2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
జూలై 26–ఆగష్టు 1. సిద్ధాంతము మరియు నిబంధనలు 84: “దైవత్వపు శక్తి”


“జూలై 26–ఆగష్టు 1. సిద్ధాంతము మరియు నిబంధనలు 84: ‘దైవత్వపు శక్తి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“జూలై 26–ఆగష్టు 1. సిద్ధాంతము మరియు నిబంధనలు 84,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

మెల్కీసెదెకు యాజకత్వమును పొందుతున్న జోసెఫ్ స్మిత్

పునఃస్థాపన, లెమన్ స్విండిల్ చేత

జూలై 26–ఆగష్టు 1

సిద్ధాంతము మరియు నిబంధనలు 84

“దైవత్వపు శక్తి”

మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 84 చదువుతున్నప్పుడు, “దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాటవలన మీరు జీవించెదరు” (44వ వచనము) అనే ఉపదేశాన్ని ధ్యానించండి. ఈ బయల్పాటులోని పదాల ప్రకారం మీరెలా జీవిస్తారు?

మీ మనోభావాలను నమోదు చేయండి

1829లో యాజకత్వము పునఃస్థాపించబడినప్పటి నుండి, ఆ పరిశుద్ధ శక్తి చేత కడవరి-దిన పరిశుద్ధులు దీవించబడ్డారు. నేడు మనమున్నట్లే, వారు యాజకత్వ అధికారము చేత బాప్తీస్మమివ్వబడి, నిర్ధారించబడి, సేవకు పిలువబడ్డారు. కానీ యాజకత్వ శక్తికి అవకాశం కలిగియుండడమనేది పూర్తిగా అర్థం చేసుకున్నట్లుగా లేదు మరియు ప్రత్యేకించి రాబోయే దేవాలయ విధుల పునఃస్థాపనకు సంబంధించి తన పరిశుద్ధులు అర్థం చేసుకోవాలని ఆయన కోరినదానిని దేవుడు ఎక్కువగా కలిగియున్నాడు. యాజకత్వంపై 1832 నాటి బయల్పాటు, నేటి సిద్ధాంతము మరియు నిబంధనలు 84, నిజంగా యాజకత్వం అంటే ఏమిటి అనే దాని గురించి పరిశుద్ధుల దృష్టిని విస్తరింపజేసాయి. నేడు మనకోసం అది అలాగే చేయగలదు. ఏమైనప్పటికీ, “దేవుని జ్ఞానము యొక్క తాళపుచెవులను” కలిగియుండి, “దైవత్వపు శక్తిని” ప్రత్యక్షపరచి, “దేవుడైన తండ్రి ముఖమును చూచి, జీవించియుండుటకు” మనల్ని సిద్ధపరిచే దైవిక శక్తి గురించి నేర్చుకోవడానికి చాలా ఉంది (19–22 వచనాలు).

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 84:1–5, 17–28

దేవుని యొక్క యాజకత్వపు శక్తి మరియు దీవెనలకు నేను అవకాశం కలిగియున్నాను.

యాజకత్వము అనే పదం గురించి మీరు ఆలోచించినప్పుడు, మనస్సులో ఏమి స్ఫురిస్తుంది? యాజకత్వము మరియు మీ అనుదిన జీవితంపై దాని ప్రభావం గురించి ఎంత తరచుగా మీరు ఆలోచిస్తారు? ఈ ప్రశ్నలను ధ్యానించిన తర్వాత, సిద్ధాంతము మరియు నిబంధనలు 84:1–5, 17–28 అధ్యయనం చేయండి మరియు ఆయన యాజకత్వ శక్తి గురించి మీరు ఏమి తెలుసుకోవాలని ప్రభువు కోరుతున్నారో ఆలోచించండి. ఎవరైనా ఒకరికి యాజకత్వమును వర్ణించి, దాని ఉద్ధేశాలను వివరించడానికి ఈ వచనాలను మీరెలా ఉపయోగించగలరు?

