“ఆగష్టు 9–15. సిద్ధాంతము మరియు నిబంధనలు 88: ‘ఒక దేవుని మందిరమును స్థాపించుడి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)
“ఆగష్టు 9–15. సిద్ధాంతము మరియు నిబంధనలు 88,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021
ఆగష్టు 9–15
సిద్ధాంతము మరియు నిబంధనలు 88
“ఒక దేవుని మందిరమును స్థాపించుడి”
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ అన్నారు, “సువార్త నేర్చుకొనుటకు కేంద్రముగా మీ గృహమును పునర్నిర్మించుటకు మీరు శ్రద్ధగా పనిచేసినప్పుడు, … మీ జీవితంలో, మీ గృహములో అపవాది యొక్క ప్రభావము తక్కువగునని నేను వాగ్దానం చేస్తున్నాను” (“మార్గదర్శకులైన కడవరి-దిన పరిశుద్ధులగుట,” ఎన్‌సైన్ లేక లియహోనా, నవ. 2018, 113).
మీ మనోభావాలను నమోదు చేయండి
తన ప్రవక్తలకు విస్తృతమైన బయల్పాటులు ఇవ్వడం ద్వారా, అప్పుడప్పుడు ప్రభువు తన అపారమైన “మహత్యము మరియు ప్రభావము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:47) యొక్క చిన్న క్షణదర్శనాన్ని మనకిస్తారు. సిద్ధాంతము మరియు నిబంధనలు 88 అటువంటి ఒక బయల్పాటు—వెలుగు, మహిమ మరియు రాజ్యములకు సంబంధించినది, దానితో సరిపోల్చినప్పుడు మన భూలోక సమస్యలు అల్పమైనవిగా కనిపించేలా అది చేయగలదు. ప్రభువు మనకు బోధించే వాటన్నిటిని మనం అర్థం చేసుకోలేకపోయినప్పటికీ, నిత్యత్వమునకు సంబంధించి మనమిప్పుడు గ్రహించగలిగిన దానికంటే ఎంతో ఎక్కువ ఉన్నదని మాత్రము మనం తెలుసుకోగలుగుతాము. మనల్ని భయపెట్టడానికో లేక తక్కువ చేసి చూపించడానికో ప్రభువు ఈ గొప్ప మర్మముల గురించి మాట్లాడలేదు. వాస్తవానికి, “ఒక దినము వచ్చును, మీరు అప్పుడు దేవుడిని కూడా చూచెదరు” (49వ వచనము; ఏటవాలు అక్షరాలు చేర్చబడ్డాయి) అని ఆయన వాగ్దానం చేసారు. బహుశా ఈ ఉన్నతమైన అంతమునకే ప్రభువు కర్ట్‌లాండ్‌లోని తన పరిశుద్ధులను ప్రవక్తల పాఠశాల నెలకొల్పమని ప్రేరేపించారు. “మిమ్ములను మీరు ఏర్పాటుచేసుకొనుడి,” అని ఆయన చెప్పారు. “అవసరమైన ప్రతిదానిని సిద్ధపరచుకొనుడి; … ఒక దేవుని మందిరమును స్థాపించుడి” (119వ వచనము). ఎందుకనగా దేవుని పరిశుద్ధ మందిరములోనే—మన ఇళ్ళలోనే—ఇతర ప్రదేశాలలో కంటే ఎక్కువగా ఆయన మర్త్య లోకమును మించి మన దృష్టిని పైకెత్తగలరు, “తన ముఖము యొక్క ముసుగును (మన) యెదుట తొలగించి,” “సిలెస్టియల్ మహిమను సహించుటకు” మనల్ని సిద్ధపరచగలరు (68, 22 వచనాలు).
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
ప్రభువు మనకు నిరీక్షణను, శాంతిని అందిస్తారు.
