ గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు, ఇతరులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సత్యాన్ని ఎలా కనుగొన్నారో తెలుసుకోవడానికి ఇది సహాయపడవచ్చు. ఎల్డర్ మథియాస్ హెల్డ్ సంఘములో కొత్త సభ్యుడిగా తన అనుభవాన్ని వివరించారు (“ఆత్మ ద్వారా జ్ఞానమును వెదకుట,” లియహోనా, మే 2019, 31–33 చూడండి). ఈ సందేశాలలో ఒకటి లేదా రెండింటిని చదవడాన్ని మరియు మీ స్వంత విషయంలో మీకు సహాయపడే సత్యం కోసం వారి శోధనల నుండి మీరు నేర్చుకునేదేదైనా వ్రాయడాన్ని పరిగణించండి.

ఏ లేఖనాలు మీకు ప్రత్యేకంగా అంతర్దృష్టి కలిగినవిగా కనిపిస్తున్నాయి? ఆత్మ ద్వారా సత్యాన్ని వెదుకుతున్న వేరొకరితో పంచుకోవడానికి బహుశా మీరు ఒకదానిని ఎంచుకోవచ్చు.

అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్, “ప్రార్థన ద్వారా అడుగుటకు, తరువాత పొందిన జవాబును అమలు చేయడానికి విశ్వాసము,” లియహోనా, నవ. 2021, 74–76 చూడండి.

మనోభావాలను నమోదు చేయండి. యేసు క్రీస్తు సువార్తకు మారడం అంటే సువార్తను తెలుసుకోవడం మరియు జీవించడం. మీరు నేర్చుకునే వాటిని వ్రాస్తే, వాటి మీద మీరు చర్య తీసుకునే అవకాశం ఉంది. మీరు బోధిస్తున్నట్లయితే, మీరు బోధించే వ్యక్తులను వారి ఆధ్యాత్మిక భావాలను నమోదు చేయమని ఆహ్వానించండి.

మొరోనై 10:8–25

దేవుడు నాకు ఆత్మీయ బహుమానాలిచ్చారు.

ఒక వ్యక్తి “దేవుని బహుమానాలను నిరాకరించే” విధానాలు అనేకమున్నాయి (మొరోనై 10:8). ఈ బహుమానాలు ఇంకా ఉన్నాయనడాన్ని కూడా కొందరు జనులు నిరాకరిస్తారు. ఇతరులు కేవలము వాటిని నిర్లక్ష్యం చేయడం లేదా వాటిని వృద్ధి చేయడానికి విఫలమవడం ద్వారా వారి బహుమానాలను నిరాకరిస్తారు. మీరు మొరోనై 10:8–25 చదువుతున్నప్పుడు, మీ ఆత్మీయ బహుమానాలను కనుగొనడానికి సహాయపడే సత్యముల కొరకు వెదకండి మరియు దేవుని పిల్లలను ఆశీర్వదించడానికి వాటిని ఉపయోగించండి. ఇటువంటి ప్రశ్నలు సహాయపడవచ్చు: ఆత్మీయ బహుమానాలు అనగా ఏమిటి? అవి ఎవరికి ఇవ్వబడ్డాయి? అవి ఎందుకు ఇవ్వబడ్డాయి? మనము వాటిని ఎలా పొందగలము? మొరోనై 10:9–16 లో జాబితా చేయబడిన బహుమతులను ఉపయోగించే వ్యక్తుల ఉదాహరణల గురించి మీరు ఆలోచించగలరా?

మొరోనై 10:30–33

యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా నేను పరిపూర్ణముగా చేయబడగలను.

“క్రీస్తు నొద్దకు రండి” అనే మొరోనై యొక్క సలహాలో ఆయన గురించి నేర్చుకోవడం మరియు ఆలోచించడం కంటే ఎక్కువ ఉంటుంది. అయితే, సాధ్యమైన మిక్కిలి సంపూర్ణమైన భావనలో క్రీస్తునొద్దకు వచ్చుటకు—ఆయన ఉన్నట్లుగా మారుటకు ఇది ఒక ఆహ్వానము. మీరు మొరోనై 10:30–33 చదువుతున్నప్పుడు, క్రీస్తు నొద్దకు వచ్చుట అనగా అర్థమేమిటో, అది ఎలా సాధ్యమైందో మరియు అలా చేయడం వల్ల కలిగే ఫలితాలేమిటో అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడే వాక్యభాగాలను గమనించండి.

ఈ సంవత్సరం మోర్మన్ గ్రంథము గురించిన మీ అధ్యయనాన్ని తిరిగి చూసుకోండి మరియు యేసు క్రీస్తు గురించి మీరు ఏమి భావించారో మరియు నేర్చుకున్నారో ఆలోచించండి. ఉదాహరణకు, ఆయన దగ్గరకు రావడానికి మోర్మన్ గ్రంథము మీకు ఎలా సహాయం చేసింది? ఆయన కృపపై మరింత పూర్తిగా ఆధారపడడానికి ఇది మీకు ఎలా సహాయపడింది? రక్షకుని శక్తిని “తిరస్కరించకుండా” ఉండేందుకు ఇది మీకు ఎలా సహాయపడింది? మోర్మన్ గ్రంథము యొక్క సందేశం గురించి తెలియని ప్రియమైనవారు మరియు స్నేహితులతో సహా, మీ స్వంత సాక్ష్యాన్ని వినవలసిన వారితో దానిని పంచుకోవడం గురించి ఆలోచించండి.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

మొరోనై 10:3-4

మోర్మన్ గ్రంథము సత్యమని నేను స్వయంగా తెలుసుకోగలను.