మీరు పాల్గొనిన యాజకత్వ విధులను కూడా మీరు ధ్యానించవచ్చు. వాటిలో “దైవత్వపు శక్తి” (20వ వచనము ) ప్రత్యక్షపరచబడడాన్ని మీరెలా చూసారు? మీ జీవితంలో ఆయన శక్తిని అధికంగా పొందడానికి మీరు ఏమి చేయాలని ప్రభువు కోరుతున్నారో పరిగణించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 84:31–42

నేను ప్రభువును, ఆయన సేవకులను స్వీకరించినట్లయితే, తండ్రి కలిగియున్న దానంతటిని నేను పొందెదను.

ఎల్డర్ పౌల్ బి. పైపర్ ఇలా బోధించారు: “యాజకత్వము యొక్క ప్రమాణము మరియు నిబంధనలో [సిద్ధాంతము మరియు నిబంధనలు 84:31–42], పొందు మరియు స్వీకరించు అనే క్రియాపదాలను ప్రభువు ఉపయోగించడం ఆసక్తికరము. నియమించు అనే క్రియాపదాన్ని ఆయన ఉపయోగించరు. దేవాలయములోనే స్త్రీ పురుషులు—కలిసి—అహరోను మరియు మెల్కీసెదెకు యాజకత్వములు రెండింటి దీవెనలను, శక్తిని పొందుతారు మరియు స్వీకరిస్తారు” (“Revealed Realities of Mortality,” Ensign, Jan. 2016, 21).

మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 84:31–42 చదువుతున్నప్పుడు, “పొందు” మరియు “స్వీకరించు” అనే పదాల కొరకు చూడండి. ఈ సందర్భంలో వాటి అర్థమేమిటో ధ్యానించండి. ప్రభువును, ఆయన సేవకులను మీరెలా “స్వీకరిస్తున్నారు”?

దేవుడు “మీరలేని” (40వ వచనము) యాజకత్వము యొక్క ప్రమాణము మరియు నిబంధనకు సంబంధించి ఈ వచనాలలో ఉన్న వాగ్దానాలను కూడా మీరు గమనించవచ్చు. తండ్రిని, ఆయన సేవకులను, ఆయన యాజకత్వ శక్తిని స్వీకరించడంలో మరింత విశ్వాసంగా ఉండేందుకు మిమ్మల్ని ప్రేరేపించేలా మీరేమి కనుగొంటారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 84:43–58

ఆయన మాటలు విని, ఆయన ఆత్మను ఆలకించినప్పుడు, నేను క్రీస్తు వద్దకు వస్తాను.

క్రమంగా లేఖనాలను, ప్రవక్తల మాటలను చదవడమనేది ఆత్మీయంగా చేయవలసిన వాటి జాబితాలో ఒకదానిపై గీత గీయడాన్ని మించినది. నిలకడగా దేవుని వాక్యాన్ని మీరు అధ్యయనం చేయవలసిన అవసరాన్ని మీరు గ్రహించేలా సహాయపడే ఏ సత్యాలను మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 84:43–58 లో కనుగొంటారు? ఈ వచనాలలో వెలుగు, చీకటి మధ్య వ్యత్యాసాన్ని గమనించండి; మీరు “నిత్య జీవపు మాటలకు శ్రద్ధతో చెవియొగ్గడం” ఏవిధంగా మీ జీవితంలోకి వెలుగును, సత్యాన్ని మరియు “యేసు క్రీస్తు ఆత్మను” తెచ్చింది? (43, 45 వచనాలు).

2 నీఫై 32:3 కూడా చూడండి.

లేఖనాలను అధ్యయనం చేస్తున్న స్త్రీ

లేఖనాలను అధ్యయనం చేయడం ఆత్మ యొక్క ప్రభావాన్ని భావించడానికి నాకు సహాయపడుతుంది.

సిద్ధాంతము మరియు నిబంధనలు 84:62–91

నేను ఆయన సేవలో ఉన్నప్పుడు, ప్రభువు నాతో ఉంటారు.