“సమస్త జనముల మీద యుద్ధము వ్యాపించునని” (సిద్ధాంతము మరియు నిబంధనలు 87:2) హెచ్చరించిన కొద్ది రోజుల తర్వాత, “మనకు ప్రభువు ఇచ్చిన శాంతి సందేశము, పరదైసు అనబడే చెట్టునుండి తుంచబడిన … ఒలీవ ఆకు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 88, ప్రకరణ శీర్షిక) అని జోసెఫ్ స్మిత్ అభివర్ణించిన బయల్పాటును ప్రభువు ఇచ్చారు. ఈ బయల్పాటు శాంతికి సాంప్రదాయక చిహ్నమైన ఒలీవ ఆకు వలె ఎట్లున్నది? (ఆదికాండము 8:11 కూడా చూడండి). ఈ ప్రకరణములోని ఏ సత్యాలు క్రీస్తునందు నిరీక్షణను, శాంతిని భావించునట్లు మీకు సహాయపడతాయి?
సిద్ధాంతము మరియు నిబంధనలు 88:6–67
వెలుగు మరియు చట్టము యేసు క్రీస్తు నుండి వస్తాయి.
వెలుగు మరియు చట్టము అనే పదాలు 88వ ప్రకరణములో అనేకసార్లు ఉదహరించబడ్డాయి. ఈ పదాలు ఇతర లేఖనాలలో యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తను వర్ణించడానికి ఉపయోగించబడ్డాయి (ఉదాహరణకు, యెషయా 60:19; యోహాను 1:1–9; 3 నీఫై 15:9 చూడండి). సిద్ధాంతము మరియు నిబంధనలు 88:6–67లో ఈ పదాలను మీరు కనుగొనిన వచనాలను గుర్తించండి లేక గమనించండి మరియు రక్షకుడు, వెలుగు, చట్టము గురించి మీరు నేర్చుకున్న దానిని వ్రాయండి. మరింత విశ్వాసముతో వెలుగును పొంది, “క్రీస్తు ధర్మశాస్త్రము” (21వ వచనము)ను జీవించడానికి మీ జీవితంలో మార్పులు చేసుకోవడానికి ఈ వచనాలు మిమ్మల్ని ప్రేరేపించవచ్చు.
షారన్ యుబాంక్, “క్రీస్తు: అంధకారములో ప్రకాశించు వెలుగు,” ఎన్‌సైన్ లేక లియహోనా, మే 2019, 73–76 కూడా చూడండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 88:62–126
అవసరమైన ప్రతిదానిని సిద్ధపరచుకొనుడి.
కొన్ని విధాలుగా, “అన్ని సంగతులు సంక్షోభములోనుండును; మనుష్యులు ధైర్యము చెడి, కూలుదురు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:91) అని ప్రభువు వర్ణించిన కాలంలో మనము జీవిస్తున్నాము. మీరు 62–126 వచనాలు చదివినప్పుడు, ప్రభువు యొక్క ఉపదేశము రక్షకుని రెండవ రాకడ కొరకు సిద్ధపడేందుకు మీకెలా సహాయపడగలదో ఆలోచించండి. పరిగణించవలసిన ప్రశ్నలు కొన్ని ఇక్కడున్నాయి:
-
62–76 వచనాలు.మీరు ఈ వచనాలను ధ్యానిస్తున్నప్పుడు, దేవుని “యొద్దకు వచ్చుటకు” ఏమి చేయాలని మీరు ప్రేరేపించబడ్డారు? (63వ వచనము). మీ దృష్టిలో “మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడి” అను ప్రభువు యొక్క ఆజ్ఞకు అర్థమేమిటో పరిగణించండి (68వ వచనము).
-
77–80, 118–26 వచనాలు.సిద్ధాంతపరమైన మరియు ఐహికమైన విషయాలు రెండూ “మీరు గ్రహించుటకు ఎందుకు యుక్తమైనవి” కావచ్చు? (78వ వచనము). “నేర్చుకొనుటకు ప్రయత్నించుడి” అనే ఉపదేశాన్ని మీరెలా అనుసరిస్తున్నారు? (118వ వచనము). “అధ్యయనము ద్వారా, విశ్వాసము ద్వారా కూడా” నేర్చుకొనుట అనగా అర్థమేమిటని మీరనుకుంటున్నారు?