  • మోర్మన్ గ్రంథము నిజమా కాదా అని దేవుణ్ణి అడగమనిన మొరోనై యొక్క ఆహ్వానాన్ని అంగీకరించడానికి మీ పిల్లలకు మీరు ఎలా సహాయం చేయగలరు? చదవండి, గుర్తుంచుకోండి, ధ్యానించండి మరియు అడగండి అనే పదాలు వ్రాసిన కాగితపు ముక్కలను వారికి ఇవ్వడాన్ని పరిగణించండి. మీ పిల్లలు మొరోనై 10:3–4 లో ఈ పదాలను కనుగొనగలరు. మోర్మన్ గ్రంథం గురించి మన సాక్ష్యాలను పొందడానికి లేదా బలోపేతం చేయడానికి మనం ఏమి చదవాలి, ఏమి గుర్తుంచుకోవాలి, ఏమి ధ్యానించాలి మరియు ఏమి అడగాలి?

  • పలకలపై రాసి, వాటిని పాతిపెడుతున్న మొరోనైలా నటించడాన్ని చిన్న పిల్లలు ఆనందించవచ్చు. మోర్మన్ గ్రంథము గురించి మీ సాక్ష్యాలను ఒకరితో ఒకరు పంచుకోండి.

మొరోనై 10:8-19

పరలోక తండ్రి నాకు ఆత్మీయ బహుమానాలిస్తారు.

  • ఆత్మీయ బహుమానాల గురించి మీ పిల్లలకు బోధించడానికి, మీరు వేర్వేరు కాగితాలపై 9 నుండి 16 సంఖ్యలను వ్రాసి, ప్రతి కాగితాన్ని బహుమతిగా చుట్టవచ్చు. మీ పిల్లలు బహుమతులను విప్పడం, మొరోనై 10:9–16 నుండి సంఖ్యలకు అనుగుణంగా ఉండే వచనాలను చదవడం మరియు ప్రతి ఆత్మీయ బహుమానాన్ని గుర్తించడం వంటివి చేయవచ్చు. ఆయన పిల్లలను ఆశీర్వదించడానికి ఈ బహుమతులను మనం ఎలా ఉపయోగించాలని పరలోక తండ్రి కోరుకుంటున్నారు అనే దాని గురించి మీరు మాట్లాడవచ్చు. మీ పిల్లలకు పరలోక తండ్రి ఇచ్చిన బహుమతులను గమనించడానికి కూడా మీరు మీ పిల్లలకు సహాయం చేయవచ్చు.

మొరోనై 10:32–33

నేను ఆయన వద్దకు రావాలని యేసు క్రీస్తు కోరుతున్నారు.

  • “క్రీస్తు నొద్దకు రండి” అంటే అర్థమేమిటో మీ పిల్లలకు తెలుసా? బహుశా మీరు మొరోనై 10:32 ను చదివి, మీతోపాటు ఆ వాక్యభాగాన్ని పునరావృతం చేయమని వారిని ఆహ్వానించవచ్చు. తరువాత మీరు గదిలో ఎక్కడో యేసు చిత్రాన్ని ఉంచేటప్పుడు వారు కళ్ళు మూసుకోవచ్చు. తరువాత వారు తమ కళ్ళు తెరిచి, చిత్రాన్ని కనుగొని, దాని చుట్టూ గుమిగూడి, మనం క్రీస్తు దగ్గరకు వచ్చే మార్గాల గురించి మాట్లాడనివ్వండి. క్రీస్తు యొద్దకు రావడం అంటే ఏమిటి? అనే ప్రశ్నను వ్రాయడానికి ఇది సహాయపడవచ్చు. సాధ్యమైన సమాధానాలను కనుగొనడానికి మొరోనై 10:32–33 ను శోధించడంలో వారికి సహాయపడండి (విశ్వాస ప్రమాణాలు 1:3–4 కూడా చూడండి). మనం ఏమి చేయాలని క్రీస్తు కోరుతున్నారో మరియు ఆయన మన కోసం ఏమి చేస్తానని వాగ్దానం చేసారో, వాటిని జాబితా చేయడానికి కలిసి పని చేయండి.

  • బహుశా మీ పిల్లలు, “నేను నా పూర్ణ శక్తితో, మనస్సుతో మరియు బలముతో దేవుడిని ప్రేమిస్తున్నాను” అని చూపే హృదయాకారపు చిహ్నములను తయారు చేయడాన్ని మరియు అలంకరించడాన్ని ఆనందించవచ్చు (మొరోనై 10:32 చూడండి). వారలా చేస్తున్నప్పుడు, మనం దేవుడిని ప్రేమిస్తున్నామని ఆయనకు ఎలా చూపిస్తామనే దాని గురించి వారితో మాట్లాడండి.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

చిత్రం
బంగారు పలకలను పాతిపెడుతున్న మొరోనై

గ్రంథములను పాతిపెట్టడానికి ముందు, “ప్రభువు ఎంత కనికరము కలిగియుండెనో జ్ఞాపకము చేసుకోమని” (మొరోనై 10:3) మొరోనై మనల్ని ఆహ్వానించాడు.

ముద్రించు