మీరు ఈ వచనాలను చదువుతున్నప్పుడు, తన అపొస్తలులకు, సువార్తికులకు సహకరిస్తానని ప్రభువు చెప్పిన విధానాలను మీరు గుర్తించవచ్చు. మీరు చేయాలని ఆయన అడిగిన పనికి ఈ వాగ్దానాలు ఎలా అన్వయించబడవచ్చు? ఉదాహరణకు, 88వ వచనములో ఉన్న వాగ్దానాలు మీ జీవితంలో ఎలా నెరవేర్చబడ్డాయి?

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 84:6–18.మోషే తన యాజకత్వ అధికారాన్ని ఎలా పొందాడో చదివిన తర్వాత, మీ కుటుంబంలో యాజకత్వము కలిగియున్న వారొకరు లేక పరిచర్య చేయు సహోదరుడు యాజకత్వ స్థానానికి నియమించబడినప్పుడు వారికి కలిగిన అనుభవాన్ని పంచుకోవచ్చు. సాధ్యమైనట్లయితే, అతడు తన యాజకత్వ అధికార క్రమమును పంచుకొని, చర్చించవచ్చు. నేడు సంఘంలో మనము యేసు క్రీస్తు యొక్క అధికారము వరకు వెనుకకు యాజకత్వ అధికారపు జాడ తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము? యాజకత్వ అధికార క్రమము కొరకు విజ్ఞప్తి చేయడానికి, lineofauthority@ChurchofJesusChrist.org కు ఈ-మెయిల్ పంపండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 84:20–21.బాప్తీస్మము లేక సంస్కారము వంటి విధి ద్వారా “దైవత్వపు శక్తి” ప్రత్యక్షపరచబడడాన్ని మీ కుటుంబము ఎప్పుడు అనుభూతి చెందింది? ఈ విధులు మన జీవితాల్లోకి దేవుని శక్తిని ఎలా తీసుకువస్తాయనే దాని గురించి బహుశా మీరు మాట్లాడవచ్చు. మీరు ఒక దేవాలయ చిత్రాన్ని ప్రదర్శించి, దేవాలయ విధులు రక్షకునిలా కావడానికి మనకు అదనపు శక్తిని ఏవిధంగా ఇస్తాయో కూడా చర్చించవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 84:43–44.మీరు ఒక భోజనాన్ని లేక విందును సిద్ధంచేసి, దానిలో ప్రతి పదార్థానికి 44వ వచనము నుండి ఒక పదమును లేక వాక్యభాగమును పేరుగా పెట్టవచ్చు. మనం ప్రతి పదార్థాన్ని చేర్చడం ఎందుకు ముఖ్యం? దేవుని యొక్క ప్రతి మాట ప్రకారం జీవించడం ఎందుకు ముఖ్యము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 84:98–102.ఈ వచనాలలో “క్రొత్త కీర్తన” (98వ వచనము) నుండి యేసు క్రీస్తు గురించి మనమేమి నేర్చుకుంటాము? ఈ కీర్తనలో వివరించబడిన పరిస్థితులను తీసుకువచ్చేలా సహాయపడేందుకు మన కాలములో మనమేమి చేయగలము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 84:106–10.“ప్రతి సభ్యుని“ బహుమానాలు మరియు ప్రయత్నాల ద్వారా మన కుటుంబము ఏవిధంగా “వృద్ధి పొందుతుంది“? (110వ వచనము).

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “The Priesthood Is Restored,” Children’s Songbook, 89; “మీ కుటుంబ లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు” కూడా చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

చర్య తీసుకోవడానికి ఆహ్వానాలిచ్చి, వాటిపై విచారణ చేయండి. వారు నేర్చుకొనే దానిపై పనిచేయడానికి మీరు మీ కుటుంబాన్ని ఆహ్వానించినప్పుడు, సువార్త అనేది కేవలం మాట్లాడడానికి కాదు, జీవించడానికి అని మీరు వారికి చూపుతారు. సిద్ధాంతము మరియు నిబంధనలు 84 లో మీరు అధ్యయనం చేసిన దానిని బట్టి, దేనిపై పనిచేయమని మీరు వారిని ఆహ్వానించగలరు?

రోమ్ ఇటలీ దేవాలయము

రోమ్ ఇటలీ దేవాలయము