-
81–116 వచనాలు.ఈ వచనాలలో రక్షకుని రెండవ రాకడ గురించి గల ప్రవచనాలను గమనించడాన్ని పరిగణించండి. మీరు ఈ విషయాల గురించి తెలుసుకోవాలని ప్రభువు ఎందుకు కోరుతున్నారని మీరనుకుంటున్నారు?
-
117–26 వచనాలు.మనస్సులో దేవాలయాన్ని ఉంచుకొని ఈ వచనాలను చదవడాన్ని పరిగణించండి; ప్రభువు మందిరంలో ప్రవేశించడానికి సిద్ధపడడంలో మీకు సహాయపడేలా ఇక్కడ మీరేమి కనుగొంటారు?
డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్, “ప్రభువు రాకడకు సిద్ధపడుట,” ఎన్‌సైన్ లేక లియహోనా, మే 2019, 81–84 కూడా చూడండి.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 88:14–33, 95–101.ఈ వచనాల నుండి పునరుత్థానము గురించి మనం ఏమి నేర్చుకుంటాము? మనం చేసే ఎంపికలను ఈ సత్యాలు ఎలా ప్రభావితం చేయవచ్చు?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 88:33.వారికివ్వబడిన బహుమతులు—వారు సంతోషంగా స్వీకరించినవి మరియు వారు స్వీకరించని వాటి గురించి మాట్లాడమని కుటుంబ సభ్యులను అడగడం ద్వారా ఈ వచనంపై మీరు చర్చను ప్రారంభించవచ్చు. ఆయన మనకు అందించే సిలెస్టియల్ మహిమ అనే బహుమానం పట్ల మనం ఆనందిస్తామని మనం ప్రభువుకు ఎలా చూపగలము? “బహుమానము ఇచ్చే వారి” యందు మనమెలా ఆనందిస్తాము?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 88:63, 68.ఈ వచనాలలో కొన్ని క్రియాత్మక పదాలున్నాయి, అవి ఈ వచనాలలోని సందేశాలను మీ పిల్లలకు బోధించడానికి సృజనాత్మక విధానాలను ఆలోచించేలా మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు. “శ్రద్ధతో నన్ను వెదకుడి, మీరు నన్ను కనుగొందురు” అనే వాక్యభాగాన్ని చర్చించడానికి మీరు దాగుకొనే ఆట ఆడవచ్చు (63వ వచనము; ఏటవాలు అక్షరాలు జతచేయబడ్డాయి).
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 88:81.ఒక కుటుంబంగా, మీ ఇంటి లోపల మరియు చుట్టూ ఉన్న కొన్ని హెచ్చరిక చిహ్నాలను గుర్తించండి, మందులపై ఉన్న హెచ్చరిక గుర్తులు లేక వాహన చోదకుల కొరకు రవాణా చిహ్నాలు వంటివి. ఈ హెచ్చరికలు మనకెలా సహాయపడతాయి? దేని గురించి మనం “(మన) పొరుగువానిని హెచ్చరించాలని” పరలోక తండ్రి కోరుతున్నారు?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 88:119.119వ వచనములో వర్ణించబడినట్లుగా మీ ఇంటిని తయారు చేయడానికి మీ కుటుంబమును ప్రేరేపించడానికి ఇటువంటిది ఏదైనా ప్రయత్నించండి: కాగితపు ముక్కలపై ఈ వచనంలోని వాక్యభాగాలను వ్రాయండి మరియు ఒక దేవాలయపు చిత్రపటాన్ని మూసివేయడానికి వాటిని ఉపయోగించండి. సిద్ధాంతము మరియు నిబంధనలు 88:119 కలిసి చదవండి మరియు ఆ వచనంలోని సంబంధిత వాక్యభాగాన్ని వారు వినినప్పడు కుటుంబ సభ్యులు ఒక్కొక్క కాగితపు ముక్కను తొలగించేలా చేయండి. మన ఇంటిని “దేవుని మందిరము”గా చేయడానికి మనమేమి చేయగలము? (119వ వచనము).
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.
సూచించబడిన పాట: “Nearer, My God, to Thee,” Hymns, no. 100.